ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ ఫలితాలపై బెట్టింగ్ కాస్తున్న 23 మందిని ఉత్తర ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ముందుగా అందిన సమాచారం మేరకు పోలీసులు బేగం సరాయ్ ప్రాంతంలోని ఓ ఇంటిపై దాడి చేశారు.
అక్కడ ఓ టీవీ, 20 మొబైల్ ఫోన్లు, రూ. 65 వేల నగదు, ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించిన చీటీలు, నగదు చెల్లింపులకు సంబంధించిన రికార్డులు అన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
ఐపీఎల్ బెట్టింగ్ కేసులో 23 మంది అరెస్టు
Published Thu, May 29 2014 1:07 PM | Last Updated on Sat, Sep 2 2017 8:02 AM
Advertisement
Advertisement