ఆశ్చర్యపోయా...
యూఏఈలో ఐపీఎల్‌కు ఆదరణపై డుప్లెసిస్
దుబాయ్: భారత్‌లో క్రికెట్ ఆడుతుంటే స్వదేశీ, విదేశీ ఆటగాళ్లకు లభించే కిక్కే వేరు. ఎక్కడ ఆడినా అభిమానులతో స్టేడియాలన్నీ నిండిపోయి హోరెత్తిస్తుంటాయి. ఇప్పుడు యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లు కూడా అదే స్థాయిలో జరుగుతుండడం దక్షిణాఫ్రికా టి20 కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్‌కు వింతగా అనిపిస్తోంది. ఎందుకంటే పాకిస్థాన్‌తో గతంలో ఇక్కడ వన్డే, టెస్టులు ఆడిన అనుభవం తనకు ఉంది.
అప్పుడు మ్యాచ్‌లు చూసేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదని, కానీ లీగ్‌కు మాత్రం అభిమానులు పోటెత్తడంతో భారత్‌లో ఉన్నామా.. అనే భ్రమను కలిగిస్తోందని ఆశ్చర్యపోయాడు. ‘గతంలో నేను పాక్‌తో ఇక్కడ మ్యాచ్‌లు ఆడినప్పుడు అభిమానులు తక్కువ సంఖ్యలో వచ్చారు. ఇప్పుడు కూడా అదే అభిప్రాయంతో ఐపీఎల్ ఆడేందుకు వచ్చాను. కానీ ఈ ఆదరణ చూస్తుంటే నమ్మశక్యంగా లేదు. చెన్నైలో ఆడుతున్నట్టే ఉంది’ అని డుప్లెసిస్ పేర్కొన్నాడు.