న్యూఢిల్లీ: మహారాష్ట్ర నుంచి ఐపీఎల్ మ్యాచ్‌ల తరలింపుపై నేడు (శుక్రవారం) లీగ్ చైర్మన్ రాజీవ్ శుక్లా.. ఫ్రాంచైజీలతో సమావేశం కానున్నారు. నీటి సమస్య కారణంగా బాంబే హైకోర్టు ఈమేరకు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈనెల 30 అనంతరం ముంబై ఇండియన్స్, రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్‌లకు చెందిన 13 మ్యాచ్‌లను ఇతర వేదికలకు మార్చాల్సిన అవసరం ఏర్పడింది. ఈనేపథ్యంలో చర్చించేందుకు రెండు జట్లకు చెందిన ప్రతినిధులను శుక్లా ఆహ్వానించారు. ఈసమావేశంలో బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ కూడా పాల్గొంటారు.
రేసులోకి వైజాగ్
మహారాష్ట్ర నుంచి తరలించాల్సిన మ్యాచ్‌లలో కొన్నింటిని విశాఖపట్నంలో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ముంబై, పుణే జట్ల హోమ్ మ్యాచ్‌లను నిర్వహించేందుకు వైజాగ్, రాయ్‌పూర్, కాన్పూర్ రేసులో ఉన్నట్లు సమాచారం. మే నెలలో ముంబై ఇండియన్స్ ఆడాల్సిన మూడు హోమ్ మ్యాచ్‌లు విశాఖపట్నంలో జరగడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
హైకోర్టు తీర్పుపై నేడు సమావేశం
Published Fri, Apr 15 2016 12:50 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement