Rajiv Shukla
-
BCCI: చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన ఆరోజే
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) సమయం సమీపిస్తోంది. ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 19న పాకిస్తాన్ వేదికగా మొదలుకానుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్ తదితర బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. అయితే, భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మాత్రం ఇంత వరకు ఈ టోర్నీలో పాల్గొనే సభ్యుల పేర్లు వెల్లడించలేదు.ఈ నేపథ్యంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా(Rajiv Shukla) కీలక అప్డేట్ అందించారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టును ఈనెల 18 లేదా 19వ తేదీల్లో ప్రకటించనున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా 2017లో టైటిల్ గెలిచిన పాకిస్తాన్.. చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను దక్కించుకుంది.భద్రతా కారణాల దృష్ట్యాఅయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను అక్కడికి పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. ఈ క్రమంలో అనేక చర్చోపచర్చల అనంతరం ఐసీసీ ఆదేశాల మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) హైబ్రిడ్ విధానానికి అంగీకరించింది. దీని ప్రకారం భారత జట్టు తమ మ్యాచ్‌లను తటస్థ వేదికైన దుబాయ్‌లో ఆడనుంది.ఇక తమ తొలి మ్యాచ్‌లో భాగంగా భారత్ ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. కాగా ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్ ఈ ఐసీసీ టోర్నీకి నేరుగా అర్హత సాధించగా.. వన్డే వరల్డ్‌కప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ క్వాలిఫై అయ్యాయి. ఇక వన్డే ఫార్మాట్లో జరిగే ఈ మెగా ఈవెంట్లో ఆసీస్‌తో పాటు టీమిండియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా హాట్ ఫేవరెట్లుగా బరిలోకి దిగనున్నాయి. మరోవైపు.. భారత్ వేదికగా ప్రపంచకప్-2023లో సెమీ ఫైనల్ కూడా చేరలేకపోయిన పాకిస్తాన్.. సొంతగడ్డపై జరిగే చాంపియన్స్ ట్రోఫీలో మాత్రం భారీ అంచనాలతో ముందుకు రానుంది. ఆసీస్‌ను వారి స్వదేశంలో వన్డే సిరీస్‌లో ఓడించడంతో పాటు.. సౌతాఫ్రికా గడ్డపై ఇంత వరకూ ఏ జట్టుకూ సాధ్యం కాని రీతిలో ప్రొటిస్ జట్టును వన్డే సిరీస్‌లో 3-0తో క్లీన్‌స్వీప్ చేసి జోరు మీదుంది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025గ్రూప్-‘ఎ’- ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికాగ్రూప్-‘బి’- ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్డబ్ల్యూపీఎల్ వేదికలు ఎంపిక చేశాంఇదిలా ఉంటే..వచ్చే నెల 7 నుంచి మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ప్రారంభం కానుంది. గతేడాది రెండు (లక్నో, బరోడా) వేదికల్లో ఈ లీగ్ నిర్వహించగా... ఈ సారి నాలుగు నగరాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మార్చి 2న డబ్ల్యూపీఎల్ ఫైనల్ జరగనుండగా... అదే నెల 21 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది.ఇక మే 25న ఐపీఎల్ తుదిపోరుకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం ఆతిథ్యమివ్వనుంది. 2024 ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ట్రోఫీ చేజిక్కించుకోవడంతో... తొలిపోరు కూడా అక్కడే జరగనుంది.బీసీసీఐ కొత్త కార్యదర్శి అతడేఈ సమావేశంలో బోర్డు కార్యదర్శిగా దేవజిత్ సైకియా(Devjith Saikiya), కోశాధికారిగా ప్రభ్‌తేజ్ సింగ్ భాటియా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ రెండు పదవులకు వీరిద్దరే దరఖాస్తు చేసుకోవడంతో ఎన్నిక అవసరం లేకుండా పోయిందని... ఎన్నికల అధికారి వెల్లడించారు. మరోవైపు.. డబ్ల్యూపీఎల్ వేదికల ఎంపిక గురించి రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. అతి త్వరలో వాటి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఈ సందర్భంగానే చాంపియన్స్ ట్రోఫీకి జట్టును ఎప్పుడు ప్రకటిస్తామనే విషయాన్ని కూడా రాజీవ్ శుక్లా తెలిపారు.చదవండి: CT 2025: ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. తొలిసారిగా ఆ ఇద్దరు -
‘థర్డ్ అంపైర్ నిర్ణయం ముమ్మాటికీ తప్పే.. జైస్వాల్ నాటౌట్’
బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ అవుటైన తీరు((Yashasvi Jaiswal’s controversial dismissal) )పై భారత క్రికెట్ నియంత్రణ మండలి ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు. జైసూ నాటౌట్ అని స్పష్టంగా తెలుస్తున్నా.. అవుట్‌గా ప్రకటించడం సరికాదని అభిప్రాయపడ్డారు. సాంకేతిక ఆధారంగా థర్డ్ అంపైర్ నిర్ణయం తీసుకోవాల్సిందని పేర్కొన్నారు.సరైన కారణాలు లేకుండా ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని తారుమారు చేయడం ఏమిటని రాజీవ్ శుక్లా(Rajiv Shukla) మండిపడ్డారు. అదే విధంగా.. భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ సైతం ఈ విషయంలో థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టాడు.కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులుఆడుతోంది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య గురువారం మెల్బోర్న్ వేదికగా మొదలైన బాక్సింగ్ డే టెస్టు ఆఖరిరోజైన సోమవారం ముగిసింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన ఆసీస్ చేతిలో 184 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడింది.ఘోర ఓటమిభారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ఒంటరి పోరాటం చేసిన యశస్వి జైస్వాల్ అవుటైన విధానం వివాదస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఐదో రోజు ఆటలో భాగంగా కమిన్స్ బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలయ్యాడు జైస్వాల్. అయితే, బంతి అతడి గ్లౌవ్‌ను తాకినట్లుగా కనిపించి వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చేతుల్లో పడింది. దీంతో ఆసీస్ వికెట్ కోసం అప్పీలు చేయగా ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు.ఈ క్రమంలో ఆసీస్ రివ్యూకు వెళ్లగా స్నీకో మీటర్లో స్పైక్ రాకపోయినా.. థర్డ్ అంపైర్ జైస్వాల్‌ను అవుట్‌గా ప్రకటించాలని ఫీల్డ్ అంపైర్‌కు సూచించాడు. దీంతో భారత్ కీలక వికెట్ కోల్పోగా.. మ్యాచ్ పూర్తిగా ఆసీస్ చేతుల్లోకి వెళ్లింది. ఆఖరికి 184 పరుగుల తేడాతో కంగారూ జట్టు రోహిత్ సేనపై విజయదుందుభి మోగించి.. 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.థర్డ్ అంపైర్ నిర్ణయం ముమ్మాటికీ తప్పేఅయితే, జైస్వాల్ అవుటా? నాటౌటా? అన్న అంశంపై క్రీడా వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజీవ్ శుక్లా స్పందిస్తూ.. థర్డ్ అంపైర్ నిర్ణయం వల్ల జైస్వాల్‌కు అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సునిల్ గావస్కర్ స్పందిస్తూ.. ‘‘మీరు సాంకేతికతను ఉపయోగించాలనుకుంటే.. మొత్తంగా దానినే పరిగణనలోకి తీసుకోండి.అంతేకానీ మిథ్యనే నిజమని భావించవద్దు. అక్కడ స్నీకో మీటర్ ఉంది. అందులో లైన్ స్ట్రెయిట్గానే ఉంది. కాబట్టి ఇది కచ్చితంగా నాటౌట్’’ అని తన అభిప్రాయాన్ని స్టార్ స్పోర్ట్స్ షోలో పంచుకున్నాడు. థర్డ్ అంపైర్ నిర్ణయం ముమ్మాటికీ తప్పేనని పేర్కొన్నాడు.సిరీస్‌లో వెనుకబడిన టీమిండియాకాగా ఆసీస్‌తో పెర్త్ వేదికగా తొలి టెస్టులో గెలుపొందిన టీమిండియా.. అడిలైడ్ పింక్ బాల్ మ్యాచ్‌లో ఓడిపోయింది. అనంతరం బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో మూడో టెస్టు డ్రా చేసుకున్న రోహిత్ సేన.. మెల్బోర్న్ టెస్టులో మాత్రం ఘోర పరాభవం చవిచూసింది. కమిన్స్ బృందం విధించిన 340 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక.. 155 పరుగులకే కుప్పకూలింది. ఇరుజట్ల మధ్య జనవరి 3న సిడ్నీ వేదికగా ఆఖరి టెస్టు మొదలుకానుంది. ఇక జైస్వాల్ తొలి ఇన్నింగ్స్‌లో 82 పరుగులు చేసి దురదృష్టకరరీతిలో రనౌట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో 84 పరుగుల వద్ద థర్డ్ అంపైర్ నిర్ణయానికి బలయ్యాడు.చదవండి: WTC 2025: భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే.. అదొక్కటే దారి! -
Champions Trophy: బీసీసీఐ, భారత విదేశాంగ శాఖది ఒకే మాట
చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లదని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా మరోసారి సంకేతాలు ఇచ్చారు. ఆటగాళ్ల భద్రతే తమకు మొదటి ప్రాధాన్యం అని పునరుద్ఘాటించారు. కాగా వచ్చే ఏడాది జరుగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులకు పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే.వన్డే ఫార్మాట్లో జరుగనున్న ఈ మెగా ఈవెంట్‌కు టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్‌లతో పాటు ఆతిథ్య దేశ హోదాలో పాక్ అర్హత సాధించింది. సొంతగడ్డపై డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగాలని ఉవ్విళ్లూరుతోంది.అయితే, ఇరుదేశాల మధ్య పరిస్థితులు, భద్రతాకారణాల దృష్ట్యా బీసీసీఐ తమ జట్టును పాకిస్తాన్‌కు పంపేందుకు ససేమిరా అంటోంది. ఇదే విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలికి కూడా చెప్పింది. టీమిండియా ఆడే మ్యాచ్‌ల కోసం తటస్థ వేదికలను ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేసింది. అయితే, పాక్ క్రికెట్ బోర్డు మాత్రం ఇందుకు అంగీకరించడం లేదు.వేరే ఆప్షన్లు కూడా ఉన్నాయిటీమిండియా తమ దేశానికి రావాల్సిందేనని పట్టుబడుతోంది. ఇలాంటి తరుణంలో శుక్రవారం ఐసీసీ వర్చువల్ సమావేశం ఏర్పాటు చేసింది. నేటితో చాంపియన్స్ ట్రోఫీ వేదికపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాజీవ్ శుక్లాను మీడియా పలకరించగా.. ‘‘మేము ఈ విషయంలో చర్చలు జరుపుతున్నాం. పరిస్థితులకు అనుగుణంగా తుది నిర్ణయం ఉంటుంది.ఏదేమైనా ఆటగాళ్ల భద్రతే మాకు మొదటి ప్రాధాన్యం. హైబ్రిడ్ మోడల్ అనే ఆప్షన్ కూడా ఉంది. అదే కాకుండా ఇంకా వేరే ఆప్షన్లు కూడా ఉన్నాయి. వాటి గురించి చర్చ జరుగుతోంది’’ అని పేర్కొన్నారు.#WATCH | Delhi: On Champions Trophy in Pakistan, BCCI vice president & Congress leader Rajeev Shukla says, "Our discussions are going on. A decision will be taken after looking at the situation. Our top priority is the safety of the players. Hybrid mode is also an option,… pic.twitter.com/daIaqIEyZ2— ANI (@ANI) November 29, 2024 విదేశాంగ శాఖ కూడా ఇదే మాటటీమిండియాను పాకిస్తాన్ పంపే ప్రసక్తి లేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ(ఎమ్ఈఏ) స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఎమ్ఈఏ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ధ్రువీకరించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆటగాళ్ల భద్రత విషయంలో బీసీసీఐ ఆందోళనలు లేవనెత్తింది. ఇందుకు సంబంధించి ప్రకటన కూడా విడుదల చేసింది. కాబట్టి భారత జట్టు అక్కడికి వెళ్లే అవకాశమే కనిపించడం లేదు’’ అని పేర్కొన్నారు.చదవండి: స్వర్ణ పతక విజేతను ప్రోత్సహించే తీరిదేనా?: సుప్రీం కోర్టు అసంతృప్తి#WATCH | Delhi: On Indian cricket team participating in Pakistan, MEA Spokesperson Randhir Jaiswal says, "... The BCCI has issued a statement... They have said that there are security concerns there and therefore it is unlikely that the team will be going there..." pic.twitter.com/qRJPYPejZd— ANI (@ANI) November 29, 2024 -
CT 2025: టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లనుందా? బీసీసీఐ ఏమంటోంది?
చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్తుందా? లేదా? అన్న అంశంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించాడు. భారత ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరించే తమ కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశాడు. కాగా వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19- మార్చి 9 వరకు చాంపియన్స్ ట్రోఫీ నిర్వహించనున్నారు.పాల్గొనే జట్లు ఇవేఈ ఐసీసీ టోర్నీకి వన్డే వరల్డ్‌కప్-2023 విజేత ఆస్ట్రేలియా, రన్నరప్ టీమిండియా, ఆతిథ్య పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్ అర్హత సాధించాయి. అయితే, పాక్‌లో ఈ ఈవెంట్ జరుగనుండటంతో రోహిత్ సేన అక్కడికి వెళ్లకుండా.. తమ మ్యాచ్‌లను తటస్థ వేదికలపై ఆడనుందనే వార్తలు వచ్చాయి. అయితే, పాక్ బోర్డు మాత్రం ఇందుకు ససేమిరా అంటోందని.. టీమిండియాను తమ దేశానికి రప్పించే బాధ్యతను ఐసీసీకి అప్పగించినట్లు తెలిసింది.భారత ప్రభుత్వం అనుమతి తీసుకున్న తర్వాతేఈ నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీ వేదికను పాకిస్తాన్ నుంచి తరలించే యోచన లేదని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాఫ్రీ అలార్డిస్ పేర్కొనడం ఇందుకు బలాన్నిచ్చింది. అయితే, బీసీసీఐ కూడా వెనక్కి తగ్గే సూచనలు కనబడటం లేదు. ఈ క్రమంలో తాజాగా ఈ విషయంపై రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకు చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనడం గురించి మేము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.భారత ప్రభుత్వం అనుమతి తీసుకున్న తర్వాతే అంతర్జాతీయ మ్యాచ్‌ల కోసం మేము వివిధ దేశాలకు ప్రయాణిస్తాం. ఇప్పుడు కూడా అంతే. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే అందుకు అనుగుణంగానే మా కార్యాచరణ ఉంటుంది. మా జట్టు ఒక దేశానికి వెళ్లాలా లేదా అనేది భారత ప్రభుత్వమే నిర్ణయిస్తుంది’’ అని స్పష్టం చేశాడు. కాగా ముంబై దాడుల తర్వాత టీమిండియా- పాకిస్తాన్ ఇంతవరకు ద్వైపాక్షిక సిరీస్‌లలో ముఖాముఖి తలపడలేదు. చివరగా 2008లో భారత జట్టు పాక్ పర్యటనకు వెళ్లింది. అయితే, గతేడాది వన్డే వరల్డ్‌కప్ ఆడేందుకు పాకిస్తాన్ జట్టు ఇక్కడకు వచ్చింది.చదవండి: IND vs BAN: విరాట్ కోహ్లి వరల్డ్ రికార్డు.. టెస్టు క్రికెట్ చరిత్రలోనే -
పాకిస్తాన్లో చాంపియన్స్ ట్రోఫీ.. బీసీసీఐ కండిషన్ ఇదే!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణ హక్కులను దక్కించుకున్న పాకిస్తాన్.. మెగా టోర్నీని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జరుగనున్న ఈ ఈవెంట్ కోసం ఇప్పటికే కరాచీ, లాహోర్, రావల్పిండిలను వేదికలుగా ఖరారు చేసింది.అవకాశమే లేదుఈ నేపథ్యంలో ఈ వన్డే ఫార్మాట్ టోర్నీ ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్తుందా? అన్న సందేహాలు తలెత్తాయి. దాయాది దేశాల మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో భారత జట్టు పాక్‌లో పర్యటించే అవకాశమే లేదని విశ్లేషకులు అంటున్నారు.గతంలో ఆసియా వన్డే కప్-2023 నిర్వహణ హక్కులను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దక్కించుకున్నప్పటికీ.. టీమిండియా భద్రతా కారణాల దృష్ట్యా హైబ్రిడ్ మోడల్లో నిర్వహించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కాగా ఆసియా కప్‌లో భారత జట్టు తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో ఆడిన విషయం తెలిసిందే.బీసీసీఐ స్పందన ఇదేఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘చాంపియన్స్ ట్రోఫీ విషయంలో భారత ప్రభుత్వం ఎలా చెబితే మేము అలా నడుచుకుంటాం.కేంద్రం అనుమతినిస్తేనే టీమిండియాను పాకిస్తాన్‌కు పంపిస్తాం. ప్రభుత్వం నిర్ణయాన్ని బట్టే మేము ముందుకు వెళ్తాం’’ అని రాజీవ్ శుక్లా స్పష్టం చేశాడు. కాగా ఆసియా వన్డే కప్-2023లో రోహిత్ సేన విజేతగా నిలవగా.. శ్రీలంక రన్నరప్‌తో సరిపెట్టుకుంది.ఇక ఆఖరిసారి 2017లో నిర్వహించిన చాంపియన్స్ ట్రోఫీలో చాంపియన్‌గా నిలిచిన పాకిస్తాన్ ఈసారి డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. సొంతగడ్డపై ఈవెంట్ జరుగనుండటం బాబర్ ఆజం బృందానికి సానుకూలాంశంగా పరిణమించింది.చదవండి: Rohit Sharma Crying Video: కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. వీడియో వైరల్#WATCH | Delhi: On the Champion Trophy to be held in Pakistan next year, BCCI vice-president Rajeev Shukla said, "In the case of the Champion Trophy, we will do whatever the Government of India will tell us to do. We send our team only when the Government of India gives us… pic.twitter.com/TeA3dZ5Twn— ANI (@ANI) May 6, 2024 -
పీసీబీకి థాంక్స్.. ఇండియా- పాక్ మ్యాచ్ అంటే: పాకిస్తాన్ పర్యటనలో బీసీసీఐ బాస్
BCCI President Roger Binny Visit To Pakistan: పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు రోజర్ బిన్నీ ధన్యవాదాలు తెలిపారు. తమను పాకిస్తాన్‌కు ఆహ్వానించినందుకు సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. కాగా ఆసియా కప్-2023 నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను అక్కడికి పంపేది లేదని బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ మండలి(ఏసీసీ) అధ్యక్షుడు జై షా స్పష్టం చేశారు. ఈ క్రమంలో చర్చోపర్చల అనంతరం శ్రీలంకతో కలిసి హైబ్రిడ్ విధానంలో ఈ వన్డే ఈవెంట్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు పీసీబీ సిద్ధపడింది. ఆ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే ఇందుకు తగ్గట్లుగానే భారత జట్టు ఆడే మ్యాచ్లన్నింటితో పాటు ఫైనల్ కూడా శ్రీలంకలోనే జరుగనుంది. ఇదిలా ఉంటే.. ఏసీసీ సభ్యులు, ఆసియా కప్‌లో భాగమైన జట్ల క్రికెట్ బోర్డు మెంబర్స్‌ను పీసీబీ డిన్నర్‌కు ఆహ్వానించింది. PC: PCB ఈ క్రమంలో బీసీసీఐ బాస్ రోజర్ బిన్నీతో పాటు.. ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సోమవారం నాటి పీసీబీ విందుకు హాజరయ్యారు. లాహోర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రోజర్ బిన్నీ మాట్లాడుతూ.. దాయాదుల పోరు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. థాంక్యూ పీసీబీ ‘‘మమ్మల్ని ఇక్కడకు ఆహ్వానించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ తరఫున కృతజ్ఞతలు చెబుతున్నా. బీసీసీతో పాటు భారత్‌లో ఉన్న క్రికెట్ ప్రేమికుల తరఫున కూడా నేనే విష్ చేస్తున్నా. ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే అందరికీ పండుగ. రోడ్లు మొత్తం ఖాళీ అవుతాయి మ్యాచ్ మొదలైందంటే చాలు.. ప్రతి ఒక్కరు అలెర్ట్ అయిపోతారు. పనులన్నీ పక్కనపెట్టేస్తారు. రోడ్లు మొత్తం ఖాళీ అయిపోతాయి. ప్రతి ఒక్కరు క్రికెట్ చూసేందుకు టీవీ ముందు కూర్చుంటారు’’ అంటూ రోజర్ బిన్నీ చిరకాల ప్రత్యర్థుల క్రికెట్ పోరు గురించి కామెంట్ చేశారు. పల్లెకెలెలో మ్యాచ్ అద్భుతంగా సాగిందని.. వర్షం అంతరాయం కలిగించి ఉండకపోతే.. ఫలితం చూసే వాళ్లమని పేర్కొన్నారు. పీసీబీ ఆహ్వానం మేరకు సరిహద్దులు దాటి వచ్చామన్న బిన్నీ.. ఇదొక అద్భుతమైన అనుభవమని సంతోషం వ్యక్తం చేశారు. కాగా ఆసియా కప్-2023లో భారత్- పాక్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. అది స్వర్ణయుగం ఇక రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. 2004 తర్వాత మళ్లీ పాకిస్తాన్‌కు రావడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. అప్పట్లో ఇండియా- పాకిస్తాన్‌కు స్వర్ణయుగమని గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. కాగా పాకిస్తాన్ వేదికగా ఆగష్టు 30న ఆరంభమైన ఆసియా టోర్నీ సెప్టెంబరు 17న శ్రీలంకలో జరుగనున్న ఫైనల్‌తో ముగియనుంది. చదవండి: WC 2023: ఇద్దరూ తుదిజట్టులో ఉంటే తప్పేంటి?: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ BCCI President Roger Binny's speech at the PCB Gala Dinner at the Governor's House in Lahore.#AsiaCup2023 pic.twitter.com/Zl2tq5MHxW — Pakistan Cricket (@TheRealPCB) September 4, 2023 BCCI Vice-President Rajeev Shukla's speech at the PCB grand gala dinner at Governor's House, Lahore.#AsiaCup2023 pic.twitter.com/OdOmI4Ddcl — Pakistan Cricket (@TheRealPCB) September 4, 2023 -
వరల్డ్‌కప్ వేదికలపై వివాదం.. బీసీసీఐ వివరణ
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ జరగనుంది. ఈ మేరకు ఐసీసీ మంగళవారం వరల్డ్‌కప్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. మొత్తం 48 మ్యాచ్‌లు జరగనుండగా.. అందులో 45 లీగ్ దశలో.. మరో మూడు నాకౌట్ మ్యాచ్‌లు(రెండు సెమీఫైనల్స్, ఒక ఫైనల్) ఉన్నాయి. కాగా ఈ మ్యాచ్‌లకు పది వేదికలను ఖరారు చేసిన బీసీసీఐ.. వార్మప్ మ్యాచ్‌లకు మరో రెండు మైదానాలను(త్రివేండం, గుహవాటి) ఎంపిక చేసింది. అయితే ఈ వరల్డ్‌కప్‌కు పలు స్టేడియాలకు మ్యాచ్‌లు కేటాయించకపోవడంపై ఆయా రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లు గుర్రుగా ఉన్నాయి. వరల్డ్‌కప్ వేదికల ఎంపికలో తమకు అన్యాయం జరిగిందంటూ ఆరోపణలు చేశారు. ఈసారి వరల్డ్‌కప్ వేదికల జాబితాలో నాగ్‌పూర్, మొహాలీ, జైపూర్ లాంటివి ఉన్నాయి. ముఖ్యంగా మొహాలీ వేదికపై దుమారం నెలకొంది. 1996 నుంచి ప్రపంచకప్ మ్యాచులకు ఇది వేదికగా ఉంటూ వస్తోంది. దీంతో ఈ స్టేడియాన్ని ఎంపిక చేయకపోవడంపై పంజాబ్ క్రీడా మంత్రి గుర్మీత్ సింగ్ విమర్శించారు. రాజకీయ జోక్యం వల్లే మొహాలిని పక్కన పెట్టారని ఆరోపించారు. బీసీసీఐ వద్ద ఈ అంశం లేవనెత్తుతామని గుర్మీత్ సింగ్ ప్రకటించారు. అహ్మదాబాద్ వేదికకు లబ్ధి చేసేందుకే మొహాలీకి చేయిచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ సైతం విమర్శించారు. ఈ విమర్శలపై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పందించారు. ''ప్రపంచ కప్ కోసం తొలిసారి పన్నెండు వేదికలను ఎంపిక చేశాం. ఇందులో చాలా వేదికలు గత ప్రపంచ కప్‌ల కోసం ఎంపిక కాలేదు. ఈ 12 వేదికల్లో తిరువనంతపురం, గువాహటి స్టేడియాల్లో వార్మప్ మ్యాచ్‌లు జరుగుతాయి. మిగతావన్నీ లీగ్‌లు, నాకౌట్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తాయి. మరిన్ని వసతులను కల్పించడంతోనే వాటికి అవకాశం వచ్చింది. సౌత్ జోన్ నుంచి నాలుగు, సెంట్రల్ జోన్ నుంచి ఒకటి, వెస్ట్ జోన్ నుంచి రెండు, నార్త్ జోన్ నుంచి రెండు వేదికలను ఎంపిక చేశాం. అలాగే ఢిల్లీ, ధర్మశాలలోనూ మ్యాచ్‌లు జరుగుతాయి. మ్యాచ్‌లను కేటాయించడంపై ఏ వేదికపైనా వివక్షత చూపలేదు. ద్వైపాక్షిక సిరీస్ మ్యాచ్‌లను మొహాలీ వేదికగానే నిర్వహించాం. విరాట్ కోహ్లి వందో టెస్టు మ్యాచ్ కూడా మొహాలీలో జరిగింది. మొహాలీలోని మల్లాన్‌పుర్ స్టేడియం సిద్ధమవుతోంది. ఒకవేళ రెడీగా ఉండుంటే వరల్డ్ కప్ మ్యాచ్‌కు వేదికయ్యే పరిస్థితి ఉండేది. ఇప్పుడున్న మైదానం ఐసీసీ స్టాండర్డ్స్‌కు తగ్గట్టుగా లేదు. అందుకే ఈసారి అవకాశం రాలేదు. ద్వైపాక్షిక సిరీస్ మ్యాచ్‌లను కేటాయించాం. వరల్డ్ కప్ కోసం మైదానాల ఎంపికలో ఐసీసీ నిర్ణయమే కీలకం. తిరువనంతపురంలో తొలిసారి వార్మప్ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారు. అందులోనూ ఎన్నోసార్లు చర్చల తర్వాతే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈసారి చాలా స్టేడియాలు కొత్తగా ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి'' అని శుక్లా వెల్లడించారు. చదవండి: వరుసగా ఏడు ఓవర్లు బౌలింగ్.. పూర్తిగా కోలుకున్నట్లేనా! 2011 నుంచి ఆతిథ్య జట్టుదే.. ఈ లెక్కన వరల్డ్‌కప్ మనదేనా అంటూ జోస్యం! -
Sourav Ganguly: గంగూలీ బర్త్‌డే.. ఒకరోజు ముందుగానే సెలబ్రేషన్స్!
టీమిండియా మాజీ కెప్టెన్, భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రస్తుత అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శుక్రవారం 50వ పడిలో అడుగుపెట్టనున్నాడు. అయితే, పుట్టినరోజు వేడుకలు మాత్రం ఒకరోజు ముందుగానే మొదలైపోయాయి. ఐపీఎల్ మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లా, ఒకప్పటి సహచర ఆటగాడు, టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్తో కలిసి గంగూలీ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను రాజీవ్ శుక్లా ట్విటర్లో షేర్ చేశాడు. ‘‘సౌరవ్ గంగూలీ 50వ పుట్టినరోజు సెలబ్రేట్ చేశాము. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలి. సంతోషకర జీవితం గడపాలి’’ అని ఆకాంక్షించారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా టీమిండియా ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో గంగూలీ సైతం యూకేలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రీషెడ్యూల్డ్ టెస్టు విషయానికొస్తే.. టీమిండియా ఇంగ్లండ్ చేతిలో 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. గురువారం(జూలై 7) నుంచి ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ మొదలుకానుంది. చదవండి: Wasim Jaffer: 'టెస్టుల్లో అతడికి సచిన్ రికార్డు బ్రేక్ చేసే సత్తా ఉంది' Celebrated the 50th birthday of Sourav Ganguli.wishing him happy & healthy life ahead. @SGanguly99 @sachin_rt @JayShah @BCCI pic.twitter.com/KBXbBajp3s — Rajeev Shukla (@ShuklaRajiv) July 7, 2022 -
అత్యాచారం కేసులో హార్దిక్ పాండ్యా.. ? గ్యాంగ్‌స్టర్ భార్య సంచలన ఆరోపణలు..!
Dawood Ibrahim Wife Aide Accuses Hardik Pandya and Rajiv Shukla: టీ20 ప్రపంచకప్-2021లో ఆశించిన మేర రాణించకపోవడంతో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చోటు కోల్పోయిన టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాకు మరో షాక్ తగిలింది. అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సహాయకుడు రియాజ్ భాటి భార్య రెహ్నుమా భాటి.. హార్ధిక్ పాండ్యాతో పాటు మునాఫ్ పటేల్, పృథ్వీరాజ్ కొఠారీ, మాజీ బీసీసీఐ చైర్మన్ రాజీవ్ శుక్లాలపై సంచలన ఆరోపణలు చేసింది. సదరు వ్యక్తులంతా తనను లైంగిక వేధింపులకు గురి చేసి, అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ముంబైలోని సాంతా క్రూజ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. COMPLAINT COPY EXCLUSIVE‼️ https://t.co/Nj2U9UoA8P pic.twitter.com/o5uWCoDfLx — Sameet Thakkar (@thakkar_sameet) November 10, 2021 తన భర్త రియాజ్ భాటి స్వప్రయోజనాల కోసం అతని వ్యాపార భాగస్వామ్యులతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేసేవాడని, అలా కొందరు హై ప్రొఫైల్ సెలబ్రిటీల వద్దకు తనను పంపాడని రెహ్నుమా ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే, రెహ్నుమా ఇచ్చిన ఫిర్యాదులో సరైన అడ్రస్ లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదిలా ఉంటే, హార్ధిక్.. గతంలో ‘కాఫీ విత్ కరణ్ షో’లో వివాదాస్పద కామెంట్లు చేసి ఓ మ్యాచ్ నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హార్ధిక్.. భార్య నటాశాతో కలిసి మాల్దీవుల్లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నట్లు సమాచారం. చదవండి: "గంగూలీతో విభేదాలు నిజమే.." రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు -
వాళ్లు లేకపోయినంత మాత్రానా ఐపీఎల్ నిర్వహణ ఆగదు..
దుబాయ్: విదేశీ ఆటగాళ్లు అందుబాటులో లేకపోయినంత మాత్రానా ఐపీఎల్ 2021 సీజన్ నిర్వహణ ఆగదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్రణాళిక ప్రకారమే యూఏఈ వేదికగా సెప్టెంబరు 18 నుంచి అక్టోబరు 10 మధ్యలో లీగ్‌ను నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. టీ20 ప్రపంచకప్‌కు ముందు ఐపీఎల్ మిగిలిన మ్యాచ్‌లను ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని బీసీసీఐ పట్టుదలతో ఉన్నట్లు పేర్కొన్నారు. కొందరు విదేశీ ఆటగాళ్లు లీగ్‌కు దూరంగా ఉన్నా, భారత స్టార్ ఆటగాళ్లు లీగ్‌కు వన్నె తెస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వెస్టిండీస్ పర్యటన నిమిత్తం కొందరు, వ్యక్తిగత కారణాలచే మరికొందరు ఆసీస్ ఆటగాళ్లు ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వస్తున్న వార్తలు వాస్తవమేనని, ఈ విషయమై ఆయా ఫ్రాంఛైజీలు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించే పనిలో నిమగ్నమై ఉన్నాయని ఆయన తెలిపారు. ఐపీఎల్ నిర్వహణ ప్రణాళిక, షెడ్యూల్ తదితర అంశాలపై చర్చించేందకు బీసీసీఐ ఆఫీస్ బేరర్లు త్వరలోనే యూఏఈలో సమావేశమవుతారని ప్రకటించారు. కాగా, పలువురు విదేశీ ఆటగాళ్లు తమతమ అంతర్జాతీయ జట్లకు ప్రాతినిధ్యం వహించాల్సి ఉండటంతో లీగ్‌కు దూరంగా ఉంటారని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో శుక్లా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదిలా ఉంటే, భారత్‌లో కరోనా కేసులు అధికమవడం కారణంగా మే 4న ఐపీఎల్ 14 ఎడిషన్ నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. చదవండి: ప్రేయసిని హత్తుకుని భావోద్వేగానికి లోనైన ఆసీస్ క్రికెటర్.. -
IPL2021: ఐపీఎల్... ఓవర్ టూ యూఏఈ
ముంబై: కరోనా కారణంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మిగిలిన మ్యాచ్‌లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. శనివారం జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం) అనంతరం బోర్డు తమ నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే ఏ తేదీల్లో నిర్వహిస్తామనే విషయంపై పూర్తి స్పష్టత రాలేదు. అయితే సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 12 మధ్య లీగ్ జరగవచ్చని బోర్డు వర్గాల సమాచారం. 2021 ఐపీఎల్లో 29 మ్యాచ్‌లు నిర్వహించిన అనంతరం అనూహ్యంగా ఆటగాళ్లకు కరోనా సోకడంతో తప్పనిసరి పరిస్థితుల్లో లీగ్‌ను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ప్లే ఆఫ్స్ సహా లీగ్‌లో మరో 31 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. భారత్‌లో కరోనా తీవ్రత మరింత పెరిగిపోవడంతో ఈ సీజన్లో మన దేశంలో మాత్రం మ్యాచ్‌లు నిర్వహించలేమని స్పష్టమైంది. దాంతో ప్రత్యామ్నాయ వేదికగా మరోసారి యూఏఈవైపే బీసీసీఐ చూసింది. 2020లో మొత్తం టోర్నీకి ఆతిథ్యమిచ్చిన దుబాయ్, అబుదాబి, షార్జా మైదానాల్లోనే ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే బీసీసీఐ అధికారిక ప్రకటనలో కోవిడ్–19 కారణంగా వేదిక మారినట్లు కాకుండా సెప్టెంబర్–అక్టోబర్ సమయంలో భారత్‌లో వర్షాకాలం కాబట్టి మ్యాచ్‌లు ఇబ్బంది కలగకుండా వేదిక మార్చినట్లు ఉండటం గమనార్హం. మరోవైపు తాజా షెడ్యూల్ ప్రకారం చూస్తే తమ ఆటగాళ్లు ఐపీఎల్లో ఆడరని ఇంగ్లండ్ బోర్డు ఇప్పటికే ప్రకటించగా... కీలకమైన ఆస్ట్రేలియా బోర్డు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎస్‌జీఎంలో విదేశీ ఆటగాళ్ల విషయంపై కూడా చర్చ జరిగింది. అయితే ఎవరు వచ్చినా రాకున్నా, ఏ బోర్డునూ బతిమాలబోమని, మిగిలిన మ్యాచ్‌లను పూర్తి చేయడమే లక్ష్యమని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అయితే విండీస్ ఆటగాళ్ల కోసం కరీబియన్ ప్రీమియర్ లీగ్ షెడ్యూల్లో మార్పులు చేయాలని బోర్డు కోరినట్లు అంతర్గత సమాచారం. ఆటగాళ్లు ఎవరైనా అందుబాటులో లేకపోతే వారి స్థానాల్లో మరొకరిని తీసుకునేందుకు ఫ్రాంచైజీలను బోర్డు అనుమతిస్తుంది. హెచ్‌సీఏ నుంచి అజహరుద్దీన్... సుదీర్ఘ వివాదం అనంతరం బీసీసీఐ వర్చువల్ సమావేశంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) తరఫున అధ్యక్షుడు మొహమ్మద్ అజహరుద్దీన్ హాజరయ్యాడు. అజహర్ వైరి వర్గం కొన్నాళ్ల క్రితం హెచ్‌సీఏ ప్రతినిధిగా శివలాల్ యాదవ్ పేరును ప్రతిపాదించి పంపించినా... బోర్డు దానిని పట్టించుకోకుండా అజహర్‌కే అవకాశం కల్పించింది. టి20 వరల్డ్‌కప్ కోసం వేచి చూద్దాం కరోనాతో ఐపీఎల్ విదేశానికి తరలి పోగా... అక్టోబర్–నవంబర్లోనే జరగాల్సిన టి20 ప్రపంచకప్‌ను భారత్ నిర్వహించగలదా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. 16 జట్లతో ఒక ఐసీసీ ఈవెంట్‌ను జరపడం అంత సులువు కాదు. అప్పటికి భారత్‌లో కోవిడ్–19 కేసుల పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు కానీ... పూర్తిగా వైరస్ తగ్గిపోతుందనుకోవడం కూడా అత్యాశే. అందుకే బోర్డు వేచి చూసే ధోరణిలో ఉంది. భారత్ నుంచి టి20 ప్రపంచకప్‌ను తరలించే ఆలోచనతో ఉన్న ఐసీసీని బీసీసీఐ మరో నెలరోజులు గడువు ఇవ్వాలని కోరనుంది. వరల్డ్‌కప్‌ను సమస్యలు లేకుండా నిర్వహించే క్రమంలో ఒకే ప్రాంతంలో అన్ని మ్యాచ్‌లు నిర్వహించాలనే ఆలోచనతో కూడా బోర్డు ఉంది. ముంబైలోని మూడు స్టేడియాలతో పాటు దగ్గర్లోనే పుణేను వాడుకుంటే ఎలా ఉంటుందనేది ఒక సూచన. జూన్ 1న జరిగే ఐసీసీ సమావేశంలో పాల్గొనేందుకు సోమవారం బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా దుబాయ్ వెళ్లనున్నారు. అక్కడే ఐపీఎల్ నిర్వహణ గురించి యూఏఈ బోర్డుతో కూడా చర్చిస్తారు. మరోవైపు రంజీ క్రికెటర్లకు నష్టపరిహారం ఇచ్చే అంశంపై ఈ సమావేశంలో ఎలాంటి చర్చా జరగలేదు. (చదవండి: IPL 2021: ఎప్పుడు నిర్వహిద్దాం?) -
ఐపీఎల్ ప్లేయర్స్‌కు కరోనా వ్యాక్సినేషన్: బీసీసీఐ ఉపాధ్యక్షుడు
ముంబై: దేశంలో కరోనా మహమ్మారి రెండో దశలో కోరలు చాస్తున్న వేళ, ఐపీఎల్లో పాల్గొనే ఆటగాళ్లను కాపాడుకోవాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా అభిప్రాయపడ్డారు. ప్లేయర్లకు వ్యాక్సినేషన్ అంశంపై బీసీసీఐ ఆలోచన చేస్తున్నట్లు, తర్వలో దీనికి సంబంధించి ఆరోగ్య శాఖతో సంప్రదింపులు జరుపనున్నట్టు ఆయన వెల్లడించారు. కరోనా ఎప్పుడు అంతమవుతుందో ఎవ్వరికీ తేలీదు కాబట్టి, ఆటగాళ్ల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా వ్యాక్సినేషన్ ఉత్తమమైన మార్గమని అభిప్రాయపడుతున్నట్లు పేర్కొన్నారు. కోవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఐపీఎల్ కోసం అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముందుగా ప్రకటించిన ఆరు వేదికల్లో మ్యాచ్‌లు తప్పక నిర్వహిస్తామని, ఆ దిశగా బయో బబుల్ కూడా ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు. ఖాళీ స్టేడియాల్లోనే టోర్నీ మొత్తం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, ఇప్పటికే ముగ్గురు ఆటగాళ్లు వైరస్ బారిన పడటంతో ఆటగాళ్లతో సహా ఆయా యాజమాన్యాలు, బీసీసీఐ ఆందోళన చెందుతున్నాయి. తొలుత కేకేఆర్ ఆటగాడు నితీష్ రాణాకు వైరస్ నిర్ధారణ కాగా, అతరువాత ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. తాజాగా, ఆర్సీబీ యువ ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్‌ను సైతం కరోనా కాటువేయడంతో ఆయా ఫ్రాంఛైజీలు, బీసీసీఐ కరోనా కట్టడి మార్గాలను అన్వేషించే పనిలో నిమగ్నమైంది. అందులో భాగంగానే ఆటగాళ్లకు వ్యాక్సినేషన్ ప్రస్థావనకు తెరపైకి తెచ్చింది. చదవండి: భార్యకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వార్నర్ -
‘ఆ విషయంలో ధోనికి పూర్తి స్వేచ్ఛ’
ఇండోర్: ప్రస్తుత క్రికెట్లో ప్రధానంగా చర్చ జరుగుతున్న అంశం ‘ధోని రిటైర్మెంట్ ఎప్పుడు?’. టెస్టు క్రికెట్‌కు 2014లోనే వీడ్కోలు పలికిన ఎంఎస్ ధోని.. పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. కాగా, ఇంగ్లండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ అనంతరం మళ్లీ ఇప్పటివరకు ధోని టీమిండియా జెర్సీ ధరించలేదు. కొంతకాలం ఆర్మీకి సేవలందించాలని కొన్ని నెలలు క్రికెట్‌కు దూరంగా ఉండగా.. ప్రస్తుతం సెలక్షన్స్‌కు స్వతహగా అతడే దూరంగా ఉంటున్నాడని బయట టాక్. దీంతో ధోని రిటైర్మెంట్ అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మాజీ ఛైర్మన్ రాజీవ్ శుక్ల ధోని గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ధోని ఒక గొప్ప క్రికెటర్. సారథిగా, ఆటగాడిగా టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. అతడు ఇంకా చాలా క్రికెట్ ఆడాల్సి ఉంది. కానీ, రిటైర్మెంట్పై తుది నిర్ణయం అతడి చేతుల్లోనే ఉంటుంది. ఆ విషయంలో బీసీసీఐతో సహా మరొకరు జోక్యం చేసుకోలేరు. రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకునే పూర్తి స్వేచ్ఛను ప్రతీ ఒక్క క్రికెటర్‌కు బీసీసీఐ ఇచ్చింది. వారు తీసుకున్న నిర్ణయాన్ని బీసీసీఐ స్వాగతిస్తుంది తప్ప ఎలాంటి అభ్యంతరం చెప్పదు’అంటూ శుక్ల పేర్కొన్నాడు. ఇక ధోని భవిత్యం త్వరలో జరగబోయే ఐపీఎల్‌తో తేలనుందని క్రికెట్ పండితులు పేర్కొంటున్నారు. ఈ మెగా టోర్నీలో రాణించి ఈ ఏడాది చివర్లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో ధోని టీమిండియా తరుపున ఆడతాడని అతడి ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: పులిని పులి ఫొటో తీసింది..! అందుకే ధోని బెస్ట్ కెప్టెన్ -
మా సర్జికల్ దాడులివీ..
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వంలోనూ సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టామని వెల్లడించిన కాంగ్రెస్ అందుకు సంబంధించిన జాబితాను బహిర్గతం చేసింది. తాము అధికారంలో ఉన్నప్పుడు ఆరు సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టామని, కానీ ఏనాడు వాటిని రాజకీయాల కోసం వినియోగించుకోలేదని కాంగ్రెస్ పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రాజీవ్ శుక్లా గురువారం మీడియా సమావేశంలో జాబితాను వెల్లడించారు. 2008 జూన్ 19న పూంచ్‌లోని భట్టల్ సెక్టార్ ప్రాంతంలో, 2011 ఆగస్టు 30–సెప్టెంబర్ 1 తేదీల్లో కేల్లో నీలమ్ నదీ ప్రాంతంలోని శార్దా సెక్టార్లో, 2013 జనవరి 6న సవన్ పత్ర చెక్‌పోస్ట్ వద్ద, 2013 జూలై 27–28 తేదీల్లో నజపిర్ సెక్టార్లో, 2013 ఆగస్టు 6న నీలమ్ లోయ ప్రాంతంలో, మరొకటి 2013 డిసెంబర్ 23న చేపట్టినట్లు తెలిపారు. అలాగే వాజ్‌పేయ్ ప్రభుత్వంలోనూ రెండు సర్జికల్ స్ట్రైక్స్ జరిపినట్లు వెల్లడించారు. 2000 జనవరి 21న నీలమ్ నది ప్రాంతంలోని నదలా ఎన్క్లేవ్, 2003 సెప్టెంబర్ 18న పూంచ్‌లోని బార్హో సెక్టార్లో దాడులు చేసినట్లు తెలిపారు. మన్మోహన్ ఇంటర్వ్యూ తర్వాత... యూపీఏ హయాంలోనూ సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టినట్లు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హిందుస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అప్పటి నుంచి బీజేపీ–కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. -
పాక్‌తో ఆడే ముచ్చటే లేదు: ఐపీఎల్ ఛైర్మన్
ముంబై : దాయాది పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడే అవకాశమే లేదని ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. పుల్వామా ఉగ్రదాడిపై ఆయన స్పందించారు. ప్రభుత్వ అంగీకారం లేకుండా పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడే ప్రసక్తే లేదన్నారు. ఈ విషయంలో తమ వైఖరిపై స్పష్టత ఉందన్నారు. వాస్తవానికి క్రీడలకు ఈ పరిణామాలతో సంబంధం ఉండదని, కానీ ఎవరైనా ఉగ్రవాదానికి ఊతమిస్తున్నారంటే... దాని ప్రభావం కచ్చితంగా క్రీడలపై పడుతుందన్నారు. ఇంగ్లండ్ వేదికగా జరగబోయే ప్రపంచ కప్‌లో పాక్‌తో భారత్ ఆడుతుందా అన్న ప్రశ్నకు శుక్లా సమాధానం దాటవేశారు. ప్రస్తుతం దీనిపై ఏమీ చెప్పలేనన్నారు. ‘‘ప్రపంచకప్‌కు ఇంకా చాలా రోజుల సమయం ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం...’’అని పేర్కొన్నారు. పుల్వామా దాడితో యావత్ భారత్ పాకిస్తాన్‌పై రగిలిపోతున్న సంగతి తెలిసిందే. ఈ జనాగ్రహాన్ని సమర్ధించిన శుక్లా... ఉగ్రవాదానికి కొమ్ముకాయడం మానుకోవాలంటూ పాక్‌కు హితవు పలికారు. గత గురువారం(ఫిబ్రవరి14న) జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి జరగడంతో 40 మంది సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. -
కేసీఆర్ హయాంలో సర్వనాశనం
సాక్షి, హైదరాబాద్: ఏ లక్ష్యంతో అయితే తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిందో ఆ లక్ష్యం నెరవేరలేదని, కేసీఆర్ హయాంలో తెలంగాణ సర్వనాశనం అయిందని కేంద్ర మాజీ మంత్రి, ఏఐసీసీ అధికార ప్రతినిధి రాజీవ్‌శుక్లా వ్యాఖ్యానించారు. ఫాంహౌస్ నుంచి పాలన సాగించిన కేసీఆర్ నియం తలా వ్యవహరించారని, ప్రజాస్వామ్యంలో ఇది సరైంది కాదని అభిప్రాయపడ్డారు. ఆదివారం హైదరాబాద్‌కు వచ్చిన ఆయన గాంధీభవన్‌లో టీపీసీసీ కిసాన్‌సెల్ చైర్మన్ కోదండరెడ్డి, ఏఐసీసీ ప్రతినిధులు ప్రశాంత్, ఫయీమ్, సత్యప్రకాశ్, యతీశ్, సురేశ్‌కుమార్‌లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. తెలం గాణ రాష్ట్ర గమనంలో ఈ ఎన్నికలు చాలా కీలకమైనవన్నారు. లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పిన కేసీఆర్ తన కుటుంబంలో మాత్ర మే ఉపాధి చూపెట్టారని, తెలంగాణ యువతను నిర్వీర్యం చేశారన్నారు. నిరుద్యోగంలో తెలంగాణ దేశంలోనే మూడోస్థానంలో ఉండటం పరిస్థితికి అద్దం పడుతోందన్నారు. రాష్ట్రసాధన కోసం ప్రాణత్యాగం చేసిన 1,200 మంది అమరవీరుల కుటుం బాలకు న్యాయం చేయడంలోనూ కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమయ్యాయన్నారు. తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి, సోనియాగాంధీకి, అప్పటి ప్రధాని మన్మోహన్‌కు మాత్రమే దక్కుతుం దని, కాంగ్రెస్ ఇవ్వాలనుకోకపోతే కేసీఆర్ తెలంగాణ సాధించగలిగేవాడా అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల తర్వాత తెలంగాణలో మార్పు తప్పకుండా వస్తుం దని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై తీరుతుందన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి 80 సీట్లు తప్పకుండా వస్తాయన్నారు. టికెట్ల గురించి కాంగ్రెస్‌లో జరుగుతున్న గొడవల గురించి ప్రశ్నించగా, టికెట్ల గురించి గొడవలు జరగని పార్టీ ఏదీ ఉండదని, ఇది సర్వసాధారణమేనని చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోదీ, రాష్ట్రాన్ని పాలిస్తోన్న కేసీఆర్‌లది జబర్దస్త్ జోడీ అని, అబద్ధాలు చెప్పడంలో ఇద్దరిదీ ఒకటే నైజం అని విమర్శించారు. -
శుక్లా సన్నిహితుడిపై వేటు!
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (యూపీసీఏ) సెలక్షన్ ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు గుప్పుమన్న నేపథ్యంలో ఓ అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. ఐపీఎల్ చైర్మన్, యూపీసీఏ కార్యదర్శి రాజీవ్ శుక్లా వర్గానికి చెందిన అక్రమ్ సైఫీపై అవినీతి ఆరోపణలు రావడంతో అతన్ని విధుల నుంచి తొలగించారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ పూర్తి వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించింది. ఓ జాతీయ మీడియా జరిపిన స్టింగ్ ఆపరేషన్‌లో అక్రమ్ సైఫీ... రాష్ట్ర జట్టులో చోటు కోసం యత్నిస్తున్న యువ ఆటగాడు రాహుల్ శర్మ నుంచి ముడుపులు కోరడంతో పాటు ఆటగాళ్లకు తప్పుడు వయసు ధ్రువీకరణ పత్రాలు ఇస్తున్నట్లు తేలింది. ఈ అంశాలను ఆ ఛానల్ ప్రసారం చేయడంతో బీసీసీఐ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. -
టీ20: హర్మన్‌ప్రీత్ వర్సెస్ స్మృతి మంధాన
ముంబై: మహిళా క్రికెటర్ల కోసం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తరహాలో బీసీసీఐ ఈ నెల 22న ఒక టీ20 మ్యాచ్ నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. ముంబైలో ఈనెల 22న జరగనున్న ఐపీఎల్-11 తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌కు ముందు ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తారు. భారత మహిళా క్రికెటర్లతో పాటు విదేశీ మహిళా ప్లేయర్లు ఈ టీ20 మ్యాచ్‌లో ఆడనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఈ నెల 22న ఐపీఎల్లో భాగంగా వాంఖడే మైదానంలో రాత్రి 8గంటలకు క్వాలిఫయర్-1 జరగనుంది. ఇరు జట్లకు కెప్టెన్లుగా భారత మహిళా స్టార్ క్రికెటర్లు హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధానలు వ్యవరిస్తారని ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా ప్రకటించారు. తాజాగా బీసీసీఐ జట్లను, జట్టు ప్లేయర్లను వెల్లడించింది. 26 మంది మహిళా క్రికెటర్లను ఎంపిక చేయగా.. ఇందులో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లకు చెందిన వారు 10 మంది ఉన్నారు. భారత మహిళా క్రికెటర్లు అధిక సంఖ్యలో ఈ టీ20 మ్యాచ్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. టీ20 క్రికెట్‌కు ప్రాధాన్యం పెంచేందుకు విదేశీ మహిళా క్రికెటర్లు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. రెండు జట్లు: ఐపీఎల్ ట్రయల్ బ్లేజర్స్: స్మృతి మంధాన(కెప్టెన్), అలిస్సా హీలీ(కీపర్), సుజీ బేట్స్, దీప్తి శర్మ, బెత్ మూనీ, జెమీమా రోడ్రిక్స్, డానియెల్లె హాజెల్, శిఖా పాండే, లీ టహుహు, జులన్ గోస్వామి, ఏక్తా బిస్త్, పూనమ్ యాదవ్, హేమలత. కోచ్: తుషార్ ఆర్థో ఐపీఎల్ సూపర్ నోవాస్: హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), తానియా భాటియా(కీపర్) మిథాలీ రాజ్, మెగ్ లానింగ్, సోఫీ డివైన్, ఎల్లీస్ పెర్రీ, వేద కృష్ణమూర్తి, మోన మెశ్రమ్, పూజా వస్త్రాకర్, మేగన్ స్క్కూట్, రాజేశ్వరి గైక్వాడ్, అనూజ పాటిల్ కోచ్: బిజు జార్జ్ -
అటెన్షన్ ప్లీజ్ : ఐపీఎల్ టైమింగ్స్‌లో మార్పు
ముంబై : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-11 సీజన్లో ప్లే ఆఫ్, ఫైనల్ మ్యాచ్‌ల సమయాల్లో మార్పు చోటుచేసుకుంది. ప్రస్తుత సమయం కంటే ఓ గంట ముందుగానే మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. అభిమానుల ఇబ్బందుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా బుధవారం మీడియాకు తెలిపారు. ‘‘గత కొన్నేళ్లుగా ఐపీఎల్‌కు వస్తున్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. టీవీ, మైదానాల్లో చూసే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వారికి ఇబ్బందులు తలెత్తకుండా ప్లే ఆఫ్, ఫైనల్ మ్యాచ్‌లను ఓ గంట ముందు ప్రారంభించాలని నిర్ణయించాం. దీంతో మ్యాచ్‌లు 7 గంటలకే ప్రారంభం కానున్నాయి. ఇది కేవలం మైదానంలోని అభిమానుల కోసమే కాకుండా టీవీ ప్రేక్షకులను సైతం దృష్టిలో ఉంచుకొని తీసుకున్న నిర్ణయం. మ్యాచ్‌లు ఆలస్యం కావడంతో మైదాన, టీవీ ప్రేక్షకులకు ఉదయం లేచి, కాలేజీలు, ఉద్యోగాలకు వెళ్లడం కష్టంగా ఉంటుంది. దీంతో మ్యాచ్ సమయాలను మార్చాం’ అని శుక్లా పేర్కొన్నాడు. ప్రస్తుతం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతున్న మ్యాచ్‌లు రాత్రి 11.30 ముగుస్తున్నాయి. ఇక స్లో ఓవర్ రేట్ కారణంగా కొన్ని మ్యాచ్‌లు అర్థరాత్రి 12 తర్వాత ముగుస్తున్నాయి. వర్షం అంతరాయం కలిగిస్తే ఇక అంతే సంగతులు. దీంతో ప్రేక్షకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. -
ఐపీఎల్: ప్లే ఆఫ్ మ్యాచ్‌ల వేదికలు మార్పు
కోల్‌కతా : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్ షెడ్యూల్ వేదికల్లో స్పల్ప మార్పు చోటుచేసుకుంది. ముందస్తుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లకు పుణే మైదానం (మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) స్టేడియం) ఆతిథ్యమివ్వాల్సి ఉంది. అయితే రెండు మ్యాచ్‌ల వేదికలను కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌కు తరలిస్తూ శుక్రవారం ఐపీఎల్ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. మే 23, 25 తేదీల్లో ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లు కోల్‌కతాలో జరుగుతాయని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపారు. పుణే స్టేడియం కన్నా చరిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ సామర్థ్యం ఎక్కువగా ఉండటంతో ఐపీఎల్ పాలకమండలి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈడెన్‌లో 67వేల మంది అభిమానులు మ్యాచ్‌ను వీక్షించేందుకు అవకాశం ఉంది. క్వాలిఫయర్ 1 యథావిధిగా ముంబైలోని వాంఖెడే స్టేడియంలోనే మే 22న జరగనుంది. మే 27న టోర్నీ ఫైనల్ మ్యాచ్‌కు కూడా ఈ మైదానమే ఆతిథ్యమివ్వనుంది. తొలుత ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లకు చెన్నై సూపర్ కింగ్స్ హోం గ్రౌండ్ చపాక్ స్టేడియం ఆతిథ్యమివ్వాల్సిండగా.. కావేరీ వివాదంతో ఆ జట్టు సొంతమైదానంగా పుణెలో ఆడుతున్న విషయం తెలిసిందే. -
అంపైర్లు అప్రమత్తంగా ఉండాలి: ఐపీఎల్ చైర్మన్
న్యూఢిల్లీ : మైదానంలో అంపైర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా సూచించారు. రాజస్తాన్ రాయల్స్, సన్‌రైజర్స్ మ్యాచ్‌లో ఓవర్లో 7 బంతులు వేయించడం.. ఉప్పల్‌లో చెన్నై-సన్‌రైజర్స్ మ్యాచ్‌లో స్పష్టమైన నోబాల్‌ను ఇవ్వకపోవడంతో అంపైర్ల విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఢిల్లీ డేర్ డెవిల్స్, కింగ్స్ పంజాబ్ మ్యాచ్‌కు హజరైన శుక్లా.. అంపైర్ల తప్పిదాలపై స్పందించారు. ‘ఇలాంటి తప్పిదాలు కొన్ని సార్లు జరుగుతుంటాయి. అంపైర్లు అప్రమత్తంగా వ్యవహరించేలా మ్యాచ్ రిఫరీలు వారితో చర్చించాలని’ పేర్కొన్నారు. ఇలాంటి చిన్న తప్పిదాలు జరగకుండా అంపైర్లు అవసరమైతే టెక్నాలజీ సాయం తీసుకోవాలని మరో ఐపీఎల్ అధికారి అభిప్రాయపడ్డారు. ఎవరు కావాలని తప్పిదాలు చేయరని ఆయన పేర్కొన్నారు. ఇక చెన్నై మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓటమికి అంపైర్ నిర్ణయమే కారణమని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సన్‌రైజర్స్-రాజస్తాన్ మ్యాచ్‌లో ఘోర తప్పిదం పాండ్యా నాటౌట్..! చిర్రెత్తిన కోహ్లీ ‘అంపైర్ వల్లే సన్‌రైజర్స్ ఓటమి’ -
ఐపీఎల్ నుంచి స్మిత్, వార్నర్‌లు ఔట్
ముంబై : ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లకు దెబ్బ మీద దెబ్బ తగలుతోంది. ఇప్పటికే వారి దేశ బోర్డు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఏడాది పాటు నిషేధం విధించగా.. ఈ ఆటగాళ్లు ప్రాతినిథ్యం వహిస్తున్న ఐపీఎల్ జట్లు కెప్టెన్సీ నుంచి తప్పించాయి. కెప్టెన్సీ ఊడినా ఐపీఎల్లో ఆడొచ్చు అని భావించిన ఈ ఆటగాళ్లకు ఐపీఎల్ కమిషనర్ రాజీవ్ శుక్లా గట్టి షాకిచ్చారు. క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించడంతో స్మిత్, వార్నర్‌లను ఈ సీజన్ ఐపీఎల్‌కు అనుమతించేది లేదని స్పష్టం చేశాడు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. వార్నర్, స్మిత్‌లు ప్రాతినిథ్యం వహిస్తున్న ఫ్రాంచైజీలు వారి స్థానాల్లో ఇతర ఆటగాళ్లను తీసుకోవాలని సూచించారు. ఈ ఇద్దరిని ఈ సీజన్ ఐపీఎల్‌లోకి అనుమతించేది లేదని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్సీ నుంచి తొలిగించినా ఆటగాడిగానైనా జట్టులో కొనసాగుతారని అందరు భావించారు. తాజా నిర్ణయంతో ఈ ఫ్రాంచైజీలు వారిని భర్తీ చేయగల విదేశీ ఆటగాళ్ల అన్వేషణలో పడ్డాయి. డేవిడ్ వార్నర్ దూరమవ్వడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ సగం బలం కోల్పోనుంది. ముఖ్యంగా జట్టు బ్యాటింగ్ బాధ్యతను గత రెండు సీజన్లలో వార్నర్ ఒంటి చేత్తో భుజాన మోసాడు. దీంతోనే సన్‌రైజర్స్ యాజమాన్యం వార్నర్‌ను వదులుకోకుండా అంటిపెట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కెప్టెన్‌గా ఎవరిని నియమించాలని తలపట్టుకుంటున్న సన్‌రైజర్స్ యాజమాన్యానికి తాజా నిర్ణయం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. వార్నర్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు హైదరాబాద్ జట్టుకు ఇప్పటికిప్పుడు దొరకడం కష్టమేనని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
క్రికెట్ మ్యాచ్‌ల వేళల్లో మార్పులు?
న్యూఢిల్లీ:రాబోవు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ లో జరిగే మ్యాచ్‌ల సమయాలు మారే అవకాశం కనిపిస్తోంది. ఈ టోర్నీ నిర్వహించే సమయంలో ఇప్పటివరకూ తొలి మ్యాచ్ సాయంత్రం 4 గంటలకు, రెండో మ్యాచ్ రాత్రి 8 గంటలకు నిర్వహించే వారు. అయితే ఇక నుంచి రెండో మ్యాచ్‌ను 7గంటలకు నిర్వహించాలనే యోచనలో ఐపీఎల్ నిర్వాహకులు ఉన్నారు. రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే రెండో మ్యాచ్ ముగిసే సరికి అర్ధరాత్రి దాటుతున్న కారణం చేత దాన్ని ఒక గంట ముందుకు తీసుకురావాలని ఆలోచన ఉంది. అంతేకాదు ఇంటి దగ్గర ఉండి చూసే ప్రేక్షకులు సైతం పూర్తిగా మ్యాచ్‌లను వీక్షించలేకపోతున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకున్న నిర్వాహకులు వచ్చే ఏడాది నుంచి రెండో మ్యాచ్‌ను సాయంత్రం 7గంటలకే ప్రారంభించాలన్న ప్రతిపాదనను ఫ్రాంఛైజీల ముందుంచారు. ఈ ప్రతిపాదనకు అందరూ అంగీకారం తెలపడంతో దీనిపై ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా స్టార్ ఇండియా ప్రతినిధులతో మాట్లాడనున్నారు.'డిసెంబరు 5న ఢిల్లీలో స్టార్ ఇండియా ప్రతినిధులతో జరిగే సమావేశంలో ఈ అంశాన్ని వారి ముందు ఉంచుతా. రెండో మ్యాచ్ సాయంత్రం 7గంటలకే నిర్వహిస్తాం' అని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపారు. అయితే రెండో మ్యాచ్ రాత్రి 7 గంటలకు నిర్వహిస్తే, తొలి మ్యాచ్ ను గంట ముందుగా అంటే మధ్యాహ్నం 3 గంటలకు ఆరంభిస్తారు. -
ఏడాదికి రెండు ఐపీఎల్ లీగ్‌లు
న్యూఢల్లీ: క్రికెట్ లీగుల్లో ఐపీఎల్‌కు ఉండే క్రేజే వేరు. అటు ఆటగాళ్లకు, ఇటు బోర్డుకు కాసుల వర్షం కురిపిస్తోంది. భారత్‌లో నిర్వహించే ఈ టోర్నీ క్రికెట్లో అత్యంత ప్రాచుర్యం పొందింది. ఈ టోర్నీని చూడటానికి పలు దేశాలనుంచి క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తునే వస్తారు. ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని మినీ ఐపీఎల్ టోర్నీని ప్రవేశపెట్టే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న ఐపీఎల్‌ని ఏడాదిలో ఒకసారి మాత్రమే నిర్వహించడం సబబుకాదని ఐపీఎల్ చీఫ్ రాజీవ్ శుక్లా అన్నారు. గతంలో నిర్వహించిన ఛాంపియన్స్ లీగ్ టీ20 ఫెయిల్ అవడంతో, ఇప్పుడు ఆ స్థానంలో ఈ మినీ ఐపీఎల్ ప్రవేశపెట్టాలని బీసీసీఐతో చర్చలు జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం మినీ ఐపీఎల్ నిర్వహణపై చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే మినీ ఐపీఎల్ టోర్నీని విదేశాల్లో నిర్వహిస్తామని రాజీవ్ తెలిపారు. అన్నీ సక్రమంగా జరిగితే దుబాయ్‌లో మినీ ఐపీఎల్ నిర్వహించే అవకాశం ఉందని రాజీవ్ అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా అభిమానుల రెట్టింపు ఆనందం కోసం 2018లో జరగనున్న ఐపీఎల్లో చాలా మార్పులు చోటుచేసుకుంటాయన్నారు. రానున్న పది ఏళ్లలో ఐపీఎల్ మరింత ఎక్కువ మందికి చేరువయ్యేలా, ఆకట్టుకునేలా ప్రణాళికలు చేస్తున్నట్లు శుక్లా తెలిపారు. ఫ్రాంచైజీ జట్టు, బీసీసీఐతో ఆదాయాన్ని పంచుకునే విధానం గురించి ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఐపీఎల్-11వ సీజన్లో 8 జట్లే ఆడతాయని తెలిపారు. ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి టోర్నీకి ముందు ఐపీఎల్ ఆడటం ఆటగాళ్లకు ఎంతో లాభించిందని, ఫిట్నెస్ మెరుగుపరుచుకుని టోర్నీలో పాల్గొన్నారని శుక్లా తెలిపారు. -
బీసీసీఐ ప్రత్యేక కమిటీలో గంగూలీ
చైర్మన్‌గా రాజీవ్ శుక్లా ఏడుగురికి స్థానం లోధా సంస్కరణల అమలుపై ఏర్పాటు న్యూఢిల్లీ: లోధా ప్యానెల్ సూచించిన సంస్కరణల అమలు కోసం బీసీసీఐ ఏర్పాటు చేసిన కమిటీలో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి చోటు దక్కింది. ఏడుగురితో కూడిన ఈ కమిటీ లోధా సంస్కరణల అమల్లో ఎదురవుతున్న ఇబ్బందులపై నివేదిక ఇవ్వనుంది. సోమవారం జరిగిన బోర్డు ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం)లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కమిటీకి రాజీవ్ శుక్లా చైర్మన్‌గా... బోర్డు కార్యదర్శి అమితాబ్ చౌదరి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. మిగతా సభ్యుల్లో టీసీ మ్యాథ్యూ (కేరళ క్రికెట్ సంఘం మాజీ అధ్యక్షులు), నబా భట్టాచార్జీ (మేఘాలయ క్రికెట్ సంఘం కార్యదర్శి), జయ్ షా (బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు, గుజరాత్ క్రికెట్ సంఘం కార్యదర్శి), బీసీసీఐ కోశాధికారి అనిరుధ్ చౌదరి ఉన్నారు. ఈనెల 30న కమిటీ తొలి సమావేశం జరిగే అవకాశం ఉంది. లోధా ప్యానెల్ ప్రతిపాదనల్లో కొన్నింటిని కచ్చితంగా అమలు చేయాల్సిందేనని గతంలో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. కానీ ఈ తీర్పులో ఉన్న కొన్ని క్లిష్టమైన విషయాలను గుర్తించి ఈ కమిటీ బీసీసీఐకి 15 రోజుల్లో నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ‘లోధా ప్రతిపాదనల అమలుపై కోర్టులో వచ్చే నెల 14న విచారణ జరగనుంది. వీలైనంత త్వరగా సమావేశం తేదీని ఖరారు చేసుకుని వచ్చే నెల 10నే నివేదిక అందించాల్సి ఉంటుంది. బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు వీకే ఖన్నాకు కమిటీ తుది నివేదికను సమర్పిస్తుంది. ఆ తర్వాత మరోసారి ఎస్‌జీఎంలో చర్చ జరుగుతుంది’ అని కార్యదర్శి అమితాబ్ చౌదరి తెలిపారు. ఒక రాష్ట్రం ఒక ఓటు, ఆఫీస్ బేరర్ల గరిష్ట వయస్సు 70 ఏళ్లకు మించకపోవడం, మూడేళ్ల కూలింగ్ పీరియడ్, జాతీయ సెలక్షన్ ప్యానెల్లో సభ్యుల సంఖ్యపై బీసీసీఐ సభ్యులకు తీవ్ర అభ్యంతరాలున్నాయి. -
రైతు కష్టాలు పట్టవా?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఏఐసీసీ నేత శుక్లా ధ్వజం సాక్షి, హైదరాబాద్: రైతులు అప్పులతో ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం బడా కంపెనీల వేలకోట్ల అప్పులను మాఫీ చేస్తోందని ఏఐసీసీ అధికారప్రతినిధి రాజీవ్ శుక్లా విమర్శించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంతరావుతో కలసి సోమవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. దేశంలో రోజుకు 35 మంది రైతులు సగటున ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని శుక్లా చెప్పారు. వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో పడిపోయిందని, పంటలకు సబ్సిడీ ఇవ్వకుండా, పండించిన పంటలకు గిట్టుబాటుధర కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయరంగంలో స్వామినాథన్ సిఫారసులను అమలుచేస్తామని హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ మూడేళ్లుగా ఏం చేశారని ప్రశ్నించారు. వ్యవసాయపెట్టుబడులపై 50 శాతం లాభానికి పంటలను అమ్ముకునే విధంగా రైతులను తీర్చిదిద్దుతామని చెప్పి ఇప్పుడు పట్టించుకోవడంలేదన్నారు. కేంద్రం అమలు చేస్తున్న ఫసల్ బీమా పథకం రైతులకు కాకుండా బీమా కంపెనీలకే ఉపయోగపడు తోందని ఆరోపించారు. ఈ పథకం వల్ల కంపెనీలు రైతుల నుంచి రూ.10,376 కోట్ల లాభం పొందాయని వివరించారు. రాష్ట్రప్రభుత్వం కూడా రైతుల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందన్నారు. మద్దతు ధరలు ఇవ్వాలని అడిగిన పాపానికి రైతులపై కేసులు పెట్టడం, చేతులకు బేడీలు వేయడం వంటి కిరాతకాలకు పాల్పడుతోందని రాజీవ్ శుక్లా ధ్వజమెత్తారు. రైతుల పట్ల అనుచితుంగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బీజేపీకి, టీఆర్ఎస్కు రైతులే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. -
రాజీవ్ శుక్లా అవుట్!
లక్నో: లోధా కమిటీ సిఫారుసులను అమలు చేసేందుకు ఉత్తర ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్(యూపీసీఏ) నడుంబిగించింది. దీనిలో భాగంగా యూపీసీఏ సెక్రటరీ పదవికి రాజీవ్ శుక్లా తాజాగా రాజీనామా చేశారు. దాంతో పాటు మరో ఐదుగురు ఆఫీస్ బేరర్లు తమ తమ పదవులకు రాజీనామా చేస్తూ వర్కింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వీరిలో రాజీవ్ శుక్లా, బీసీ జైన్(అకౌంట్స్ జాయింట్ సెక్రటరీ)లు ఇప్పటికే తొమ్మిదేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకోవడంతోవారి హోదాల నుంచి వైదొలగాల్సి వచ్చింది. మరొకవైపు 70 ఏళ్ల పైబడిన నలుగురు యూపీసీఏ సభ్యులు తమ పదవులకు గుడ్ బై చెప్పారు. ఇలా తప్పుకున్న వారిలో కేఎన్ టాండన్(ట్రెజరర్), సుహబ్ అహ్మద్(జాయింట్ సెక్రటరీ)లతో పాటు ఉపాధ్యక్షులు తాహిర్ హసన్, మదన్ మోహన్ మిశ్రాలు తమ పదవులకు వీడ్కోలు చెప్పారు. ఈ మేరకు ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన లోధా సిఫారుసులను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పలువురు యూపీసీఏ నుంచి తప్పుకున్నట్లు తెలిపారు. తదుపరి ఏజీఎం(వార్షిక సర్వసభ్య సమావేశం)లో కొత్త ఆఫీస్ బేరర్లను ఎన్నుకోనున్నట్లు శుక్లా స్పష్టం చేశారు. -
'ఆయన్ను ఎలా మరచిపోతాం'
కాన్పూర్:భారత జట్టు 500వ టెస్టు ఆడుతున్న సందర్భంగా పలువురు మాజీ కెప్టెన్లను బీసీసీఐ సన్మానించిన సంగతి తెలిసిందే. వీరిలో అజిత్ వాడేకర్, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి, దిలీప్ వెంగ్‌సర్కార్, సౌరవ్ గంగూలీ, కె.శ్రీకాంత్, అనిల్ కుంబ్లే, మొహమ్మద్ అజహరుద్దీన్, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లిలు ఉండగా, బిషన్ సింగ్ బేడీతో పాటు, గుండప్ప విశ్వనాథ్ లు మాత్రం సన్మాన కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. అయితే గత కొన్ని రోజులు క్రితం తనకు బీసీసీఐ నుంచి ఎటువంటి ఆహ్వానం రాలేదని బిషన్ సింగ్ బేడీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కారణం చేతనే బేడీ సన్మాన కార్యక్రమానికి దూరంగా ఉన్నారని భావించినా.. అందులో ఎటువంటి వాస్తవం లేదని ఐపీఎల్ చైర్మన్, ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి బిషన్ సింగ్ బేడీ హాజరు కాకపోవడాన్ని బీసీసీఐకి జరిగిన నష్టంగా అభివర్ణించిన శుక్లా.. ఓ దిగ్గజ ఆటగాడ్ని పిలువ కూడదనే ఆలోచన ఎలా చేస్తామని ప్రశ్నించారు. జాతీయ వార్తా పత్రిక ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్య్వూలో బిషన్ సింగ్ బేడీ గైర్హజరీపై శుక్లా స్పందించారు. '500వ టెస్టు మ్యాచ్ సన్మాన కార్యక్రమానికి ఆహ్వానిస్తూ బేడీకి ఈ-మెయిల్ చేశా. దాంతో పాటు ఫోన్ లో కూడా కాంటాక్ట్ చేయాలని యత్నించా. బిషన్ సింగ్ బేడీ అందుబాటులోకి రాలేదు. నాకు బేడీ అంటే విపరీతమైన అభిమానం. విద్యార్థి దశ నుంచి ఆయన ఆటను చూస్తూ పెరిగాను. ఈ గ్రీన్ పార్క్ స్టేడియంలో బేడీ కొట్టిన సిక్సలు ఇప్పటికీ నాకు గుర్తే. 22 టెస్టులకు సారథిగా వ్యవరించిన బేడీని పిలవకూడదనే ఆలోచన బీసీసీఐ చేయలేదు' అని శుక్లా పేర్కొన్నారు. -
సుప్రీం తీర్పును గౌరవిస్తున్నాం: బీసీసీఐ
న్యూఢిల్లీ: జస్టిస్ లోథా కమిటీ ప్రతిపాదించిన సిఫారుసుల అమలుపై తాజాగా సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును తాము గౌరవపూర్వకంగా స్వీకరిస్తున్నట్లు బీసీసీఐ సీనియర్ కోశాధికారి , ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. అయితే లోథా కమిటీ ప్రతిపాదనలను ఏ రకంగా అమలు చేయాలనే దానిపై ప్రధాన దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. 'సుప్రీం తీర్పును గౌరవిస్తున్నాం. లోథా కమిటీ కొన్ని ప్రతిపాదనలు సూచించింది. ఆ ప్రతిపాదనల్లో చాలా వాటిని సుప్రీం ఆమోదించింది. వాటిని అమలు చేయడానికి కచ్చితమైన ప్రణాళికతో ముందుకు వెళతాం. అయితే ఎలా అమలు చేయాలి అనే దానిపై త్వరలో కార్యచరణ రూపొందిస్తాం' అని శుక్లా పేర్కొన్నారు. బీసీసీఐ ప్రక్షాళనలో భాగంగా ఈ ఏడాది జనవరిలో ఏర్పాటైన జస్టిస్ లోథా కమిటీ అనేక ప్రతిపాదనలను సూచించింది. అయితే దీనిపై కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసిన బీసీసీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిలో భాగంగా సోమవారం మరోసారి బీసీసీఐ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం.. దాదాపులోథా కమిటీ సూచించిన అన్ని ప్రధాన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఆరు నెలల్లో క్రికెట్‌ను ప్రక్షాళన చేయాలని బీసీసీఐకు సూచించిన సుప్రీం.. క్రికెట్ కు రాజకీయ నేతలకు దూరంగా ఉండాలని తీర్పులో స్పష్టం చేసింది. -
పుణే మ్యాచ్ లు విశాఖలో...
♦ బెంగళూరుకు ఫైనల్ ♦ ఐపీఎల్ మ్యాచ్‌ల తరలింపు న్యూఢిల్లీ: నీటి సమస్య కారణంగా మహారాష్ట్రలో జరగాల్సిన 13 ఐపీఎల్ మ్యాచ్‌లను ఇతర వేదికలకు తరలించారు. బాంబే హైకోర్టు తీర్పు నేపథ్యంలో లీగ్ చైర్మన్ రాజీవ్ శుక్లా నేతృత్వంలో వేదికల మార్పుపై శుక్రవారం సమావేశం జరిగింది. ఇందులో ముంబై ఇండియన్స్, రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. దీంట్లో భాగంగా విశాఖపట్నం, రాయ్‌పూర్, కాన్పూర్, జైపూర్లను ప్రత్యామ్నాయ వేదికలుగా నిర్ణయించారు. దీంతో రైజింగ్ పుణే తమ వేదికగా విశాఖపట్నంను ఎంచుకుంది. మరోవైపు ముంబై ఇండియన్స్ మాత్రం నిర్ణయం తీసుకునేందుకు రెండు రోజుల గడువును కోరింది. అలాగే ముంబైలో జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌ను కూడా ఇక్కడే నిర్వహిస్తారు. ఇక రెండో క్వాలిఫయర్‌తో పాటు ఎలిమినేటర్ మ్యాచ్‌ను కోల్‌కతాకు ప్రతిపాదించారు. ‘పుణే తమ హోం మ్యాచ్‌ల కోసం విశాఖను కోరింది. ఈ అంశాన్ని పాలకమండలి ముందు ఉంచుతాం. మహారాష్ట్ర సీఎం కరవు బాధిత సహాయక నిధి కోసం రెండు జట్లు రూ.5 కోట్ల చొప్పున విరాళం ఇచ్చేందుకు అంగీకరించాయి. అలాగే మే 1న ముంబై, పుణే జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను పుణేలో జరిపేందుకు అనుమతించాలని కోర్టును కోరనున్నాం’ అని రాజీవ్ శుక్లా తెలిపారు. -
హైకోర్టు తీర్పుపై నేడు సమావేశం
న్యూఢిల్లీ: మహారాష్ట్ర నుంచి ఐపీఎల్ మ్యాచ్‌ల తరలింపుపై నేడు (శుక్రవారం) లీగ్ చైర్మన్ రాజీవ్ శుక్లా.. ఫ్రాంచైజీలతో సమావేశం కానున్నారు. నీటి సమస్య కారణంగా బాంబే హైకోర్టు ఈమేరకు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈనెల 30 అనంతరం ముంబై ఇండియన్స్, రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్‌లకు చెందిన 13 మ్యాచ్‌లను ఇతర వేదికలకు మార్చాల్సిన అవసరం ఏర్పడింది. ఈనేపథ్యంలో చర్చించేందుకు రెండు జట్లకు చెందిన ప్రతినిధులను శుక్లా ఆహ్వానించారు. ఈసమావేశంలో బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ కూడా పాల్గొంటారు. రేసులోకి వైజాగ్ మహారాష్ట్ర నుంచి తరలించాల్సిన మ్యాచ్‌లలో కొన్నింటిని విశాఖపట్నంలో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ముంబై, పుణే జట్ల హోమ్ మ్యాచ్‌లను నిర్వహించేందుకు వైజాగ్, రాయ్‌పూర్, కాన్పూర్ రేసులో ఉన్నట్లు సమాచారం. మే నెలలో ముంబై ఇండియన్స్ ఆడాల్సిన మూడు హోమ్ మ్యాచ్‌లు విశాఖపట్నంలో జరగడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. -
ఐపీఎల్‌కు ఝలక్
ఏప్రిల్ 30 తర్వాతి మ్యాచ్‌లను మహారాష్ట్ర నుంచి తరలించండి ► బీసీసీఐకి బాంబే హైకోర్టు ఆదేశం ► ఫైనల్ సహా 13 మ్యాచ్‌లకు అడ్డంకి ఐపీఎల్-9లో కుదుపు. మహారాష్ట్రలో కరువు, నీటి ఎద్దడి లీగ్‌ను ఊపేసింది. ఓవైపు ప్రాణాలు పోతుంటే.. మరోవైపు ఆటల కోసం పెద్ద మొత్తంలో నీటిని వృథా చేస్తున్నారంటూ చెలరేగిన విమర్శలు తారా స్థాయికి చేరుకున్నాయి. మహారాష్ట్రలో ఏప్రిల్ 30 తర్వాత జరగాల్సిన మొత్తం 13 మ్యాచ్‌లను తరలించాలంటూ బాంబే హైకోర్టు ఆదేశించింది. ముంబై: ఐపీఎల్-9 మ్యాచ్‌ల తరలింపు అంశంలో బీసీసీఐకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 30 తర్వాత మహారాష్ర్టలో జరిగే అన్ని మ్యాచ్‌లను తరలించాలని బాంబే హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువు, నీటి ఎద్దడి నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు తరలించాలని సూచించింది. దీంతో మే 29న జరగాల్సిన ఫైనల్‌తో సహా 13 మ్యాచ్‌లకు ఆటంకం ఏర్పడింది. తరలింపునకు ప్రత్యామ్నాయంగా బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఎన్ని హామీలు ఇచ్చినా కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ‘మహారాష్ట్ర నుంచి మ్యాచ్‌లను తరలించడం సమస్యకు పరిష్కారం కాదనే అంశంతో మేం ఏకీభవిస్తున్నాం. కానీ రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువు, నీటి సమస్యను పరిష్కరించేందుకు ఇది తొలి అడుగు అవుతుందనే భావనతో ఈ నిర్ణయానికి వచ్చాం. నీరు అందుబాటులో లేక కొంత మంది మృత్యువాత పడుతున్నారు. వాళ్ల దురవస్థను కోర్టు విస్మరించజాలదు. కొన్ని జిల్లాలో పారిశుధ్యం, ఇతర అవసరాలకు కూడా నీరు దొరకని పరిస్థితి నెలకొంది. పిచ్‌ల నిర్వహణ కోసం వాడే శుద్ధి చేసిన (సీవరేజ్) నీటిని అలాంటి చోట్లకు తరలిస్తే బాగుంటుంది. ఇలాంటి కేసుల్లో మ్యాచ్‌లను తరలించడానికి బీసీసీఐగానీ, ఫ్రాంచైజీలుగానీ ముందుకొస్తాయని భావించాం. కానీ వాళ్ల స్పందన మరోలా ఉంది. కాబట్టి మ్యాచ్‌లను తరలించడం తప్ప కోర్టుకు మరో అవకాశం లేకపోయింది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు అధికారులకు 15 రోజుల సమయం ఇస్తున్నాం’ అని కోర్టు వ్యాఖ్యానించింది. అసలు కేసు ఇదీ! మ్యాచ్‌ల సందర్భంగా పిచ్‌ల నిర్వహణ కోసం 60 లక్షల లీటర్ల నీటిని వృథా చేస్తున్నారని లోక్‌సత్తా ఎన్జీఓ మూవ్మెంట్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ కనడే, ఎంఎస్ కార్నిక్‌లతో కూడిన డివిజన్ బెంచ్ రెండుసార్లు వాయిదా వేసింది. ఈలోగా ముంబైలో తొలి మ్యాచ్ కూడా జరిగిపోయింది. కానీ బుధవారం జరిగిన సుదీర్ఘ విచారణలో కోర్టు మ్యాచ్‌లను తరలించడానికే మొగ్గు చూపింది. పిటిషనర్ చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ ఆదేశాలు జారీ చేసింది. బీసీసీఐ ప్రతిపాదన మ్యాచ్‌ల తరలింపుకు ప్రత్యామ్నాయంగా 60 లక్షల లీటర్ల శుద్ధి చేసిన నీటిని కరువు పీడిత ప్రాంతాలకు ఉచితంగా సరఫరా చేస్తామని విచారణలో బోర్డు తర ఫు న్యాయవాది రఫీక్ దాదా ప్రతిపాదించారు. తాము పిచ్‌ల కోసం కేవలం శుద్ధి చేసిన నీటిని మాత్రమే వినియోగిస్తున్నామన్నారు.అలాగే ముంబై, పుణే ఫ్రాంచైజీలు చెరో రూ. 5 కోట్లను ‘సీఎం కరువు నివారణ నిధి’కి జమ చేస్తాయని చెప్పారు. టోర్నీ మధ్యలో మ్యాచ్‌లను తరలిస్తే ఆర్థికంగా నష్టపోతామని చెప్పినా కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. జట్ల బ్రాండ్ విలువ, ఆతిథ్య ఫ్రాంచైజీ మ్యాచ్‌ల ఏర్పాట్లకు ఖర్చు చేసిన రూ. 30 కోట్లు వృథా అవుతాయన్న పట్టించుకోలేదు. ఇలా అయితే ఎలా? ఐపీఎల్ ఒక్క రాష్ట్రానికే పరిమితంకాదు. దేశంలోని పెద్ద నగరాలన్నీ చాలా మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తున్నాయి. ప్రస్తుతం ఎండకాలం కావడంతో దేశంలో ప్రతి చోటా తాగునీటి సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇతర నగరాల్లో కూడా ఇలాంటి పిల్ దాఖలైతే బీసీసీఐ పరిస్థితి ఏమిటి? ఇప్పటికే బెంగళూరులో ఇదే తరహాలో పిల్ దాఖలైంది. కానీ ఇదే ధోరణి కొనసాగితే బోర్డు ఎలాంటి చర్యలు చేపడుతుందన్నది మిలి యన్ డాలర్ల ప్రశ్న. గతంలో ఎన్నికల కారణంగా ఐపీఎల్‌ను దక్షిణాఫ్రికాలో ఏర్పాటు చేయడంతో బీసీసీఐ కూడా పెద్ద మొత్తంలో డబ్బులు నష్టపోయింది. మొత్తం 13 మ్యాచ్‌లు... షెడ్యూల్ ప్రకారం ఈనెల 30 తర్వాత నాగ్‌పూర్‌లో 3, ముంబైలో 4, పుణేలో 6 మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నా యి. ఇందులో ఓ ఎలిమినేటర్, ఓ క్వాలిఫయర్‌తో పాటు ఫైనల్ కూడా ఉంది. ఇప్పుడు ఈ మ్యాచ్‌లను ఎక్కడ నిర్వహిస్తారనే దానిపై సందిగ్దత నెలకొంది. ప్రస్తుతానికి బీసీసీఐకి 18 రోజుల సమయం ఉంది. ఈలోగా కొత్త వేదికలను ఎంపిక చేస్తారా లేక హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాలు చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు ఇండోర్‌తో పాటు మరో వేదికను ప్రత్యామ్నాయంగా పరిశీలిస్తున్నట్లు బోర్డు వర్గాల సమాచారం. కోల్‌కతా, బెంగళూరు సిద్ధం ఐపీఎల్-9 ఫైనల్ మ్యాచ్‌కు తాము ఆతిథ్యమిస్తామ ని కోల్‌కతా, బెంగళూరు ముందుకొచ్చాయి. అయితే బెంగళూరులో ఓ క్వాలిఫయర్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఫైనల్ అవకాశం ఈడెన్కే దక్కొచ్చని సమాచారం. మరోవైపు నాగ్‌పూర్‌లో ఆడాల్సిన తమ 3 హోమ్ మ్యాచ్‌లను మొహాలీ లేదా ధర్మశాలలో ఆడాలని పంజాబ్ భావిస్తోంది. ఐపీఎల్‌ను నిర్వహించడమంటేనే తలకు మించిన పని. ఏర్పాట్లన్నీ ఆరు నెలల ముందే జరిగిపోయాయి. అప్పుడే చెప్పాల్సింది. కానీ మధ్యలో అడ్డుకుంటే మ్యాచ్‌లను తరలించడం సాధ్యంకాదు. కోర్టులంటే మాకూ గౌర వం ఉంది. 13 మ్యాచ్‌లను తరలించడం అంటే మామూలు విషయం కాదు. కొంత మంది ఐపీఎల్‌ను లక్ష్యం గా చేసుకున్నారు.- రాజీవ్ శుక్లా మేం తాగునీటిని ఉపయోగించుకోవడం లేదు. కేవలం శుద్ధి చేసిన నీటిని మాత్రమే వాడుతున్నాం. ఐదు నక్షత్రాల హోటల్స్‌లో ఎన్ని స్విమ్మింగ్ పూల్స్ మూతపడ్డాయి? ఎంతమంది తమ పచ్చిక బయళ్లకు నీటిని ఆపేశారు? లీగ్‌పై అపోహలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు. మ్యాచ్‌లకు మేం కేవలం 0.00038 శాతం నీటిని మాత్రమే వాడుతున్నాం. -అనురాగ్ ఠాకూర్ (బీసీసీఐ కార్యదర్శి) -
ఐపీఎల్లో ఎల్ఈడీ స్టంప్స్
న్యూఢిల్లీ: ఈ సీజన్ ఐపీఎల్ మ్యాచ్‌లు కొత్త వెలుగును సంతరించుకోనున్నాయి. టి20 ప్రపంచకప్‌లో వాడిన ఎల్ఈడీ స్టంప్స్‌ను తొలిసారి ఐపీఎల్‌లోనూ ఉపయోగిస్తున్నామని లీగ్ చైర్మన్ రాజీవ్ శుక్లాతెలిపారు. అలాగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో విండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవో, మరికొంత మంది క్రికెటర్లు కలిసి ‘చాంపియన్ డాన్స్’ను స్టేజ్‌పై చేసి చూపించనున్నారు. -
'మహారాష్ట్రలో షెడ్యూల్ ప్రకారమే ఐపీఎల్'
ముంబై:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) లో భాగంగా మహారాష్ట్రలో నిర్వహించే మ్యాచ్ ల షెడ్యూల్ విషయంలో ఎటువంటి మార్పులు ఉండబోవని లీగ్ చైర్మన్ రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. గత వంద ఏళ్లలో ఎన్నడూలేని కరువు రాష్ట్రంలో తాండవిస్తున్న కారణంగా ఐపీఎల్ మ్యాచ్ లను ఇక్కడ నిర్వహించవద్దని బీజేపీ కార్యదర్శి వివేకానంద గుప్తా బీసీసీఐ ప్రెసిడెంట్ శశాంక్ మనోహర్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మంగళవారం ఐపీఎల్ షెడ్యూల్ అంశంపై శుక్లా మీడియాతో మాట్లాడారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారమే ఐపీఎల్ టోర్నీ జరుగుతుందని పేర్కొన్నారు. దీంతో పాటు మహారాష్ట్ర రైతులకు అండగా నిలబడేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. 'మ్యాచ్ ల వేదికలను మార్చాలనుకోవడం లేదు. మ్యాచ్ ల నిర్వహణకు కొద్ది శాతం నీరు మాత్రమే అవసరమవుతుంది. కానీ రైతులకు అధిక శాతంలో నీరు అవసరమనే విషయం మాకు తెలుసు. రాష్ట్ర రైతుల నీరు సమస్యను తీర్చడానికి అన్ని రాజకీయ పార్టాలు నడుంబిగించాలి. రైతులకు సాయం చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ముందు ఓ నివేదికను రూపొందిస్తే మా నుంచి తగిన సహకారాన్ని అందిస్తాం'అని శుక్లా పేర్కొన్నారు. -
ముందు మంచి వేదికను తయారు చేసుకోండి.
పీసీబీకి రాజీవ్ శుక్లా సలహా కరాచీ: తమ హోమ్ సిరీస్‌లను యూఏఈలో ఆడించకుండా పాకిస్తాన్‌లోనే జరిపించేందుకు తగిన వేదికను తయారు చేసుకోవాల్సిందిగా బీసీసీఐ సీనియర్ అధికారి రాజీవ్ శుక్లా పీసీబీకి సూచించారు. అలాగైతేనే భారత్... పాకిస్తాన్లో ఆడుతుందని తేల్చారు. ఐసీసీకి వారు భద్రతాపరంగా తగిన హామీనిస్తే లాహోర్‌లో ఆడేందుకు కూడా సిద్ధమని స్పష్టం చేశారు. ‘ఒకవేళ పాకిస్తాన్ జట్టు ఇలాగే తమ సొంత సిరీస్‌లను యూఏఈలో ఆడిస్తే క్రమక్రమంగా వారి దేశంలో క్రికెట్ క్షీణిస్తుంది. నిజానికి లాహోర్‌ను సురక్షిత వేదికగా తయారుచేసుకోవచ్చు. స్టేడియానికి దగ్గరలోనే టీమ్ హోటల్‌ను నిర్మించి తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తే భారత్ అక్కడ ఆడేందుకు సిద్ధమే. అన్ని జట్లు కూడా ఆడేందుకు సుముఖంగానే ఉంటాయి. అయితే దీనికి ముందు వారు ఐసీసీకి భద్రత విషయంలో హామీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇతర బోర్డులు కూడా పాక్‌లో ఆడేందుకు అభ్యంతరం వ్యక్తం చేయకూడదు. ఈసారికి వారు భారత్‌కు వచ్చి ఆడితే బావుంటుంది. ఈ విషయంలో నష్టపరిహారం ఇవ్వడానికి కూడా సిద్ధమే’ అని శుక్లా అన్నారు. ఎంఓయూపై ఒత్తిడి ఉంది: పీసీబీ పాక్ జట్టుతో ద్వైపాక్షిక సిరీస్‌పై కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం (ఎంఓయూ) విషయంలో బీసీసీఐపై తీవ్ర ఒత్తిడి నెలకొందని పీసీబీ తెలిపింది. 2015 నుంచి 2023 వరకు ఆరు సిరీస్‌లు జరిగేలా గతంలో ఈ ఒప్పందం కుదిరింది. ఈ వారాంతంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అధ్యక్షుడు గైల్స్ క్లార్క్‌తో బీసీసీఐ చీఫ్ శశాంక్ మనోహర్ సమావేశం కానున్నారని, వీరి మధ్య ఎంఓయూ చర్చకు వచ్చే అవకాశం ఉందని పీసీబీ ఎగ్జిక్యూటివ్ కమిటీ చీఫ్ నజమ్ సేథీ తెలిపారు. అలాగే త్వరలోనే కామన్వెల్త్ టీమ్‌ను పాక్‌కు పంపేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పారు. -
బహిష్కరిస్తే అనుభవిస్తారు
- పీసీబీకి శుక్లా హెచ్చరిక - డిసెంబర్లో సిరీస్ జరగదు లక్నో: డిసెంబర్లో భారత జట్టు తమతో సిరీస్ ఆడకపోతే ఐసీసీ, ఏసీసీ ఈవెంట్స్‌లో వారిని బహిష్కరిస్తామన్న పాకిస్తాన్ క్రికెట్‌బోర్డు(సీపీబీ) చైర్మన్ షహర్యార్ ఖాన్‌పై ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా ధ్వజమెత్తారు. అదే జరిగితే వారు ఫలితం అనుభవిస్తారని ఘాటుగా స్పందించారు. అసలు డిసెంబర్ లో సిరీస్ జరిగే అవకాశాలు లేవని తేల్చి చెప్పా రు. ‘బీసీసీఐ లేక ఐసీసీని ఆయన హెచ్చరిస్తున్నారా? ఐసీసీ నిబంధనలకు పీసీబీ లోబడి ఉండాలి. లేకపోతే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అసలు వారి దేశంలో పర్యటించడానికి ఏ జట్టు ఆసక్తి చూపిస్తుందని. భారత ఆటగాళ్లకు పూర్తి రక్షణ కల్పించగలుగుతామని ఆయన హామీ ఇవ్వగలరా? ఇంగ్లండ్, ఆసీస్ జట్లే కాకుండా బంగ్లాదేశ్ కూడా అక్కడికి వెళ్లడానికి ఇష్టపడలేదు. ఇక సిరీస్ గురించి ప్రభుత్వ అనుమతి కోరతాం. కానీ అంతకుముందు చాలా సమస్యలు పరిష్కారం కావాల్సి ఉంది. కాబట్టి డిసెంబర్లో సిరీస్ జరిగే అవకాశం లేదు’ అని ఆయన స్పష్టం చేశారు. -
బరిలోకి అమితాబ్ చౌదరి!
♦ అధ్యక్ష పదవికి ఈస్ట్‌జోన్ ప్రతిపాదన ♦ ఆరు సంఘాలు మద్దతిచ్చే అవకాశం న్యూఢిల్లీ : బీసీసీఐ అధ్యక్ష పదవిపై సీనియర్ పరిపాలకులు శరద్ పవార్, రాజీవ్ శుక్లాలు ఆసక్తి చూపిస్తుండగా అనూహ్యంగా మరో పేరు తెర మీదికి వచ్చింది. బోర్డు చీఫ్‌ను ఎంచుకునే అవకాశం ఉన్న ఈస్ట్‌జోన్ తమ అభ్యర్థిగా జార్ఖండ్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అమితాబ్ చౌదరిని ప్రతిపాదించాలని నిర్ణయించింది. ఈస్ట్‌జోన్‌లోని ఆరు సంఘాలు బెంగాల్, అస్సాం, జార్ఖండ్, ఒడిషా, త్రిపుర, నేషనల్ క్రికెట్ క్లబ్‌లు అమితాబ్‌కు మద్దతు పలకనున్నట్లు సమాచారం. దాల్మియా మృతి అనంతరం గత రెండు రోజులుగా వీరి మధ్య చర్చలు జరుగుతున్నాయి. అమితాబ్ చౌదరి ప్రస్తుతం బీసీసీఐ సంయుక్త కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారిగా మంచి గుర్తింపు ఉండటం, వివాదరహితుడు కావడం వల్ల కూడా ఆయన పేరుపై పెద్దగా వ్యతిరేకత ఎదురు కాకపోవచ్చు. శ్రీనివాసన్ చాణక్యం నిబంధనల ప్రకారం 2017 వరకు ఈస్ట్‌జోన్‌కు చెందిన వ్యక్తే బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండాలని అక్కడి సంఘాలు కోరుకుంటున్నాయి. ప్రస్తుత బోర్డు కార్యవర్గం మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్‌ను పక్కన పెడుతున్నా... అనేక మంది మద్దతుదారులు ఆయన వెంటే ఉన్నారు. బోర్డు కోశాధికారి అనిరుధ్ చౌదరితో పాటు అమితాబ్ చౌదరి కూడా శ్రీనివాసన్‌కు బాగా నమ్మకస్తులు. వీరిద్దరిలో ఒకరిని అధ్యక్షుడిగా చేసి మళ్లీ పట్టు సాధించాలని భావిస్తున్న శ్రీని ఇప్పటికే ఈస్ట్ జోన్ సంఘాలతో మాట్లాడగా... కనీసం నాలుగు సంఘాలు అండగా నిలుస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. అందరూ అమితాబ్ పేరుకు మద్దతిస్తే సమస్యే లేకుండా ఏకగ్రీవ ఎంపిక జరుగుతుంది. ఒక వేళ ఏదైనా అసోసియేషన్ అమితాబ్‌కు వ్యతిరేకంగా ఉంటే మాత్రం ఏజీఎం జరిపి ఎన్నిక నిర్వహిస్తారు. పవార్, శుక్లాలకు కష్టం! మరో వైపు పవార్, శుక్లాలలో ఎవరైనా ఎన్నికల్లో పోటీ పడేందుకు సిద్ధమైనా వారికి పరిస్థితి అనుకూలంగా ఉండకపోవచ్చు. బోర్డులోని 30 ఓట్లలో కనీసం 16 మంది ఖాయంగా తన వైపు ఉన్నారని స్పష్టమైతే తప్ప బరిలోకి దిగరాదని పవార్ భావిస్తున్నారు. కాబట్టి ఆయన ఇంకా వేచి చూసే ధోరణిలోనే ఉన్నారు. రాజీవ్ శుక్లా పరిస్థితి కూడా ఇలాగే ఉంది. తమ అభ్యర్థిని బరిలోకి దించకుండా తనకే మద్దతు ఇవ్వాలని ఈస్ట్‌జోన్ సంఘాలకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసేందుకు శుక్లా సిద్ధమవుతున్నా అది జరిగే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. ప్రత్యేక ఏజీఎంను కూడా శ్రీనివాసన్ అంశంపై సుప్రీం కోర్టు స్పష్టత ఇచ్చాకే నిర్వహించాలని బీసీసీఐ భావిస్తుండటంతో సమావేశం మరింత ఆలస్యం కావచ్చు. -
శాస్త్రి భవితవ్యంపై తుది నిర్ణయం!
లంకకు వెళ్లిన అనురాగ్ ఠాకూర్ న్యూఢిల్లీ : భారత జట్టు టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి భవితవ్యంపై మరికొద్ది రోజుల్లో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు ఈ అంశాన్ని చర్చించేందుకు బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ బుధవారం శ్రీలంకకు బయలుదేరి వెళ్లారు. రెండో టెస్టు సందర్భంగా ఈ విషయంపై శాస్త్రితో ఆయన కూలంకశంగా చర్చించనున్నట్లు సమాచారం. అయితే బీసీసీఐ తరఫున సంగక్కరను సన్మానించేందుకు లంకకు వెళ్తున్నానని ఠాకూర్ అధికారికంగా వెల్లడించినా... పర్యటన వెనుక ఉద్దేశం మాత్రం శాస్త్రితో చర్చలు జరపడమేనని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. అక్టోబర్‌లో మొదలుకానున్న దక్షిణాఫ్రికా పర్యటన వరకు ఈ అంశంపై ఓ కొలిక్కి రావాలని బోర్డు భావిస్తోంది. మరోవైపు ఢిల్లీలో జరిగిన ఐపీఎల్ వర్కింగ్ గ్రూప్ కమిటీ సమావేశంలో సౌరవ్ గంగూలీతో ప్రత్యేకంగా సమావేశమైన ఠాకూర్... చీఫ్ కోచ్ అంశంపై చర్చించినట్లు సమాచారం. జస్టిస్ లోథా కమిటీ తీర్పును పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్ కమిటీ ఈనెల 28లోపు తమ తుది నివేదికను ఇవ్వనుంది. భాగస్వాములందరి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించామని, వర్కింగ్ కమిటీ సమావేశంలోపు తుది నివేదికను అందజేస్తామని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా వెల్లడించారు. -
ఎనిమిది జట్లు ఖాయం
ఐపీఎల్‌పై రాజీవ్ శుక్లా స్పష్టీకరణ కోల్‌కతా: ఐపీఎల్‌ను వచ్చే ఏడాది కూడా ఎనిమిది జట్లతోనే నిర్వహిస్తామని, దానిని మరింతగా విజయవంతం చేస్తామని లీగ్ చైర్మన్ రాజీవ్ శుక్లా విశ్వాసం వ్యక్తం చేశారు. లీగ్‌లో చెన్నై, రాజస్థాన్ జట్లను రద్దు చేయాలని లోధా కమిటీ సిఫారసు చేసినా... ఎనిమిది జట్ల తమ ఫార్మాట్లో మార్పు రాదని ఆయన చెప్పారు. ‘వచ్చే ఐపీఎల్ ఇంకా పెద్ద సక్సెస్ అవుతుంది. తాజా తీర్పు ఐపీఎల్ గొప్పతనాన్ని తగ్గించదు. ఫార్మాట్లో మార్పు లేకుండా ఎనిమిది జట్లతోనే లీగ్ నిర్వహిస్తాం. ఆరు జట్లతో లీగ్ ఉండదు’ అని శుక్లా అన్నారు. రెండు జట్లను బీసీసీఐ నేరుగా నిర్వహించడం సహా పలు ప్రత్యామ్నాయాలు తమకు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఆదివారం జరిగే గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో అన్ని అంశాలు చర్చిస్తామని శుక్లా వెల్లడించారు. -
బేరాలు లేకుండా ప్రభుత్వమా?
న్యూఢిల్లీ: రాజధాని నగరంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలకు ఎరవేయడం తప్పదని కాంగ్రెస్ అభిప్రాయపడింది. ఢిల్లీ అసెంబ్లీలో ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంపూర్ణ మెజారిటీ లేనందున, ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు బేరం పెట్టకుండా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయజాలదని కాంగ్రెస్ నాయకుడు రాజీవ్ శుక్లా వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందు రాజ్యాంగ సూత్రాలు విస్మరించకుండా చూసే బాధ్యత లెఫ్టినెంట్ గవర్నర్దేనని ఆయన అన్నారు. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు తాను బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పార్టీలతో సంప్రదింపులు జరుపుతానని నజీబ్ జంగ్ పేర్కొన్న నేపథ్యంలో రాజీవ్ శుక్లా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీలో బీజేపీకి 28 మంది ఎమ్మెల్యేలుండగా, వారి మిత్రపక్షమైన అకాలీదళ్‌కు ఒకే శాసనసభ్యుడున్నారు. మొత్తంగా 67 మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే బీజేపీకి మరో ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం. -
'మోడీ ప్రభావం మీడియాలోనే..దేశంలోని ప్రజల్లో లేదు'
సిమ్లా: బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై విమర్శలకు కాంగ్రెస్ మరింత పదును పెట్టింది.మోడీ జపం చేస్తున్న బీజేపీపై కాంగ్రెస్ నేత, కేంద్ర మంత్రి రాజీవ్ శుక్లా మండిపడ్డారు. నరేంద్ర మోడీ ప్రభావం కేవలం మీడియాలోనే కనిపిస్తోందని.. దేశంలోని ప్రజల్లో మాత్రం ఎక్కడా కూడా ఆయన ఊసే లేదని వ్యాఖ్యానించారు. దేశంలోని సగానిగా పైగా రాష్ట్రాల్లో మోడీ ప్రభావం అసలు ఏమాత్రం కనిపించడం లేదన్న విషయాన్ని బీజేపీ అగ్రనేతలు గుర్తించాలని శుక్లా ఎద్దేవా చేశారు. మీడియాల్లోనే ఆయన ప్రచారాల్ని ఎక్కువగా చూపించి ఏదో జరగబోతుందని బీజేపీ నేతల మభ్య పెడుతున్నారన్నారు. మీడియాలోని మోడీ ప్రచారాలకు కొన్ని కోట్ల రూపాయిలను బీజేపీ ఖర్చు పెడుతుందని తూర్పారబట్టారు. గత యూపీఏ ప్రభుత్వం సాధించిన విజయాలే కాంగ్రెస్ ను మరోమారు గద్దెనెక్కిస్తాయని శుక్లా తెలిపారు. తాము చేసిన అభివృద్ధిని చూపే ప్రజలను ఓట్లు వేయమని కోరుతున్నామన్నారు. -
ఐపీఎల్-7లో అధిక భాగం భారత్‌లోనే
-
ఐపీఎల్-7లో అధిక భాగం భారత్‌లోనే
న్యూఢిల్లీ: దేశంలో సార్వత్రిక ఎన్నికల తేదీలు ఖరారు కావడంతో బీసీసీఐ ఇక ఐపీఎల్-7 వేదికను నిర్ణయించే పనిలో పడింది. ఈ మేరకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ బుధవారం సమావేశమై చర్చలు జరిపింది. బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్‌తోపాటు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కార్యదర్శి సంజయ్‌పటేల్, ఐపీఎల్ చైర్మన్ రంజిబ్ బిస్వాల్, సీఈఓ సుందరరామన్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఏప్రిల్ 7 నుంచి మే 12 వరకు ఎన్నికలు జరగనుండగా, మే 16న ఓట్ల లెక్కింపు జరపనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మరోవైపు ఏప్రిల్ 9 నుంచి జూన్ 3 వరకు ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించటానికి సమయముంది. దానికి ఎన్నికలు పూర్తయ్యేదాకా భారత్ ఆవల మ్యాచ్‌ల్ని నిర్వహించి ఓట్ల లెక్కింపు అనంతరం మిగిలిన మ్యాచ్‌ల్ని భారత్‌లో ఆడించాలనే నిర్ణయానికి బీసీసీఐ వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయమై బిస్వాల్ మాట్లాడుతూ.. 60 నుంచి 70 శాతం మ్యాచ్‌ల్ని భారత్‌లోనే నిర్వహిస్తామని, మరో రెండు రోజుల్లో తుదినిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రత్యామ్నాయ వేదికలుగా దక్షిణాఫ్రికాతోపాటు బంగ్లాదేశ్, యూఏఈల పేర్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. -
ఐపీఎల్‌కు భద్రత ఇవ్వలేం
స్పష్టం చేసిన కేంద్రం ప్రారంభ మ్యాచ్‌లు దక్షిణాఫ్రికాలో! న్యూఢిల్లీ: లోక్‌సభ సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఏడో సీజన్‌కు భద్రత కల్పించలేమని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాలతో గురువారం జరిగిన సమావేశంలో హోం మంత్రి షిండే ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ‘ఏప్రిల్-మేలో ఎన్నికల కారణంగా ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం తగినంత భద్రతా సిబ్బందిని కేటాయించలేము. ఎన్నికలు ముగిశాకే అది వీలవుతుంది’ అని హోం మంత్రి షిండే తెలిపారు. మేనెల మధ్యలో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. ప్రత్యామ్నాయ వేదికను చూసుకోవాలని ఇప్పటికే బీసీసీఐకి హోం శాఖ సమాచారం ఇచ్చింది. దీంతో అప్పటిదాకా మ్యాచ్‌లను దక్షిణాఫ్రికాలో నిర్వహించే అవకాశాలున్నాయి. 2009లోనూ ఎన్నికల కారణంతో లీగ్‌ను ఆ దేశంలోనే జరిపారు. అయితే ఈనెల 28న భువనేశ్వర్‌లో జరిగే ఐపీఎల్ పాలక మండలి సమావేశంలో వేదికపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ‘వేదికపై ఇతర బోర్డులతో చర్చిస్తున్నాం’ లీగ్ భద్రతపై కేంద్రం చేతులెత్తేయడంతో ప్రత్యామ్నాయ వేదికలపై బీసీసీఐ కసరత్తు ప్రారంభించింది. దీంట్లో భాగంగా ఇతర దేశాల బోర్డులతో సంప్రదింపులు జరుపుతోంది. ‘కేంద్రం వ్యక్తం చేసిన అభిప్రాయంతో ఐపీఎల్ నిర్వహణ కోసం వివిధ దేశాల బోర్డులతో మాట్లాడడం జరుగుతోంది. దక్షిణాఫ్రికా ఫేవరెట్‌గా ఉన్నా ఇతర ప్రత్యామ్నాయం గురించి కూడా ఆలోచిస్తున్నాం’ అని లీగ్ చైర్మన్ రంజిబ్ బిస్వాల్ అన్నారు. -
ఆ భూమి నాకొద్దు కేంద్ర మంత్రి శుక్లా ప్రకటన
న్యూఢిల్లీ: కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి రాజీవ్‌శుక్లా జుహూలో చౌకధరకు భూమిని కేటాయించిన వ్యవహారం మరో మలుపు తిరిగింది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేయడం, ఆక్రమణల కారణంగా భూమిని స్వాధీనం చేసుకోకూడదని ఆయన నిర్ణయించారు. ఈ మేరకు ఆయన తాము ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌కు ఈ నెల నాలుగున లేఖ రాశానని శుక్లా మంగళవారం ఇక్కడ తెలిపారు. తనకు సంబంధించిన సొసైటీకి కేటాయించిన స్థలంలో ఆక్రమణల కారణంగా ఎటువంటి కార్యకలాపాలూ చేపట్టనందున వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సదరు స్థలంలో పలు మురికివాడలు వెలిసినందున దానిని తాము స్వాధీనం చేసుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం ఎన్నో విద్యాసంస్థలకు తక్కువ ధరలకు భూములు కేటాయించారని, తనకూ ఇవ్వడం తప్పేమీ కాదని ఆయన వివరణ ఇచ్చారు. ప్రాథమిక పాఠశాల నిర్మాణానికి మాత్రమే ఆ స్థలం కోరామని, వాణిజ్య కార్యకలాపాల ఆలోచనే లేదని రాజీవ్ శుక్లా తెలియజేశారు. శుక్లాకు భూకేటాయింపులపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. మంత్రికి కారుచౌకగా రెండు ప్లాట్లను కట్టబెట్టారని ఆ పార్టీ సీనియర్ నేత కిరీట్సోమయ్య ముంబైలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆరోపించారు. అయితే ఈ భూమి ఎక్కడుందో రెవెన్యూ అధికారులు కనుక్కోలేకపోయారని తెలిపారు. విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఈ భూమిని కేటాయించారని వివరించారు. -
కాంగ్రెస్‌కు ‘మాస్టర్’ ప్రచారం చేయడు: రాజీవ్ శుక్లా
కాన్పూర్: భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కాంగ్రెస్ తరఫున ఎన్నికల్లో ప్రచారం చేయడని ఆ పార్టీ ఎంపీ, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున దిగ్గజ బ్యాట్స్‌మన్ ప్రచారం చేయనున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన చెప్పారు. ‘సచిన్ ఇప్పుడు క్రికెట్ మ్యాచ్‌లతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ముంబై తరఫున రంజీ మ్యాచ్ ఆడుతున్నాడు. అనంతరం స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో పాల్గొంటాడు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో అతను పాలుపంచుకుంటాడనే వార్తలు పూర్తిగా నిరాధారం’ అని శుక్లా చెప్పారు. యూపీఏ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం గతేడాది సచిన్‌ను రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు ప్రతిఫలంగా అతను కాంగ్రెస్‌కు ప్రచారం చేస్తాడనే వార్తలొచ్చాయి. అయితే వీటిని ఆ పార్టీ సినీయర్ ఎంపీ అయిన శుక్లా నిర్ద్వందంగా కొట్టిపారేశారు. ప్రస్తుతం మాస్టర్ బ్యాట్స్‌మన్ వీడ్కోలు సిరీస్ కోసం సన్నాహకంగా రంజీ మ్యాచ్ ఆడుతున్నట్లు చెప్పారు. ఇక భవిష్యత్‌లో అతని ప్రచారం గురించి ఇప్పుడే చెప్పడం సముచితం కాదన్నారు. -
సచిన్ కాంగ్రెస్ కు ప్రచారం చేయడు:శుక్లా
కాన్పూర్:భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కాంగ్రెస్ తరుపున ఎన్నికల్లో ప్రచారం చేయడని ఆ పార్టీ ఎంపీ, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ అభ్యర్థుల తరుపున దిగ్గజ బ్యాట్స్ మన్ ప్రచారం చేయనున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన చెప్పారు. 'సచిన్ ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ లతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ముంబై తరుపున రంజీ మ్యాచ్ ఆడుతున్నాడు. అనంతరం స్వదేశంలో వెస్టిండీస్ తో జరిగే టెస్టు సిరీస్ లో పాల్గొంటాడు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో అతను పాలు పంచుకుంటాడనే వార్తులు పూర్తిగా నిరాధారం' అని శుక్లా తెలిపాడు. యూపీఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది సచిన్ ను రాజ్యసభకు నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు ప్రతి ఫలంగా సచిన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్లు వార్తలొచ్చాయి. అయితే వీటిని శుక్లా కొట్టి పారేశారు. -
సైనికుల మృతిపై పార్లమెంట్లో ప్రకటన చేయనున్న ఆంటోని !
భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వద్ద జరిగిన కాల్పుల ఘటనలో ఐదుగురు భారతీయ సైనికులు మరణంపై రక్షణ శాఖ మంత్రి ఏ.కే.ఆంటోని ఈ రోజు పార్లమెంట్లో తాజా ప్రకటన చేసే అవకాశం ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రాజీవ్ శుక్లా గురువారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. భారతీయ సైనికుల మరణంపై విపక్షాల పార్లమెంట్లో ఆందోళన బాట పట్టాయి. ఆ సంఘటనపై పూర్తి వివరాల కోసం ఇప్పటికే భారత ఆర్మీ చీఫ్ సంఘటన స్థలాన్ని సందర్శించారని తెలిపారు. అనంతరం ఆ సంఘటనకు సంబంధించిన వివరాలను ఆయన ఆంటోనికి వివరించారని రాజీవ్ శుక్లా చెప్పారు. ఐదుగురు భారత సైనికుల మరణంపై రక్షణ మంత్రి ఆంటోని ప్రకటన చేయాలని బుధవారం విపక్షాలు పార్లమెంట్లో డిమాండ్ చేశాయి. అయితే పాకిస్థాన్ సైనికులతోపాటు మరో 20 మంది తీవ్రవాదులు సైనికుల దుస్తులు ధరించి భారత్ సైనికులపై కాల్పులు జరిపారని ఆంటోని పార్లమెంట్లో వివరించారు. ఆంటోని ప్రకటనతో విపక్షాలు ఆగ్రహాం కట్టలు తెంచుకుంది. రక్షణ మంత్రి ఆంటోని పాకిస్థాన్‌కు పరోక్షంగా మద్దతిస్తున్నట్లు మాట్లాడుతున్నారని విపక్షాలు ఆందోళనబాట పట్టాయి. దీంతో ఆ ఘటనపై రక్షణ మంత్రి ఆంటోని తాజా ప్రకటన చేయనున్నారు.