స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ (ఫైల్ ఫొటో)
ముంబై: మహిళా క్రికెటర్ల కోసం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తరహాలో బీసీసీఐ ఈ నెల 22న ఒక టీ20 మ్యాచ్ నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. ముంబైలో ఈనెల 22న జరగనున్న ఐపీఎల్-11 తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌కు ముందు ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తారు. భారత మహిళా క్రికెటర్లతో పాటు విదేశీ మహిళా ప్లేయర్లు ఈ టీ20 మ్యాచ్‌లో ఆడనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఈ నెల 22న ఐపీఎల్‌లో భాగంగా వాంఖడే మైదానంలో రాత్రి 8గంటలకు క్వాలిఫయర్-1 జరగనుంది.
ఇరు జట్లకు కెప్టెన్లుగా భారత మహిళా స్టార్ క్రికెటర్లు హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధానలు వ్యవరిస్తారని ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా ప్రకటించారు. తాజాగా బీసీసీఐ జట్లను, జట్టు ప్లేయర్లను వెల్లడించింది. 26 మంది మహిళా క్రికెటర్లను ఎంపిక చేయగా.. ఇందులో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లకు చెందిన వారు 10 మంది ఉన్నారు. భారత మహిళా క్రికెటర్లు అధిక సంఖ్యలో ఈ టీ20 మ్యాచ్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. టీ20 క్రికెట్‌కు ప్రాధాన్యం పెంచేందుకు విదేశీ మహిళా క్రికెటర్లు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.
రెండు జట్లు:
ఐపీఎల్ ట్రయల్ బ్లేజర్స్: స్మృతి మంధాన(కెప్టెన్), అలిస్సా హీలీ(కీపర్), సుజీ బేట్స్, దీప్తి శర్మ, బెత్ మూనీ, జెమీమా రోడ్రిక్స్, డానియెల్లె హాజెల్, శిఖా పాండే, లీ టహుహు, జులన్ గోస్వామి, ఏక్తా బిస్త్, పూనమ్ యాదవ్, హేమలత. కోచ్: తుషార్ ఆర్థో
ఐపీఎల్ సూపర్ నోవాస్: హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), తానియా భాటియా(కీపర్) మిథాలీ రాజ్, మెగ్ లానింగ్, సోఫీ డివైన్, ఎల్లీస్ పెర్రీ, వేద కృష్ణమూర్తి, మోన మెశ్రమ్, పూజా వస్త్రాకర్, మేగన్ స్క్కూట్, రాజేశ్వరి గైక్వాడ్, అనూజ పాటిల్ కోచ్: బిజు జార్జ్
Comments
Please login to add a commentAdd a comment