WPL Auction 2023: మహిళల తొట్టతొలి ఐపీఎల్ వేలం తర్వాత భారత క్రికెట్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. యాదృచ్ఛికంగా జరిగిందో లేక ఆయా ఫ్రాంచైజీల ప్రణాళికల ప్రకారం జరిగిందో తెలీదు కానీ.. భారత పురుషుల క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, మహిళా జట్టు సారధి హర్మన్‌ప్రీత్ కౌర్‌లు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలో ఉన్నారు.
నిన్న జరిగిన వేలంలో హర్మన్‌ను ముంబై ఇండియన్స్ 1.8 కోట్ల ధర వెచ్చింది సొంతం చేసుకోగా.. రోహిత్ 2011 నుంచి ఈ ఫ్రాంచైజీలోనే కొనసాగుతున్నాడు. అయితే రోహిత్ ముంబైతో జతకట్టే సమయానికి టీమిండియా కెప్టెన్‌గా లేడు. ఇటీవలే అతను కోహ్లి నుంచి ఆ బాధ్యతలను తీసుకున్నాడు. ఏదిఏమైనప్పటికీ భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్ల కెప్టెన్లు ముంబై ఇండియన్స్‌లో చేరడం క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర అంశంగా మారింది.
ఈ విషయం నిన్నటి నుంచి సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా ఉన్న రోహిత్.. ముంబై ఇండియన్స్‌ను 5 సార్లు ఛాంపియన్‌గా నిలిపాడు. హర్మన్ కూడా అదే రేంజ్‌లో సక్సెస్ సాధిస్తుందని ఆశిద్దాం.
ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్టులోని జెర్సీ నంబర్ 18 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఉన్నారు. నిన్న జరిగిన వేలంలో ఆర్సీబీ వుమెన్ జెర్సీ నంబర్ 18 స్మృతి మంధనను 3.4 కోట్ల రికార్డు ధరకు దక్కించుకుంది. WPLలో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. ఇక పురుషుల క్రికెట్‌లో జెర్సీ నంబర్ 18 విరాట్ కోహ్లి ఐపీఎల్ పుట్టుక నుంచి ఆర్సీబీలోనే కొనసాగుతున్నారు.
ఐపీఎల్ మరే ఇతర క్రికెటర్ కోహ్లిలా ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించింది లేదు. అయితే కోహ్లికి ఒక్క లోటు మాత్రం ఉంది. అతను ఒక్కసారి కూడా ఆర్సీబీని ఛాంపియన్‌గా నిలబెట్టలేకపోయాడు. మొత్తంగా టీమిండియా కెప్టెన్లు, జెర్సీ నంబర్ 18 ఐపీఎల్‌లో వేర్వేరు జట్లుగా విడిపోవడం ఆసక్తికర పరిణామం. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్-ఆర్సీబీల పోరు ఎంత హోరాహోరీగా సాగుతుందో WPLలో కూడా ఈ రెండు జట్ల మధ్య అంతే రసవత్తర పోరులు సాగే అవకాశం ఉంది.
WPLలో ముంబై ఇండియన్స్ సొంతం చేసుకున్న ఆటగాళ్లు..
- స్మృతి మంధాన (రూ.3.40 కోట్లు)
- రిచా ఘోష్ (రూ.1.90 కోట్లు)
- ఎలీస్ పెర్రీ (రూ.1.70 కోట్లు)
- రేణుక సింగ్ (రూ.1.50 కోట్లు)
- సోఫీ డివైన్ (రూ.50 లక్షలు)
- హీతెర్ నైట్ (రూ.40 లక్షలు)
- మేగన్ షుట్ (రూ.40 లక్షలు)
- కనిక అహుజ (రూ.35 లక్షలు)
- డేన్‌వాన్ నికెర్క్ (రూ.30 లక్షలు)
- ఎరిన్ బర్న్స్ (రూ.30 లక్షలు)
- ప్రీతి బోస్ (రూ.30 లక్షలు)
- కోమల్ జంజద్ (రూ.25 లక్షలు)
- ఆశ శోభన (రూ.10 లక్షలు)
- దిశ కాసత్ (రూ.10 లక్షలు)
- ఇంద్రాణి రాయ్ (రూ.10 లక్షలు)
- పూనమ్ ఖేమ్నర్ (రూ.10 లక్షలు)
- సహన పవార్ రూ.10 లక్షలు
- శ్రేయాంక పాటిల్ రూ.10 లక్షలు
WPLలో ఆర్సీబీ సొంతం చేసుకున్న ప్లేయర్స్..
- నటాలీ సివర్ (రూ.3.20 కోట్లు)
- పూజ వస్త్రకర్ (రూ.1.90 కోట్లు)
- హర్మన్‌ప్రీత్ కౌర్ (రూ.1.80 కోట్లు)
- యస్తిక భాటియా (రూ.1.50 కోట్లు)
- అమేలియా కెర్ (రూ.1 కోటి)
- అమన్‌జోత్ కౌర్ (రూ.50 లక్షలు)
- హేలీ మాథ్యూస్ (రూ.40 లక్షలు)
- క్లొయ్ ట్రియాన్ (రూ.30 లక్షలు)
- హిదెర్ గ్రాహమ్ (రూ.30 లక్షలు)
- ఇసాబెలె వోంగ్ (రూ.30 లక్షలు)
- ప్రియాంక బాల (రూ.20 లక్షలు)
- ధార గుజ్జార్ (రూ.10 లక్షలు)
- హుమైరా కాజి (రూ.10 లక్షలు)
- జింతిమని కలిత (రూ.10 లక్షలు)
- నీలమ్ బిష్త్ (రూ.10 లక్షలు)
- సయిక ఇషాక్ (రూ.10 లక్షలు)
- సోనమ్ యాదవ్ (రూ.10 లక్షలు)
Comments
Please login to add a commentAdd a comment