టీమిండియా మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా.. భారత క్రికెట్ జట్టు ప్రస్తుత సారధి రోహిత్ శర్మకు సంబంధించి బయటి ప్రపంచానికి తెలియని ఓ సంచలన విషయాన్ని బయటపెట్టాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు కలిసి ఆడిన ఈ ఇద్దరు చాలా సన్నిహితంగా మెలిగేవారు. ఒకరి కష్టాలు ఒకరు షేర్ చేసుకోవడంతో వీరి స్నేహ బంధం మరింత బలపడింది. సెటిల్ అవ్వకముందు హిట్‌మ్యాన్ కష్టాలను దగ్గరి నుండి చూసిన ఓజా.. ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.
Pragyan Ojha strolls down the memory lane and recalls Rohit Sharma's struggles in his early stage.
— CricTracker (@Cricketracker) March 28, 2023
He feels very proud about the journey how they started (u15) and where they reached now.#PragyanOjha #RohitSharma pic.twitter.com/O06OjPt2Mp
మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన రోహిత్.. ఒకానొక సందర్భంలో (అండర్-15 ఆడే రోజుల్లో) కిట్ కొనేందుకు పాల ప్యాకెట్లు డెలివరీ చేసేవాడని ఓజా తెలిపాడు. అక్కడి నుంచి మొదలైన హిట్‌మ్యాన్ జర్నీ ఇవాళ ఎక్కడుందో చూస్తుంటే చాలా గర్వంగా ఉందని తెలిపిన ఓజా.. టీమిండియా కెప్టెన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ యువతరానికి ఆదర్శప్రాయుడని కొనియాడిన ఓజా.. ఫైవ్ టైమ్ ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్‌ను ఆకాశానికెత్తాడు. ఈ వార్త ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది.
ఇదిలా ఉంటే, రోహిత్ శర్మ మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్-2023 సీజన్ సన్నాహకాల్లో బిజీగా ఉండగా, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ అయిన ఓజా తన పనుల్లో తాను బిజీగా ఉన్నాడు. గత రెండు సీజన్లుగా పేలవ ప్రదర్శన కనబరుస్తున్న ముంబై ఇండియన్స్‌ను ఎలాగైనా గాడిలో పెట్టాలని భావిస్తున్న హిట్‌మ్యాన్, తదనుగుణంగా వ్యూహాలు రచించడంలో నిమగ్నమై ఉన్నాడు. ఏప్రిల్ 2న ఆర్సీబీతో జరిగే మ్యాచ్‌తో ముంబై ఇండియన్స్ ఐపీఎల్-2023 సీజన్ జర్నీ మొదలవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment