
ముంబై ఇండియన్స్ సారధి రోహిత్ శర్మ.. తమ యువ కెరటాలు తిలక్ వర్మ, నేహల్ వధేరాలపై ప్రశంసల వర్షం కురిపించాడు. వీరిని భవిష్యత్తు సూపర్ స్టార్ ప్లేయర్లుగా అభివర్ణించాడు. గత సీజన్‌లో తిలక్, ఈ సీజన్‌లో నేహల్ తమకు దొరికిన ఆణిముత్యాలని కొనియాడాడు. ఈ సీజన్‌లో ఇద్దరు అదరగొట్టారని ఆకాశానికెత్తాడు.
మిడిలార్డర్‌లో నేహాల్ (12 మ్యాచ్‌ల్లో 214 పరుగులు) మ్యాచ్ విన్నర్‌గా మారాడని, తిలక్ (9 మ్యాచ్‌ల్లో 274 పరుగులు) తనకు లభించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముంబై అభిమానుల దృష్టిలో హీరోలా తయారయ్యాడని అన్నాడు.
హార్ధిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలు ముంబై ఇండియన్స్‌కు ఆడుతూనే సత్తా చాటి, స్టార్లుగా ఎదిగారని.. తిలక్, నేహల్‌ల తీరు చూస్తుంటే వీరు కూడా పెద్ద స్టార్లుగా మారేలా ఉన్నారని అభిప్రాయపడ్డాడు. తిలక్, నేహల్‌లు ముంబై ఇండియన్స్‌కే కాకుండా భవిష్యత్తులో టీమిండియా సూపర్‌స్టార్లుగా ఎదుగుతారని జోస్యం చెప్పాడు.
వచ్చే రెండేళ్లలో తేడాను మీరు చూస్తారని తిలక్, నేహల్‌లపై విశ్వాసం వ్యక్తం చేశాడు. ముంబై ఇండియన్స్‌ని సూపర్‌స్టార్ టీమ్ అంటారు. కానీ మేము ఇక్కడ స్టార్లను తయారు చేస్తున్నామని ప్రగల్భాలు పలికాడు.
ఇదిలా ఉంటే, నిన్న (మే 25) జరిగిన ఐపీఎల్ 2023 ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్.. లక్నో సూపర్ జెయింట్స్‌ను 81 పరుగుల భారీ తేడాతో ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కామెరాన్ గ్రీన్ (23 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (20 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం ఆకాశ్ మధ్వాల్ (3.3-0-5-5) ధాటికి లక్నో 16.3 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌటైంది. స్టొయినిస్ (27 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. కనీసం పూర్తి ఓవర్లు కూడా ఆడలేకపోయిన లక్నో 21 బంతుల ముందే కుప్పకూలింది.
చదవండి: సపోర్ట్ బౌలర్‌గా వచ్చాడు.. అతనిలో టాలెంట్ ఉందని ముందే పసిగట్టాను: రోహిత్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment