Nehal Wadhera
-
Rohit Sharma: భవిష్యత్తు ఆ ఇద్దరిదే.. హార్ధిక్, బుమ్రాల్లాగా..!
ముంబై ఇండియన్స్ సారధి రోహిత్ శర్మ.. తమ యువ కెరటాలు తిలక్ వర్మ, నేహల్ వధేరాలపై ప్రశంసల వర్షం కురిపించాడు. వీరిని భవిష్యత్తు సూపర్ స్టార్ ప్లేయర్లుగా అభివర్ణించాడు. గత సీజన్లో తిలక్, ఈ సీజన్లో నేహల్ తమకు దొరికిన ఆణిముత్యాలని కొనియాడాడు. ఈ సీజన్లో ఇద్దరు అదరగొట్టారని ఆకాశానికెత్తాడు. మిడిలార్డర్లో నేహాల్ (12 మ్యాచ్‌ల్లో 214 పరుగులు) మ్యాచ్ విన్నర్‌గా మారాడని, తిలక్ (9 మ్యాచ్‌ల్లో 274 పరుగులు) తనకు లభించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముంబై అభిమానుల దృష్టిలో హీరోలా తయారయ్యాడని అన్నాడు. హార్ధిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలు ముంబై ఇండియన్స్‌కు ఆడుతూనే సత్తా చాటి, స్టార్లుగా ఎదిగారని.. తిలక్, నేహల్ల తీరు చూస్తుంటే వీరు కూడా పెద్ద స్టార్లుగా మారేలా ఉన్నారని అభిప్రాయపడ్డాడు. తిలక్, నేహల్లు ముంబై ఇండియన్స్‌కే కాకుండా భవిష్యత్తులో టీమిండియా సూపర్స్టార్లుగా ఎదుగుతారని జోస్యం చెప్పాడు. వచ్చే రెండేళ్లలో తేడాను మీరు చూస్తారని తిలక్, నేహల్లపై విశ్వాసం వ్యక్తం చేశాడు. ముంబై ఇండియన్స్‌ని సూపర్‌స్టార్ టీమ్ అంటారు. కానీ మేము ఇక్కడ స్టార్లను తయారు చేస్తున్నామని ప్రగల్భాలు పలికాడు. ఇదిలా ఉంటే, నిన్న (మే 25) జరిగిన ఐపీఎల్ 2023 ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్.. లక్నో సూపర్ జెయింట్స్‌ను 81 పరుగుల భారీ తేడాతో ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కామెరాన్ గ్రీన్ (23 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (20 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం ఆకాశ్ మధ్వాల్ (3.3-0-5-5) ధాటికి లక్నో 16.3 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌటైంది. స్టొయినిస్ (27 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. కనీసం పూర్తి ఓవర్లు కూడా ఆడలేకపోయిన లక్నో 21 బంతుల ముందే కుప్పకూలింది. చదవండి: సపోర్ట్ బౌలర్‌గా వచ్చాడు.. అతనిలో టాలెంట్ ఉందని ముందే పసిగట్టాను: రోహిత్ శర్మ -
రానున్న రెండేళ్లలో ముంబై, టీమిండియా సూపర్ స్టార్లు ఈ ఇద్దరే: రోహిత్
IPL 2023- Rohit Sharma: ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా ముంబై ఇండియన్స్‌కు పేరుంది. టీమిండియా స్టార్ రోహిత్ శర్మ సారథ్యంలో ఏకంగా ఐదుసార్లు టైటిల్ గెలిచి ఇంత వరకు మరే ఇతర జట్టుకు సాధ్యం కాని రీతిలో రికార్డు సృష్టించింది. ప్రస్తుతం టీమిండియా స్టార్లుగా కొనసాగుతున్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, పేసర్ జస్ప్రీత్ బుమ్రా ముంబైకి ఆడి లైమ్‌లైట్‌లోకి వచ్చినవాళ్లే! తిరిగి పుంజుకుని టాప్-4లో వీరిద్దరితో పాటు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ వంటి ఎంతో మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లకు లైఫ్ ఇచ్చింది ముంబై ఫ్రాంఛైజీ. ఇక ఐపీఎల్-2023 ఆరంభంలో వరుస పరాజయాలు నమోదు చేసిన ముంబై తిరిగి పుంజుకుని ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. టాప్-4తో లీగ్ దశను ముగించిన రోహిత్ సేన బుధవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడనుంది. బుమ్రా, హార్దిక్‌లా వాళ్లిద్దరు కూడా ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌కి జియో సినిమా షోలో ముంబై సారథి రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. హార్దిక్, బుమ్రాలాగే రానున్న రెండేళ్లలో టీమిండియాకు ముంబై ఫ్రాంఛైజీ ఇద్దరు స్టార్లను అందించబోతోందని హిట్‌మ్యాన్ వ్యాఖ్యానించాడు. ‘‘బుమ్రా, హార్దిక్ విషయంలో ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగబోతోంది. తిలక్ వర్మ, నేహల్ వధేరా రానున్న రెండేళ్లలో సూపర్ స్టార్లు అవుతారు. అప్పుడు మా జట్టును అందరూ ఇది సూపర్స్టార్ల టీమ్ అంటారు. వాళ్లకు మేమిచ్చే శిక్షణ అలాంటిది. వీళ్లిద్దరు మా జట్టుకే కాదు.. టీమిండియాలోనూ ప్రధాన పోషించే స్థాయికి ఎదుగుతారు’’ అని ప్రశంసలు కురిపించాడు. తెలుగు తేజం తిలక్ వర్మ తెలుగు క్రికెటర్ తిలక్ వర్మను గతేడాది ముంబై కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్-2022లో 14 మ్యాచ్‌లు ఆడిన ఈ హైదారాబాదీ బ్యాటర్ 397 పరుగులు సాధించాడు. ముంబై తరఫున రెండో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఈ సీజన్లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లలో 274 పరుగులు స్కోరు చేశాడు తిలక్ వర్మ. గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. నేహల్ వధేరా ఈ ఏడాదే ఇక నేహల్ వధేరా ఈ ఏడాదే ఐపీఎల్లో అడుగుపెట్టాడు. 8 ఇన్నింగ్స్ ఆడి 214 పరుగులు సాధించాడీ ఈ పంజాబ్ ఆటగాడు. కీలక సమయాల్లో రాణించి కెప్టెన్ రోహిత్ శర్మ నమ్మకాన్ని చూరగొన్నాడు. ఈ సీజన్లో నేహల్ అత్యధిక స్కోరు 64(ఇప్పటి వరకు). ఇదిలా ఉంటే.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నోను ఓడిస్తేనే ముంబై ఇండియన్స్ ప్రయాణం కొనసాగుతుంది. చెన్నై మ్యాచ్‌లో గెలిస్తే క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్‌తో పోటీ పడుతుందీ రోహిత్ సేన. చదవండి: లక్నోతో కీలక పోరు.. ముంబై జట్టులోకి యువ స్పిన్నర్! విధ్వంసకర ఓపెనర్ కూడా ఛీ.. అపార్థం చేసుకున్నావు! ధోనిని అవమానించావు.. నీకేం తక్కువ చేశాం? Virat Kohli: మీకు ఇంగ్లిష్ అర్థం కాకపోతే.. వెళ్లి!.. దాదా ట్వీట్ వైరల్ It's the 𝔼𝕝𝕚𝕞𝕚𝕟𝕒𝕥𝕠𝕣 day & आपले boys are leaving no stone unturned in the quest for a 𝑾 💪🏏#OneFamily #LSGvMI #MumbaiMeriJaan #MumbaiIndians #IPL2023 #TATAIPL MI TV pic.twitter.com/IsRz5BS8tK — Mumbai Indians (@mipaltan) May 24, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'మ్యాచ్ గెలిచాం కదా.. ఆ సెలబ్రేషన్ అవసరమా?'
ఐపీఎల్ 16వ సీజన్లో ముంబై ఇండియన్స్ మంగళవారం ఆర్సీబీతో మ్యాచ్‌లో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. 200 పరుగుల టార్గెట్‌ను 22 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. సూర్యకుమార్ 35 బంతుల్లో 83 పరుగులతో సుడిగాలి ఇన్నింగ్స్‌తో చెలరేగగా.. నెహాల్ వదేరా హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం ఇషాన్ కిషన్, నెహాల్ వదేరాల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. విజయం అనంతరం వదేరా హెల్మెట్ తీసి విజయనాదం చేయడంపై ఇషాన్ ప్రశ్నించాడు. ''మ్యాచ్‌లో ముంబై గెలుస్తుందని అందరికి తెలుసు.. ఎందుకంటే అప్పటికే మ్యాచ్ మనవైపు మొగ్గింది. అయినా కూడా నువ్వు విన్నింగ్ షాట్ కొట్టిన తర్వాత గెలుస్తాం అని తెలుసు.. అయినా హెల్మెట్ తీసి ఆ గెస్ట్చర్ ఎందుకు ఇచ్చావు'' అని అడిగాడు. ఇషాన్ ప్రశ్నపై వదేరా స్పందిస్తూ.. ''ఆ సమయంలో అలా జరిగిపోయింది. స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు విజయనాదం చేస్తూ గట్టిగా అరుస్తుండడంతో తెలియకుండానే నా చేతులు హెల్మెట్ వద్దకు వెళ్లడం.. ఒక చేత్తో బ్యాట్.. మరొక చేతిలో హెల్మెట్ పట్టుకొని అభివాదం చేశాను. మ్యాచ్‌ను దగ్గరుండి గెలిస్తే వచ్చే కిక్కు వేరుగా ఉంటుందని నీకు తెలియదా'' అని నవ్వుతూ పేర్కొన్నాడు. ఇక ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో 11 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు, ఐదు ఓటములతో 12 పాయింట్లతో టాప్-మూడో స్థానానికి చేరుకుంది. Ishan pulling Nehal's leg - you know you want to watch this 😂 PS: No complaints from the admin for the celebration at the end, Nehal. 😌😋#OneFamily #MumbaiMeriJaan #MumbaiIndians #IPL2023pic.twitter.com/OX9CMcoUCy — Mumbai Indians (@mipaltan) May 10, 2023 చదవండి: ఒక్కసారి కుదురుకుంటే అతడిని ఆపడం ఎవరి తరం కాదు.. మేము కనీసం! -
క్యాచ్ డ్రాప్.. రోహిత్ కోపానికి అర్థముంది!
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్, ఆర్సీబీ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే డుప్లెసిస్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. డుప్లెసిస్ ఇచ్చిన క్యాచ్‌ను నెహాల్ వదేరా జారవిడిచాడు. ఓవర్ నాలుగో బంతిని మిడ్‌వికెట్ దిశగా ఆడగా.. అక్కడే ఉన్న వదేరా చేతిలోకి వచ్చిన క్యాచ్‌ను వదిలేశాడు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ వదేరాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. రోహిత్ ఆగ్రహానికి ఒక కారణం ఉంది. ఈ సీజన్లో డుప్లెసిస్ టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. 10 మ్యాచ్‌లాడి 511 పరుగులు సాధించిన డుప్లెసిస్ ఆరెంజ్ క్యాప్‌తో కొనసాగుతున్నాడు. అతని ఖాతాలో ఐదు అర్థసెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోరు 84గా ఉంది. సున్నా వద్ద ఉన్నప్పుడే డుప్లెసిస్ ఔట్ అయితే ముంబైకి ప్రమాదం తప్పేదని రోహిత్ భావించాడు. అందుకే వదేరా క్యాచ్ వదిలేయగానే తన కోపాన్ని బయటపెట్టాడు. Nehal Wadhera dropped an easy catch of Faf (the orange cap holder) at mid-wicket & Rohit Sharma was annoyed with that 😑#TATAIPL | #IPL2023 | #MIvsRCB pic.twitter.com/8zYFIyfrVE — CricWatcher (@CricWatcher11) May 9, 2023 చదవండి: రిటైర్మెంట్పై తొందరేం లేదు.. ఐపీఎల్-2023 గెలిచి ఇంకో ఏడాది ఆడతా..! ధోనిలా ఉన్నాడు.. 2040లో ఇదే జరగొచ్చు! -
IPL 2023: చెన్నై ‘డబుల్’ ధమాకా
ఐపీఎల్ తాజా సీజన్లో ఇంటాబయటా ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్‌కింగ్సే ఆధిపత్యం కొనసాగించింది. నెల రోజుల క్రితం ముంబైని మరాఠా వేదికపై ఓడించిన ధోని సేన, ఇప్పుడు దాదాపు అదే ప్రదర్శనను పునరావృతం చేసింది. పైగా వరుసగా గత ఆరు సార్లు చెపాక్ మైదానంలో ముంబై చేతిలో ఎదురైన పరాజయాలకు ఈ గెలుపుతో బ్రేక్ వేసింది. చెన్నై: ఐపీఎల్లో హేమాహేమీ జట్లు ముంబై, చెన్నై మధ్య వరుసగా మరో మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. శనివారం జరిగిన పోరులో చెన్నై 6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం సాధించింది. మొదట రోహిత్ సేన 20 ఓవర్లలో 8 వికెట్లకు 139 పరుగులు చేసింది. నేహల్ వధేరా (51 బంతుల్లో 64; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా...‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మతీశ పతిరణ (3/15) దెబ్బ తీశాడు. çసూపర్‌కింగ్స్ 17.4 ఓవర్లలో 4 వికెట్లే కోల్పోయి 140 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే (42 బంతుల్లో 44; 4 ఫోర్లు), రుతురాజ్ గైక్వాడ్ (16 బంతుల్లో 30, 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. రోహిత్ మళ్లీ విఫలం ముంబై బ్యాటింగ్‌కు దిగడంతోనే కష్టాల్లో కూరుకుపోయింది. గ్రీన్ (6), ఇషాన్ (7), రోహిత్ (0)లు 14 పరుగుల స్కోరుకే పెవిలియన్‌లో కూర్చున్నారు. హైదరాబాద్ కుర్రాడు తిలక్‌వర్మ స్వల్ప గాయంతో బరిలోకి దిగలేకపోవడంతో మూడో స్థానంలో వచ్చిన కెప్టెన్ మళ్లీ డకౌటయ్యాడు. సూర్యకుమార్ (22 బంతుల్లో 26; 3 ఫోర్లు) తర్వాత స్టబ్స్ (21 బంతుల్లో 20; 2 ఫోర్లు)తో నేహల్ వధేరా ఇన్నింగ్స్‌ను కుదుటపరిచాడు. 123/4 స్కోరు దాకా బాగానే ఉన్నా... 14 పరుగుల వ్యవధిలోనే 4 వికెట్లను కోల్పోయింది. చెన్నై సులువుగా... చెన్నై ముందున్న లక్ష్యం 140 పరుగులు. ఇందులో సగంకంటే ఎక్కువ పరుగుల్ని ఓపెనర్లు రుతురాజ్, కాన్వే చేసేయడంతో ఛేదనలో సూపర్‌కింగ్స్ సాఫీగా సాగిపోయింది. కాన్వే నింపాదిగా ఆడుకుంటే... రుతురాజ్ ధాటిని ప్రదర్శించాడు. తర్వాత రహానె (17 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్), రాయుడు (12) తక్కువ స్కోర్లే చేసినా చెన్నైపై ఇదేమంత ప్రభావం చూపలేదు. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: గ్రీన్ (బి) తుషార్ 6; (బి) ఇషాన్ (సి) తీక్షణ (బి) చహర్ 7; రోహిత్ (సి) జడేజా (బి) చహర్ 0; నేహల్ (బి) పతిరణ 64; సూర్యకుమార్ (బి) జడేజా 26; స్టబ్స్ (సి) జడేజా (బి) పతిరణ 20; డేవిడ్ (సి) రుతురాజ్ (బి) తుషార్ 2; అర్షద్ (సి) రుతురాజ్ (బి) పతిరణ 1; ఆర్చర్ నాటౌట్ 3; చావ్లా నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 139. వికెట్ల పతనం: 1–13, 2–13, 3–14, 4–69, 5–123, 6–127, 7–134, 8–137. బౌలింగ్: దీపక్ చహర్ 3–0–18–2, తుషార్ 4–0–26–2, జడేజా 4–0–37–1, అలీ 1–0–10–0, తీక్షణ 4–0–28–0, పతిరణ 4–0–15–3. చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) ఇషాన్ (బి) చావ్లా 30; కాన్వే (ఎల్బీ) (బి) ఆకాశ్ 44; రహానె (ఎల్బీ) (బి) చావ్లా 21; రాయుడు (సి) గోయల్ (బి) స్టబ్స్ 12; దూబే నాటౌట్ 26; ధోని నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (17.4 ఓవర్లలో 4 వికెట్లకు) 140. వికెట్ల పతనం: 1–46, 2–81, 3–105, 4–130. బౌలింగ్: గ్రీన్ 1–0–10–0, ఆర్చర్ 4–0–24–0, అర్షద్ 1.4–0–28–0, చావ్లా 4–0–25–2, రాఘవ్ 4–0–33–0, స్టబ్స్ 2–0–14–1, ఆకాశ్ 1–0–4–1. 16: ఐపీఎల్లో రోహిత్ డకౌట్లు. ఎక్కువ సార్లు ‘సున్నా’ చేసిన ఆటగాడిగా అతను నిలిచాడు. -
'అర్జున్ను తిడుతున్నావా? చావ్లా విషయంలో నువ్వు చేసిందేంటి!'
ఐపీఎల్ 16వ సీజన్లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 55 పరుగుల తేడాతో ఓటమిపాలై 2017 తర్వాత అత్యంత పెద్ద ఓటమిని మూటగట్టుకుంది. నెహల్ వదేరా 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చావ్లాను బలిచేసిన నెహల్ వదేరా.. అయితే మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన నెహర్ వదేరా చేసిన ఒక తప్పిదం చర్చనీయాంశంగా మారింది. తాను బ్యాటింగ్ చేయడం కోసం లేని పరుగు కోసం యత్నించి పియూష్ చావ్లాను రనౌట్ చేశాడు. ఆ తర్వాత అర్జున్ టెండూల్కర్ సింగిల్ తీయడానికి ప్రయత్నిస్తే అతనిపై అసహనం వ్యక్తం చేయడం ఆసక్తిగా మారింది. విషయంలోకి వెళితే.. 18వ ఓవర్లో మోహిత్ శర్మ వేసిన తొలి బంతిని పియూష్ చావ్లా మిస్ చేయడంతో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా బంతిని అందుకున్నాడు. అయితే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న నెహాల్ వదేరా వేగంగా పరిగెత్తుకొచ్చాడు. బంతి మిస్ అయిందని తెలిసినా కూడా పరిగెత్తుకురావడం పియూష్ చావ్లాను ఆశ్చర్యానికి గురి చేసింది. (Virat Kohli: చరిత్రకెక్కిన కోహ్లి.. 580 రోజుల తర్వాత) Photo: IPL Twitter అంతటితో ఆగక చావ్లాను క్రీజు వదలమని సంకేతం ఇచ్చాడు. చివరికి చేసేదేం లేక చావ్లా వదేరా కోసం క్రీజు నుంచి బయటకు వచ్చి పరిగెత్తాడు. కానీ అప్పటికే సాహా మోహిత్‌కు బంతి ఇవ్వడం.. ఆలస్యం చేయకుండా వికెట్లను ఎగురగొట్టడంతో చావ్లా రనౌట్‌గా వెనుదిరిగాడు. అయితే ఆ తర్వాత బంతిని నెహాల్ వదేరా డీప్స్వ్కేర్లెగ్ దిశగా ఆడాడు. అర్జున్‌పై అసహనం నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న అర్జున్ సింగిల్ కోసం పరిగెత్తుకొచ్చాడు. తన వద్దే స్ట్రైక్ ఉంచుకోవాలని భావించిన వదేరా తొలుత సింగిల్ తీయడానికి ఇష్టపడలేదు. కానీ అర్జున్ అప్పటికే సగం క్రీజు దాటడంతో చేసేదేంలేక సింగిల్ పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఎందుకు పరిగెత్తుకొచ్చావ్ అంటూ అర్జున్‌పై అసహనం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ తర్వాత బంతికి అర్జున్ సింగిల్ తీసి వదేరాకు స్ట్రైక్ ఇవ్వగా.. ఫిఫ్టీ పూర్తి చేయకుండానే వదేరా.. మోహిత్ శర్మ బౌలింగ్‌లో షమీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. (సెంచరీలతో విధ్వంసం.. పసికూనపై లంక ఓపెనర్ల ప్రతాపం) కాగా నెహల్ వదేరాపై క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ''అర్జున్ సింగిల్ తీయడానికి ప్రయత్నించాడని తిడుతున్నావా.. మరి పియూష్ చావ్లా విషయంలో నువ్వు చేసిందేంటి''.. ''సిగ్గుండాలి.. ఫిఫ్టీ కోసం చావ్లాను బలిచేశావు.. పైగా అర్జున్‌ని తిడుతున్నావు''.. ''ఒక రకంగా నీవల్లే ముంబై ఓడింది '' అంటూ కామెంట్ చేశారు. Nehal Wadhera gets frustrated after immature run by Arjun Tendulkar. He was saying 'No' but Arjun covered 70% pitch already. #NehalWadhera #GTvsMI pic.twitter.com/VAPip85lyF — Vikram Rajput (@iVikramRajput) April 25, 2023