Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్, ఆర్‌సీబీ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే డుప్లెసిస్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. డుప్లెసిస్ ఇచ్చిన క్యాచ్‌ను నెహాల్ వదేరా జారవిడిచాడు. ఓవర్ నాలుగో బంతిని మిడ్‌వికెట్ దిశగా ఆడగా.. అక్కడే ఉన్న వదేరా చేతిలోకి వచ్చిన క్యాచ్‌ను వదిలేశాడు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ వదేరాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
రోహిత్ ఆగ్రహానికి ఒక కారణం ఉంది. ఈ సీజన్‌లో డుప్లెసిస్ టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. 10 మ్యాచ్‌లాడి 511 పరుగులు సాధించిన డుప్లెసిస్ ఆరెంజ్ క్యాప్‌తో కొనసాగుతున్నాడు. అతని ఖాతాలో ఐదు అర్థసెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోరు 84గా ఉంది. సున్నా వద్ద ఉన్నప్పుడే డుప్లెసిస్ ఔట్ అయితే ముంబైకి ప్రమాదం తప్పేదని రోహిత్ భావించాడు. అందుకే వదేరా క్యాచ్ వదిలేయగానే తన కోపాన్ని బయటపెట్టాడు.
Nehal Wadhera dropped an easy catch of Faf (the orange cap holder) at mid-wicket & Rohit Sharma was annoyed with that 😑#TATAIPL | #IPL2023 | #MIvsRCB pic.twitter.com/8zYFIyfrVE
— CricWatcher (@CricWatcher11) May 9, 2023
చదవండి: రిటైర్మెంట్‌పై తొందరేం లేదు.. ఐపీఎల్-2023 గెలిచి ఇంకో ఏడాది ఆడతా..!
Comments
Please login to add a commentAdd a comment