GT Vs MI: Nehal Wadhera Gets Frustrated On Arjun Tendulkar, Piyush Chawla Sacrifice Wicket - Sakshi
Sakshi News home page

Nehal Wadhera: 'అర్జున్‌ను తిడుతున్నావా? చావ్లా విషయంలో నువ్వు చేసిందేంటి!'

Published Wed, Apr 26 2023 4:54 PM | Last Updated on Wed, Apr 26 2023 9:30 PM

Nehal Wadhera Frustrated Arjun Tendulkar-Piyush Chawla Sacrifice Wicket - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. మంగళవారం గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 55 పరుగుల తేడాతో ఓటమిపాలై 2017 తర్వాత అత్యంత పెద్ద ఓటమిని మూటగట్టుకుంది. నెహల్‌ వదేరా 41 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

చావ్లాను బలిచేసిన నెహల్‌ వదేరా..
అయితే మ్యాచ్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన నెహర్‌ వదేరా చేసిన ఒక తప్పిదం చర్చనీయాంశంగా మారింది. తాను బ్యాటింగ్‌ చేయడం కోసం లేని పరుగు కోసం యత్నించి పియూష్‌ చావ్లాను రనౌట్‌ చేశాడు. ఆ తర్వాత అర్జున్‌ టెండూల్కర్‌ సింగిల్‌ తీయడానికి ప్రయత్నిస్తే అతనిపై అసహనం వ్యక్తం చేయడం ఆసక్తిగా మారింది.

విషయంలోకి వెళితే.. 18వ ఓవర్లో మోహిత్‌ శర్మ వేసిన తొలి బంతిని పియూష్ చావ్లా మిస్ చేయడంతో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా బంతిని అందుకున్నాడు. అయితే నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న నెహాల్ వదేరా వేగంగా పరిగెత్తుకొచ్చాడు. బంతి మిస్‌ అయిందని తెలిసినా కూడా పరిగెత్తుకురావడం పియూష్‌ చావ్లాను ఆశ్చర్యానికి గురి చేసింది.
(Virat Kohli: చరిత్రకెక్కిన కోహ్లి.. 580 రోజుల తర్వాత)


Photo: IPL Twitter

అంతటితో ఆగక చావ్లాను క్రీజు వదలమని సంకేతం ఇచ్చాడు. చివరికి చేసేదేం లేక చావ్లా వదేరా కోసం క్రీజు నుంచి బయటకు వచ్చి పరిగెత్తాడు. కానీ అప్పటికే సాహా మోహిత్‌కు బంతి ఇవ్వడం.. ఆలస్యం చేయకుండా వికెట్లను ఎగురగొట్టడంతో చావ్లా రనౌట్‌గా వెనుదిరిగాడు. అయితే ఆ తర్వాత బంతిని నెహాల్‌ వదేరా డీప్‌స్వ్కేర్‌లెగ్‌ దిశగా ఆడాడు.

అర్జున్‌పై అసహనం
నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉ‍న్న అర్జున్‌ సింగిల్‌ కోసం పరిగెత్తుకొచ్చాడు. తన వద్దే స్ట్రైక్‌ ఉంచుకోవాలని భావించిన వదేరా తొలుత సింగిల్‌ తీయడానికి ఇష్టపడలేదు. కానీ అర్జున్‌ అప్పటికే సగం క్రీజు దాటడంతో చేసేదేంలేక సింగిల్‌ పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఎందుకు పరిగెత్తుకొచ్చావ్‌ అంటూ అర్జున్‌పై అసహనం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ తర్వాత బంతికి అర్జున్‌ సింగిల్‌ తీసి వదేరాకు స్ట్రైక్‌ ఇవ్వగా.. ఫిఫ్టీ పూర్తి చేయకుండానే వదేరా.. మోహిత్‌ శర్మ బౌలింగ్‌లో షమీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.
(సెంచరీలతో విధ్వంసం.. పసికూనపై లంక ఓపెనర్ల ప్రతాపం)

కాగా నెహల్‌ వదేరాపై క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్య‍క్తం చేశారు. ''అర్జున్‌ సింగిల్‌ తీయడానికి ప్రయత్నించాడని తిడుతున్నావా.. మరి పియూష్‌ చావ్లా విషయంలో నువ్వు చేసిందేంటి''.. ''సిగ్గుండాలి.. ఫిఫ్టీ కోసం చావ్లాను బలిచేశావు.. పైగా అర్జున్‌ని తిడుతున్నావు''.. ''ఒక రకంగా నీవల్లే ముంబై ఓడింది '' అంటూ కామెంట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement