WPL 2023: Gorgeous Women Sania Mirza, Ellyse Perry, Smriti Mandhana All In RCB - Sakshi
Sakshi News home page

WPL 2023: అందాలన్నీ ఆర్సీబీలోనే.. స్మృతి, సానియా, ఎల్లిస్‌..!

Published Wed, Feb 15 2023 6:56 PM | Last Updated on Wed, Feb 15 2023 7:48 PM

WPL: Gorgeous Women Sania Mirza, Ellyse Perry, Smriti Mandhana All In RCB - Sakshi

మహిళల ఐపీఎల్‌ (WPL)లో అందమైన జట్టు ఏది అంటే..? ఏమాత్రం తడుంకోకుండా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు పేరు చెప్పాలి. విధ్వంసకర ఆటతో పాటు మతి పోగొట్టే అందాలన్నీ ఆర్సీబీ సొంతమయ్యాయనడం అతిశయోక్తి కాదు. టీమిండియా డాషింగ్‌ ఓపెనర్‌ స్మృతి మంధన, ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ ఎల్లిస్‌ పెర్రీ, ఇంగ్లండ్‌ కెప్టెన్‌ హీథర్‌ నైట్‌, ఆసీస్‌ పేసర్‌ మెగాన్‌ షట్‌, న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ సోఫీ డివైన్‌, టీమిండియా పేసర్‌ రేణుకా సింగ్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే జట్టు నిండా అందాలే ఉన్నాయి.

ఇన్ని అందాలు చాలవన్నట్లు.. ఆర్సీబీ తమ కుటుంబంలోకి క్రికెటేతర అందాన్ని కూడా ఆహ్వానించింది. బెంగళూరు ప్రాంచైజీ స్టార్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జాను మెంటార్‌గా నియమించుకుంది. జట్టు అందాల పూతోటగా మారడం పట్ల ఆర్సీబీ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోని అందాలన్నీ ఒకే చోట చేరినట్లుందని సంబురపడిపోతున్నారు. అందంతో పాటు తమ ప్లేయర్స్‌ ఆటలోనూ మహరాణులంటూ మురిసిపోతున్నారు. ఆటతో పాటు అందాలను ఆస్వాదించే వారికి ఆర్సీబీ వంద శాతం కనువిందు కలిగిస్తుందని గర్వంగా చెప్పుకుంటున్నారు. 

కాగా, ఫిబ్రవరి 13న జరిగిన WPL మెగా వేలంలో ఆర్సీబీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అందాలన్నిటినీ ఏకం చేసింది. వేలంలో స్మృతి మంధనను 3.4 కోట్ల రికార్డు ధర వెచ్చించి సొంతం చేసుకున్న ఆర్సీబీ యాజమాన్యం.. రిచా ఘోష్‌ను 1.9 కోట్లకు, ఎల్లిస్‌ పెర్రీని 1.7 కోట్లకు, రేణుకా సింగ్‌ను 1.5 కోట్లకు, సోఫీ డివైన్‌ను 50 లక్షలకు, హీథర్‌ నైట్‌ను 40 లక్షలకు, మెగాన్‌ షట్‌ను 40 లక్షలకు, కనిక అహుజను 35 లక్షలకు, డేన్‌ వాన్‌ నికెర్క్‌ను 30 లక్షలకు, ఎరిన్‌ బర్న్స్‌ను 30 లక్షలకు, ప్రీతి బోస్‌ను 30 లక్షలకు, కోమల్‌ జంజద్‌ను 25 లక్షలకు, ఆశా శోభనను 10 లక్షలకు, దిశా కాసత్‌ను 10 లక్షలకు, ఇంద్రాణి రాయ్‌ను 10 లక్షలకు, పూనమ్‌ ఖేమ్నర్‌ను 10 లక్షలకు, సహన పవార్‌ను 10 లక్షలకు, శ్రేయాంక పాటిల్‌ను 10 లక్షలకు సొంతం చేసుకుంది. 

వేలంలో మొత్తంగా 18 ప్లేయర్లను (12 మంది స్వదేశీ, ఆరుగురు విదేశీ ప్లేయర్లు) కొనుగోలు చేసిన ఆర్సీబీ.. తాజాగా తమ హెడ్‌ కోచ్‌గా న్యూజిలాండ్‌కు చెందిన బెన్‌ సాయర్‌ను నియమించుకుంది. ఆర్సీబీ పర్స్‌లో ఇంకా 10 లక్షలు మిగిలాయి.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement