బెంగళూరు కెప్టెన్ మెరుపు ఇన్నింగ్స్
రాణించిన ఎలీస్ పెరీ
ఆర్‌సీబీకి మూడో విజయం
23 పరుగులతో ఓడిన వారియర్స్
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోరీ్నలో తొలి అంచెపోటీలను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు విజయంతో ముగించింది. ఓపెనర్, కెపె్టన్ స్మృతి మంధాన (50 బంతుల్లో 80; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), టాపార్డర్ బ్యాటర్ ఎలీస్ పెరీ (37 బంతుల్లో 58; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగడంతో బెంగళూరు 23 పరుగుల తేడాతో యూపీ వారియర్స్‌పై గెలుపొందింది.
ఈ లీగ్‌లో ఆర్‌సీబీకిది మూడో విజయం. మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిరీ్ణత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ఆంధ్ర అమ్మాయి సబ్బినేని మేఘన (21 బంతుల్లో 28; 5 ఫోర్లు)తో ఒపెనింగ్ వికెట్‌కు చకచకా 51 పరుగులు జతచేసిన స్మృతి ఆ తర్వాత పెరీ అండతో దూకుడు పెంచింది. ఇద్దరు ధనాధన్ ఆటతీరు కనబరచడంతో యూపీ బౌలర్లకు కష్టాలు తప్పలేదు. రెండో వికెట్‌కు 10.4 ఓవర్లలో 95 పరుగులు జతచేశారు.
మంధాన 34 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. 146 పరుగుల వద్ద స్మృతి ని్రష్కమించగా, 33 బంతుల్లో అర్ధశతకం సాధించిన పెరీ ఆఖరి ఓవర్లో అవుటైంది. రిచా ఘోష్ (10 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) మెరిపించింది. ఆంధ్ర అమ్మాయి అంజలి శర్వాణి, దీప్తి శర్మ, సోఫీ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం భారీలక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యూపీ వారియర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేయగలిగింది.
కెపె్టన్, ఓపెనర్ అలీసా హీలీ (38 బంతుల్లో 55; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) పవర్‌ప్లేలో దంచేసింది. మరో ఓపెనర్ కిరణ్ నవ్‌గిరే (18) సహా చమరి ఆటపట్టు (8), గ్రేస్ హారిస్ (5), శ్వేత సెహ్రావత్ (1) స్వల్ప వ్యవధిలో ని్రష్కమించడంతో యూపీ లక్ష్యానికి దూరమైంది. దీప్తి శర్మ (22 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్), పూనమ్ (24 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్) కాసేపు పోరాడారు. నేటి నుంచి ఢిల్లీ వేదికపై రెండో అంచె పోటీలు జరుగుతాయి. మంగళవారం జరిగే పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment