మంధాన క్రేజ్‌.. తెలుగమ్మాయి ఫిఫ్టీ.. రిచా ధనాధన్‌ ఇన్నింగ్స్‌ | WPL 2024 Packed Chinnaswamy Crowd Roars For Mandhana Meghana Richa Fifties | Sakshi
Sakshi News home page

మంధాన క్రేజ్‌.. తెలుగమ్మాయి హాఫ్‌ సెంచరీ.. రిచా ధనాధన్‌ ఇన్నింగ్స్‌

Published Sat, Feb 24 2024 9:20 PM | Last Updated on Sat, Feb 24 2024 9:29 PM

WPL 2024 Packed Chinnaswamy Crowd Roars For Mandhana Meghana Richa Fifties - Sakshi

ఆర్సీబీ మహిళా జట్టు కెప్టెన్‌ స్మృతి మంధాన (PC: WPL/X)

WPL 2024- RCBW Vs UPW: మహిళల ప్రీమియర్‌ లీగ్‌-2024 ఎడిషన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తమ తొలి మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌తో తలపడుతోంది. ఎం. చిన్నస్వామి స్టేడియంలో శనివారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన యూపీ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య ఆర్సీబీ ఆరంభంలోనే ఓపెనర్‌ సోఫీ డివైన్‌(1) వికెట్‌ కోల్పోయింది. మరో ఓపెనర్‌ స్మృతి మంధాన.. వన్‌డౌన్‌ బ్యాటర్‌, తెలుగమ్మాయి సబ్బినేని మేఘనతో కలిసి ఇన్నింగ్స్‌ నిర్మించే ప్రయత్నం చేసింది.

ఈ నేపథ్యంలో రెండో ఓవర్‌ మూడు, నాలుగో బంతుల్లో వరుసగా సిక్సర్‌, ఫోర్‌తో చెలరేగింది. కానీ.. మంధాన మెరుపులు కాసేపటికే మాయమయ్యాయి. ఆరో ఓవర్‌ తొలి బంతికే మెగ్రాత్‌ బౌలింగ్‌లో వ్రిందా దినేశ్‌కు క్యాచ్‌ ఇచ్చి స్మృతి మంధాన 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించింది.

ఆమె తర్వాత మరో స్టార్‌ ప్లేయర్‌ ఎలిస్‌ పెర్రీ(8) కూడా ఇలా వచ్చి అలా పెవిలియన్‌కు చేరింది. ఈ క్రమంలో సబ్బినేని మేఘన, వికెట్‌ కీపర్‌ రిచా ఘోష్‌ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. మేఘన 44 బంతులు ఎదుర్కొని 53 పరుగులు చేసింది. ఆమె ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్‌ ఉన్నాయి.

ఇలా మేఘన జట్టుకు అవసరమైన సమయంలో అర్ధ శతకం బాదితే.. రిచా ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో అదరగొట్టింది. 37 బంతుల్లోనే 12 ఫోర్ల సాయంతో 62 రన్స్‌ చేసింది. మిగతా వాళ్లలో జార్జియా వరేహం డకౌట్‌ కాగా.. సోఫీ మొలినెక్స్‌ 9, శ్రెయాంక పాటిల్‌ 8 పరుగులతో అజేయంగా నిలిచారు.

స్మృతి రాగానే హోరెత్తిన చిన్నస్వామి స్టేడియం
ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ మహిళా జట్టు ఆరు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. యూపీ వారియర్స్‌ బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్‌ రెండు వికెట్లు తీయగా.. గ్రేస్‌ హ్యారిస్‌, తహిలా మెగ్రాత్‌, సోఫీ ఎక్లిస్టోన్‌, దీప్తి శర్మ తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

ఇదిలా ఉంటే.. టాస్‌ సమయంలో స్మృతి మంధాన రాగానే చిన్నస్వామి స్టేడియం హోరెత్తిపోయింది. అదే విధంగా ఆమె బ్యాట్‌ ఝులించినప్పుడు కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్‌. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement