Dawood Ibrahim Wife Aide Accuses Hardik Pandya and Rajiv Shukla: టీ20 ప్రపంచకప్-2021లో ఆశించిన మేర రాణించకపోవడంతో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చోటు కోల్పోయిన టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాకు మరో షాక్ తగిలింది. అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సహాయకుడు రియాజ్ భాటి భార్య రెహ్నుమా భాటి.. హార్ధిక్ పాండ్యాతో పాటు మునాఫ్ పటేల్, పృథ్వీరాజ్ కొఠారీ, మాజీ బీసీసీఐ చైర్మన్ రాజీవ్ శుక్లాలపై సంచలన ఆరోపణలు చేసింది. సదరు వ్యక్తులంతా తనను లైంగిక వేధింపులకు గురి చేసి, అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ముంబైలోని సాంతా క్రూజ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
COMPLAINT COPY EXCLUSIVE‼️ https://t.co/Nj2U9UoA8P pic.twitter.com/o5uWCoDfLx
— Sameet Thakkar (@thakkar_sameet) November 10, 2021
తన భర్త రియాజ్ భాటి స్వప్రయోజనాల కోసం అతని వ్యాపార భాగస్వామ్యులతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేసేవాడని, అలా కొందరు హై ప్రొఫైల్ సెలబ్రిటీల వద్దకు తనను పంపాడని రెహ్నుమా ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే, రెహ్నుమా ఇచ్చిన ఫిర్యాదులో సరైన అడ్రస్ లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదిలా ఉంటే, హార్ధిక్.. గతంలో ‘కాఫీ విత్ కరణ్ షో’లో వివాదాస్పద కామెంట్లు చేసి ఓ మ్యాచ్ నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హార్ధిక్.. భార్య నటాశాతో కలిసి మాల్దీవుల్లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నట్లు సమాచారం.
చదవండి: "గంగూలీతో విభేదాలు నిజమే.." రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment