Munaf Patel
-
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ బౌలర్
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ పేసర్ మునాఫ్ పటేల్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ యాజమాన్యం ఇవాళ (నవంబర్ 12) అధికారికంగా ప్రకటించింది. మునాఫ్ వచ్చే సీజన్ నుంచి హెడ్ కోచ్ హేమంగ్ బదాని, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ వేణుగోపాల్ రావుతో కలిసి పని చేస్తాడు. మునాఫ్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్‌గా జేమ్స్ హోప్స్ పని చేశాడు. ఢిల్లీ యాజమాన్యం ఇటీవలే రికీ పాంటింగ్‌ను హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తొలగించింది. పాంటింగ్‌తో పాటు హోప్స్ తదితరులు తమ పదవులు కోల్పోయారు. పాంటింగ్, సౌరవ్ గంగూలీ స్థానాల్లో హేమంగ్ బదాని, వేణుగోపాల్ రావు హెడ్ కోచ్, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా బాధ్యతలు చేపట్టారు. సపోర్టింగ్ స్టాఫ్‌కు ఎంపిక చేసుకునే బాధ్యతను ఢిల్లీ యాజమాన్యం హెడ్ కోచ్, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌కే వదిలేసింది. ఈ క్రమంలో బదాని, వేణు మునాఫ్‌ను బౌలింగ్ కోచ్‌గా ఎంపిక చేసుకున్నారు.41 ఏళ్ల మునాఫ్ పటేల్ 2013లో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. మునాఫ్ 2008-17 మధ్యలో రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్ ఫ్రాంచైజీల తరఫున 63 మ్యాచ్‌లు ఆడి 74 వికెట్లు పడగొట్టాడు. మునాఫ్ టీమిండియా తరఫున 2006-2011 మధ్యలో మూడు ఫార్మాట్లలో కలిపి 86 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 125 వికెట్లు పడగొట్టాడు. మునాఫ్ 2011లో భారత్ వన్డే ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. -
అత్యాచారం కేసులో హార్దిక్ పాండ్యా.. ? గ్యాంగ్‌స్టర్ భార్య సంచలన ఆరోపణలు..!
Dawood Ibrahim Wife Aide Accuses Hardik Pandya and Rajiv Shukla: టీ20 ప్రపంచకప్-2021లో ఆశించిన మేర రాణించకపోవడంతో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చోటు కోల్పోయిన టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాకు మరో షాక్ తగిలింది. అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సహాయకుడు రియాజ్ భాటి భార్య రెహ్నుమా భాటి.. హార్ధిక్ పాండ్యాతో పాటు మునాఫ్ పటేల్, పృథ్వీరాజ్ కొఠారీ, మాజీ బీసీసీఐ చైర్మన్ రాజీవ్ శుక్లాలపై సంచలన ఆరోపణలు చేసింది. సదరు వ్యక్తులంతా తనను లైంగిక వేధింపులకు గురి చేసి, అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ముంబైలోని సాంతా క్రూజ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. COMPLAINT COPY EXCLUSIVE‼️ https://t.co/Nj2U9UoA8P pic.twitter.com/o5uWCoDfLx — Sameet Thakkar (@thakkar_sameet) November 10, 2021 తన భర్త రియాజ్ భాటి స్వప్రయోజనాల కోసం అతని వ్యాపార భాగస్వామ్యులతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేసేవాడని, అలా కొందరు హై ప్రొఫైల్ సెలబ్రిటీల వద్దకు తనను పంపాడని రెహ్నుమా ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే, రెహ్నుమా ఇచ్చిన ఫిర్యాదులో సరైన అడ్రస్ లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదిలా ఉంటే, హార్ధిక్.. గతంలో ‘కాఫీ విత్ కరణ్ షో’లో వివాదాస్పద కామెంట్లు చేసి ఓ మ్యాచ్ నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హార్ధిక్.. భార్య నటాశాతో కలిసి మాల్దీవుల్లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నట్లు సమాచారం. చదవండి: "గంగూలీతో విభేదాలు నిజమే.." రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు -
లంక లీగ్ వేలానికి మునాఫ్ పటేల్
కొలంబో: శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) ఆధ్వర్యంలో జరుగనున్న తొలి లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్)లో భారత మాజీ పేసర్ మునాఫ్ పటేల్ పాల్గొనే అవకాశం ఉంది. ఈ టోర్నమెంట్‌కు సంబంధించి అక్టోబర్ 1న జరుగనున్న వేలానికి మునాఫ్ పటేల్ అందుబాటులో ఉండనున్నాడు. 37 ఏళ్ల మునాఫ్ భారత్ తరఫున 13 టెస్టులు, 70 వన్డేలు, 3 టి20లు ఆడాడు. 2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులోనూ సభ్యుడు. ఎల్పీఎల్ కోసం మునాఫ్‌తో పాటు ఇంగ్లండ్ ప్లేయర్ రవి బొపారా, దక్షిణాఫ్రికా ఆటగాడు కోలిన్ మున్రో, వెర్నాన్ ఫిలాండర్‌లతో కలిపి మొత్తం 150 మంది అంతర్జాతీయ క్రికెటర్లు వేలానికి రానున్నారు. ఇందులో పాల్గొనే ఐదు ఫ్రాంచైజీలు గరిష్టంగా ఆరుగురు చొప్పున అంతర్జాతీయ క్రికెటర్లను దక్కించుకోవచ్చు. (చదవండి: ముంబైతో కలిసిన వెస్టిండీస్ ఆల్‌రౌండర్) -
నన్ను కావాలనే ఇరికిస్తున్నారు: మునాఫ్
న్యూఢిల్లీ: విదర్భ క్రికెట్ చీఫ్ దేవేంద్ర సుర్తి తనను కావాలనే ఇరికిస్తున్నారని భారత మాజీ క్రికెటర్ మునాఫ్ పటేల్ ఆరోపించాడు. తాను దేవేంద్రను చంపుతానంటూ ఆయన చేసిన ఫిర్యాదు వెనుక చాలా పెద్ద కుట్ర దాగి ఉందని మునాఫ్ పేర్కొన్నాడు. తాను కేవలం క్రికెటర్ల ఆటకు సంబంధించిన వ్యవహారాలు చూసుకోవడం తప్ప, సెలక్షన్ పరమైన వాటిలో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని బరోడా క్రికెట్ అసోసియేషన్(బీసీఏ) క్రికెట్ జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తున్న మునాఫ్ అన్నాడు. తనను మునాఫ్ చంపుతానంటూ బెదిరించినట్లు దేవేంద్ర సుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను అవినీతికి వ్యతిరేకంగా పోరాడటాన్ని సహించలేక మునాఫ్ బెదిరింపులకు దిగాడని సుర్తి పేర్కొన్నారు. ఒకవేళ తనకు కానీ, కుటుంబానికి కానీ ఏమైనా ప్రమాదం వాటిల్లితే మునాఫ్‌నే పూర్తి బాధ్యడ్ని చేయాల్సి ఉంటుందని పోలీస్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాము సుర్తి నుంచి ఫిర్యాదు తీసుకున్నామని, ఇప్పటివరకూ అయితే ఎటువంటి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదని నవాపురా పోలీస్ ఇన్స్పెక్టర్ ఆర్ఎమ్ చౌహాన్ తెలిపారు. దీనిపై స్పందించిన మునాఫ్.. ‘ ఎటువంటి కారణాలు లేకుండా నా పేరును తెరపైకి తీసుకొచ్చారు. నాకు తెలిసినంత వరకూ క్రికెట్ ఆడటమే తెలుసు. సుర్తికి సెలక్షన్ కమిటీ సభ్యులతో ఇబ్బందులున్నాయి. నేను కేవలం మెంటార్‌ని మాత్రమే. నాకు సెలక్షన్స్‌తో ఎటువంటి సంబంధం ఉండదు. అటువంటప్పుడు నాపేరును ఎందుకు బయటకు తెస్తున్నారు. ఇది అనవసరమైన రాద్ధాంతం తప్ప నేను ఎవర్నీ చంపుతానని బెదిరించలేదు’ అని మునాఫ్ పేర్కొన్నాడు. మునాఫ్ పటేల్ 2006లో భారత్ తరఫున అరంగేట్రం చేసి 70 వన్డేలు, 13 టెస్టులు, 3 టీ20లు ఆడాడు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన మునాఫ్.. 2011లో భారత్ వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడు. -
క్రికెట్‌కు మునాఫ్ పటేల్ వీడ్కోలు
న్యూఢిల్లీ: భారత పేస్‌బౌలర్ మునాఫ్ పటేల్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. 2011 వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన మునాఫ్ ఆ తర్వాత గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యాడు. 2006లో ఇంగ్లండ్‌పై టెస్టు అరంగేట్రం చేసిన అతను మొత్తం 13 టెస్టుల్లో 35 వికెట్లు... 70 వన్డేల్లో 86 వికెట్లు... 3 టి20ల్లో 4 వికెట్లు తీశాడు. వరల్డ్‌కప్ గెలిచిన ఏడాదే ఇంగ్లండ్‌తో చివరి అంతర్జాతీయ టి20 మ్యాచ్ ఆడిన మునాఫ్ ఆ తర్వాత తిరిగి జట్టుకు ఎంపిక కాలేదు. ‘ఇప్పటి వరకు చాలామందితో కలిసి ఆడాను. వారిలో ధోని తప్ప దాదాపు అందరూ తప్పుకున్నారు. మిగతావారు ఆడుతూ నేను రిటైర్మెంట్ ప్రకటిస్తే ఎక్కువ బాధ ఉండేది. ఇక వైదొలగాల్సిన సమయం వచ్చేసింది’ అని 35 ఏళ్ల మునాఫ్ పేర్కొన్నాడు. -
నాలుగేళ్ల తరువాత తొలి ఐపీఎల్ మ్యాచ్
ముంబై:దాదాపు నాలుగేళ్ల పాటు ఒక లీగ్ కు దూరంగా ఉండి పునరాగమనం చేయడమంటే అంత తేలికైన విషయం కాదు. అయితే భారత మాజీ పేస్ బౌలర్ మునాఫ్ పటేల్ నాలుగేళ్ల తరువాత తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. ఆదివారం వాంఖేడ్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ ద్వారా గుజరాత్ లయన్స్ తరపున మునాఫ్ బరిలోకి దిగాడు. ఇలా సుదీర్ఘ విరామం తరువాత ఆడటం చాలా అరుదుగా జరుగుతుంది. కాగా, మునాఫ్ పటేల్ పై నమ్మకం ఉంచిన గుజరాత్ కెప్టెన్ సురేశ్ రైనా తుది జట్టులోకి తీసుకున్నాడు. దాంతో పాటు మునాఫ్ చేత పూర్తి కోటా బౌలింగ్ కూడా వేయించాడు. నిన్నటి మ్యాచ్ లో నాలుగు ఓవర్ల బౌలింగ్ వేసిన మునాఫ్ 35 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు. ముంబై ఇండియన్స్ ఓపెనర్ జాస్ బట్లర్ వికెట్ మునాఫ్ ఖాతాలో చేరింది. 1426 రోజుల తరువాత తొలి మ్యాచ్ ఆడినప్పటికీ మునాఫ్ చక్కటి రిథమ్ తో బౌలింగ్ చేయడం ఆకట్టుకుంది. ఈ మ్యాచ్ కు ముందు మునాఫ్ చివరి సారి 2013లో ఆడాడు. అప్పుడు ముంబై ఇండియన్స్ తరపున మునాఫ్ పాల్గొన్నాడు. చెన్నై కింగ్స్ తో జరిగిన ఆ మ్యాచ్ లో మునాఫ్ మూడు ఓవర్లు వేసి వికెట్ తీయకుండా 32 పరుగులిచ్చాడు. అప్పటి మ్యాచ్ లో మునాఫ్ బౌలింగ్ ను చితక్కొట్టిన వారిలో రైనా ఒకడు. ఇప్పుడ అదే రైనా జట్టులో మునాఫ్ తిరిగి ఆడటం ఇక్కడ విశేషం.