marital rape
-
అవును.. వైవాహిక అత్యాచారం నేరమే.. కాదు!
ఆమె అతనికి ఓ ఆట బొమ్మ మాత్రమే... ప్రతి రాత్రి ఆమెతో ఆమె జీవితంతో ఆడుకోవాలని చూస్తాడు.. చిన్నదైనా..పెద్దదైనా ఇద్దరి మధ్యా ఎప్పుడైనా గొడవ జరిగితే... ఆ ప్రతీకారాన్ని రాత్రి మంచంపై తీర్చుకోవడం అతనికి అలవాటు. ఆమె ఆరోగ్యం బాగోలేకున్నా అతనికి ఏమీ పట్టదు. కేవలం కోరికలు తీర్చే ఓ యంత్రంలా మాత్రమే ఆమెను చూస్తాడు. ఆరోగ్యం బాగోలేదు.. ఇవాళ శారీరంగా కలిసే శక్తి లేదని ఎప్పుడైనా చెబితే... ఇక ఆ రాత్రి పిడి గుద్దులు కురిపించి.. నరకం చూపిస్తాడు.. బలవంతంగా అనుభవించి పక్కకు జరుగుతాడు.." తన వైవాహిక జీవితానికి సంబంధించి ఇటీవల ఓ మహిళ సుప్రీంకోర్టు ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పిన మాటలివి. ఆమె చెప్పినదంతా వింటే మీకేం అనిపిస్తుంది? ఓ అత్యాచార బాధితురాలి మాటలు లాగా అనిపించడంలేదా? అయితే కేంద్రానికి మాత్రం దీన్ని రేప్ లాగా భావించడంలేదు.. కారణం ఒక్కటే.. వారిద్దరూ భార్యభర్తలు! అదేంటి.. దంపతులైతే మాత్రం బలవంతంగా భార్యపై ఓ మృగంలా పడిపోవచ్చా అని అడిగితే మాత్రం కేంద్రం దగ్గర సమాధానం ఉండదు.. ఈ తరహా వైఖరి కేవలం కేంద్ర ప్రభుత్వానిది మాత్రమే కాదు .. భార్య శరీరాన్ని సొంత ఆస్తిగా భావించే భర్తలకు కూడా వైవాహిక అత్యాచారం ఓ నేరంలా అనిపించదు..! ఇంతకీ మ్యారిటల్ రేప్‌ను కేంద్ర ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తోంది? ఈ వైవాహిత అత్యాచార బాధితుల బాధ ఎలాంటిది? దేశంలో మ్యారిటల్ రేప్ బాధితులు ఎంతమంది ఉన్నారు?'పురుషుడు పురుషుడే.. చట్టం చట్టమే.. స్త్రీపై పురుషుడు అత్యాచారం చేసినా, భార్యపై భర్త అత్యాచారం చేసినా అది అత్యాచారమే..' కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగప్రసన్న రెండేళ్ళ క్రితం ఒక కేసులో ఇచ్చిన తీర్పులో భాగంగా చేసిన వ్యాఖ్యలు ఇవి! అయితే చట్టాలు మాత్రం ఆయన మాటలకు విరుద్ధంగా ఉన్నాయి. అటు కేంద్రం కూడా మ్యారిటల్ రేప్‌ను నేరంగా అసలు అంగీకరించడంలేదు. భార్యతో ఆమె ఇష్టానికి విరుద్ధంగా భర్త సంభోగంలో పాల్గొనడాన్ని నేరంగా పరిగణించే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా మరోసారి స్పష్టం చేసింది. భార్య వయసు 18 ఏళ్లు దాటి ఉంటే ఆమెతో భర్త బలవంతంగా లైంగిక కార్యం జరిపినా నేరం కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 👉ఇక భారత న్యాయ సంహిత-BNS ప్రకారం వైవాహిక అత్యాచారం నేరం కాదు. ఈ మ్యారిటల్ రేప్‌ను నేరంగా గుర్తించడం కారణంగా వివాహ వ్యవస్థ దెబ్బతింటుందని కేంద్రం అనేకసార్లు కోర్టుల్లో వాదిస్తూ వచ్చింది. వైవాహిక అత్యాచారాన్ని క్రిమినలైజ్ చేయడం వివాహబంధాలకు హాని కలుగుతుందన్నది వారి ప్రధాన వాదన. అయితే వివాహ వ్యవస్థను ఓ sacred institutionగా భావించడం కారణంగానే కేంద్రం ఈ విధంగా మాట్లాడుతోందని మహిళా సంఘాలు చెబుతుంటాయి. Consent.. అంటే అనుమతి లేకుండా శృంగారంలో పాల్గొనడం మహిళా హక్కులకు పూర్తి వ్యతిరేకమంటారు. నిజానికి కేవలం భార్య అయినంతా మాత్రనా ఏ మహిళా కూడా తన హక్కులను కోల్పోదు. అందుకే Marriage is not an excuse for any kind of rape అని చెబుతారు మహిళా సంఘాల నేతలు!👉అయితే కేంద్రం మాత్రం వివాహ వ్యవస్థ రక్షణ కోసమే మ్యారిటల్ రేప్‌ను క్రిమినలైజ్ చేయడం లేదని పదేపదే చెబుతుంటుంది. ఒకవేళ వైవాహిక అత్యాచారాన్ని నేరంగా గుర్తిస్తే ఫేక్ కేసులు పెట్టేవారు పెరుగుతారని.. ఇది ఓవరాల్‌గా వివాహ వ్యవస్థకు హాని చేస్తుందని వాదిస్తుంటుంది. అటు ఈ మ్యారిటల్ రేప్‌ని నేరంగా పరిగణించాలని పోరాడే వారు మాత్రం కేంద్రం వాదనలో ఎలాంటి హేతుబద్ధత లేదంటారు. చట్టాల చాటున ఫేక్ కేసులు పెట్టే వారూ ఎక్కడైనా ఉంటారని.. అలాంటి ఘటనలు జరుగుతున్నాయని అసలు మొత్తానికే చట్టం లేకుండా చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. 👉నిజానికి అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్, దక్షిణ ఆఫ్రికా లాంటి అనేక దేశాలు మ్యారిటల్ రేప్‌ను నేరంగా గుర్తించాయి. ఇటు ఇండియాలో మాత్రం మ్యారిటల్ రేప్ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 2018లో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే లెక్కల ప్రకారం, వివాహితులలో 29శాతం మంది శారీరక లేదా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారు. వైవాహిక అత్యాచారం కారణంగా మహిళలు ఎదుర్కొనే బాధ భరించరానిది. మానసికంగా ఎంతో కుంగిపోతారు. డిప్రెషన్ లాంటి సమస్యలు వేధిస్తాయి. అటు శారీరక హింస ఎలాగో ఉంటుంది. ఇటు సామాజికంగానూ ఎన్నో సవాళ్లు ఫేస్ చేయాల్సి వస్తుంది. 👉గృహ హింస, మహిళలపై లైంగిక వేధింపుల కట్టడికి సంబంధించిన చట్టాలను తీసుకురావడంలో ఇండియా కాస్త పురోగతిని సాధించింది కానీ ఈ వైవాహిక అత్యాచార విషయంలో మాత్రం సాంప్రదాయ ఆలోచనలతో అసలు నేరాన్ని నేరంకాదని చెబుతుండడం బాధకరమని బాధితులు వాపోతుంటారు. నిజానికి గృహ హింస వివిధ రూపాల్లో ఉంది. భర్తకు భార్య పగలంతా ఒక యంత్రంలా పని చేయాలి. రాత్రికి కోరికలు తీర్చే బొమ్మలా సిద్ధం కావాలి. నిద్ర, అలసట ఉండకూడదు. పీరియడ్స్, జ్వరం ఏమీ అనకూడదు. ఇవే చాలా మంది మ్యారిటల్ రేప్ బాధితులు చెప్పే మాటలు..! వాస్తవానికి ఇలాంటి కేసులు బయటకు రావడమే చాలా అరుదు. కుటుంబం విచ్ఛిన్నమవుతుందనే భయాలు, బెదిరింపులు వల్ల వైవాహిక హింస భారతీయ సమాజంలో ఎక్కువగా బహిర్గతం కాదు. అటు కేంద్రం మాత్రం ఇది అసలు నేరమే కాదంటోంది..!:::త్రినాథ్ బండారు, సాక్షి డిజిటల్ -
మ్యారిటల్ రేప్ నేరం కాదు: కేంద్రం
న్యూఢిల్లీ: భార్యతో ఆమె ఇష్టానికి విరుద్ధంగా భర్త సంభోగంలో పాల్గొనడాన్ని(మ్యారిటల్ రేప్) నేరంగా పరిగణించే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. భార్య వయసు 18 ఏళ్లు దాటి ఉంటే ఆమెతో భర్త బలవంతంగా లైంగిక కార్యం జరిపినా నేరం కాదని వెల్లడించింది. ఒకవేళ ఆమె వయసు 18 ఏళ్లలోపు ఉంటే ఆ లైంగిక కార్యం నేరమేనని ఉద్ఘాటించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ బుధవారం రాజ్యసభలో సమాధానమిచ్చారు. భారతీయ న్యాయ సంహిత–2023లోని సెక్షన్ 74, 75, 76, 85తోపాటు గృహహింస నుంచి మహిళలకు రక్షణ కలి్పంచే చట్టం–2005 వివాహిత మహిళలకు పలు హక్కులు, రక్షణలు, గౌరవం కలి్పస్తున్నాయని వెల్లడించారు. -
వైవాహిక అత్యాచారం కేసుల విచారణ వాయిదా
న్యూఢిల్లీ: వైవాహిక అత్యాచారం ఘటనల్లో భర్తపై నేరం మోపకుండా చట్టం కల్పిస్తున్న రక్షణలపై నమోదైన కేసుల విచారణను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం నాలుగు వారాలు వాయిదావేసింది. నవంబర్ పదో తేదీన సీజేఐ చంద్రచూడ్ పదవీవిరమణ నేపథ్యంలో ఇక ఈ కేసులను ఆయన విచారించబోరని తెలుస్తోంది. కోర్టుకు దీపావళి సెలవు దినాలు మొదలుకానున్న నేపథ్యంలో ఈ కేసుల వాదోపవాదనలను ముగించలేకపోతున్నానని ఆయన చెప్పారు. కేసులో తగిన పత్రాల దాఖలుకు సంబంధిత న్యాయవాదులకు తగు గడువు ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సీజేఐ చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం కాకుండా ఈ కేసుల తదుపరి విచారణను మరో ధర్మాసనం ఆలకించే వీలుంది. మైనర్కాని భార్యతో బలవంతంగా శృంగారం చేసిన భర్తకు భారతీయ శిక్షా స్మృతి, భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్) చట్టాలు విచారణ నుంచి రక్షణ కల్పిస్తున్న విషయం తెల్సిందే. ఈ కేసుల విచారణ అక్టోబర్ 17న మొదలైంది. ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం 18ఏళ్లు దాటిన భార్యతో బలవంతగా భర్త సంభోగించినా అది రేప్‌గా పరిగణించబోరు. అలాగే బీఎన్ఎస్లోని సెక్షన్ 63(రేప్)(2) ప్రకారం చూసినా ఈ చర్యను అత్యాచారంగా పరిగణించరు. మారుతున్న సామా జిక పోకలు, ఆధునిక సమాజంలో భర్త సాన్నిహిత్య పరిస్థితుల్లో భార్య సమ్మతి ఉంది లేదు అనే అంశాన్ని నిరూపించడం అసంభవమని కేంద్రం గతంలో సుప్రీంకోర్టుకు తెలిపింది. చట్టాలను దుర్విని యోగం చేస్తూ ఈ మినహాయింపు రక్షణ నుంచి భర్తను పక్కకు జరిపితే భారతీయ సామాజిక, కుటుంబ వ్యవస్థలో కొత్త సమస్యలు ఉత్పన్నమ య్యే ప్రమాదముందని కేంద్రం పేర్కొంది. -
Supreme Court: రాజ్యాంగబద్ధతను తేలుస్తాం
న్యూఢిల్లీ: మారిటల్ రేప్ నుంచి భర్తలకు రక్షణ కల్పిస్తున్న ఐపీసీ, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని మినహాయింపు నిబంధనల రాజ్యాంగబద్ధతను తేలుస్తామని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. భార్య సమ్మతి లేకుండా ఆమెతో భర్త బలవంతంగా సంభోగం జరపడాన్ని మారిటల్ రేప్‌గా పరిగణిస్తారు. పాశ్చాత్య దేశాల్లో ఇది క్రిమినల్ నేరం. భారత్‌లో చట్టాలు దీనికి మినయింపునిస్తున్నాయి. మారిటల్ రేప్ నేరం కాదని భర్తలకు రక్షణ కల్పిస్తున్నాయి. భార్య 18 ఏళ్ల లోపు మైనర్ కాకుంటే మారిటల్ రేప్ నేరం కాదని పేర్కొంటున్నాయి. దీన్ని పలువురు సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిపిన సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వ అఫిడవిట్‌పై పిటిషనర్ల ప్రతిస్పందన కోరింది. మారిటల్ రేప్‌ను నేరంగా చేస్తే దాంపత్య బంధంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని, వివాహ వ్యవస్థ ఒడిదుడుకులకు లోనవుతుందని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. ఇదే విషయాన్ని తాజా అఫిడవిట్లో సుప్రీంకోర్టు ముందుంచింది. ‘ఇది రాజ్యాంగబద్ధతకు సంబంధించిన అంశం. ఈ అంశంలో రెండు గత తీర్పులున్నాయి. మినహాయింపును ఇస్తున్న నిబంధనల రాజ్యాంగబద్ధతను తేల్చడమే ముఖ్యం’ అని సీజేఐ చంద్రచూడ్ విచారణ సందర్భంగా అన్నారు. భార్య వయసు 18 ఏళ్ల లోపు కానంతవరకు భర్త ఆమెను బలవంతంగా అనుభవించినా అది నేరం కాదు.. అని బీఎన్ఎస్లో సెక్షన్ 63 (రేప్) మినహాయింపు–2 చెబుతోంది. రాజ్యాంగ విరుద్ధమైన ఈ నిబంధనను కొట్టివేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కరుణా నంది కోరారు. ‘మారిటల్ రేప్‌కు మినయింపు నిబంధన.. ఆర్టికల్ 14 (సమానత్వపు హక్కు), ఆర్టికల్ 19, ఆరి్టకల్ 21 (జీవించే హక్కు, వ్యక్తి స్వేచ్ఛ)కు భంగకరమని మీరు అంటున్నారు. 18 ఏళ్లు పైబడిన భార్యతో భర్త బలవంతంగా లైంగిక చర్యకు పాల్పడ్డా అది రేప్ కాదని మినహాయింపును ఇచి్చనపుడు పార్లమెంటు భావించింది. భర్తలకు రక్షణ కల్పిస్తున్న మినహాయింపును కొట్టివేస్తే అప్పుడా లైంగిక చర్య రేప్ నిర్వచనం కిందకు వస్తుంది. అలాంటపుడు దీన్ని ప్రత్యేక నేరంగా చూడాలా? మినహాయింపు చట్టబద్ధతను తేల్చాలా? అనే సమస్య కోర్టులకు ఉత్పన్నమవుతుంది’అని ధర్మాసనం పేర్కొంది. ‘భర్త డిమాండ్ చేస్తాడు. భార్య నిరాకరిస్తుంది. ఈ సందర్భంలో భర్త ఆమెను నిర్భందిస్తే అది చట్టవిరుద్ధమవుతుంది. ఆమెను గాయపరిస్తే నేరపూరిత బెదిరింపు అవుతుంది. చివరికి భార్య లొంగిపోతే అప్పుడా సంభోగం నేరం కాదు. మిగతావన్నీ నేరాలైనపుడు చివరికి ఎందుకు కాదనేగా మీ ప్రశ్న’ అని జస్టిస్ పారి్థవాలా అన్నారు. ‘కాదంటే కాదనే అర్థం. ఒక మహిళ వద్దు అదంటే వద్దనే అర్థం. వైవాహిక బంధంలో బలవంతంగా సంభోగం జరిపినా అది రేప్ అవుతుంది. కేసు నమోదు చేయాల్సిందే’ అని పిటిషనర్ తరఫున వాదించిన కోలిన్ గొంజాల్వెజ్ అన్నారు. వాదనల తర్వాత కేసు ఈనెల 22వ తేదీకి వాయిదా పడింది. -
‘వైవాహిక అత్యాచారం’ నేరంగా పరిగణించాల్సిన అవసరం లేదు’
న్యూఢిల్లీ: వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాల్సిన అవసరం లేదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించడం సర్వోన్నత న్యాయస్థానం పరిధిలో లేదని కేంద్రం అభిప్రాయం వ్యక్తం చేసింది. వైవాహిక అత్యాచారం అనేది చట్టపరమైనదాని కంటే సమాజానికి సంబంధించిన సమస్య అని, ఇది సమాజంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని కేంద్రం పేర్కొంది. దీనికి చట్టంలో వేరే విధమైన శిక్షలు ఉన్నాయని తెలిపింది.ఈ మేరకు వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో కేంద్రం గురువారం కౌంటర్ దాఖలు చేసింది. ఈ అంశానికి సంబంధించి అన్ని పక్షాలతో సంప్రదింపులు లేకుండా, అన్ని రాష్ట్రాల అభిప్రాయాలనుపరిగణలోకి తీసుకోకుండా సరైన నిర్ణయానికి రాలేమని తెలిపింది. అయితే ప్రతీ వివాహం మహిళ సమ్మతితో జరగడం లేదని విషయాన్ని కేంద్రం అంగీకరించింది. ఒకవేళ ఏదైనా ఉల్లంఘనలకు పాల్పడితే వారు చట్టపరంగా శిక్షలు ఎదుర్కొవాల్సి ఉంటుందని తెలిపింది. కానీ వివాహంలో జరిగే ఇలాంటి ఉల్లంఘన పరిణామాలు, బయట జరిగే ఉల్లంఘనలకు తేడా ఉంటుందని పేర్కొంది.వివాహంలో తమ జీవిత భాగస్వామి నుంచి శారీరక సంబంధాన్ని కోరుకోవడం సహజం కానీ.. తన భార్య ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెను లైంగిక సంబంధానికి ఒత్తిడి చేసే హక్కు భర్తకు లేదు. అలాంటి చర్యకు పాల్పడిన వ్యక్తిపై అత్యాచార నిరోధక చట్టాల కింద శిక్ష విధించడం మితిమీరినది(అవసరమైన దానికంటే ఎక్కువ). వివాహంలో మహిళ సమ్మతిని రక్షించేందుకు పార్లమెంట్ ఇప్పటికే చర్యలు తీసుకుంది. ఇందులో వివాహితలపై క్రూరత్వానికి పాల్పడే వారిని శిక్షించే చట్టాలు ఉన్నాయి’ అని కేంద్రం పేర్కొంది.కాగా భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 375లోని 2వ మినహాయింపున సవాల్ చేస్తూ గతంలో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. సెక్షన్ 375లోని రెండో మినహాయింపు 18 ఏళ్లు లేదా అంతకంటే పైబడిన భార్యతో భర్త శారీరక సంబంధంలో పాల్గొనడాన్ని అనుమతిస్తుంది. దీనికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు విభజన తీర్పు వెల్లడించింది. జస్టిస్ రాజీవ్ శక్ధేర్ ఈ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించగా, జస్టిస్ సి హరిశంకర్ దీనిని సమర్థించారు. అయితే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తాజాగా దీనిపై విచారణ చేపట్టింది. -
భార్యకు 18 ఏళ్లు దాటితే.. భర్తపై వైవాహిక అత్యాచారం కేసుండదు
ప్రయాగ్‌రాజ్: భార్య వయస్సు 18 ఏళ్లు, అంతకు మించి ఉన్న సందర్భాల్లో వైవాహిక అత్యాచారం(మారిటల్ రేప్) అభియోగం నుంచి వ్యక్తికి రక్షణ ఉంటుందని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ఇందుకు సంబంధించి భర్తపై ఐపీసీ సెక్షన్ 377ను వర్తింప జేయడంపై గతంలో మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచి్చన తీర్పును ఈ సందర్భంగా ఉదహరించింది. అయితే, ఇండిపెండెంట్ థాట్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా(2017)కేసులో సుప్రీంకోర్టు తీర్పుననుసరించి వ్యక్తి, 15–18 మధ్య వయస్సున్న అతడి భార్య మధ్య జరిగే ఎలాంటి లైంగిక సంపర్కమైనా అత్యాచారం కిందికే వస్తుందని స్పష్టం చేసింది. ఓ వ్యక్తి వేసిన రివిజన్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ నెల 6న ఈ మేరకు పేర్కొంది. అయితే, పిటిషనర్‌పై కట్నం వేధింపులకు సంబంధించిన ఆరోపణలపై తమ తీర్పు ప్రభావం ఉండబోదని తెలిపింది. ఘజియాబాద్‌కు చెందిన ఓ వ్యక్తిపై 2013లో ఐపీసీ సెక్షన్లు 498ఏ, 323, 377తోపాటు వరకట్న నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఘజియాబాద్‌లోని దిగువ కోర్టుతోపాటు, అప్పిల్లేట్ కోర్టు కూడా అతడిని దోషిగా పేర్కొన్నాయి. వీటిని సవాల్ చేస్తూ అతడు అలహాబాద్ హైకోర్టులో రివిజన్ పిటిషన్ వేశాడు. విచారించిన హైకోర్టు.. పిటిషనర్‌పై ఐపీసీ సెక్షన్లు 498ఏ, 323 కింద నమోదైన కేసుల్లో దిగువ కోర్టులిచి్చన తీర్పులను సమరి్థస్తూ తీర్పు వెలువరించింది. -
Marital Rape: మారిటల్ రేప్‌పై భిన్న తీర్పులిచ్చిన జడ్జిలు
భార్యతో బలవంతంగా శృంగారంలో పాల్గొనడాన్ని (మారిటల్ రేప్).. నేరంగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెలువడింది. ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ వేర్వేరు అభిప్రాయాలను వెలువరించడంతో గందరగోళం నెలకొంది. అంతేకాదు ఈ గందరగోళం నడుమ.. తాము ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకునేందుకు పిటిషర్లకు అనుమతి ఇచ్చింది బెంచ్. న్యూఢిల్లీ: దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న తీర్పు ఇవాళ రానే వచ్చింది. అయితే మారిటల్ రేప్ (వైవాహిక అత్యాచారం)పై ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు ఇవాళ భిన్న తీర్పులు వెలువరించారు. వైవాహిక జీవితంలో భార్యతో బలవంతపు శృంగారం నేరమే అవుతుందని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ రాజీవ్ షక్దేహర్ ఆదేశాలు ఇచ్చారు. అయితే బెంచ్‌లోని మరో న్యాయమూర్తి జస్టిస్ సీ హరిశంకర్ మాత్రం ఆ ఆదేశాలతో విభేధించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 19, 21లను సెక్షన్ 375(మినహాయింపు 2) ధిక్కరిస్తుందనడానికి ఎలాంటి మద్ధతు కనిపించడం లేదని, కాబట్టి, భార్యపై బలవంతపు శృంగారం నేరం కిందకు రాదని అన్నారు. ఈమేరకు జస్టిస్ రాజీవ్ ఇచ్చిన ఆదేశాలను అంగీకరించడం లేదంటూ పేర్కొన్నారు. దీంతో భిన్నాభిప్రాయాల తీర్పు వెలువడినట్లయ్యింది. బుధవారం ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు మారిటల్ రేప్‌పై ఈ తరహా తీర్పు వెలువరించింది. ఐపీసీలోని అత్యాచార సెక్షన్-375(మినహాయింపు 2) నుంచి మారిటల్ రేప్‌నకు మినహాయింపు ఇవ్వడంపై అభ్యంతరాలతో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఏడేళ్ల కిందట(2015లో) ఈ వ్యవహారంపై మొదటి పిటిషన్ దాఖలుకాగా, ఆ తర్వాత మరికొన్ని దాఖలు అయ్యాయి. ఈ పిటిషన్లకు కౌంటర్‌గా.. పురుష హక్కుల సంఘాలు కౌంటర్ పిటిషన్లు దాఖలు చేశాయి. మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించకూడదనే ఆ పిటిషన్లో కోరాయి పురుష హక్కుల సంఘాలు. అయితే ఈ పిటిషన్లపై ఈ ఏడాది జనవరి నుంచి రోజూవారీ వాదనలు జరిగాయి. చివరికి.. తీర్పును ఫిబ్రవరి 21వ తేదీన రిజర్వ్‌లో ఉంచింది కోర్టు. గతంలో మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించలేమంటూ కేంద్రం పేర్కొనగా.. ఢిల్లీ హైకోర్టు నోటీసుల నేపథ్యంలో తమ ప్రకటనను పరిశీలిస్తామంటూ డబుల్ గేమ్ ఆడింది. మరోవైపు మారిటల్ రేప్ నేరం కాదంటూ సుప్రీం కోర్టు సైతం కొన్ని కేసుల్లో తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు తాజా తీర్పుపై.. పిటిషనర్లు సుప్రీంకు వెళ్లేందుకు మార్గం సుగమం కావడం గమనార్హం. చదవండి: సెక్స్ బానిసగా భార్య.. కూతురి ముందే అసహజ శృంగారం! -
భార్య సమ్మతి లేకుంటే.. బలాత్కారమే!
బెంగళూరు: తాళి కట్టినంత మాత్రాన, అర్ధాంగిగా స్వీకరించినంత మాత్రాన అమ్మాయిపై సర్వహక్కులు తమవేననే భావన భారత పితృస్వామ్య వ్యవస్థలో బలంగా వేళ్లూనుకుపోయింది. ఇది సరికాదని, స్త్రీ సమ్మతి లేకుండా భర్త బలవంతంగా కోరిక తీర్చుకుంటే.. దాన్ని మానభంగంగానే పరిగణించాలని కర్ణాటక హైకోర్టు బుధవారం విస్పష్టంగా పేర్కొంది. మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించాల్సిన సమయం వచ్చిందంటూ పరోక్షంగా దేశంలో అత్యంత ముఖ్యమైన, కీలకమైన చర్చకు తెరతీసింది. ఇష్టం లేకున్నా కోరిక తీర్చుకున్నాడని ఓ మహిళ పెట్టిన కేసును కొట్టివేయాలని ఆమె భర్త కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా.. జస్టిస్ ఎం.నాగప్రసన్నతో కూడిన ధర్మాసనం అందుకు తిరస్కరించింది. వైవాహిక బంధం భర్తకు ప్రత్యేక అధికారాలు, పెత్తనం ఏమీ కట్టబెట్టదని.. స్ట్రీకి ఇష్టం లేని సంభోగం కచ్చితంగా రేప్ కిందకే వస్తుందని, భర్త అయినంత మాత్రాన దీనికేమీ మినహాయింపు ఉండదని అభిప్రాయపడింది. చారిత్రక చర్చకు తెరలేపింది. కూతురిని కూడా భర్త లైంగికంగా వేధించాడని సదరు మహిళ ఫిర్యాదు చేయడంతో.. అతనిపై బాలలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం (పోక్సో) కింద కూడా కేసు నమోదు చేసి విచారించాల్సిందిగా అదేశించింది. లైంగిక వాంఛలకు పెళ్లి లైసెన్స్ కాదు! సతీమణి ఇష్టానిష్టాలకు విలువనివ్వకుండా... ఎప్పుడు పడితే అప్పుడు వాంఛలు తీర్చుకోవడానికి పెళ్లి అనేది ఒక లైసెన్స్ కాదని జస్టిస్ నాగప్రసన్న పేర్కొన్నారు. పాశ్చాత్యదేశాల్లో మహిళ సమ్మతి లేకుండా సంభోగానికి పాల్పడితే దాన్ని చట్టపరంగా నేరంగానే పరిగణిస్తున్నారు. అయితే భారత్‌లో నిరక్షరాస్యత ఎక్కువగా ఉండటం, పితృస్వామ్య వ్యవస్థ భావనలు బలంగా వేళ్లూనుకొని ఉండటం, సామాజిక కట్టుబాట్లు, ఆచారవ్యవహారాల పేరిట.. కేంద్ర ప్రభుత్వాలు చాన్నాళ్లుగా ఈ అంశం జోలికి (మారిటల్ రేప్‌ను నేరంగా మార్చే చట్ట సవరణకు) పోవడం లేదు. భార్యాభర్తలు అనే దానితో సంబంధం లేకుండా.. అమ్మాయి సమ్మతి లేకుండా లైంగిక దాడికి పాల్పడితే అది కచ్చితంగా నేరమే అవుతుందని జస్టిస్ నాగప్రసన్న బుధవారం అభిప్రాయపడ్డారు. బలత్కారమనేది స్త్రీల మానసిక స్థితిపైన తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని, వారికి భయకంపితులను చేస్తుందని పేర్కొన్నారు. అమ్మాయిని బలవంతంగా అనుభవించడం నేరమైనపుడు అది జీవిత భాగస్వామి అయినా సరే నేరంగానే చూడాలన్నారు. ‘తరతరాలుగా పురుషుడు భర్త అనే ముసుగులో.. మహిళలను తన సొంత ఆస్తిగా చూస్తున్నాడు. భార్యలు తమ చెప్పుచేతల్లో ఉండాలనుకునే బూజుపట్టిన ఆలోచనలు, సంప్రదాయాలను సమూలంగా తుడిచిపెట్టాల్సిందే. భర్తకు రేప్ నుంచి మినహాయింపునిస్తున్న భారత నేర స్మృతిలోని (ఐపీసీ) 375 సెక్షన్ ఏమాత్రం ప్రగతిశీల ఆలోచన కాదు. నా దృష్టిలో అది తిరోగమన భావన. అర్ధాంగిగా స్వీకరించిన మహిళ శరీరం, ఆలోచనలపై తమకు సంపూర్ణ హక్కులు దఖలు పడ్డాయనే భావన.. కచ్చితంగా తిరోగమన ఆలోచనే. స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానమనే భావనకు ఇది తూట్లు పొడుస్తుంది. అందువల్లే చాలాదేశాలు మారిటల్ రేప్‌ను నేరంగా చేశాయి. యునైటెడ్ కింగ్డమ్, అమెరికాలోని 50 రాష్ట్రాలు, ఆస్ట్రేలియాలోని మూడు ఫ్రావిన్సులు, న్యూజిలాండ్, కెనడా, ఇజ్రాయిల్, ఫ్రాన్స్, స్వీడన్, డెన్మార్క్... తదితర దేశాలు మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణిస్తున్నాయని జస్టిస్ నాగప్రసన్న ఎత్తిచూపారు. భారత్‌లోనూ అసంఖ్యాక స్త్రీల మౌనరోదనను గుర్తించి చట్టసభల సభ్యులు ఈ మేరకు మారిటల్ రేప్ చట్టంలో మార్పులు తేవాలని అభిప్రాయపడ్డారు. -
Marital Rape: కూతురి ముందే అసహజ శృంగారం.. భర్తకు చెంపపెట్టు
బెంగళూరు: వైవాహిక జీవితంలో బలవంతపు శృంగారాన్ని.. నేరంగా పరిగణించాలంటూ తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఓ కేసుకు సంబంధించి కర్ణాటక హైకోర్టు ఇవాళ(బుధవారం) కీలక ఆదేశాలు ఇచ్చింది. వివాహం జరిగినప్పటి నుంచి తనని భర్త ఒక సెక్స్ బానిసగానే చూస్తున్నాడని, మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నాడని, చివరికి కూతురి ముందే అదీ అసహజ శృంగారానికి బలవంతం చేస్తున్నాడంటూ కోర్టుకెక్కింది ఓ బాధితురాలు. ఈ క్రమంలో ఆమె అత్యాచార ఆరోపణల కింద కోర్టును ఆశ్రయించింది. అయితే ఐపీసీ సెక్షన్ 375 కింద నమోదు అయిన కేసును కొట్టేయాలంటూ సదరు భర్త కోర్టులో అభ్యర్థన దాఖలు చేయగా.. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగప్రసన్న కీలక వ్యాఖ్యలు చేస్తూ సదరు భర్త అభ్యర్థనను తోసిపుచ్చారు. భార్యపై భర్త చేసే లైంగిక వేధింపులు ఆమె మానసిక స్థితిపై తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. భర్తల ఇలాంటి చేష్టలు.. భార్యల ఆత్మకు మాయని మచ్చను మిగులుస్తాయి. అనాదిగా.. భర్తలు తమ భార్యలకు తామే పాలకులని భావిస్తున్నారు. భార్యల శరీరం, మనస్సు, ఆత్మను అన్నింటిని అణచివేయాలనే ఆలోచన బలంగా నాటుకుపోయిందని జస్టిస్ నాగప్రసన్న వ్యాఖ్యానించారు. వివాహం అనేది మనిషిలోని మృగాన్ని బయటకు రప్పించి.. భార్యలను శారీరకంగా హింసించేందుకు దొరికిన లైసెన్స్ కాదంటూ వ్యాఖ్యానించారాయన. కాబట్టి, భార్యతో బలవంతపు శృంగారం చేస్తూ.. ఆమెనొక సెక్స్ బానిసగా చూస్తున్న మీకు(భర్తకు) ఈ కేసు నుంచి విముక్తి ఇవ్వడం కుదరదు అంటూ పిటిషన్‌ను ఏకసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది. అత్యాచారమే అవుతుంది భార్యపై భర్త చేసే లైంగిక దాడిని.. అత్యాచారంగా పరిగణించేందుకు నిర్దిష్టమైన చట్టం లేకపోవచ్చు. అయితే మినహాయింపులనేవి కొన్ని ఏళ్ల కిందటివని న్యాయమూర్తి ప్రస్తావించారు. పీనల్ కోడ్ చట్టాలు, అందులో సెక్షన్లు ఎప్పటివో. మధ్యయుగ చట్టంలో.. భర్తలు తమ భార్యలపై తమ అధికారాన్ని ఉపయోగించుకునే ఒప్పందంలో భాగంగా ఆ చట్టాలు పుట్టుకొచ్చాయి. కానీ, స్వాతంత్ర్యం వచ్చాక మనం రాజ్యాంగాన్ని పాటిస్తున్నాం. అందులో సమానత్వం అనేది ఒకటి ఉంది. నా దృష్టిలో.. మనిషంటే మనిషి. చట్టం అంటే చట్టం. అత్యాచారం అంటే అత్యాచారం, అది స్త్రీ అయిన భార్యపై పురుషుడైన భర్త చేసినా సరే అని పేర్కొన్నారు న్యాయమూర్తి. నేరంగా గుర్తించకపోయినా.. వైవాహిక జీవితంలో బలవంతపు శృంగారాన్ని.. అత్యాచారంగా, తీవ్ర నేరంగా పరిగణించడం గురించి మేం చర్చించ దల్చుకోలేదు. ఎందుకంటే అది చట్టసభలకు సంబంధించిన అంశం. కేవలం భార్యపై అఘాయిత్యానికి పాల్పడుతున్న భర్త విషయంలో మాత్రమే మేం ఈ ఆదేశాలు ఇస్తున్నాం అని ప్రత్యేకంగా ప్రస్తావించారు హైకోర్టు న్యాయమూర్తి. ఈ సమాజంలో భర్త అయినా ఇంకెవరైనా అత్యాచార ఆరోపణలకు అతీతులేం కారని, అలా చేస్తే.. చట్టం ముందు అసమానత్వం ప్రదర్శించడమే కాకుండా.. రాజ్యాంగాన్ని అవమానించినట్లు అవుతుందని బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘రాజ్యాంగానికి అంతా సమానమే. నేరం ఎవరు చేసినా నేరమే!. అత్యాచార సెక్షన్‌కూ మినహాయింపు ఉండద’ని అన్నారు. చాలా దేశాలు మారిటల్ రేప్‌ను గుర్తిస్తున్నాయని ఈ సందర్భంగా జస్టిస్ నాగప్రసన్న ప్రత్యేకంగా ప్రస్తావించారు. -
‘వైవాహిక అత్యాచార’ పిటిషన్ల విచారణ.. కీలక పరిణామం
సాక్షి, ఢిల్లీ: వైవాహిక జీవితంలో బలవంతపు శృంగారాన్ని.. నేరంగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్లపై తీర్పును రిజర్వ్‌లో ఉంచింది ఢిల్లీ హైకోర్టు. ఈ క్రమంలో మరింత గడువు కోరుతూ.. పిటిషన్ విచారణ వాయిదా వేయాలన్న కేంద్రం విజ్ఞప్తిని సోమవారం సున్నితంగా తిరస్కరించింది ఢిల్లీ హైకోర్టు. పిటిషన్లపై స్పందించేందుకు మరింత సమయం కావాలని కోరిన సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల సీఎస్‌లకు ఫిబ్రవరి 10వ తేదీనే అభిప్రాయసేకరణకు సమాచారం అందించామని, అయితే ఇంకా స్పందన రాలేదని తెలిపారు. అయితే కోర్టు మాత్రం కేంద్రం విజ్ఞప్తిని తోసిపుచ్చింది. జస్టిస్ రాజీవ్ శక్ధేర్, జస్టిస్ సి హరిశంకర్‌లతో కూడిన ధర్మాసనం కేంద్రం వైఖరిని ‘‘త్రిశంకు’’ లాంటిదంటూ పేర్కొంది. గడువు కోరే అంశం ఎప్పుడో దాటిపోయిందని గుర్తు చేసింది. Marital Rapeను నేరంగా పరిగణించాలంటూ పలు పిటిషన్లు ఢిల్లీ హైకోర్టులో దాఖలు అయ్యాయి. ఇదిలా ఉండగా.. భారతదేశం పరిస్థితుల నేపథ్యంలో మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించేందుకు సిద్ధంగా లేమని గతంలో కేంద్ర ప్రభుత్వం ఓసారి పేర్కొంది. ఇష్టం లేకున్నా, ఆమె సమ్మతి లేకుండా బలవంతపెట్టి భార్యను శారీరకంగా అనుభవించడాన్ని నేరంగా పరిగణిస్తూ సంబంధిత చట్టాన్ని సవరించేందుకు సిద్ధంగా లేమని పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసింది. ‘‘అంతర్జాతీయ నిర్వచనం వేరు, భారత సమాజ స్థితిగతులు వేరు. లా కమిషన్ కూడా నివేదికలు సమర్పించే సమయంలో ఈ అంశాన్ని సిఫారసు చేయలేదు. ’’ అని కేంద్రం తరపున ఆ సందర్భంలో ప్రకటన వెలువడింది. సంబంధిత వార్త: మారిటల్ రేప్.. డబుల్ గేమ్ ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి కోర్టుల్లో ఈ అంశంపై పిటిషన్లు దాఖలు అవుతున్నాయి. 2017లో కేంద్రం స్టాండ్‌ను పరిగణనలోకి తీసుకున్న ఢిల్లీ హైకోర్టు.. ఆ తర్వాత కొత్తగా కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటనను తీసుకోలేదు. మరోవైపు.. ఈ వ్యవహారంపై కేంద్రం ఈ ఏడాదిలో వాదనలు వినిపించకపోవడం గమనార్హం. సెక్షన్ 375 భారతీయ శిక్షాస్మృతి (IPC) మినహాయింపు 2 ప్రకారం.. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించకూడదు. అలాగే 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు లేని తన భార్యతో.. భర్త లైంగిక సంబంధం కలిగి ఉన్నా కూడా అది అత్యాచారం కాదని నిర్దేశిస్తుంది. భారతదేశంలో వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలని చాలా మంది న్యాయవాదులు, రాజకీయ నాయకులు, పౌరుల నుండి భారీ డిమాండ్ ఉంది. ఏది ఏమైనప్పటికీ, నేరీకరణ అనేది సామాజిక-చట్టపరమైన ప్రభావాన్ని కలిగి ఉంటుందని కేంద్రం వాదిస్తోంది. -
అత్యాచారం కేసులో హార్దిక్ పాండ్యా.. ? గ్యాంగ్‌స్టర్ భార్య సంచలన ఆరోపణలు..!
Dawood Ibrahim Wife Aide Accuses Hardik Pandya and Rajiv Shukla: టీ20 ప్రపంచకప్-2021లో ఆశించిన మేర రాణించకపోవడంతో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చోటు కోల్పోయిన టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాకు మరో షాక్ తగిలింది. అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సహాయకుడు రియాజ్ భాటి భార్య రెహ్నుమా భాటి.. హార్ధిక్ పాండ్యాతో పాటు మునాఫ్ పటేల్, పృథ్వీరాజ్ కొఠారీ, మాజీ బీసీసీఐ చైర్మన్ రాజీవ్ శుక్లాలపై సంచలన ఆరోపణలు చేసింది. సదరు వ్యక్తులంతా తనను లైంగిక వేధింపులకు గురి చేసి, అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ముంబైలోని సాంతా క్రూజ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. COMPLAINT COPY EXCLUSIVE‼️ https://t.co/Nj2U9UoA8P pic.twitter.com/o5uWCoDfLx — Sameet Thakkar (@thakkar_sameet) November 10, 2021 తన భర్త రియాజ్ భాటి స్వప్రయోజనాల కోసం అతని వ్యాపార భాగస్వామ్యులతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేసేవాడని, అలా కొందరు హై ప్రొఫైల్ సెలబ్రిటీల వద్దకు తనను పంపాడని రెహ్నుమా ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే, రెహ్నుమా ఇచ్చిన ఫిర్యాదులో సరైన అడ్రస్ లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదిలా ఉంటే, హార్ధిక్.. గతంలో ‘కాఫీ విత్ కరణ్ షో’లో వివాదాస్పద కామెంట్లు చేసి ఓ మ్యాచ్ నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హార్ధిక్.. భార్య నటాశాతో కలిసి మాల్దీవుల్లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నట్లు సమాచారం. చదవండి: "గంగూలీతో విభేదాలు నిజమే.." రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు -
భార్యతో అలా చేయడం తప్పుకాదు: ఛత్తీస్‌గఢ్ హైకోర్టు
రాయపూర్: భార్య ఇష్టాయిష్టాలకు వ్యతిరేకంగా భర్త బలవంతంగా భార్యతో సెక్స్‌లో పాల్గొంటే అది అత్యాచారం కిందకి రాదని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తీర్పు చెప్పింది. భార్యతో శృంగారపరమైన చేష్టలు కూడా రేప్‌గా భావించలేమని స్పష్టం చేసింది. మారిటల్ రేప్ కింద అభియోగాలు ఎదుర్కొంటున్న సదరు భర్తని కేసు నుంచి విముక్తుడిని చేసింది. ఆ అభియోగాలను కొట్టేసిన కోర్టు అతను అసహజమైన పద్ధతుల్లో సెక్స్ చేస్తున్నాడంటూ ఐపీసీ సెక్షన్ 377 కింద నమోదైన అభియోగాలను సమరి్థంచింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన ఒక మహిళ తన భర్త , అత్తమామలు తనని కట్నం కోసం వేధిస్తున్నారంటూ కేసు వేసింది. చదవండి: భార్యాభర్తల మధ్య బలవంతపు శృంగారం.. కోర్టు సంచలన తీర్పు గృహహింస కేసుతో పాటు తాను ఎంత వ్యతిరేకిస్తున్నా వినిపించుకోకుండా అసహజ పద్ధతుల్లో శృంగారం చేస్తూ తనను హింసిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. కింద కోర్టులో అమెకి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆ భర్తపై అత్యాచారం కింద కేసు నమోదైంది. ఆ తీర్పుని సవాల్ చేస్తూ భర్త, అత్తమామలు హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో ఈ కేసుని విచారించిన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.కె. చంద్రవంశీ ‘‘భార్య వయసు 18 ఏళ్ల కంటే ఎక్కువ ఉంటే ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా శృంగారం చేసినా, లైంగిక చేష్టలు చేసినా అది అత్యాచారం కాదు’’ అని తీర్పు చెప్పారు. చదవండి: ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తీర్పుపై తాప్సీ అసహనం వివాహబంధంతో ఒక్కటైన జంటలో భార్య గట్టిగా వ్యతిరేకించినా భర్త శృంగారం చేస్తే దానిని అత్యాచారంగా పరిగణించలేమని స్పష్టం చేస్తూ ఆ భర్తపై మారిటల్ రేప్ అభియోగాలను కొట్టేశారు. అసహజ పద్ధతుల్లో శృంగారం చేస్తూ హింసిస్తున్నాడని సెక్షన్ 377 కింద నమోదైన అభియోగాలపై న్యాయమూర్తి విచారణ చేస్తూ.. వికృతమైన ఆనందం కోసం భార్యతో అసహజంగా శృంగారం చేస్తే అది నేరపూరిత చర్యేనని అన్నారు. భారతదేశంలో ఉన్న చట్టాల ప్రకారం మారిటల్ రేప్ నేరం కాదు. కానీ ఇటీవల కొన్ని కోర్టులు ఈ అంశంలో భార్యలకు అనుకూలంగా తీర్పులివ్వడం మహిళాలోకానికి ఎంతో ఊరటనిచ్చింది. -
వాళ్లిద్దరి మధ్య శృంగారాన్ని రేప్ అంటారా: సుప్రీం
న్యూఢిల్లీ: వైవాహిక అత్యాచారం గురించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక పురుషుడు ఎంత క్రూరుడైనా, ఎన్ని తప్పులు చేసినా దానిని లైంగిక దాడికి అన్వయిస్తారా అని ప్రశ్నించింది. పురుషులు లేదా మహిళలు ఎవరైనా సరే పెళ్లి పేరిట తప్పుడు వాగ్దానాలు చేయడం సరికాదని స్పష్టం చేసింది. రెండేళ్ల క్రితం నాటి కేసు విచారణ సందర్భంగా సోమవారం ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. వివరాలు.. వినయ్ ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి గతంలో ఓ మహిళతో సహజీవనం చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లొంగదీసుకున్నాడు. రెండేళ్ల అనంతరం వేరే మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పెళ్లి పేరిట తనను మోసగించి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేసింది. దీంతో అతడిపై కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి దిగువ కోర్టులో తనకు న్యాయం జరగడం లేదని భావించిన వినయ్ ప్రతాప్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. పరస్పర అంగీకారంతోనే తాము ఒక్కటయ్యామని, ఇందులో తన తప్పేమీ లేదని, కాబట్టి బెయిలు ఇప్పించాల్సిందిగా కోరాడు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేయగా, సోమవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘పెళ్లి చేసుకుంటానని అసత్యపు ప్రమాణాలు చేయడం తప్పు. పురుషులైనా, మహిళలు అయినా ఎవరూ ఇలాంటి పనిచేయకూడదు. ఒకవేళ ఓ స్త్రీ, పురుషుడు భార్యాభర్తల్లాగా కలిసి జీవిస్తున్నారంటే(నిబద్ధత లేకపోయినా).. ఆ పురుషుడు ఎంత క్రూరుడైనా సరే, ఎన్ని పొరపాట్లు చేసినా సరే వారి మధ్య శృంగారాన్ని అత్యాచారం అంటారా’’ అని ప్రశ్నించారు. ఈ క్రమంలో పిటిషనర్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ‘‘వాళ్లిద్దరూ కలిసి ఉన్న సమయంలో ఇష్టప్రకారమే శృంగారంలో పాల్గొన్నారు. నిజానికి పెళ్లి కూడా చేసుకోలేదు. అది కేవలం ఓ బంధం మాత్రమే’’ అని వాదించారు. ఇందుకు బాధితురాలి తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ‘‘పెళ్లి పేరుతోనే బాధితురాలిపై అత్యాచారం చేశాడు. మనాలిలోని ఓ ఆలయంలో పెళ్లి కూడా చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెపై అత్యంత పాశవికంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించి మెడికల్ రిపోర్టులు కూడా ఉన్నాయి’’ అని న్యాయస్థానానికి తెలిపారు. ఇందుకు బదులుగా వినయ్ న్యాయవాది.. బాధితురాలికి మరో ఇద్దరు వ్యక్తులతో సంబంధం ఉందంటూ ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన కోర్టు.. ‘‘మీరు ఇలా మాట్లాడకూడదు. ఆమె బాధితురాలు’’ అని స్పష్టం చేసింది. అనేక వాదోపవాదాల అనంతరం ఎట్టకేలకు నిందితుడికి అరెస్టు నుంచి ఎనిమిది వారాల పాటు రక్షణ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్ బెయిలుకు అప్లై చేసుకోవాల్సిందిగా ఆదేశించింది. చదవండి: ఆ రిటైర్డు జడ్జి విచారణ ఎదుర్కోవాల్సిందే: సుప్రీంకోర్టు పెళ్లి చేసుకుంటావా.. జైలుకెళ్తావా?: సుప్రీంకోర్టు -
ఆమె ఇష్టప్రకారమే.. అందుకే అతడు నిర్దోషి!
న్యూఢిల్లీ: ‘‘బాధితురాలు చెప్పిన ప్రకారం ఆమెకు నవంబరు 2, 2015లో అతడితో వివాహం జరిగింది. అయితే జూలై 5, 2016 తర్వాత అతడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పింది. అయితే ఆనాటికి వాళ్లిద్దరి మధ్య భార్యాభర్తల సంబంధం ఉంది కాబట్టి... దీనిని అత్యాచారంగా పరిగణించలేం. అందుకే అతడు నిర్దోషి’’ అని ఢిల్లీ అదనపు సెషన్స్ కోర్టు అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తిని విడుదల చేసింది. అత్యాచారం జరిగే నాటికి బాధితురాలు నిందితుడి భార్యగా ఉన్నందున దానిని నేరంగా పరిగణించలేమని పేర్కొంది. వివరాలు... పంజాబ్‌కు చెందిన ఓ మహిళకు 2015లో పెళ్లి జరిగింది. అయితే తనను పెళ్లి చేసుకున్న వ్యక్తి గతంలో దొంగతనం కేసులో దోషిగా తేలి.. జైలు శిక్ష అనుభవించాడని ఆమెకు ఆలస్యంగా తెలిసింది. దీంతో మనోవేదనకు గురైన సదరు మహిళ.. భర్తకు చెప్పకుండా ఢిల్లీకి వెళ్లి.. అక్కడే జీవించడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో కొన్నిరోజులకు ఆమె జాడను కనుక్కున్న భర్త.. తనతో కలిసి జీవించాలంటూ ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చాడు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు వారి కాపురం సజావుగానే సాగింది. అయితే కొన్నాళ్ల తర్వాత.. తాను కష్టపడి సంపాదించుకున్న రూ. 2 లక్షలను అతడు దొంగతనం చేశాడంటూ సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. గతంలో కూడా ఇలాంటి పనులు చేశాడని.. ఎప్పటికైనా మారతాడని ఎదురుచూశానని.. కానీ అతడిలో ఎలాంటి మార్పు రాలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అయితే జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత మళ్లీ అతడు భార్య దగ్గరికి తరచుగా వెళ్లేవాడు. ఈ క్రమంలో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా.. ఈ కేసును విచారించిన న్యాయస్థానం... వాళ్లిద్దరూ చాలారోజుల పాటు కలిసే ఉన్నారని.. కేవలం డబ్బు విషయంలో భేదాభిప్రాయాలు తలెత్తడంతోనే ఇప్పుడు బాధితురాలు కేసు నమోదు చేసిందని పేర్కొంది. ఆమె ఇష్టప్రకారమే అతడితో శారీరక సంబంధానికి సమ్మతించిందని తన మాటల ద్వారా అర్థమైందని.. కాబట్టి అతడిని నిర్దోషిగా ప్రకటిస్తున్నట్లు తెలిపింది. అప్పుడు అంగీకరించినా.. కేసు పెట్టవచ్చు కదా! కాగా ఈ కేసు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో.. ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం గతంలో పేర్కొన్న అంశాలను విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. దీనిని వైవాహిక అత్యాచారంగా పరిగణించవచ్చు కదా అని అభిప్రాయపడుతున్నారు. ‘‘వివాహం అనగానే భార్య ఎల్లవేళలా సిద్ధంగా ఉండి.. భర్తతో శారీరక సంబంధాలకు సమ్మతి తెలుపుతుందని అర్థం కాదు. భార్య సమ్మతితోనే భర్త ఈ సంబంధాన్ని కొనసాగించాల్సి ఉంటుంది’ అని ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్, సీ హరిశంకర్‌తో కూడిన ధర్మాసనం గతంలో పేర్కొంది. ఈ అంశంపై విచారణ సందర్భంగా... లైంగిక హింస విషయంలో భాగస్వామిని బలవంతపెట్టడం, భయపెట్టడం వంటి చర్యలను మాత్రమే నేరంగా పరిగణించాలని, అలాంటివి లేనప్పుడు దీనిని నేరంగా పరిగణించలేమని మారిటల్ రేప్ అంశాన్ని వ్యతిరేకిస్తున్న పురుషుల సంక్షేమ ట్రస్ట్ అనే ఎన్జీవో సంస్థ వాదించగా.. ఈ వాదనతో న్యాయస్థానం ఏకీభవించలేదు. లైంగిక దాడి కోసం బలవంతపెట్టారా? గాయాలయ్యాయా అని చూడాల్సి అవసరం ఇప్పుడు లేదని, రేప్ నిర్వచనం ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని ధర్మాసనం పేర్కొంది. ‘శారీరంగా బలవంతపెట్టడమనేది కచ్చితమైన షరతు ఏమీ కాదు. భార్యను ఆర్థిక ఇబ్బందులకు గురిచేసి.. శృంగారంలో పాల్గొంటేనే గృహావసరాలు, పిల్లల ఖర్చుల కోసం డబ్బులు ఇస్తానని భర్త ఒత్తిడి చేయవచ్చు. తప్పనిసరి పరిస్థితుల్లో భార్య అందుకు ఒప్పుకున్నా.. ఆ తర్వాత ఆమె భర్తకు వ్యతిరేకంగా రేప్ కేసు పెట్టవచ్చు. అది జరిగే అవకాశముంది’ అని ధర్మాసనం పేర్కొంది. గృహహింస నిరోధక చట్టం, వివాహిత మహిళల వేధింపుల నిరోధక చట్టం, వేరుగా ఉంటున్న భార్యతో బలవంతపు శృంగారం నిరోధించే చట్టాలు ఇప్పటికే అమలులో ఉన్నాయని, ఈ నేపథ్యంలో భార్యతో శృంగారం నేరం కాబోదని పేర్కొంటున్న సెక్షన్ 375ను మార్చాల్సిన అవసరం ఏముందని మారిటల్ రేప్‌ను వ్యతిరేకిస్తున్న ఓ పిటిషనర్ వాదించగా.. ఇన్ని చట్టాల పరిధిలో ఉన్నప్పుడు సెక్షన్ 375లో మాత్రం ఎందుకు మినహాయింపు ఇవ్వాలని ధర్మాసనం పిటిషనర్‌ను ప్రశ్నించిన తీరును ఈ సందర్భంగా పలువురు ప్రస్తావిస్తున్నారు. -
సారీ..!
అంటోంది భూమి ఫెడ్నేకర్. ఎందుకు? మ్యారిటల్ రేప్ మీద వ్యంగ్యంగా కామెంట్ చేసినందుకు. అఫ్కోర్స్ స్క్రీన్ మీదే అనుకోండి.. అయినా స్త్రీవాదుల మనోభావాలు దెబ్బతిన్నాయి. భూమి ఫెడ్నేకర్, కార్తీక్ ఆర్యన్ నటించిన ‘పతీ పత్నీ ఔర్ వోహ్’ సినిమా ట్రైలర్‌కు సంబంధించిన విషయం ఇది. ఈ ట్రైలర్లో హీరో ఆర్యన్ కార్తీక్ పాత్ర ‘‘భర్త నానా తంటాలు పడి.. కిటుకులు, గిమ్మిక్కులతో కష్టపడి భార్యను ‘ఒప్పిస్తే’ ఆ భర్తను రేపిస్ట్‌గా ముద్రేస్తారు’’ అని అంటాడు. ఈ డైలాగ్ వివాదమైంది. దాంతో భూమి ఫెడ్నేకర్ ‘‘మ్యారిటల్ రేప్ అనే సీరియస్ అంశాన్ని అపహాస్యం చేయాలని, వాళ్లను బాధపెట్టాలనే ఉద్దేశం మాకెంతమాత్రం లేదు. అయినా ఈ డైలాగ్ వల్ల కొంతమంది బాధపడ్డారు. క్షమించండి’’ అంటూ సారీ చెప్పింది. సమాజంలో మ్యారిటల్ రేప్ మీద చాలా సీరియస్‌గా చర్చ జరుగుతున్న నేపథ్యంలో పతీ పత్నీ ఔర్ వోహ్ లోని హీరో పాత్ర చెప్పే డైలాగ్ నిజంగానే.. ఈ అంశం సీరియస్‌నెస్‌ను తగ్గించేదిగానే ఉంది. భార్య మనసు గెలుచుకోవాల్సింది కిటుకులు, పొగడ్తలతో కాదు.. ఇంటి బాధ్యతల్లో, సహజీవన ప్రయాణంలో సమభాగస్వామిగా గౌరవం ఇచ్చి. ఇలా అర్థం వచ్చేలా సీన్స్ ఉంటే సారీ చెప్పాల్సిన అవసరమే ఉండదు కదా! అడుసు తొక్కనేలా? కాలు కడగనేలా? విషయాన్ని అపహాస్యం చేయనేలా? సారీ చెప్పనేల? -
‘క్రూరంగా పశువులా ప్రవర్తించాడు.. అందుకే’
హ్యూమన్స్ ఆఫ్ బాంబే ఫేస్బుక్ పేజీలో ఓ యువతి రాసుకొచ్చిన పోస్టును ఎంతోమంది ప్రశంసిస్తూ ఉంటే..మరికొంత మంది మాత్రం ఎప్పటిలాగానే ఇప్పుడెందుకు.. అప్పుడేం చేశావు... నీకు నచ్చలేదు.. బాధ కలిగింది కాబట్టే ఇప్పుడు అతడి గురించి బయటపెట్టావా అంటూ ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఈ నెగటివ్ కామెంట్స్ చదువుతుంటే విషయమేంటో మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది. అవును మీరు ఊహించింది కరెక్టే. గతంలో తాను ఎదుర్కొన్న లైంగిక హింస, వేధింపుల గురించి శ్రుతీ చౌదరి అనే అమ్మాయి నిర్భయంగా అందరితో పంచుకుంది. అంతేకాదు తన #మీటూస్టోరీ ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తుందని ధైర్యంగా ‘అతడి’ ముసుగును తొలగించింది. తనలా ఎవరూ మోసపోకూడదని.. అతడి బారి నుంచి కనీసం ఒక్కరిని కాపాడినా సరే తను విజయం సాధించినట్లేనని పేర్కొంది. ఆ పోస్టు సారాంశం ఇలా.. ‘అందరిలాగానే కలలు సాకారం చేసుకునేందుకు... చిన్న పట్టణం నుంచి ముంబై మహానగరానికి వచ్చాను. కానీ ఇక్కడికొచ్చాకే ఎన్నెన్నో సత్యాలు నాకు బోధపడ్డాయి. ఓరోజు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌కు ఓ వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చింది. సోషల్ మీడియాలో నా రాతలు చూసి తన దగ్గర రైటర్‌గా పనిచేయాలంటూ కోరాడు. సరే అన్నాను. కలిసి పనిచేస్తున్న క్రమంలో మా మధ్య స్నేహం చాలా బలపడింది. ఆత్మీయుడిగా భావించి నాకున్న అభద్రతా భావం గురించి, ఇతర సమస్యల గురించి అతడితో పంచుకోవడం ప్రారంభించాను. తరుచుగా కలుసుకునేవాళ్లం(అన్ని విధాలుగా). అయితే మా స్కాట్లాంట్ ట్రిప్ వరకు అంతా బాగానే జరిగింది. ఆరోజు రాత్రి మేము ఔటింగ్‌కు వెళ్లాల్సింది. కానీ అకస్మాత్తుగా వద్దన్నాడు. అయితే నేను అందుకు సిద్ధంగా లేనని చెప్పాను. కాసేపటి తర్వాత తన ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. నాతో కఠినంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. మాట్లాడటం మానేశాడు. దాంతో గిల్టీగా ఫీలయ్యాను. తన కోరిక కాదన్నందుకు బాధపడతాడేమోనని సరేనన్నాను. కానీ తను మాత్రం అలా అనుకోలేదు. చాలా కఠినంగా, పశువులా ప్రవర్తించాడు. ఆరోగ్యం గురించి శ్రద్ధ ఉండాలి కదా అన్నా వినలేదు. శారీరక హింసకు గురిచేశాడు. అలా చాలాసార్లు ఎంతగానో హింసించాడు. కొన్ని రోజుల తర్వాత తనతో ‘బంధం’ తెంచుకోవాలని అనుకున్నాను. తను కూడా సరేనన్నాడు. సహచర ఉద్యోగుల్లా మాత్రమే ఉన్నాము. కానీ ఓ రోజు నాకు వచ్చిన మెసేజ్ చూసి షాకయ్యాను. అతడు కేవలం నాతోనే కాదు చాలా మంది అమ్మాయిలతో ఇలాగే ప్రవర్తించాడు అని తెలిసి ఎంతో వేదనకు గురయ్యాను. అతడి నిజస్వరూపం గురించి బయటపెట్టాలని భావించాను. నాలా ఎంతమంది అమ్మాయిలు ఈ లైంగిక హింసను ప్రేమలో భాగం అనుకుని పొరబడ్డారో తెలిసి, నా మూర్ఖత్వం గురించి తెలుసుకుని పశ్చాత్తాపపడ్డాను. అందుకే ఇన్‌స్టాగ్రామ్‌లో నా మీటూస్టోరీని బహిర్గతం చేశాను. ఆ తర్వాత కొన్ని గంటల పాటు ఫోన్ స్విచ్చాఫ్ చేసి.. మళ్లీ ఆన్ చేయగానే నా పోస్టు వైరల్‌గా మారడం చూసి ఆశ్చర్యపోయాను. పదుల కొద్ది సంఖ్యలో అమ్మాయిలు అతడిని నమ్మిన తీరు, ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి తెలుసుకుని షాకయ్యాను. నేను అనుకున్న దానికన్నా కూడా అతడెంతో క్రూరుడు. మూర్ఖుడు. నేను ధైర్యంగా అతడి గురించి బయటపెట్టడం చూసి చాలా మంది కూడా పోరాడటానికి సిద్ధమయ్యారు. అందుకు ఫలితంగా అతడికి శిక్ష వేయించడంలో సఫలీకృతులమయ్యాం. ఈ రోజు నేను షేర్ చేసిన నా స్టోరీ ఎంతోమంది యువతులకు ఆదర్శంగా నిలుస్తుందనుకుంటున్నాను. నాలా ఎంతో మంది భ్రమలో ఉండి మోసపోయి ఉంటారు. మీరెవ్వరూ ఒంటరివారు కాదు. ధైర్యంగా ముందుకురావాలి. ఇప్పుడెందుకంటే... హ్యూమన్స్ ఆఫ్ బాంబే పేజీలో ‘ట్రిగ్గర్ వార్నింగ్’ పేరిట రాసుకొచ్చిన శ్రుతి చౌదరి మీటూస్టోరీ 24 గంటల్లోపే వేల కొద్దీ లైకులు, షేర్లతో దూసుకుపోయింది. ‘ హ్యాట్సాఫ్!!! మీలా ధైర్యంగా ముందుకు రాకపోవడం వల్ల ఎంతో మంది మహిళలకు అన్యాయం జరుగుతోంది. ఇలా చెప్పడం ద్వారా మీరు కనీసం ఒక్కరినైనా అతడి నుంచి రక్షించిన వారవుతారు. అలాకాకుండా నాకెందుకులే అనుకుని ఉంటే మరెంతో మంది అతడి బారిన పడేవారు. మీరు చాలా ధైర్యవంతురాలు’ అంటూ వందల సంఖ్యలో పురుషులు, మహిళలు శ్రుతికి మద్దుతగా నిలుస్తూ, ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓ వివాహిత మాత్రం.. ‘ఎంతోమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న నా భర్త నిజస్వరూపం గురించి బయటపెట్టాలని అనుకున్నాను. కానీ ధైర్యం చేయలేకపోయా. అది నిజంగా ఎంతపెద్ద తప్పో ఇప్పుడే అర్థమైంది. ఏం చేయాలో, ఎలా చేయాలో నాకు ఇప్పుడు అర్థమైంది. ధన్యవాదాలు’ అని తన బాధను వ్యక్తపరిచారు. ‘ జెంటిల్‌మేన్ ఎప్పుడూ సమ్మతం లేకుండా ఏ మహిళను కనీసం తాకరు. నిజంగా జెంటిల్‌మేన్ అయితే భార్య అయినా గర్ల్‌ఫ్రెండ్ అయినా సరే వారి నిర్ణయాన్ని తప్పక గౌరవిస్తాడు’ అంటూ దేవ్ పత్ అనే ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు హ్యూమన్స్ బాంబేతో పాటు నెటిజన్లు కూడా పాజిటివ్‌గా రియాక్టవ్వడం విశేషం. ఇది నాణేనికి ఒకవైపు. ఇప్పుడెందుకో.. మీ తప్పేం లేదా? ఎవరైనా ఒక అమ్మాయి తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి చెప్పగానే ఎదురయ్యే మొదటి, అతి సాధారణ ప్రశ్న. ఇప్పుడెందుకు ? అప్పుడేం చేశావు? అవును శ్రుతి చౌదరి చెప్పినట్టుగా ఎంతోమంది భ్రమలో పడి మోసానికి గురవుతున్నారు. తీరా ఆ విషయం గుర్తించే సరికి సమయం మించిపోవడంతో.. ఇలాంటి నెగటివిటీకి, సోకాల్డ్ పరువుకు భయపడి నోరు విప్పి నిజాలు చెప్పడం లేదు. చెబితే అప్పుడు అనుభవించిన శారీరక హింసకంటే కూడా... తనకు ఎదురవ్వబోయే మానసిక హింసను భరించడమెలాగో తెలియని భయం. ఎందుకంటే లైంగిక హింసకు గురైంది ఒక మహిళ అయితే, అత్యాచారానికి గురైంది ఓ ఆడపిల్ల అయితే సమాజం ఎప్పుడూ ఆమెను బాధితురాలిగా గుర్తించే కంటే.. ఏదో తప్పు చేసిన వ్యక్తులుగా చిత్రీకరించి ఆమెను మరింతగా కుంగదీసేందుకే ప్రయత్నిస్తోందనే భయం. కానీ శ్రుతి ఇలాంటివి చిన్న చిన్న విషయాలంటూ తేలికగా తీసుకుంది. అందరూ ఆమెలాగే ముందుకు వస్తే.. పశ్చాత్తాపం కంటే కూడా భయంతోనైనా అతడి లాంటి మేకతోలు వన్నె పులులు కాస్తైనా మారతాయనేది ఆమె ఉద్దేశం. ఒక్క శ్రుతిదే కాదు... భారత్‌లో మీటూ ఉద్యమాన్ని మొదలు పెట్టిన బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా, దక్షిణాదిన ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న చిన్మయి శ్రీపాద వంటి వారి ఉద్దేశం కూడా ఇదేననేది మెజారిటీ వర్గాల అభిప్రాయం. వాళ్లే కదా జెంటిల్మెన్.. శ్రుతి పోస్టు ద్వారా చర్చనీయాంశంగా మారిన మరో అంశం వైవాహిక అత్యాచారం(మ్యారిటల్ రేప్). వివాహం అనగానే భార్య ఎల్లవేళలా సిద్ధంగా ఉండి.. భర్తతో శారీరక సంబంధాలకు సమ్మతి తెలుపుతుందని అర్థం కాదు. భార్య సమ్మతితోనే భర్త ఈ సంబంధాన్ని కొనసాగించాల్సి ఉంటుంది’ అని ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్, సీ హరిశంకర్‌తో కూడిన ధర్మాసనం గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. భాగస్వామి లైంగిక హింస విషయంలో బలవంతపెట్టడం, భయపెట్టడం వంటి చర్యలను మాత్రమే నేరంగా పరిగణించాలని, అలాంటివి లేనప్పుడు దీనిని నేరంగా పరిగణించలేమని మారిటల్ రేప్ అంశాన్ని వ్యతిరేకిస్తున్న పురుషుల సంక్షేమ ట్రస్ట్ అనే ఎన్జీవో సంస్థ వాదించగా.. ఈ వాదనతో న్యాయస్థానం ఏకీభవించలేదు. లైంగిక దాడి కోసం బలవంతపెట్టారా? గాయాలయ్యాయా అని చూడాల్సి అవసరం ఇప్పుడు లేదని, రేప్ నిర్వచనం ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని ధర్మాసనం పేర్కొంది. ‘రేప్ కోసం బలవంతపెట్టడమనేది కచ్చితమైన షరతు ఏమీ కాదు. భార్యను ఆర్థిక ఇబ్బందులకు గురిచేసి.. శృంగారంలో పాల్గొంటేనే గృహావసరాలు, పిల్లల ఖర్చుల కోసం డబ్బులు ఇస్తానని భర్త ఒత్తిడి చేయవచ్చు. తప్పనిసరి పరిస్థితుల్లో భార్య అందుకు ఒప్పుకున్నా.. ఆ తర్వాత ఆమె భర్తకు వ్యతిరేకంగా రేప్ కేసు పెట్టవచ్చు. అది జరిగే అవకాశముంది’ అని ధర్మాసనం పేర్కొంది. గృహహింస నిరోధక చట్టం, వివాహిత మహిళల వేధింపుల నిరోధక చట్టం, వేరుగా ఉంటున్న భార్యతో బలవంతపు శృంగారం నిరోధించే చట్టాలు ఇప్పటికే అమలులో ఉన్నాయని, ఈ నేపథ్యంలో భార్యతో శృంగారం నేరం కాబోదని పేర్కొంటున్న సెక్షన్ 375ను మార్చాల్సిన అవసరం ఏముందని మారిటల్ రేప్‌ను వ్యతిరేకిస్తున్న ఓ పిటిషనర్ వాదించగా.. ఇన్ని చట్టాల్లో పరిధిలో ఉన్నప్పుడు సెక్షన్ 375లో మాత్రం ఎందుకు మినహాయింపు ఇవ్వాలని ధర్మాసనం పిటిషనర్‌ను ప్రశ్నించిన తీరును పలువురు ప్రస్తావిస్తున్నారు. అంతేకాదు.. . మహిళల సమ్మతి లేకుండా వారి భర్తలు శృంగారం జరిపే క్రమంలో భౌతిక దాడులు, బెదిరింపులు ఉన్నపుడు మాత్రమే అత్యాచారంగా పరిగణిస్తే సరిపోదని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అభిప్రాయాన్ని.... రేప్ నిర్వచనం పూర్తిగా మారిపోయిందన్న విషయాన్ని గౌరవించాలంటున్నారు. మహిళల అంగీకారం లేకుండా వారి శరీరంపై జరిగే ప్రతీ చర్యను అత్యాచారంగానే పరిగణించాల్సిన ఆవశ్యతను ప్రతీ ఒక్కరు గుర్తించాలంటున్నారు. న్యాయం జరుగుతుంది కదా!! ‘మీటూ లాంటి ఉద్యమాల వల్ల చాలా మంది బాధితులు తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి బయటపెడుతున్నారు. అయితే ఆ సమయంలో వారు అనుభవించిన బాధ కంటే కూడా... అప్పుడు ఏం జరిగిందో ఎలా జరిగిందో చెప్పు.. అసలు ఇదంతా నిజమేనా... ఒకవేళ నిజమే అయితే సాక్ష్యాలు చూపించు అనే ఈ మాటల వల్లే ఎక్కువ బాధను అనుభవిస్తున్నారు. ఇక్కడ విచారించదగ్గ మరో విషయం ఏంటంటే చాలా మంది యూరోప్ మహిళలు తమపై జరిగిన అత్యాచారాల గురించి నోరు మెదిపే ధైర్యం చేయలేకపోవడం. బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చినపుడే న్యాయం జరుగుతుంది కదా’ - గతంలో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, యూరోప్ మహిళా హక్కుల నేత అన్నా బ్లస్ చేసిన వ్యాఖ్యలు -
‘కాలం చెల్లిన చట్టాలను ఇకనైనా సవరించండి’
లండన్ : కాలం చెల్లిన చట్టాలను సవరించి ఇకనైనా లింగ వివక్షకు చరమగీతం పాడాలని మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ యూరోపియన్ దేశాలకు విఙ్ఞప్తి చేసింది. మహిళల సమ్మతి లేకుండా వారి భర్తలు శృంగారం జరిపే క్రమంలో భౌతిక దాడులు, బెదిరింపులు ఉన్నపుడు మాత్రమే అత్యాచారంగా పరిగణిస్తే సరిపోదని అభిప్రాయపడింది. మహిళల అంగీకారం లేకుండా వారి శరీరంపై జరిగే ప్రతీ చర్యను అత్యాచారంగానే పరిగణించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొంది. ఐర్లాండ్, యూకే, బెల్జియం, సైప్రస్, జర్మనీ, ఐస్లాండ్, లక్సెంబర్గ్, స్వీడన్ మొదలగు ఎనిమిది దేశాలు మాత్రమే సమ్మతిలేని శృంగారాన్ని అత్యాచారంగా పరిగణిస్తున్నాయని తెలిపింది. మరో 31 యూరోపియన్ దేశాలు మాత్రం ఈ విధానాల్ని పాటించడం లేదని వెల్లడించింది. అత్యాచారం అనే పదానికి నిర్వచనం మార్చినపుడు మాత్రమే బాధితులకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడింది. కాగా ‘ఎలిమినేషన్ ఆఫ్ వయొలెన్స్ అగెనెస్ట్ వుమన్’ దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ యూరోపియన్ దేశాలకు ఈ విఙ్ఞప్తి చేసింది మీటూ లాంటి ఉద్యమాలు వచ్చిప్పటికీ... ‘మీటూ లాంటి ఉద్యమాల వల్ల చాలా మంది బాధితులు తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి బయటపెడుతున్నారు. అయితే ఆ సమయంలో వారు అనుభవించిన బాధ కంటే కూడా... అప్పుడు ఏం జరిగిందో ఎలా జరిగిందో చెప్పు.. అసలు ఇదంతా నిజమేనా... ఒకవేళ నిజమే అయితే సాక్ష్యాలు చూపించు అనే ఈ మాటల వల్లే ఎక్కువ బాధను అనుభవిస్తున్నారు. ఇక్కడ విచారించదగ్గ మరో విషయం ఏంటంటే చాలా మంది యూరోప్ మహిళలు తమపై జరిగిన అత్యాచారాల గురించి నోరు మెదిపే ధైర్యం చేయలేకపోవడం’ అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, యూరోప్ మహిళా హక్కుల నేత అన్నా బ్లస్ ఆవేదన వ్యక్తం చేశారు. -
భార్యకు ఇష్టం లేకపోతే నేరమే!
సాక్షి, న్యూఢిల్లీ : భార్యకు ఇష్టం లేకుండా బలవంతపు శృంగారానికి పాల్పడితే.. దానిని అత్యాచారంగా భావించవచ్చా? దేశవ్యాప్తంగా గత కొంత కాలం నుంచి విభిన్న వర్గాల మధ్య జరుగుతున్న చర్చ ఇది. ఈ నేపథ్యంలో మారిటల్ రేప్ (వైవాహిక అత్యాచారం)ను సమర్థిస్తూ..వ్యతిరేకిస్తూ దాఖలైన అభ్యర్థనల విచారిస్తున్న ఢిల్లీ హైకోర్టు.. ఈ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెళ్లి అనగానే భార్య ఎల్లవేళల భర్తతో శారీరక సంబంధానికి సిద్ధంగా ఉంటుందని అర్థం కాదని, వివాహం వంటి సంబంధాల్లో భార్యాభర్తలిద్దరికీ తమకు నచ్చనప్పుడు శారీకర సంబంధాలను నిరాకరించే హక్కు ఉంటుందని న్యాయస్థానం పేర్కొంది. ‘వివాహం అనగానే భార్య ఎల్లవేళలా సిద్ధంగా ఉండి.. భర్తతో సంబంధాలకు సమ్మతి తెలుపుతుందని అర్థం కాదు. భార్య సమ్మతితోనే భర్త ఈ సంబంధాన్ని కొనసాగించాల్సి ఉంటుంది’ అని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్, సీ హరిశంకర్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. భాగస్వామి లైంగిక హింస విషయంలో బలవంతపెట్టడం, భయపెట్టడం వంటి చర్యలను మాత్రమే నేరంగా పరిగణించాలని, అలాంటివి లేనప్పుడు దీనిని నేరంగా పరిగణించలేమని మారిటల్ రేప్ అంశాన్ని వ్యతిరేకిస్తున్న పురుషుల సంక్షేమ ట్రస్ట్ అనే ఎన్జీవో సంస్థ వాదించగా.. ఈ వాదనతో న్యాయస్థానం ఏకీభవించలేదు. లైంగిక దాడి కోసం బలవంతపెట్టారా? గాయాలయ్యాయా అని చూడాల్సి అవసరం ఇప్పుడు లేదని, రేప్ నిర్వచనం ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని ధర్మాసనం పేర్కొంది. ‘రేప్ కోసం బలవంతపెట్టడమనేది కచ్చితమైన షరతు ఏమీ కాదు. భార్యను ఆర్థిక ఇబ్బందులకు గురిచేసి.. శృంగారంలో పాల్గొంటేనే గృహావసరాలు, పిల్లల ఖర్చుల కోసం డబ్బులు ఇస్తానని భర్త ఒత్తిడి చేయవచ్చు. తప్పనిసరి పరిస్థితుల్లో భార్య అందుకు ఒప్పుకున్నా.. ఆ తర్వాత ఆమె భర్తకు వ్యతిరేకంగా రేప్ కేసు పెట్టవచ్చు. అది జరిగే అవకాశముంది’ అని ధర్మాసనం పేర్కొంది. గృహహింస నిరోధక చట్టం, వివాహిత మహిళల వేధింపుల నిరోధక చట్టం, వేరుగా ఉంటున్న భార్యతో బలవంతపు శృంగారం నిరోధించే చట్టాలు ఇప్పటికే అమలులో ఉన్నాయని, ఈ నేపథ్యంలో భార్యతో శృంగారం నేరం కాబోదని పేర్కొంటున్న సెక్షన్ 375ను మార్చాల్సిన అవసరం ఏముందని మారిటల్ రేప్‌ను వ్యతిరేకిస్తున్న పిటిషనర్ వాదించగా.. ఇన్ని చట్టాల్లో పరిధిలో ఉన్నప్పుడు సెక్షన్ 375లో మాత్రం ఎందుకు మినహాయింపు ఇవ్వాలని ధర్మాసనం పిటిషనర్‌ను ప్రశ్నించింది. -
‘సుప్రీం’ తీర్పు అభినందనీయం
ప్రభుత్వాలుండేది కేవలం ప్రజాకర్షక పథకాలతో అందరినీ రంజింపజేయడానికి మాత్రమే కాదు... సమాజం ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలపైనా శ్రద్ధ పెట్టి వాటి పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేయడానికి కూడా. కొత్త సమస్యలైనా, అప్పటికే ఉనికిలో ఉండి కొత్తగా పరిష్కారం కోరుతున్న సమస్యలైనా–పాలకులు వాటిని పట్టించుకోవడం అవసరం. కానీ జటిలమని భావించిన సమస్యల జోలికి పోయేందుకు మన పాలకులు జంకుతున్నారు. పర్యవసానంగా అలాంటివి ఏళ్ల తరబడి అపరిష్కృతంగా మిగిలిపోతున్నాయి. చివరకు న్యాయస్థానాలే జోక్యం చేసుకుని సరిదిద్దవలసి వస్తున్నది. అత్యాచార నేరాన్ని నిర్వచించే భారత శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 375పై సుప్రీంకోర్టు బుధవారం వెలువరించిన తీర్పు ఈ కోవలోనిదే. ఆ సెక్షన్ ఎలాంటి చర్యలు అత్యాచారం కిందికొస్తాయో చెప్పడంతో పాటు అందుకు కొన్ని మినహాయింపుల్ని కూడా పేర్కొంది. భార్య వయస్సు 15 ఏళ్లలోపు కాని పక్షంలో ఆమె అంగీకారం లేకుండా భర్త సంభోగంలో పాల్గొనడం అత్యాచారంగా పరిగణించరాదన్నది అందులో ఉన్న 6వ మినహాయింపు సారాంశం. మైనర్ భార్యతో సంసారం చేయడం అత్యాచారంగానే పరిగణించాలని సుప్రీంకోర్టు చెప్పడంతోపాటు ఐపీసీలోని మినహాయింపు హక్కుల ఉల్లంఘన కిందికొస్తుందని స్పష్టం చేసింది. మన ఐపీసీ అమల్లోకొచ్చింది 155 ఏళ్లక్రితం...అంటే 1862లో. అప్పటి బ్రిటిష్ వలస పాలకులు తీసుకొచ్చిన ఆ శిక్షాస్మృతిలోనూ, ఇతర చట్టాల్లోనూ ఎన్నో అప సవ్యతలున్నాయి. అసమానతలున్నాయి. కానీ విషాదమేమంటే... స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు కావస్తున్నా వాటిల్లో చాలా భాగం ఈనాటికీ కొనసాగుతున్నాయి. అసలు ‘మైనర్’ అనే పదానికే వేర్వేరు చట్టాలు వేర్వేరు నిర్వచనాలిస్తున్నాయి. బాల్య వివాహాల నిషేధ చట్టం, హిందూ వివాహ చట్టం, షరియత్, విడాకుల చట్టం, బాల కార్మిక చట్టం, బాల నేరస్తుల చట్టం, అత్యాచారాన్ని నిర్వచించే ఐపీసీ సెక్షన్ 375 తదితరాలు మైనర్‌ను వేర్వేరుగా నిర్వచిస్తున్నాయి. దీన్ని ఆరేళ్లక్రితం జాతీయ మహిళా కమిషన్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చి అన్ని చట్టాల్లోనూ మైనర్ అన్న పదానికి ఒకే రకమైన నిర్వచనం ఉండేలా చూడాలని కోరినప్పుడు ఆనాటి అడిషనల్ సొలిసిటర్ జనరల్ అది అసాధ్యమని వాదించారు. వేర్వేరు చట్టాలకు వేర్వేరు సామాజిక లక్ష్యాలుంటాయని, అన్నిటిలోనూ ఒకే నిర్వచనం ఉండటం కుదరదని చెప్పారు. ఒక చట్టం ఆడపిల్లలకు వివాహం చేయదగ్గ వయసును 18 ఏళ్లుగా నిర్ణయిస్తుంటే... మరో చట్టం భార్య వయసు 15 ఏళ్లలోపు కాని పక్షంలో ఆమె అంగీకారం లేకుండా సంభోగంలో పాల్గొనడం అత్యాచారం కాదని ఎలా చెబు తుంది? సంభోగానికి అంగీకారం తెల్పడానికి అర్హమైన వయసు మన దేశంలో ఎప్పుడూ ఒకేలా లేదు. 1892లో అందుకు కనీస వయసు పదేళ్లనుంచి 12 ఏళ్లకు పెంచితే, ఆ తర్వాత 1949లో దాన్ని 15 ఏళ్లకు పెంచారు. 1982లో అది పదహా రేళ్లయింది. 2013లో దాన్ని 18 ఏళ్లకు పెంచారు. ఇలా ఎప్పటికప్పుడు మార్పులు చేయడానికి కారణం మహిళా సంఘాలు, ప్రజాస్వామికవాదుల ఒత్తిళ్లే. ఒకపక్క తామే ఇన్ని మార్పులు చేస్తూ సెక్షన్ 375లోని మినహాయింపు జోలికెళ్లకపోవడం మన పాలకుల నిర్లక్ష్య ధోరణికి ఆనవాలు. లైంగిక నేరాల నుంచి పిల్లల్ని రక్షించ డానికుద్దేశించిన 2012నాటి పోస్కో చట్టం 18 ఏళ్లలోపు ఆడపిల్లను బాలికగా భావి స్తుంటే సెక్షన్ 375 మాత్రం పెళ్లయినట్టయితే ఆమె బాలిక కాదంటున్నది. నాలు గేళ్లక్రితం నిర్భయ చట్టానికి సంబంధించిన బిల్లును రూపొందించిన జస్టిస్ జేఎస్ వర్మ కమిషన్ దీన్ని గమనించింది. సవరించాలని సూచించింది. అయినా ఆనాటి యూపీఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ సెక్షన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగినప్పుడు కేంద్రం తీసుకున్న వైఖరి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా బాల్యవివాహాలు మన దేశంలో వాస్తవమని... ఆ వివాహ వ్యవస్థను పరిరక్షించాల్సిన అవసరం ఉన్నదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. లేనట్టయితే వివాహమైన పిల్లల భవిష్యత్తు నాశన మవుతుందని చెప్పింది. దేశంలో 2 కోట్ల 30 లక్షలమంది బాలికా వధువులున్నా రని, సెక్షన్ 375కున్న మినహాయింపును సవరిస్తే ఆ వధువుల భర్తలంతా వేధిం పులకు గురికావలసి వస్తుందని వాదించింది. మన దేశంలో చట్టాల అమలు తీరు ఎంత పేలవంగా ఉంటున్నదో ఈ వాదనే చెబుతుంది. ప్రతి ఏటా అక్షయ తృతీయ రోజు దేశవ్యాప్తంగా వేలాది బాల్యవివాహాలు జరుగుతున్నాయి. వీటిని ఆపడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చురుగ్గా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కోరు తున్నది. జనాభాలో సగంగా ఉన్న ఆడవాళ్లపై వివిధ రూపాల్లో అమలవుతున్న వివక్షను అంతమొందించడంపై దృష్టి పెట్టాల్సిన తరుణంలో చట్టపరంగా ఉన్న వివక్షను తొలగించడానికే ప్రభుత్వాలు సిద్ధం కాకపోవడం విచారకరం. నిజానికి సుప్రీం కోర్టు ఇప్పుడు తీర్పు వెలువరించిన అంశంపై రెండేళ్లక్రితమే డీఎంకే సభ్యురాలు కనిమొళి ప్రశ్నించారు. దీన్ని సవరించే ఆలోచన చేస్తున్నారా అని ఆమె అడిగి నప్పుడు అప్పటి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అది సాధ్యంకాదని జవాబి చ్చారు. సెక్షన్ 375 మొత్తంగా వైవాహిక జీవితంలో మహిళలపై జరిగే అత్యాచారాల (మారిటల్ రేప్)కు అనుమతిస్తున్నది. అందుకు సంబంధించి దాఖలైన పిటిషన్ వేరే ధర్మాసనం ముందు విచారణలో ఉంది. మైనర్ బాలిక శారీరక నిర్మాణం గర్భధారణకు అనువుగా లేకపోయినా కేవలం భర్త అన్న ఒకే ఒక అధి కారంతో ఆమెతో సంసారానికి సిద్ధపడటం ఎంత రాక్షసమో, అందుకు అనుమతిస్తున్న చట్టం ఎంత అనాగరికమో ప్రభుత్వాలకు ఇన్ని దశాబ్దాలుగా తెలియకపోవడం, పైగా దాన్ని సమర్ధించుకోవడం ఎంత దారుణం! ఇలాంటి నిర్లిప్త ధోరణులే బాల్య వివాహాలకు లైసెన్స్నిస్తున్నాయి. పర్యవసానంగా చిన్న వయసులోనే అమ్మలై ఎందరో బాలికలు జీవితాంతం అనారోగ్యం పాలవుతున్నారు. మానవ హక్కులను కాలరాసే ఇలాంటి పరిస్థితులను అంతం చేయకుండా నాగరికుల మని చెప్పుకునే హక్కు మనకుంటుందా? -
అంతా ‘ఆయన’ ఇష్టమేనా... ఇంకెన్నాళ్లు?
పద్దెనిమిదేళ్లు నిండితేనే... ‘సమ్మతి’ చెప్పే మానసిక పరిపక్వత వస్తుంది. దాని పర్యవసానాలేమిటో అర్థం చేసుకోగలరు. ఇతర చట్టాలు కూడా (జువైనల్ జస్టిస్ చట్టం–2000, బాల్యవివాహ నిషేధ చట్టం –2006, పోస్కో చట్టం–2012) 18 ఏళ్లు నిండని అమ్మాయిలను బాలికలుగానే పరిగణిస్తున్నాయి. కాబట్టి 15–18 ఏళ్ల వయసులో ఉన్న భార్యతో సంభోగం కూడా నేరంగానే పరిగణించాలి. వీరితో శారీరకంగా కలవడం నేరం కాదని భారత శిక్ష్మాస్మృతిలోని 375 ఆర్టికల్ 2 కింద ఇస్తున్న మినహాయింపును రద్దు చేస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం బుధవారం కీలకతీర్పు వెలువరించింది. దీంతో ‘మారిటల్ రేప్’ను కూడా నేరంగా పరిగణించాలనే దీర్ఘకాలిక డిమాండ్ మళ్లీ చర్చనీయాంశం కానుంది. ఈ నేపథ్యంలో మారిటల్ రేప్‌పై భారత్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయి. అంతర్జాతీయం పరిస్థితి(సాక్షి) ఏమిటనేది చూద్దాం... మారిటల్ రేప్ స్త్రీ సమ్మతి లేకుండా ఎవరు బలప్రయోగం ద్వారా ఆమెను లొంగదీసుకున్నా, బలాత్కారం చేసినా అది రేప్ కిందకే వస్తుంది. నేరం చేసినట్లే. భార్యాభర్తలు అయినప్పటికి అర్ధాంగికి ఇష్టం లేకుండా ఆమెతో బలవంతంగా సంభోగం జరిపితే దాన్ని ‘మారిటల్ రేప్’గా పేర్కొంటారు. చాలా పాశ్చాత్యదేశాల్లో దీన్ని రేప్‌గానే పరిగణిస్తారు. శిక్షార్హమైన నేరం. భారత్‌లో మినహాయింపు పదిహేనేళ్ల వయసు పైబడిన సొంత భార్యతో ఆమె సమ్మతి లేకుండా సంభోగంలో పాల్గొన్నా అది నేరం కాదు... భారత శిక్ష్మాస్మృతిలోని ఆర్టికల్ 375లో మినహాయింపునిచ్చారు. సుప్రీంకోర్టు బుధవారం దీన్ని సవరించి... 18 లోపు భార్యతో లైంగిక సంబంధం పెట్టుకుంటే అది నేరమని తేల్చింది. ‘చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్యను బలవంతంగా అనుభవిస్తే భర్తను దోషి అనడానికి లేదు. ఎందుకంటే పెళ్లికి అంగీకరించడం ద్వారా ఆమె తనకు తాను భర్తకు సమర్పించుకుంది. దీని నుంచి ఆమె వెనక్కి మళ్లడానికి వీల్లేదు’ అని చీఫ్ జస్టిస్ సర్ మాథ్యూ హేల్ 1736లో ప్రచురితమైన తన పుస్తకంలో రాశారు. ఆయన అభిప్రాయం బ్రిటన్‌లో చట్టమైంది. ఆంగ్లేయుల పాలనలో ఉన్న చాలాదేశాల్లానే(సాక్షి) మనం కూడా బ్రిటిష్ వారి ‘కామన్ లా’ నుంచి దీన్ని స్వీకరించాం. మహిళల వాదన భార్య వద్దంటున్నా, ఆమె శారీరక, మానసిక పరిస్థితి బాగాలేకున్నా భర్త బలవంతంగా కోరిక తీర్చుకోవడాన్ని ‘రేప్’గానే చూడాలి. ఎందుకంటే ఇక్కడ ఆమె సమ్మతి లేదు. భార్యపై భర్తకు సర్వహక్కులుంటాయనేది పితృస్వామ్య ఆధిపత్య ధోరణి భావజాలం. ఆడది వస్తువు కాదు. ఆమెకూ మనోభావాలుంటాయి. భర్త పిలవగానే పక్క మీదకు రావాల్సిందేనా? ఆమె ఇష్టానిష్టాలతో, ఆసక్తితో సంబంధం లేదా? దాంపత్య బంధంలో అంతా భర్త ఇష్టమేనా? స్త్రీల పట్ల వివక్ష చూపుతోంది చట్టం. ఏ శారీరక సంబంధానికైనా పరస్పర సమ్మతి అనేది మాతృక. పెళ్లయిన జంటలకూ ఇదే వర్తిస్తుంది. వివాహిత అయినంత మాత్రాన స్త్రీకి తన శరీరంపై హక్కు ఉండదా? అవివాహిత స్త్రీని ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా అనుభవిస్తే(సాక్షి) అది నేరం అవుతుంది. రేప్ కిందకు వస్తుంది. వివాహిత స్త్రీ విషయంలో మాత్రం ఆమె భర్తకు మినహాయింపు ఉంటుందా? ఆమె సమ్మతితో పనిలేదా? అంటే వివాహిత, అవివాహిత స్త్రీల మధ్య వివక్ష చూపుతున్నట్లేగా? అందరికీ సమాన రక్షణ కల్పించే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్–14కు మారిటల్ రేప్ మినహాయింపు విరుద్ధం. అలాగే లింగపరంగా ఎలాంటి బేధం చూపకూడదనే ఆర్టికల్–15ను, గౌరవంగా బతికే హక్కును కల్పిస్తున్న ఆర్టికల్–21ను కూడా ఈ మినహాయింపు ఉల్లంఘిస్తోంది. పైగా వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని ఇటీవలే సుప్రీంకోర్టు చారిత్రక తీర్పును ఇచ్చింది. ఏకాంతాన్ని కోరుకోవడం కూడా వ్యక్తిగత స్వేచ్ఛను కోరుకోవడం (ఆర్టికల్–21) కిందకు వస్తుంది. కాబట్టి భర్త బలవంతంగా సంభోగం చేస్తే... బాధిత మహిళకు ఆర్టికల్– 21 కల్పించిన హక్కులను కూడా ఉల్లఘించినట్లే. భారతీయ మహిళల్లో మారిటల్ రేప్ బాధితులు చాలా ఎక్కువ. సాంఘిక కట్టుబాట్ల మూలంగా వీరు మౌనంగా దీన్ని భరిస్తున్నారు. వీరికి రక్షణ కల్పించాలంటే మినహాయింపును ఎత్తివేయాల్సిందే. – మహిళా సంఘాలు, హక్కుల కార్యకర్తల వాదన మినహాయింపు తీసేయండి ‘‘పెళ్లయితే భార్యపై భర్తకు సర్వహక్కులు దఖలు పడతాయనే, ఆమె అతని ఆస్తి అవుతుందనే కాలం చెల్లిన భావజాలం నుంచి పుట్టుకొచ్చిందే ఈ మారిటల్ రేప్ మినహాయింపు. రేప్ లేదా లైంగిక దాడి జరిగినపుడు... వారిద్దరు భార్యాభర్తలని లేదా చాలాకాలంగా ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఉందని చెప్పి నిందితుడు సమర్థించుకోజాలడు. లైంగిక దాడి భావోద్రేక చర్య కాదు... అవతలి వ్యక్తిపై బలప్రదర్శన. లొంగి ఉండాలని చెప్పడం. ఫిర్యాదుదారు, నిందితుడి మధ్య సంబంధం ఏమిటనేది అప్రస్తుతం. సంభోగానికి ఆమె సమ్మతి ఉందా? లేదా? అనేదే ముఖ్యం. కాబట్టి మారిటల్ రేప్‌కు మినహాయింపును ఎత్తివేయాలి’’ – 2012లో నిర్భయ ఉదంతం అనంతరం క్రిమినల్ చట్టాలను సమీక్షించేందుకు నియమించిన జస్టిస్ జే.ఎస్.వర్మ త్రిసభ్య కమిటీ చేసిన సిఫారసు. కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆమోదించలేదు. మన దగ్గర సాధ్యం కాదు... భిన్న సంస్కృతులు, ఆచార వ్యవహారాలు, మతవిశ్వాసాలకు నెలవైన భారత్ లాంటి దేశంలో భర్త జరిపే లైంగిక దాడిని నేరంగా చేయడం సాధ్యం కాదు. మహిళల్లో ఆర్థిక స్వావలంభన తక్కువ. అక్షరాస్యత, పేదరికం తదితర సాంఘిక అసమానతలను కూడా దృష్టిలో పెట్టుకొని చూసినపుడు భారత్‌లో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. పెళ్లిని పవిత్ర బంధంగా చూస్తాం. ఒక వివాహిత మహిళ భర్త తనను బలాత్కారం చేశాడని చెప్పొచ్చు. ఇతరులకు అది బలాత్కారం అనిపించకపోవచ్చు. దీన్ని నేరంగా చేయాలనే అంశాన్ని పరిశీలించే ముందు అసలు ‘మారిటల్ రేప్’ అంటే ఏమిటనేది విస్పష్టంగా నిర్వచించాల్సిన అవసరం ఉంది. మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణిస్తే... భారత్‌లో వివాహ వ్యవస్థ(సాక్షి) విచ్ఛన్నతకు దారి తీస్తుంది. మారిటల్ రేప్‌ను నేరం చేస్తే... 489ఏ (గృహ హింస నిరోధక చట్టం) లాగే ఇది కూడా దుర్వినియోగమయ్యే అవకాశాలు ఉంటాయి. భర్తలను వేధించడానికి భార్యలు దీన్నో సాధనంగా వాడే ఆస్కారం ఉంటుంది. – ఆగష్టులో ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో కేంద్ర ప్రభుత్వం. (యూపీఎ, ఎన్డీయే... ఏ కూటమి అధికారంలో ఉన్నా... మారిటల్ రేప్ విషయంలో కేంద్ర ప్రభుత్వాలు ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నాయి. పార్లమెంటులో కూడా మారిటల్ రేప్‌ను నేరం చేయడం సాధ్యం కాదని తేల్చిచెప్పాయి. అయితే సుప్రీంకోర్టు మాత్రం చట్టాన్ని మార్చే అధికారం పార్లమెంటుదేనని, దీనిపై పాలకుల దృష్టి పెట్టాలని అంటోంది.) చాలా దేశాల్లో నేరం... ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల్లో మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణిస్తున్నారు. యూరోప్‌లో 22 దేశాల్లో, ఉభయ అమెరికా ఖండాల్లో 22 దేశాల్లో, ఆఫ్రికాలో 11 దేశాల్లో, ఆసియా, ఆస్ట్రేలియాల్లో కలిపి... 15 దేశాల్లో మారిటల్ రేప్ శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తున్నారు. భర్త బలాత్కారాన్ని నేరంగా పరిగణించిన తొలిదేశం పోలండ్. 1932లో పోలండ్ ఈమేరకు చట్టం చేసింది అమెరికాలో 1970లో మొదలై 1993 దాకా మొత్తం 50 రాష్ట్రాలూ దీన్ని నేరం చేశాయి. మహిలపై హింసకు వ్యతిరేకంగా యూరోపియన్ యూనియన్ పార్లమెంటు చేసిన తీర్మానం... మారిటల్ రేప్‌ను నేరంగా చేయాలని(సాక్షి) పిలుపునిచ్చింది. దాంతో ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం తదితర దేశాలు మినహాయింపును ఎత్తివేశాయి. 1991లో బ్రిటన్ ఈ పనిచేసింది. మన పొరుగునున్న చిన్నదేశం నేపాల్ 2002లోనే మారిటల్ రేప్‌ను నేరంగా ప్రకటించింది. రాజ్యాంగంలోని సమాన రక్షణ, వ్యక్తిగత గోప్యత హక్కులను ఈ మినహాయింపు ఉల్లంఘిస్తోందని సుప్రీంకోర్టు తేల్చడంలో నేపాల్ ప్రభుత్వం చట్టాలను మార్చింది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
మా శరీరాలపై మీ పెత్తనం ఏమిటీ?
సాక్షి, న్యూఢిల్లీ: మారిటల్ రేప్, అంటే భార్య అనుమతి లేకుండా ఆమెపై భర్త లైంగిక దాడి జరపడం. దీన్ని భారత్‌లో కూడా నేరంగా పరిగణించాలని పలు మహిళా సంఘాలు, జాతీయ, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. అయితే దీన్ని నేరంగా పరిగణించాల్సిన అవసరం లేదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మంగళవారం ఢిల్లీ హైకోర్టుకు తేల్చి చెప్పింది. భారత్‌కున్న విభిన్న సంస్కతి, సంప్రదాయాలను, సామాజిక దక్పథాన్ని, ముఖ్యంగా పెళ్లనే పవిత్ర బంధాన్ని సాకులుగా చూపించింది. అలాగే విద్యాçపరంగా, ఆర్థికంగా మహిళలు వెనకబడి పోవడం వల్ల మారిటల్ రేప్‌ను వారు ఎక్కువగా దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. వరకట్నం కేసులను అరికట్టేందుకు తీసుకొచ్చిన భారతీయ శిక్షాస్మతిలోని 498 ఏ సెక్షన్‌ను మహిళలు దుర్వినియోగం చేయడం లేదా? మరి ఆ సెక్షన్‌ను ఎత్తివేసేందుకు ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించడం లేదు. ‘నా శరీరంపై సర్వహక్కులు నావే’ అనే నారీ నినాదం ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగుతున్న నేటి ఆధునిక యుగంలో మారిటల్ రేప్‌ను శిక్షార్హమైన నేరంగా పరిగణించడం తప్పా? మహిళలపై జరిపే హింసల్లో మారిటల్ రేప్‌ను కూడా చేరుస్తూ 1993లో ఐక్యరాజ్య సమితి ‘ఎలిమినేషన్ ఆఫ్ వాయలెన్స్ అగనెస్ట్ వుమెన్’ డిక్లరేషన్ తీసుకొచ్చింది. ఆ తర్వాత ఐరోపా మానవ హక్కుల సంఘం కూడా మారిటల్ రేప్‌ను హింసగా పరిగణించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. దీంతో పలు పాశ్చాత్య దేశాలు మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణిస్తూ చట్టాలు తీసుకొచ్చాయి. భారత్‌లో కూడా దీన్ని నేరంగా పరిగణించాలంటూ పలు మహిళా సంఘాలు డిమాండ్ చేస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించాలంటూ జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ 2013, జనవరి నెలలో సిఫార్సు చేసింది. దీన్ని అప్పటి యూపీఏ ప్రభుత్వం కూడా అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఆ తర్వాత కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక 2015, ఏప్రిల్ నెలలో ఈ అంశం పార్లమెంట్లో ప్రస్థావనకు వచ్చింది. అప్పుడు పెళ్లి ఒక పవిత్ర బంధంగా గుర్తిస్తున్న భారత్ లాంటి సమాజంలో, బలమైన సామాజిక కట్టుబాట్లు, దారిద్య్రం, నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న మన దేశంలో మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించడం సాధ్యం కాదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హరిభాయ్ చౌధరి స్పష్టం చేశారు. కొన్ని మాటలు అటు, ఇటుగా ఇప్పుడు కేంద్రం ప్రభుత్వం కూడా అదే చెప్పింది. 2015, జూన్ నెలలో ఐఏఎన్ఎస్కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ, చౌధరి అభిప్రాయంతో విభేదించారు. మగవాడి ఆధిపత్యానికి, అహంకారానికి, మహిళల అణచివేతకు మారిటల్ రేప్ ఓ చిహ్నంగా మారిందని, దాన్ని నేరంగా పరిగణించాల్సిందేనని ఆ ఇంటర్వ్యూలో మేనకా గాంధీ మాట్లాడారు. ఇప్పుడు మాటమార్చి ప్రభుత్వ వైఖరికి వంతపాడారు. మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించడం పాశ్చాత్య దేశాల్లో చెల్లుబాటు అవుతుందిగానీ, భారత్ లాంటి దేశాల్లో కాదని అన్నారు. ఎందుకు కాదు? సాధారణ రేప్ కేసుల్లోలాగానే మారిటల్ రేప్‌లను పరిగణించి భర్తలను కఠినంగా శిక్షించాలని ఏ భార్య, ఏ మహిళా సంఘం కోరుకోవడం లేదు. సెక్స్ అనేది పరస్పర అంగీకారంతో కొనసాగాలిగానీ, ఇంటి పనులు, బయటి పనులతో అలసి సొలసి వచ్చే భార్యల శారీరక, మానసిక పరిస్థితులను పట్టించుకోకుండా తప్పతాగో లేదా మగవాడి హక్కనో దౌర్జన్యం చేయడాన్ని అడ్డుకునేందుకే నేరంగా పరిగణించాలని వారు కోరుతున్నారు. ముందుగా చిన్న శిక్షలతో మొదలు పెట్టి, పదే పదే నేరం చేసినట్లయితేనే కఠిన శిక్షలు వేయాలంటున్నారు. ముఖ్యంగా తమ శరీరాలపై మగవాడి పెత్తనం ఏమిటీ? అని ప్రశ్నిస్తున్నారు. -
వైవాహిక అత్యాచారం నేరం కాదు
ఢిల్లీ హైకోర్టులో కేంద్రం అఫిడవిట్ న్యూఢిల్లీ: భార్య అంగీకారం లేకుండా భర్త ఆమెతో శృంగారంలో పాల్గొనడాన్ని నేరంగా పరిగణించలేమని, అలా చేస్తే వివాహ వ్యవస్థ అస్థిరమవుతుందని ఢిల్లీ హైకోర్టుకు కేంద్రం తెలిపింది. భర్తలను వేధింపులకు గురిచేయడానికి భార్యలకు అది ఒక సులభమైన ఆయుధంగా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది. వైవాహిక అత్యాచారాన్ని (మారిటల్ రేప్)ను నేరంగా చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్లకు స్పందనగా కేంద్రం మంగళవారం అఫిడవిట్ సమర్పించింది. ఐపీసీ సెక్షన్ 498 ఏ (గృహ హింస వ్యతిరేక చట్టం) దుర్వినియోగమవుతున్న సంగతి సుప్రీంకోర్టు, పలు హైకోర్టుల దృష్టికి వచ్చిందని గుర్తుచేసింది. ఈ విషయంలో ఎలాంటి సంక్లిష్టతలకు తావివ్వకుండా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ప్రతివాదులుగా చేర్చి వాటి అభిప్రాయాలు తెలుసుకోవాలది. వైవాహిక రేప్‌ను చట్టం లో నిర్వచించలేదని, అందుకోసం సమాజంలో విస్తృత ఏకాభిప్రాయం అవసరమవుతుందని తెలిపింది. నైతిక అవగాహన ముఖ్యం: ‘భార్యకు వైవాహిక అత్యాచారంగా కనిపించినది ఇతరులకు అలా కనిపించకపోవచ్చు. వైవాహిక రేప్, వైవాహికేతర రేప్ మధ్య తేడాను స్పష్టంగా నిర్వచించాలి. రేప్ కేసుల విచారణ నుంచి భర్తలకు ఇస్తున్న మినహాయింపు తొలగించడం ద్వారా వైవాహిక రేప్‌లు సమసిపోవు. నైతిక, సామాజిక అవగాహన ఇక్కడ చాలా ముఖ్యం. భర్త తనపై చేసింది రేపా? కాదా? అని తేల్చే బాధ్యత భార్యపైనే ఉంటుంది. భార్య, భర్తల మధ్య జరిగిన శృంగారానికి సంబంధించి ఎలాం టి సాక్ష్యాలు లేనప్పుడు కోర్టులు ఏ ఆధారాలను నమ్ముతాయి’ అని కేంద్రం ప్రశ్నించింది. అవివాహితురాలి మాదిరిగానే వివా హితురాలికీ తన శరీరంపై హక్కు ఉంటుం దని పిటిషనర్ల న్యాయవాది వాదించారు. -
మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించలేం: కేంద్రం
న్యూఢిల్లీ: మారిటల్ రేప్ (వైవాహిక అత్యాచారం)ను నేరంగా పరిగణించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. 'భారత్‌లో మారిటల్ రేప్ నేరంగా పరిగణించలేం. ఎందుకంటే దేశంలో అక్షరాస్యత, మెజారిటీ మహిళలకు ఆర్థిక స్వావలంబన లేకపోవడం, సమాజ దృష్టికోణం, పేదరికం, విభిన్నత వంటి అనేక సమస్యలు ఉన్నాయి' అని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ విషయంలో పాశ్చాత్య దేశాలను భారత్ గుడ్డిగా అనుసరించబోదని తెలిపింది. కేంద్రం తరఫున అడ్వకేట్ మోనికా అరోరా ఈ అఫిడవిట్‌ను దాఖలు చేశారు. సత్వర ట్రిపుల్ తలాఖ్ విషయంలో మహిళలకు అనుకూల వైఖరిని కేంద్రం తీసుకోవడంతో ఈ విషయంలోనూ అనుకూల వైఖరిని తీసుకుంటుందని భావించారు. మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించడం లింగ సమన్వత్యంలో కీలక ముందడుగుగా భావించారు. కానీ కేంద్రం ఈ విషయంలో భిన్నమైన వైఖరిని తీసుకుంది. మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించే ముందు ఏది మారిటల్ రేప్, ఏది నాన్ మారిటల్ రేప్ అన్నది స్పష్టంగా నిర్వచించాల్సిన అవసరముందని అఫిడవిట్లో కేంద్రం పేర్కొంది. 'ఒక వ్యక్తి తన భార్యతో చేసే శృంగార చర్యలన్నీ మారిటల్ రేప్ కింద పరిగణిస్తే.. ఏకపక్షంగా భార్య చెప్పిన విషయాల ఆధారంగా తీర్పు ఇవ్వాల్సి వస్తుంది' అని పేర్కొంది. సాక్ష్యాల విలువను గుర్తించడం ఈ విషయంలో ప్రధాన సమస్యగా మారుతుందని తెలిపింది. అంతేకాకుండా వివాహ వ్యవస్థను మారిటల్ రేప్ అస్థిరపరిచే అవకాశముందని కేంద్రం అభిప్రాయపడింది. -
మారిటల్ రేప్ నేరం కాదు: సుప్రీం
న్యూఢిల్లీ: భార్యతో బలవంతంగా శృంగారంలో పాల్గొనడాన్ని (మారిటల్ రేప్) నేరంగా పరిగణించలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ విషయమై భారత పార్లమెంటు సైతం గతంలో విస్తృతంగా చర్చించిందని జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం తెలిపింది. మైనర్ భార్యతో శృంగారంలో పాల్గొనడానికి అనుమతిస్తున్న నిబంధనల రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీం ఈ మేరకు స్పందించింది. ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం భార్య వయసు 15 ఏళ్ల లోపుంటే ఆమె ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా శృంగారంలో పాల్గొంటే నేరమవుతుంది. ఒకవేళభార్య వయసు 15 ఏళ్లకు పైబడి 18 ఏళ్ల లోపుంటే అప్పడు ఆమె అంగీకారం లేకుండా శృంగారంలో పాల్గొన్నా నేరం కాద’ని కోర్టు పేర్కొంది. -
భార్యపై రేప్ కేసు పెట్టిన భర్త!
సియోల్: మహిళలపై లైంగిక దాడులు గురించి నిత్యం వింటూనే ఉన్నాం. ఆశ్చర్యకరంగా భార్యపై భర్త రేప్ కేసు పెట్టిన ఘటన దక్షిణ కొరియాలో వెలుగులోకి వచ్చింది. అయితే ఈ కేసులో నిందితురాలిని కోర్టు నిర్దోషిగా తేల్చడం విశేషం. శృంగారం కోసం తన భార్య షిమ్ బలవంతం చేసిందని కిమ్ అనే వ్యక్తి సియోల్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ కోర్టును ఆశ్రయించాడు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం ఆమెను నిర్దోషిగా ప్రకటింది. భాగస్వామితో బలవంతపు శృంగారం సరికాదని షిమ్ కు కోర్టు హితపు పలికింది. భార్యతో సఖ్యతతో మెలగాలని కిమ్ కు సూచించింది. అయితే భర్తను 29 గంటల పాటు ఇంట్లో నిర్బంధించి, అతడిని గాయపరిచినందుకు షిమ్ కు కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. వివాహ అనంతరం భాగస్వామి అంగీకారం లేకుండా బలవంతపు శృంగారానికి పాల్పడటాన్ని(మారిటల్ రేప్) 2013లో సుప్రీంకోర్టు నేరంగా గుర్తించిన తర్వాత ఇలాంటి కేసు నమోదు కావడం ఇదే మొదటిసారి.