మారిటల్‌ రేప్‌ నేరం కాదు: సుప్రీం | Marital rape is not a crime: Supreme court | Sakshi
Sakshi News home page

మారిటల్‌ రేప్‌ నేరం కాదు: సుప్రీం

Published Thu, Aug 10 2017 1:45 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

మారిటల్‌ రేప్‌ నేరం కాదు: సుప్రీం - Sakshi

మారిటల్‌ రేప్‌ నేరం కాదు: సుప్రీం

న్యూఢిల్లీ: భార్యతో బలవంతంగా శృంగారంలో పాల్గొనడాన్ని (మారిటల్‌ రేప్‌) నేరంగా పరిగణించలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ విషయమై భారత పార్లమెంటు సైతం గతంలో విస్తృతంగా చర్చించిందని జస్టిస్‌ ఎంబీ లోకూర్, జస్టిస్‌ దీపక్‌ గుప్తాల ధర్మాసనం తెలిపింది. మైనర్‌ భార్యతో శృంగారంలో పాల్గొనడానికి అనుమతిస్తున్న నిబంధనల రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీం ఈ మేరకు స్పందించింది.

ఐపీసీ సెక్షన్‌ 375 ప్రకారం భార్య వయసు 15 ఏళ్ల లోపుంటే ఆమె ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా శృంగారంలో పాల్గొంటే నేరమవుతుంది. ఒకవేళభార్య వయసు 15 ఏళ్లకు పైబడి 18 ఏళ్ల లోపుంటే అప్పడు ఆమె అంగీకారం లేకుండా శృంగారంలో పాల్గొన్నా నేరం కాద’ని కోర్టు పేర్కొంది.   

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement