న్యూఢిల్లీ: వైవాహిక అత్యాచారం ఘటనల్లో భర్తపై నేరం మోపకుండా చట్టం కల్పిస్తున్న రక్షణలపై నమోదైన కేసుల విచారణను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం నాలుగు వారాలు వాయిదావేసింది. నవంబర్ పదో తేదీన సీజేఐ చంద్రచూడ్ పదవీవిరమణ నేపథ్యంలో ఇక ఈ కేసులను ఆయన విచారించబోరని తెలుస్తోంది.
కోర్టుకు దీపావళి సెలవు దినాలు మొదలుకానున్న నేపథ్యంలో ఈ కేసుల వాదోపవాదనలను ముగించలేకపోతున్నానని ఆయన చెప్పారు. కేసులో తగిన పత్రాల దాఖలుకు సంబంధిత న్యాయవాదులకు తగు గడువు ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సీజేఐ చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం కాకుండా ఈ కేసుల తదుపరి విచారణను మరో ధర్మాసనం ఆలకించే వీలుంది.
మైనర్‌కాని భార్యతో బలవంతంగా శృంగారం చేసిన భర్తకు భారతీయ శిక్షా స్మృతి, భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్) చట్టాలు విచారణ నుంచి రక్షణ కల్పిస్తున్న విషయం తెల్సిందే. ఈ కేసుల విచారణ అక్టోబర్ 17న మొదలైంది. ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం 18ఏళ్లు దాటిన భార్యతో బలవంతగా భర్త సంభోగించినా అది రేప్‌గా పరిగణించబోరు. అలాగే బీఎన్‌ఎస్‌లోని సెక్షన్ 63(రేప్)(2) ప్రకారం చూసినా ఈ చర్యను అత్యాచారంగా పరిగణించరు.
మారుతున్న సామా జిక పోకలు, ఆధునిక సమాజంలో భర్త సాన్నిహిత్య పరిస్థితుల్లో భార్య సమ్మతి ఉంది లేదు అనే అంశాన్ని నిరూపించడం అసంభవమని కేంద్రం గతంలో సుప్రీంకోర్టుకు తెలిపింది. చట్టాలను దుర్విని యోగం చేస్తూ ఈ మినహాయింపు రక్షణ నుంచి భర్తను పక్కకు జరిపితే భారతీయ సామాజిక, కుటుంబ వ్యవస్థలో కొత్త సమస్యలు ఉత్పన్నమ య్యే ప్రమాదముందని కేంద్రం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment