న్యూఢిల్లీ: భార్యతో ఆమె ఇష్టానికి విరుద్ధంగా భర్త సంభోగంలో పాల్గొనడాన్ని(మ్యారిటల్ రేప్) నేరంగా పరిగణించే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. భార్య వయసు 18 ఏళ్లు దాటి ఉంటే ఆమెతో భర్త బలవంతంగా లైంగిక కార్యం జరిపినా నేరం కాదని వెల్లడించింది.
ఒకవేళ ఆమె వయసు 18 ఏళ్లలోపు ఉంటే ఆ లైంగిక కార్యం నేరమేనని ఉద్ఘాటించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ బుధవారం రాజ్యసభలో సమాధానమిచ్చారు. భారతీయ న్యాయ సంహిత–2023లోని సెక్షన్ 74, 75, 76, 85తోపాటు గృహహింస నుంచి మహిళలకు రక్షణ కలి్పంచే చట్టం–2005 వివాహిత మహిళలకు పలు హక్కులు, రక్షణలు, గౌరవం కలి్పస్తున్నాయని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment