► లా కమిషన్‌ను కోరిన కేంద్ర హోంశాఖ
న్యూఢిల్లీ: వివాహ అనంతరం భార్య అంగీకారం లేకుండా భర్త బలవంతపు శృంగారానికి పాల్పడటాన్ని నేరంగా పరిగణించడంపై అభిప్రాయాన్ని తెలపాల్సిందిగా కేంద్ర హోం మంత్రిత్వశాఖ లాకమిషన్‌ను కోరింది. క్రిమినల్ జస్టిస్ సిస్టంను సమీక్షించే సమయంలో దీనిపై సమగ్రంగా చర్చించాల్సిందిగా అభ్యర్థించింది. ఈమేరకు రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి మేనకా గాంధీ గురువారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
మహిళల భద్రతపై నిర్ధిష్ట సిఫారసులు చేసిన పామ్ రాజపుత్ కమిటీ కూడా వివాహ అత్యాచారాన్ని నేరంగా పరిగణించినట్లు మంత్రి పేర్కొన్నారు. తదుపరి చర్యలు తీసుకునే నిమిత్తం కమిటీ సిఫారస్‌లను సంబంధిత మంత్రిత్వ శాఖలకు పంపించినట్లు ఆమె తెలిపారు.
'వివాహ అత్యాచారంపై అభిప్రాయం తెలపండి'
Published Thu, May 5 2016 10:02 PM | Last Updated on Sun, Sep 3 2017 11:28 PM
Advertisement