Central home Department
-
ఎన్నికల వేళ కేంద్ర హెం శాఖ కీలక నిర్ణయం.. ఆయనకు ‘వై’ కేటగిరి భద్రత
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల వేళ నాయకుల మధ్య విమర్శల దాడి కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మాజీ నేత కుమార్ విశ్వాస్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై సంచలన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్.. పంజాబ్ ముఖ్యమంత్రి లేదంటే ఖలిస్తాన్ ప్రధాని కావాలని అనుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. తాను వేర్పాటు వాదినే అయితే అరెస్ట్ చేయలేదన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఇలా నేతల మధ్య మాటల యుద్ధం నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కుమార్ విశ్వాస్‌కు వై కేటగిరీ భద్రత కల్పిస్తున్నట్టు హోం శాఖ శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే కుమార్ విశ్వాస్‌కు ముప్పు పొంచి ఉందనే నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రత కల్పించినట్టు హోం శాఖ తెలిపింది. ‘వై’ కేటగిరీ భద్రత ఇదే.. వై కేటగిరి భద్రతలో మొత్తం 11 మంది భద్రతా సిబ్బంది ఉంటారు. వీరిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ కమాండోలు విధులు నిర్వర్తిస్తారు. అయితే, వీరిలో కొంత మంది కుమార్ విశ్వాస్ నివాసం వద్ద భద్రతలో ఉంటారు. మిగిలిన వారు కుమార్ విశ్వాస్ ఎటు వెళ్లినా ఆయనతో పాటే వెళ్తారు. -
లాక్డౌన్ సడలింపులపై ఢిల్లీ సీరియస్
-
రాష్ట్రాలకు ప్యాకేజీపై చర్చ
-
విజిలెన్స్ డీజీ రాజేంద్రనాథ్‌రెడ్డికి రాష్ట్రపతి పోలీస్ పతకం
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ (డీజీ) కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌రెడ్డి, విజయవాడ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) కొట్ర సుధాకర్లకు రాష్ట్రపతి పతకం (ప్రెసిడెంట్ మెడల్) దక్కింది. విశిష్ట సేవలు అందించినందుకుగాను వీరిద్దరు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్ (పీపీఎం)కు, ప్రతిభావంతమైన సేవలు అందించినందుకు రాష్ట్రానికి చెందిన మరో 15 మంది పోలీస్ మెడల్స్(పీఎం)కు ఎంపికయ్యారు. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పోలీస్ విభాగాల్లో సేవలందించిన వారికి నాలుగు రకాల మెడల్స్‌ను ప్రకటిస్తూ కేంద్ర హోంశాఖ శనివారం జాబితాను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా రాష్ట్రపతి పోలీస్ శౌర్య పతకం (పీపీఎంజీ–ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ)కి నలుగురు, పోలీస్ శౌర్య పతకం (పీఎంజీ)కి 286 మంది, రాష్ట్రపతి పోలీస్ పతకం (పీపీఎం)కి 93, పోలీస్ పతకం (పీఎం)కు 657 మంది పోలీసులు ఎంపికయ్యారు. పోలీసు మెడల్‌కు ఎంపికైన వారు వీరే.. అలాగే, ప్రతిభావంతమైన సేవలు అందించినందుకు రాష్ట్రానికి చెందిన 15 మంది పోలీస్ మెడల్ (పీఎం)కు ఎంపికయ్యారు. వారిలో విజయవాడ అదనపు ఎస్పీ అమలపూడి జోషి, మంగళగిరి ఏపీఎస్పీ అడిషనల్ కమాండెంట్ చింతలపూడి వీఏ రామకృష్ణ, విజయవాడ సీఐడీ డీఎస్పీ ఎం.భాస్కరరావు, విశాఖ గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్ విజయకుమార్, విజయవాడ రిజర్వ్ పోలీస్ ఇన్స్పెక్టర్ జాన్‌మోజెస్ చిరంజీవి, నెల్లూరు ఏఆర్ ఎస్సై నన్న గౌరి శంకరుడు, అనకాపల్లి ఏఎస్సై విక్టోరియా రాణి, చిత్తూరు ఏఎస్సై కేఎన్ కేశవన్, అనంతపురం ఏఆర్ ఎస్సై ఎస్.రామచంద్రయ్య, ఒంగోలు హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్, విజయవాడ ఎస్ఐబీ హెడ్ కానిస్టేబుల్ విజయభాస్కర్, విజయనగరం ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణరాజు, కర్నూలు పోలీస్ కానిస్టేబుల్ రామన్న, విశాఖ రైల్వే పోలీస్ కానిస్టేబుల్ సూర్యనారాయణ, విశాఖపట్నం ఏసీబీ ఏఆర్ పోలీస్ కానిస్టేబుల్ ఎంవీ సత్యనారాయణరాజులు ఉన్నారు. మరోవైపు.. తెలంగాణా అడిషనల్ డీజీపీ (పర్సనల్) బి.శివధర్‌రెడ్డికి కూడా రాష్ట్రపతి పోలీస్ విశిష్ట సేవా పతకం లభించింది. 12 మంది పోలీసు అధికారులకు ప్రతిభావంతమైన సేవా మెడల్స్ లభించాయి. ఏపీకి జీవన్ రక్షా పాదక్ అవార్డులు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ఆమోదం మేరకు ఇచ్చే జీవన్ రక్షా పాదక్ సిరీస్ అవార్డులనూ కేంద్ర హోంశాఖ ప్రకటించింది. సర్వోత్తమ్ జీవన్ రక్షాపాదక్, ఉత్తమ్ జీవన్ రక్షాపాదక్, జీవన్రక్షా పాదక్ విభాగాల్లో అవార్డులు ప్రకటించింది. ఉత్తమ్ జీవన్ రక్షా పాదక్ విభాగంలో ఏపీ నుంచి మీసాల ఆనంద్‌కు, జీవన్ రక్షా పాదక్ విభాగంలోనూ ఏపీ నుంచి రాజేష్, ముఖేష్కుమార్లకు అవార్డు దక్కింది. అలాగే, అగ్నిమాపక విభాగంలో డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ చింతాడ కృపావరం, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ బి.వీరభద్రరావులకు ఫైర్ సర్వీస్ మెడల్స్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ పతకం లభించింది. డీజీపీ అభినందనలు విధి నిర్వహణలో గొప్ప సేవలు అందించి జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన పోలీసులను ఆదర్శంగా తీసుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రానికి చెందిన పలువురు పోలీసులకు కేంద్ర పతకాలు రావడంపట్ల ఆయన వారిని అభినందించారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని పోలీస్ యూనిట్లకు శనివారం ఆయన ఫ్యాక్స్ మెస్సేజ్ ఇచ్చారు. వీరు సాధించిన పతకాలు రాష్ట్రానికి, పోలీసు శాఖకు గర్వకారణమన్నారు. రాజేంద్రనాథ్ విశిష్ట సేవలు జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి తన 25 సంవత్సరాల సర్వీసులో అనేక సంచలనాత్మక కేసులను సమర్ధవంతంగా డీల్ చేశారు. ప్రధానంగా విజయవాడ పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో చిన్నారి వైష్టవి దారుణ హత్యలో నిందితులను మూడ్రోజుల్లోనే పట్టుకున్నారు. అలాగే.. - విజయవాడ వన్‌టౌన్‌లో ఎప్పుడూ లేని విధంగా అప్పట్లో మతకలహాలు చోటు చేసుకోవడంతో అందులోని నిందితులను వెంటనే పట్టుకున్నారు. సంఘ విద్రోహులకు నగర బహిష్కరణ విధించారు. - తూర్పుగోదావరి జిల్లాలో ప్రముఖుల విగ్రహాల ధ్వంసం కేసు.. నెల్లూరు జిల్లాలోని కేథలిక్ సిరియన్ బ్యాంకు దోపిడీ కేసు, డెకాయిట్ల ఆగడాలను నిలువరించడంలో విశేష ప్రతిభ కనబరిచారు. - ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా వ్యవహరిస్తూ కీలకమైన కేసుల విచారణలో ముఖ్య భూమిక వహిస్తున్నారు. రాజధాని నిర్మాణం, ఇతర అక్రమాలకు సంబంధించిన కేసుల విచారణ ఇందులో ముఖ్యమైనవి. -
'వివాహ అత్యాచారంపై అభిప్రాయం తెలపండి'
► లా కమిషన్‌ను కోరిన కేంద్ర హోంశాఖ న్యూఢిల్లీ: వివాహ అనంతరం భార్య అంగీకారం లేకుండా భర్త బలవంతపు శృంగారానికి పాల్పడటాన్ని నేరంగా పరిగణించడంపై అభిప్రాయాన్ని తెలపాల్సిందిగా కేంద్ర హోం మంత్రిత్వశాఖ లాకమిషన్ను కోరింది. క్రిమినల్ జస్టిస్ సిస్టంను సమీక్షించే సమయంలో దీనిపై సమగ్రంగా చర్చించాల్సిందిగా అభ్యర్థించింది. ఈమేరకు రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి మేనకా గాంధీ గురువారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. మహిళల భద్రతపై నిర్ధిష్ట సిఫారసులు చేసిన పామ్ రాజపుత్ కమిటీ కూడా వివాహ అత్యాచారాన్ని నేరంగా పరిగణించినట్లు మంత్రి పేర్కొన్నారు. తదుపరి చర్యలు తీసుకునే నిమిత్తం కమిటీ సిఫారస్‌లను సంబంధిత మంత్రిత్వ శాఖలకు పంపించినట్లు ఆమె తెలిపారు. -
ఏపీ హైకోర్టు ఇప్పట్లో లేనట్లే
ఏర్పాటుకు కొంతసమయం పడుతుంది స్పష్టంచేసిన కేంద్ర హోంశాఖ ఆ హైకోర్టును రాష్ట్రపతి నోటిఫై చేయాలి అప్పటివరకు హైకోర్ట్ ఎట్ హైదరాబాదే ఉమ్మడి హైకోర్టు హైకోర్టు ధర్మాసనానికి కేంద్ర హోంశాఖ నివేదన జస్టిస్ నర్సింహారెడ్డి ధర్మ సందేహంపై వాదనలు పూర్తి తీర్పు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ధర్మాసనం హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఏర్పాటుకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని, ఆ రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటై, దానిని రాష్ట్రపతి నోటిఫై చేసేంతవరకు హైకోర్ట్ అట్ హైదరాబాద్ రెండు రాష్ట్రాలకూ ఉమ్మడి హైకోర్టుగా కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటుకు స్థలం గుర్తించడం, సిబ్బందిని గుర్తించడం, పోస్టులను సృష్టించడం, ఆ తరువాత కిందిస్థాయి న్యాయవ్యవస్థను విభజించడం జరుగుతుందని, ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొంత సమయం పడుతుందని హైకోర్టుకు నివేదించింది. ఇప్పటికే న్యాయశాఖ ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగిందని, సుప్రీంకోర్టును సంప్రదించి ఆంధ్రప్రదేశ్‌కు కొత్త హైకోర్టు ఏర్పాటు చేసేంతవరకు ఉమ్మడి హైకోర్టుకు రెండు రాష్ట్రాలపై న్యాయ పరిధి ఉంటుందని తేల్చి చెప్పింది. ఇది కేంద్ర ప్రభుత్వ వైఖరని తెలిపింది. తెలంగాణలో ఏర్పాటైన హైకోర్ట్ ఎట్ హైదరాబాద్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్టంపై ఎటువంటి న్యాయపరిధి ఉండదంటూ రాష్ట్ర పునర్ విభజన చట్టంలో స్పష్టం చేసిందని, అందువల్ల ఉమ్మడి హైకోర్టుకు ఆంధ్రప్రదేశ్ రాష్టానికి సంబంధించిన కేసులను విచారించే న్యాయ పరిధి ఉందా..? లేదా..? అన్న అంశంపై జస్టిస్ నర్సింహారెడ్డి ఇటీవల సందేహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.ఈ వ్యవహారానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకూ, హైకోర్టుకు మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలను కోర్టు ముందుంచాలని ఆదేశాలు జారీ చేస్తూ, ఈ కేసులో కోర్టు సహాయకారిగా సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్‌ను నియమించారు. తరువాత ఈ కోర్టు ధిక్కార కేసును ప్రధాన న్యాయమూర్తి తన నేతృత్వంలోని ధర్మాసనానికి బదలాయించుకుని గతవారం విచారణ చేపట్టారు. తాజాగా సోమవారం ఈ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఉదయం 11.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కేసుపైనే సుదీర్ఘ వాదనలు జరిగాయి.న్యాయపరిధికి సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వశాఖ తన వైఖరిని స్పష్టం చేస్తూ, ఈ ఏడాది మే నెలలో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపిన లేఖను ధర్మాసనం ముందుంచింది. అందులోని అంశాలను పరిశీలించిన ధర్మాసనం, వాటిని రికార్డ్ చేసుకుంది. అంతకుముందు ఈ కేసులో అమికస్ క్యూరీ రవిచందర్ వాదనలు వినిపిస్తూ, హైకోర్ట్ ఎట్ హైదరాబాద్‌కు ఇరు రాష్ట్రాలపై న్యాయపరిధి ఉన్నట్లుగా పునర్ విభజన చట్టంలోని సెక్షన్లను అన్వయించుకోవాలన్నారు. పునర్ విభజన చట్టాన్ని పార్లమెంట్ ఏ ఉద్దేశంతో చేసిందో ఆ ఉద్దేశాన్ని న్యాయస్థానాలు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అంతేకాక కేంద్ర హోంశాఖ లేఖను దాని అభిప్రాయంగానే భావించాలి తప్ప, ఉత్తర్వులుగా భావించడానికి వీల్లేదని తెలిపారు.