భార్యకు 18 ఏళ్లు దాటితే.. భర్తపై వైవాహిక అత్యాచారం కేసుండదు | Marital rape not offence if wife is 18 or above | Sakshi
Sakshi News home page

భార్యకు 18 ఏళ్లు దాటితే.. భర్తపై వైవాహిక అత్యాచారం కేసుండదు

Published Mon, Dec 11 2023 5:31 AM | Last Updated on Mon, Dec 11 2023 5:31 AM

Marital rape not offence if wife is 18 or above - Sakshi

ప్రయాగ్‌రాజ్‌: భార్య వయస్సు 18 ఏళ్లు, అంతకు మించి ఉన్న సందర్భాల్లో వైవాహిక అత్యాచారం(మారిటల్‌ రేప్‌) అభియోగం నుంచి వ్యక్తికి రక్షణ ఉంటుందని అలహాబాద్‌ హైకోర్టు పేర్కొంది. ఇందుకు సంబంధించి భర్తపై ఐపీసీ సెక్షన్‌ 377ను వర్తింప జేయడంపై గతంలో మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఇచి్చన తీర్పును ఈ సందర్భంగా ఉదహరించింది. అయితే, ఇండిపెండెంట్‌ థాట్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా(2017)కేసులో సుప్రీంకోర్టు తీర్పుననుసరించి వ్యక్తి, 15–18 మధ్య వయస్సున్న అతడి భార్య మధ్య జరిగే ఎలాంటి లైంగిక సంపర్కమైనా అత్యాచారం కిందికే వస్తుందని స్పష్టం చేసింది.

ఓ వ్యక్తి వేసిన రివిజన్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ నెల 6న ఈ మేరకు పేర్కొంది. అయితే, పిటిషనర్‌పై కట్నం వేధింపులకు సంబంధించిన ఆరోపణలపై తమ తీర్పు ప్రభావం ఉండబోదని తెలిపింది. ఘజియాబాద్‌కు చెందిన ఓ వ్యక్తిపై 2013లో ఐపీసీ సెక్షన్లు 498ఏ, 323, 377తోపాటు వరకట్న నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఘజియాబాద్‌లోని దిగువ కోర్టుతోపాటు, అప్పిల్లేట్‌ కోర్టు కూడా అతడిని దోషిగా పేర్కొన్నాయి. వీటిని సవాల్‌ చేస్తూ అతడు అలహాబాద్‌ హైకోర్టులో రివిజన్‌ పిటిషన్‌ వేశాడు. విచారించిన హైకోర్టు.. పిటిషనర్‌పై ఐపీసీ సెక్షన్లు 498ఏ, 323 కింద నమోదైన కేసుల్లో దిగువ కోర్టులిచి్చన తీర్పులను సమరి్థస్తూ తీర్పు వెలువరించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement