revision petition filed
-
భార్యకు 18 ఏళ్లు దాటితే.. భర్తపై వైవాహిక అత్యాచారం కేసుండదు
ప్రయాగ్‌రాజ్: భార్య వయస్సు 18 ఏళ్లు, అంతకు మించి ఉన్న సందర్భాల్లో వైవాహిక అత్యాచారం(మారిటల్ రేప్) అభియోగం నుంచి వ్యక్తికి రక్షణ ఉంటుందని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ఇందుకు సంబంధించి భర్తపై ఐపీసీ సెక్షన్ 377ను వర్తింప జేయడంపై గతంలో మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచి్చన తీర్పును ఈ సందర్భంగా ఉదహరించింది. అయితే, ఇండిపెండెంట్ థాట్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా(2017)కేసులో సుప్రీంకోర్టు తీర్పుననుసరించి వ్యక్తి, 15–18 మధ్య వయస్సున్న అతడి భార్య మధ్య జరిగే ఎలాంటి లైంగిక సంపర్కమైనా అత్యాచారం కిందికే వస్తుందని స్పష్టం చేసింది. ఓ వ్యక్తి వేసిన రివిజన్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ నెల 6న ఈ మేరకు పేర్కొంది. అయితే, పిటిషనర్‌పై కట్నం వేధింపులకు సంబంధించిన ఆరోపణలపై తమ తీర్పు ప్రభావం ఉండబోదని తెలిపింది. ఘజియాబాద్‌కు చెందిన ఓ వ్యక్తిపై 2013లో ఐపీసీ సెక్షన్లు 498ఏ, 323, 377తోపాటు వరకట్న నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఘజియాబాద్‌లోని దిగువ కోర్టుతోపాటు, అప్పిల్లేట్ కోర్టు కూడా అతడిని దోషిగా పేర్కొన్నాయి. వీటిని సవాల్ చేస్తూ అతడు అలహాబాద్ హైకోర్టులో రివిజన్ పిటిషన్ వేశాడు. విచారించిన హైకోర్టు.. పిటిషనర్‌పై ఐపీసీ సెక్షన్లు 498ఏ, 323 కింద నమోదైన కేసుల్లో దిగువ కోర్టులిచి్చన తీర్పులను సమరి్థస్తూ తీర్పు వెలువరించింది. -
సుప్రీం కోర్టులో రివిజన్ పిటిషన్
చుండూరు కేసు తీర్పుపై ఐజీ సునీల్‌కుమార్ గ్రామంలోని పోలీస్ పికెట్ సందర్శన శాంతిభద్రతలపై ఎస్పీ, డీఎస్పీలతో సమీక్ష చుండూరు, న్యూస్‌లైన్: చుండూరు కేసులో రాష్ట్ర హైకోర్టు ప్రాసిక్యూషన్‌కు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుపై వారం రోజుల్లో సుప్రీం కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేస్తామని ఐజీ పీవీ సునీల్‌కుమార్ తెలిపారు. చుండూరు పోలీస్‌స్టేషన్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చుండూరు కేసుపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టులో స్టే చేయిస్తామని చెప్పారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్‌కు అనుకూలంగా చాలా అంశాలు ఉన్నాయన్నారు. ఇప్పటికే కేసు అప్పీల్‌కు సంబందించి పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో చర్చించినట్లు తెలిపారు. సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని, బాధితులు సంయమనం కోల్పోవద్దని సూచించారు. కోర్టు ఆదేశాల మేరకు ఎలాంటి ఉత్సవాలు, నిరసనలు నిర్వహించకుండా అందరూ ఓపిగ్గా ఉండాలన్నారు. ముందుగా గ్రామంలోని రక్తక్షేత్రం వద్ద ఏర్పాటు చేసిన పోలీసు పికెట్‌ను సంద ర్శించారు. శాంతిభద్రతలపై రూరల్ ఎస్పీ సత్యనారాయణ, తెనాలి డీఎస్పీ విఠలేశ్వర్, చుండూరు సీఐ కళ్యాణ్రాజ్లతో సమీక్షించారు.