చుండూరు కేసు తీర్పుపై ఐజీ సునీల్‌కుమార్
గ్రామంలోని పోలీస్ పికెట్ సందర్శన
శాంతిభద్రతలపై ఎస్పీ, డీఎస్పీలతో సమీక్ష
చుండూరు, న్యూస్‌లైన్: చుండూరు కేసులో రాష్ట్ర హైకోర్టు ప్రాసిక్యూషన్‌కు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుపై వారం రోజుల్లో సుప్రీం కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేస్తామని ఐజీ పీవీ సునీల్‌కుమార్ తెలిపారు. చుండూరు పోలీస్‌స్టేషన్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చుండూరు కేసుపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టులో స్టే చేయిస్తామని చెప్పారు.
ఈ కేసులో ప్రాసిక్యూషన్‌కు అనుకూలంగా చాలా అంశాలు ఉన్నాయన్నారు. ఇప్పటికే కేసు అప్పీల్‌కు సంబందించి పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో చర్చించినట్లు తెలిపారు. సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని, బాధితులు సంయమనం కోల్పోవద్దని సూచించారు. కోర్టు ఆదేశాల మేరకు ఎలాంటి ఉత్సవాలు, నిరసనలు నిర్వహించకుండా అందరూ ఓపిగ్గా ఉండాలన్నారు.
ముందుగా గ్రామంలోని రక్తక్షేత్రం వద్ద ఏర్పాటు చేసిన పోలీసు పికెట్‌ను సంద ర్శించారు. శాంతిభద్రతలపై రూరల్ ఎస్పీ సత్యనారాయణ, తెనాలి డీఎస్పీ విఠలేశ్వర్, చుండూరు సీఐ కళ్యాణ్‌రాజ్‌లతో సమీక్షించారు.
సుప్రీం కోర్టులో రివిజన్ పిటిషన్
Published Thu, Apr 24 2014 4:03 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement