chunduru
-
ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఇంకా దిగజారి పోతారు
-
20, 30 మంది ఎమ్మెల్యేలను కొని కేసీఆర్‌ను పడగొట్టాలని చూశారు : సీఎం కేసీఆర్
-
ఎన్నికలు వస్తే చాలు గాయ్.. గాయ్.. గత్తర్.. గత్తర్ లొల్లి నడుస్తోంది : కేసీఆర్
-
బీజేపీ పై కేసీఆర్ ఫైర్
-
సీఎం కాన్వాయ్ లో డబ్బులు తీసుకురాబోతున్నారు : బండి సంజయ్
-
చండూరులో పోస్టర్ల కలకలం
-
వైఎస్ఆర్టీపీ దీక్షకు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సంఘీబావం
-
చుండూరు ఎస్ఐ శ్రావణి మృతి
సాక్షి, గుంటూరు: ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చుండూరు ఎస్ఐ పిల్లి శ్రావణి(35) బుధవారం తెల్లవారుజామున మృతి చెందింది. గత శనివారం చుండూరు పోలీస్ స్టేషన్లోనే పనిచేస్తున్న కానిస్టేబుల్ రవీంద్ర, ఎస్ఐ శ్రావణి గడ్డి మందు కూల్ డ్రింక్‌లో కలుపుకొని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణానికి చెందిన శ్రావణి 2018లో ఎస్ఐగా పోలీస్ శాఖలో అడుగుపెట్టారు. జిల్లాలోని అడవులదీవి, నరసరావుపేట దిశ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించారు. దిశ పోలీస్ స్టేషన్ నుంచి ఏడు నెలల కిందట చుండూరుకు బదిలీపై వెళ్లారు. ఎస్ఐ మృతదేహానికి జీజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేశారు. సీఐపై ఆరోపణలు చుండూరు సీఐ రమేశ్‌బాబు, టీడీపీ నాయకుడు వంపుగాని గురవయ్య వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్టు ఎస్ఐ శ్రావణి వాంగ్మూలం ఇచ్చారు. గత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా టీడీపీకి చెందిన కొందరిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి బైండోవర్ చేయగా ఆ వ్యక్తులతో సీఐ తనపై రిట్పిటీషన్లు వేయించడంతో పాటు, ఎస్ఈసీకి ఉద్దేశపూర్వకంగా ఫిర్యాదు చేయించారని పేర్కొన్నారు. తనకు కానిస్టేబుల్ రవీంద్రతో అక్రమ సంబంధం ఉందని గురవయ్య ద్వారా సీఐ దుష్ప్ర చారం చేయించారని, ఎస్పీకి ఫిర్యాదులు చేయించి ఇబ్బంది పెట్టినట్టు ఎస్ఐ తెలిపారు. స్టేషన్లో తనకు అనుకూలంగా ఉన్న సిబ్బందికి, తనకు మోమోలు ఇవ్వడంతో పాటు, లంచాలు తీసుకుంటున్నట్టు అసత్య ప్రచారం చేశారని, పై అధికారులకు తప్పుడు ఫిర్యాదు చేయడంతో వృత్తిపరంగా, మానసికంగా వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు. ఇద్దరి మధ్య వివాదం ఎస్ఐ శ్రావణి తొలి నుంచి తప్పుని సహించరని పోలీస్ శాఖలో పేరుంది. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఆమెపై ఎస్ఈసీకి, కోర్టుల్లో, ఉన్నతాధికారులకు అందిన ఫిర్యాదులపై అనేక విచారణలను ఎదుర్కొన్నారు. గత కొద్ది రోజులుగా ఎస్ఐ శ్రావణి, సీఐ రమేశ్‌బాబు మధ్య వివాదం నడుస్తోందని, ఇద్దరు పర్సపరం వాదులాడుకునేవారని సమాచారం. స్టేషన్ సిబ్బంది సైతం ఈ విషయాన్ని ఉన్నతాధికారుల విచరణలో తెలిపినట్టు తెలుస్తోంది. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి నట్టు డీఎస్పీ శ్రవంతిరాయ్ తెలిపారు. సీఐను వీఆర్‌కు పిలిచాం ఎస్ఐ శ్రావణి ఆత్మహత్య ఘటనపై ప్రాథమిక విచారణ నివేదిక ఆధారంగా చుండూరు సీఐ రమేశ్‌బాబును వీఆర్‌కు పిలిచాం. శాఖపరమైన దర్యాప్తు చేపడతాం. – డాక్టర్ సీఎం త్రివిక్రమ వర్మ, డీఐజీ, గుంటూరు రేంజ్ చదవండి: గుంటూరు, నరసరావుపేటల్లో చంద్రబాబుపై కేసులు ఆత్మ బంధువులు: మానవత్వమే ‘చివరి తోడు’ -
‘చుండూరు’ కేసుపై నేడు ఆందోళన
హైదరాబాద్: చుండూరు దళితుల హత్య కేసుపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సీపీఐ, సీపీఎంలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో వామపక్షాలు, వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఉభయ రాష్ట్రాల్లోనూ ఆందోళన నిర్వహించనున్నాయి. ఈ కేసులో నిందితులందరినీ విడుదల చేస్తూ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును ఆయా పార్టీల నేతలు తీవ్రంగా నిరసించారు. హంతకులను శిక్షించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారమై న్యాయపోరాటం చేయనున్నట్టు ప్రకటించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు, ప్రదర్శనలను నిర్వహించాలని తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏం జరిగింది..?: గుంటూరు జిల్లా చుండూరులో 1991 ఆగస్టు ఆరున దళితులపై అగ్రకులాలకు చెందిన కొందరు నిందితులు మూకుమ్మడిగా దాడి చేసి 8 మంది దళితులను చంపేశారు. అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసు విచారణకు చుండూరులోనే ప్రత్యేక కోర్టు ఏర్పాటైంది. ఈ కోర్టు 219 మంది ముద్దాయిలను విచారించి 21మందికి యావజ్జీవ కారాగార శిక్ష, మరో 35 మందికి ఏడాది జైలు శిక్ష విధించింది. ఈ తీర్పుపై నిందితులు రాష్ట్ర హైకోర్టుకు వెళ్లగా న్యాయమూర్తులు జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి, జస్టిస్ జైస్వాల్ విచారించి సరైన సాక్ష్యాధారాలు లేవంటూ నిందితుందరినీ నిర్దోషులుగా పేర్కొంటూ విడుదల చేయాలని ఆదేశించారు. ఈ తీర్పుపై దళిత సంఘాలు, వామపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాయి. ఈ తీర్పు న్యాయ సూత్రాలకు అనుగుణంగా లేదని విమర్శించాయి. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించాయి. నిందితులను ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం విచారించాలని, ఈ కేసులో నిందితులకు శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవడంలో విఫలమైన అధికారులు, పోలీసులపై కూడా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. నేరస్తులు శిక్ష నుంచి తప్పించుకునేలా న్యాయవ్యవస్థలో ప్రస్తుతమున్న లోపాలను సవరించాలని ఆయా ప్రజాసంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. -
న్యాయమే బోనులో నిలబడితే!
సాక్ష్యాలలో ఒక సాక్షికి మరొక సాక్షికి కొంత తేడా ఉంటుంది. సాక్ష్యం చెప్పడంలో సాక్షికి సాక్షికి తేడా వస్తుంది. అలా వస్తాయని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది. అంతమాత్రాన కేసు కొట్టివేయటానికి వీల్లేదు. ఆగస్టు 6, 1991న చుండూరు (గుంటూరు జిల్లా) దళితవాడపై నాలుగు వం దల మందికిపైగా రెడ్లు, తెలగలు మారణాయుధాలతో దాడిచేసి, ఎనిమిది మందిని చంపివేశారు. ఇద్దరిని ముక్కలుగా నరికి గోనెసంచుల్లో కుక్కి తుంగ భద్ర మురుగుకాల్వలోకి తోసివేశారు. ఇంకొందరిని గాయపరిచారు. ఇప్పుడు 2014 ఏప్రిల్ 22వ తేదీన హైకోర్టు, చుండూరు కేసులో యావ జ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఇరవై మందిని, ఇతర శిక్షలు అనుభవించిన మరో 36 మందిపై మొత్తం శిక్షలు రద్దు చేస్తూ తీర్చునిచ్చింది. తీర్పు పూర్తి పాఠం వెలువరించకుండానే యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నవారిని ఆగమేఘాల మీద విడుదల చేయించింది. వారిని విడిచిపెట్టిన అయిదో రోజున తీర్పు పూర్తిపాఠం ప్రకటించింది. అక్కడితో ఆగకుండా హైకోర్టు ఇరుపక్షాలూ సంయమనం పాటించాలని, ఒకరి పట్ల మరొకరు గౌరవభావం పెంపొందించుకోవాలని సలహా ఇచ్చింది. పులులకు, మేకలకు ఒకే ఉద్బోధ చేసిన ఘనత హైకోర్టుదే. ఇది ‘పెద్ద మనుషుల తీర్పు’ ఆ మారణకాండపై 1991లో దేశమంతా వెల్లువెత్తిన ఆగ్రహావేశాలను మించి ఈ తీర్పుపై నిరసనలు పెల్లుబికాయి. ప్రాథమిక న్యాయ సూత్రాలకు, సుప్రీంకోర్టు పదేపదే చెబుతున్న తీర్పులకు పూర్తి భిన్నంగా వచ్చిన ఈ తీర్పు సత్య ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇది గ్రామాలతో అగ్రకుల పెత్తందార్లు ఇచ్చిన ‘పెద్దమనుషుల తీర్పు’లా ఉన్నది. ముందు నుంచీ ఈ కేసులో అగ్రకుల భూస్వామ్య అహంకారం కనిపిస్తున్నది. పోలీసుపాత్ర కూడా ఆది నుంచీ అగ్రకులాలకు వత్తాసు పలికే తీరులోనే ఉంది. హత్యలు జరిగిన రోజు చుండూరులో పోలీసు బలగం ఉన్నది. అంతకుముందు నుంచే చెదురుమదురు సంఘటనలు జరుగుతుంటే క్యాంపు పెట్టారు. సంఘటన రోజు ఉదయం పోలీసులు మాలపల్లెపై దాడిచేశారు. అంతకుముందు జరిగిన కేసులో మాలమాదిగలను అరెస్టు చెయ్యడానికి వచ్చారు. వారిని చూసి మాలమాదిగలు పారిపోయారు. దీనితో పోలీసులు తిరిగి ఊరిలోకి వచ్చారు. అప్పటికే రెడ్లు మారణాయుధాలతో పోలీస్‌స్టేషన్ ముందు జమగూడారు. నిజానికి మాలమాదిగలను తరుముతుంటూ పోలీసులు, వెనకాల రెడ్లు వెళ్లారు. వారిని పోలీసులు ఏమీ అనలేదు. దీనితో రెడ్లు మరీ రెచ్చిపోగా, వారికి తెలగలు తోడయ్యారు. రెండో రోజున, మూడో రోజున కాల్వలో ఎనిమిది శవాలు తేలాయి. అంతా పోలీసుల కళ్ల ముందే ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరిగింది. తమ కళ్లముందు జరిగిన ఘోరానికి ఎవరో రిపోర్టు చేయనవసరం లేదు. శవాలను భార్యలు, అన్నదమ్ములు, ఇతర బంధువులు గుర్తించగలిగారు. వారిని చంపటం చూసినవారు పంచనామా జరుగుతున్నప్పుడు సాక్ష్యం చెప్పారు. డాక్టర్లు గాయాలను గుర్తించారు. ఏ పోలీ సుల కళ్ల ముందు ఈ మారణకాండ జరిగిందో వారే కేసు దర్యాప్తు చేశా రు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి ఆలపాటి ధర్మారావు ఆ ఊరువాడే. అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి తప్పనిసరై 219 మం దిపై చార్జిషీటు వేయటం జరిగింది. 134 మంది సాక్షులను పెట్టారు. అప్పటికే ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం వచ్చింది. ఆ చట్టం ప్రకారం చుండూరులో ప్రత్యేక కోర్టు పెట్టారు. అది ఇష్టం లేని రెడ్లు ఏదో ఒక వంకపై విచారణ జరగటానికి వీల్లేదని పిటిషన్లు పెట్టడం, వాటిని కోర్టు కొట్టి వేస్తే హైకోర్టుకు అపీలుకు వెళ్లటం, హైకోర్టు తిరస్కరిస్తే సుప్రీంకోర్టుకు వెళ్లటం, అక్కడా పప్పులు ఉడకకపోతే మళ్లీ విచారణ ప్రారంభం కావడం జరుగుతుండేది. దాదాపు పది సంవత్సరాలు కేసు నడవకుండా చేశారు. తప్పనిసరైనాక విచారణ మొదల యింది. కేసు 219 ముద్దాయిలపై నడిచి 134 సాక్షుల జాబితా ఉన్నది. వారిలో 33 మంది ముద్దాయిలు మధ్యలో చనిపోయారు. మొత్తం 70 మంది సాక్షులను విచారించారు. సాక్ష్యాలు లేవని కొందరిని విడిచిపెట్టారు. ఒక్క సాక్షే చెప్పాడు కాబట్టి, ఆ సాక్ష్యాన్ని సమర్థించే వారు లేరని ఇంకొందరిని విడిచిపెట్టారు. మిగిలిన వారిపై తగిన ఆధారాలున్నాయని, ఒక సాక్షికి మరొక సాక్షికి పొంతన కుదిరిందని సెషన్స్ కోర్టు కొందరికి యావజ్జీవ కారాగార శిక్ష, మరికొందరికి రెండేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించింది. సోదిలోకి రాని సుప్రీం ఆదేశాలు ఈ తీర్పును ఇప్పుడు హైకోర్టు కొట్టి వేసింది. సాక్ష్యాలు నమ్మదగినవిగా ఉన్నాయని ఒక కోర్టు అభిప్రాయపడితే, వాటిని కొట్టిపారేయటానికి హైకోర్టు బలమైన ఆధారాలు చూపాలి. సాక్ష్యాలలో ఒక సాక్షికి మరొక సాక్షికి కొంత తేడా ఉంటుంది. సాక్ష్యం చెప్పడంలో సాక్షికి సాక్షికి తేడా వస్తుంది. అలా వస్తాయని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది. అంతమాత్రాన కేసు కొట్టివే యటానికి వీల్లేదు. ఈ కేసును కొట్టివేయటానికి హైకోర్టు కొన్ని ప్రధానమైన కారణాలు చూపింది. అందులో ఒకటి- ఒక సాక్షి ‘నేను ఈదుకుంటూ కాలవ దాటాను’ అని చెప్పాడు. అతనే నాకు ఈత రాదని చెప్పాడు. ఈతరాని వాడు కాలవ ఎలా దాటగలిగాడు? అని హైకోర్టు అనుమానం. వేటగాళ్ల మాదిరిగా ఆయుధాలు ధరించి తరుముకు వస్తున్న వారిబారి నుంచి రక్షించుకోవడానికి కాలవ దాటేశాడు. అది హైకోర్టుకు అర్థంకాలేదు. ఎనిమిది హత్యలు జరిగితే ఒక్కడు కూడా పోలీసు రిపోర్టు ఇవ్వలేదు. కాబట్టి వారి సాక్ష్యాలను నమ్మలేమంటుంది. రెండు రోజుల వరకూ ఆ వార్త ఎవరికీ చెప్పకుండా ఎలా ఉంటారు? అని ప్రశ్నిస్తుంది. తమ బంధువులను తమ కళ్లముందు నరికి చంపితే, దాని మీద రిపోర్టు ఇవ్వలేదన్న కారణంతో వాళ్ల సాక్ష్యాలు నమ్మరా? ఒక అవిటి ముద్దాయి దాడిలో పాల్గొని, మాలమాదిగలను పట్టుకొని, ఒకరి శరీరం నుంచి సిరంజితో రక్తం తీశాడని చాలామంది సాక్షులు చెపితే, అవిటి వ్యక్తి ఎలా చేస్తాడని నమ్మలేదు. చట్ట విరుద్ధం, అనైతికం సాక్ష్యాన్ని నమ్మటానికి కొన్ని కొలబద్దలుంటాయి. వాటి ప్రాతిపదికగానే సెషన్స్ కోర్టు కొన్ని సాక్ష్యాలను తిరస్కరించింది, కొన్నింటిని స్వీకరించింది. హైకోర్టుకు అవేం కనబడలేదు. ఏ కోర్టు పరిగణనలోకి తీసుకొని చిన్నచిన్న తేడాల ఆధారంగా కేసు కొట్టేసింది. ఇంకా ఘోరం ఏమంటే ప్రాసిక్యూషన్ తరపున ఉటంకించిన సుప్రీంకోర్టు తీర్పులలో ఏ ఒక్కటీ పరిగణనలోకి తీసుకోలేదు. ఇది చట్ట విరుద్ధం. అనైతికం. మొదటి నుంచి ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న వారిని విడుదల చెయ్యా లనే ఆత్రంతో కోర్టు ఉన్నది. ప్రతిసారీ ఎంతకాలం వాళ్లు జైల్లో మగ్గాలి అని ప్రశ్నించింది. ఆ తీరును చూసిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ కోర్టుపై మాకు నమ్మకం లేదని ప్రకటించారు. మా మీద కోర్టు ధిక్కారం కేసు పెడ తానని కోర్టు భయపెట్టింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ కొన్ని అప్పీళ్లు వేసి, వాటిని కూడా కలిపి వినండి అవి కోరితే, అవన్నీ ఎప్పుడు పూర్తి కావాలి? ముందు వీరిని విడిచి పెట్టేద్దాం అన్న ధోరణితో సాగింది. కోర్టుకు తనకు నచ్చిన తీర్పు ఇచ్చే అధికారం ఉన్నది. అయితే సరైన న్యాయసూత్రాల ప్రాతి పదిక ఉండాలి. అది హైకోర్టు తీర్పులో లేదు. సుప్రీంకోర్టు తీర్పులు పరిగణ నలోకి తీసుకుంటే ముద్దాయిలందరికీ శిక్ష ఖాయం అవుతుంది. అది హైకో ర్టుకు ఇష్టం లేదు. అందుకని వాటిని దాటవేసింది. కేవలం కుల అహంకా రంతో మాలమాదిగలను చంపేస్తే, చంపిన వారికి సెషన్స్ కోర్టు శిక్ష విధించిం ది. దానిని హైకోర్టు కొట్టివేసింది. మరి న్యాయవ్యవస్థపై మాలమాదిగలు నమ్మకం కోల్పోరా? దెబ్బ, చావుదెబ్బ ఈ కేసులో మరొక ఘోరం జరిగింది. మాలమాదిగలను తరిమేటప్పుడు, పొడిచేటప్పుడు, నరికేటప్పుడు కులం పేరుతో దూషించారు. అందుకని ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు దాఖలయింది. ప్రతిసాక్షి ప్రత్యేక కోర్టులో ఇదే చెప్పారు. ఈ సాక్ష్యాన్ని కోర్టు అంగీకరించింది. కానీ శిక్ష మాత్రం ఎస్సీ, ఎస్టీ చట్టం కింద వెయ్యలేదు. సెషన్స్ కోర్టు ఒక దెబ్బ కొడితే, హైకోర్టు చావు దెబ్బకొట్టింది. అగ్రకులాలు ముద్దాయిలుగా ఉంటే చట్టాలు, కోర్టులు ముఖం తిప్పుకుంటాయి. లేదా కళ్లు చెవులు మూసుకుంటాయి. (వ్యాసకర్త హైకోర్టు సీనియర్ న్యాయవాది, ఈ కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్) బొజ్జా తారకం -
చుండూరుపై ‘సుప్రీం’లో ఎస్ఎల్పీ
గుంటూరు జిల్లా పోలీసుల సమాయత్తం గుంటూరు, న్యూస్‌లైన్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చుండూరు దళితుల ఊచకోత కేసు లో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్‌లీవ్ పిటిషన్(ఎస్ఎల్పీ) దాఖలు చేసేందుకు గుంటూరు జిల్లా పోలీసు యంత్రాంగం సమాయత్తమైంది. నిందితుల శిక్ష రద్దు చేస్తూ హైకోర్టు ఈ నెల 23న తీర్పు వెలువరించడం తెలి సిందే. 1991 ఆగస్టు 6న చుండూరు, మోదుకూరు, అమృతలూరు గ్రామాల్లోని దళితులకు, అగ్రవర్ణాలకు మధ్య జరిగిన ఘర్షణలో దళితుల ఊచకోతకు తెగబడిన విషయం విదితమే. ఈ కేసులో 21 మందికి యావజ్జీవ శిక్ష, 35 మందికి ఏడాది జైలుశిక్ష, జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్టు 2007లో తీర్పు ఇచ్చింది. దీనిపై నిందితులు హైకోర్టుకు అప్పీలు చేసుకోగా.. వారికి విధించిన శిక్షలను రద్దుచేయడంతో, జరిమానాలను తిరిగి చెల్లించాలని హైకోర్టు తాజాగా తీర్పుచెప్పడం తెలిసిందే. దీంతో హైకోర్టు తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ జిల్లా పోలీసులు సుప్రీంను ఆశ్రయించాలని నిర్ణయించారు. ఈ మేర కు సుప్రీంకోర్టులో అప్పీలు చేసేందుకు ఏఎస్పీ డి.కోటేశ్వరరావు శుక్రవారం ఢిల్లీ వెళ్లారు. -
‘చుండూరు’పై పోలీసుల నిర్లక్ష్యం: ప్రజాసంఘాలు
హైదరాబాద్: చుండూరు కేసు విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని పలువురు వక్తలు ఆరోపించారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ‘అందరూ నిర్దోషులైతే చుండూరు దళితుల్ని చంపింది ఎవరు?’ అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. హైకోర్టు సీనియర్ అడ్వొకేట్, ఆర్పీఐ అధ్యక్షుడు బొజ్జా తారకం, మాజీ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు, హెచ్ఎంటీవీ సీఈవో రామచంద్రమూర్తి తదితరులు ప్రసంగించారు. చుండూరులో దారుణం జరిగిన వెంటనే పోలీసులు చార్జిషీటు దాఖలు చేయలేదని, కనీసం కోర్టులో సరైన ఆధారాలను ప్రవేశపెట్టలేదన్నారు. దళితులను చంపిన వారికి శిక్షలు పడకపోవటం దుర్మార్గమని విమర్శించారు. న్యాయ సూత్రాలను తుంగలో తొక్కి తీర్పునిచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లకుంటే తామే ప్రైవేటుగా అప్పీల్ చేస్తామని హెచ్చరించారు. చుండూరు కేసులో న్యాయం కోసం జైలుకెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో సామాజికవేత్త సాంబశివరావు, డాక్టర్ వై.బి.సత్యనారాయణ, ఐ.మైసయ్య, ప్రభాకర్, సీడీఎస్ నాయకులు ఆంజనేయులు, కెవీపీఎస్ నాయకులు జాన్‌వెస్లీ తదితరులు పాల్గొన్నారు. -
సుప్రీం కోర్టులో రివిజన్ పిటిషన్
చుండూరు కేసు తీర్పుపై ఐజీ సునీల్‌కుమార్ గ్రామంలోని పోలీస్ పికెట్ సందర్శన శాంతిభద్రతలపై ఎస్పీ, డీఎస్పీలతో సమీక్ష చుండూరు, న్యూస్‌లైన్: చుండూరు కేసులో రాష్ట్ర హైకోర్టు ప్రాసిక్యూషన్‌కు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుపై వారం రోజుల్లో సుప్రీం కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేస్తామని ఐజీ పీవీ సునీల్‌కుమార్ తెలిపారు. చుండూరు పోలీస్‌స్టేషన్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చుండూరు కేసుపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టులో స్టే చేయిస్తామని చెప్పారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్‌కు అనుకూలంగా చాలా అంశాలు ఉన్నాయన్నారు. ఇప్పటికే కేసు అప్పీల్‌కు సంబందించి పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో చర్చించినట్లు తెలిపారు. సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని, బాధితులు సంయమనం కోల్పోవద్దని సూచించారు. కోర్టు ఆదేశాల మేరకు ఎలాంటి ఉత్సవాలు, నిరసనలు నిర్వహించకుండా అందరూ ఓపిగ్గా ఉండాలన్నారు. ముందుగా గ్రామంలోని రక్తక్షేత్రం వద్ద ఏర్పాటు చేసిన పోలీసు పికెట్‌ను సంద ర్శించారు. శాంతిభద్రతలపై రూరల్ ఎస్పీ సత్యనారాయణ, తెనాలి డీఎస్పీ విఠలేశ్వర్, చుండూరు సీఐ కళ్యాణ్రాజ్లతో సమీక్షించారు.