BCCI President Roger Binny Visit To Pakistan: పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు రోజర్ బిన్నీ ధన్యవాదాలు తెలిపారు. తమను పాకిస్తాన్‌కు ఆహ్వానించినందుకు సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. కాగా ఆసియా కప్-2023 నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే.
అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను అక్కడికి పంపేది లేదని బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ మండలి(ఏసీసీ) అధ్యక్షుడు జై షా స్పష్టం చేశారు. ఈ క్రమంలో చర్చోపర్చల అనంతరం శ్రీలంకతో కలిసి హైబ్రిడ్ విధానంలో ఈ వన్డే ఈవెంట్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు పీసీబీ సిద్ధపడింది.
ఆ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే
ఇందుకు తగ్గట్లుగానే భారత జట్టు ఆడే మ్యాచ్‌లన్నింటితో పాటు ఫైనల్ కూడా శ్రీలంకలోనే జరుగనుంది. ఇదిలా ఉంటే.. ఏసీసీ సభ్యులు, ఆసియా కప్‌లో భాగమైన జట్ల క్రికెట్ బోర్డు మెంబర్స్‌ను పీసీబీ డిన్నర్‌కు ఆహ్వానించింది.
PC: PCB
ఈ క్రమంలో బీసీసీఐ బాస్ రోజర్ బిన్నీతో పాటు.. ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సోమవారం నాటి పీసీబీ విందుకు హాజరయ్యారు. లాహోర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రోజర్ బిన్నీ మాట్లాడుతూ.. దాయాదుల పోరు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
థాంక్యూ పీసీబీ
‘‘మమ్మల్ని ఇక్కడకు ఆహ్వానించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ తరఫున కృతజ్ఞతలు చెబుతున్నా. బీసీసీతో పాటు భారత్‌లో ఉన్న క్రికెట్ ప్రేమికుల తరఫున కూడా నేనే విష్ చేస్తున్నా. ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే అందరికీ పండుగ.
రోడ్లు మొత్తం ఖాళీ అవుతాయి
మ్యాచ్ మొదలైందంటే చాలు.. ప్రతి ఒక్కరు అలెర్ట్ అయిపోతారు. పనులన్నీ పక్కనపెట్టేస్తారు. రోడ్లు మొత్తం ఖాళీ అయిపోతాయి. ప్రతి ఒక్కరు క్రికెట్ చూసేందుకు టీవీ ముందు కూర్చుంటారు’’ అంటూ రోజర్ బిన్నీ చిరకాల ప్రత్యర్థుల క్రికెట్ పోరు గురించి కామెంట్ చేశారు.
పల్లెకెలెలో మ్యాచ్ అద్భుతంగా సాగిందని.. వర్షం అంతరాయం కలిగించి ఉండకపోతే.. ఫలితం చూసే వాళ్లమని పేర్కొన్నారు. పీసీబీ ఆహ్వానం మేరకు సరిహద్దులు దాటి వచ్చామన్న బిన్నీ.. ఇదొక అద్భుతమైన అనుభవమని సంతోషం వ్యక్తం చేశారు. కాగా ఆసియా కప్-2023లో భారత్- పాక్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే.
అది స్వర్ణయుగం
ఇక రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. 2004 తర్వాత మళ్లీ పాకిస్తాన్‌కు రావడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. అప్పట్లో ఇండియా- పాకిస్తాన్‌కు స్వర్ణయుగమని గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. కాగా పాకిస్తాన్ వేదికగా ఆగష్టు 30న ఆరంభమైన ఆసియా టోర్నీ సెప్టెంబరు 17న శ్రీలంకలో జరుగనున్న ఫైనల్‌తో ముగియనుంది.
చదవండి: WC 2023: ఇద్దరూ తుదిజట్టులో ఉంటే తప్పేంటి?: బీసీసీఐ చీఫ్ సెలక్టర్
BCCI President Roger Binny's speech at the PCB Gala Dinner at the Governor's House in Lahore.#AsiaCup2023 pic.twitter.com/Zl2tq5MHxW
— Pakistan Cricket (@TheRealPCB) September 4, 2023
BCCI Vice-President Rajeev Shukla's speech at the PCB grand gala dinner at Governor's House, Lahore.#AsiaCup2023 pic.twitter.com/OdOmI4Ddcl
— Pakistan Cricket (@TheRealPCB) September 4, 2023
Comments
Please login to add a commentAdd a comment