ఒకరోజు ముందుగానే గంగూలీ బర్త్‌డే సెలబ్రేషన్స్(PC: Rajiv Shukla Twitter)
టీమిండియా మాజీ కెప్టెన్, భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రస్తుత అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శుక్రవారం 50వ పడిలో అడుగుపెట్టనున్నాడు. అయితే, పుట్టినరోజు వేడుకలు మాత్రం ఒకరోజు ముందుగానే మొదలైపోయాయి. ఐపీఎల్ మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లా, ఒకప్పటి సహచర ఆటగాడు, టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్‌తో కలిసి గంగూలీ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నాడు.
ఇందుకు సంబంధించిన ఫొటోలను రాజీవ్ శుక్లా ట్విటర్‌లో షేర్ చేశాడు. ‘‘సౌరవ్ గంగూలీ 50వ పుట్టినరోజు సెలబ్రేట్ చేశాము. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలి. సంతోషకర జీవితం గడపాలి’’ అని ఆకాంక్షించారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా టీమిండియా ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో గంగూలీ సైతం యూకేలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రీషెడ్యూల్డ్ టెస్టు విషయానికొస్తే.. టీమిండియా ఇంగ్లండ్ చేతిలో 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. గురువారం(జూలై 7) నుంచి ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ మొదలుకానుంది.
చదవండి: Wasim Jaffer: 'టెస్టుల్లో అతడికి సచిన్ రికార్డు బ్రేక్ చేసే సత్తా ఉంది'
Celebrated the 50th birthday of Sourav Ganguli.wishing him happy & healthy life ahead. @SGanguly99 @sachin_rt @JayShah @BCCI pic.twitter.com/KBXbBajp3s
— Rajeev Shukla (@ShuklaRajiv) July 7, 2022
Comments
Please login to add a commentAdd a comment