పాకిస్తాన్‌లో చాంపియన్స్‌ ట్రోఫీ.. బీసీసీఐ కండిషన్‌ ఇదే! | BCCI Only Condition That Could See India Travelling To Pakistan For Champions Trophy | Sakshi
Sakshi News home page

BCCI: పాకిస్తాన్‌లో చాంపియన్స్‌ ట్రోఫీ.. టీమిండియాను పంపాలంటే!

Published Tue, May 7 2024 4:42 PM | Last Updated on Tue, May 7 2024 5:16 PM

BCCI Only Condition That Could See India Travelling To Pakistan For Champions Trophy

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 నిర్వహణ హక్కులను దక్కించుకున్న పాకిస్తాన్.. మెగా టోర్నీని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జరుగనున్న ఈ ఈవెంట్‌ కోసం ఇప్పటికే కరాచీ, లాహోర్‌, రావల్పిండిలను వేదికలుగా ఖరారు చేసింది.

అవకాశమే లేదు
ఈ నేపథ్యంలో ఈ వన్డే ఫార్మాట్‌ టోర్నీ ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్తుందా? అన్న సందేహాలు తలెత్తాయి. దాయాది దేశాల మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో భారత జట్టు పాక్‌లో పర్యటించే అవకాశమే లేదని విశ్లేషకులు అంటున్నారు.

గతంలో ఆసియా వన్డే కప్‌-2023 నిర్వహణ హక్కులను పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు దక్కించుకున్నప్పటికీ.. టీమిండియా భద్రతా కారణాల దృష్ట్యా హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కాగా ఆసియా కప్‌లో భారత జట్టు తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో ఆడిన విషయం తెలిసిందే.

బీసీసీఐ స్పందన ఇదే
ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘చాంపియన్స్‌ ట్రోఫీ విషయంలో భారత ప్రభుత్వం ఎలా చెబితే మేము అలా నడుచుకుంటాం.

కేంద్రం అనుమతినిస్తేనే టీమిండియాను పాకిస్తాన్‌కు పంపిస్తాం. ప్రభుత్వం నిర్ణయాన్ని బట్టే మేము ముందుకు వెళ్తాం’’ అని రాజీవ్‌ శుక్లా స్పష్టం చేశాడు. కాగా ఆసియా వన్డే కప్‌-2023లో రోహిత్‌ సేన విజేతగా నిలవగా.. శ్రీలంక రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

ఇక ఆఖరిసారి 2017లో నిర్వహించిన చాంపియన్స్‌ ట్రోఫీలో చాంపియన్‌గా నిలిచిన పాకిస్తాన్‌ ఈసారి డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. సొంతగడ్డపై ఈవెంట్‌ జరుగనుండటం బాబర్‌ ఆజం బృందానికి సానుకూలాంశంగా పరిణమించింది.

చదవండి: Rohit Sharma Crying Video: కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్‌ శర్మ.. వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement