ఐపీఎల్ కోసం జియో హైస్పీడ్ వైఫై | 'JioNet' High Speed Wi-Fi For IPL Matches at Uppal Stadium | Sakshi
Sakshi News home page

ఐపీఎల్ కోసం జియో హైస్పీడ్ వైఫై

Published Wed, Apr 5 2017 5:34 PM | Last Updated on Tue, Sep 5 2017 8:01 AM

'JioNet' High Speed Wi-Fi For IPL Matches at Uppal Stadium

హైదరాబాద్ : క్రికెట్ మహాసంగ్రామం ఐపీఎల్ సంబురంలో జియో కూడా భాగమైపోయింది. నేటి నుంచి ప్రారంభం కాబోతున్న ఐపీఎల్ మ్యాచ్ లకు  ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో తమ హై-స్పీడ్ వై-ఫై ఇంటర్నెట్ సేవలను అందించనున్నట్టు  రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ప్రకటించింది. జియో నెట్ వై-ఫైతో స్టేడియం మొత్తాన్ని కవర్ చేసింది.
 
క్రికెట్ ను వీక్షించడానికి వచ్చిన అభిమానులు తమ స్మార్ట్ ఫోన్లలో జియో హైస్పీడ్ వై-ఫై సేవల ప్రయోజనాలను పొందేలా అవకాశం కల్పిస్తోంది. ఈ సేవలు పొందడానికి ప్రేక్షకులకు కావాల్సిందల్లా ఒక్క స్మార్ట్ ఫోన్ మాత్రమే. వై-పైకి కనెక్ట్ అయిన తరువాత, జియో నెట్ హోం పేజీలో ఇచ్చిన మొబైల్ నెంబరుకి ఓటీపీ వస్తుంది. ఓటీపీని జోడించగానే వై-ఫై కనెక్ట్ అవుతుంది. ఇలా జియో హై-స్పీడ్ వై-ఫై సేవలను ఐపీఎల్ ప్రేక్షకులు వినియోగించుకోవచ్చు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement