రాణించిన విజయ్, స్టీఫెన్‌ | Andhra team Win On Nagaland Team | Sakshi
Sakshi News home page

రాణించిన విజయ్, స్టీఫెన్‌

Nov 26 2024 9:01 AM | Updated on Nov 26 2024 9:01 AM

Andhra team Win On Nagaland Team

సాక్షి, హైదరాబాద్‌: ముస్తాక్‌ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌లో ఆంధ్ర జట్టు శుభారంభం చేసింది. ఉప్పల్‌ స్టేడియంలో సోమవారం జరిగిన గ్రూప్‌ ‘ఇ’ లీగ్‌ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన నాగాలాండ్‌ జట్టు 17.1 ఓవర్లలో 77 పరుగులకే ఆలౌటైంది. ఆంధ్ర బౌలర్లు త్రిపురాణ విజయ్‌ 8 పరుగులిచ్చి 4 వికెట్లు... స్టీఫెన్‌ 6 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి నాగాలాండ్‌ను దెబ్బ తీశారు. 

శశికాంత్, సత్యనారాయణ రాజు, వినయ్‌లకు ఒక్కో వికెట్‌ దక్కింది. అనంతరం ఆంధ్ర జట్టు 9.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్లు కోన శ్రీకర్‌ భరత్‌ (26 బంతుల్లో 27; 1 ఫోర్, 1 సిక్స్‌), అశ్విన్‌ హెబ్బర్‌ (24 బంతుల్లో 43; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 63 పరుగులు జోడించారు. వీరిద్దరు అవుటయ్యాక షేక్‌ రషీద్‌ (4 నాటౌట్‌), వంశీకృష్ణ (5 నాటౌట్‌) గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు. రేపు జరిగే రెండో లీగ్‌ మ్యాచ్‌లో గోవాతో ఆంధ్ర తలపడుతుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement