Mushtaq Ali Trophy T20 tournament
-
ఆంధ్ర ‘హ్యాట్రిక్’
సాక్షి, హైదరాబాద్: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటుతోన్న ఆంధ్ర క్రికెట్ జట్టు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 టోర్నమెంట్లో వరుస విజయాలతో దూసుకెళుతోంది. గత రెండు మ్యాచ్‌ల్లో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన ఆంధ్ర జట్టు అదే జోరు కొనసాగిస్తూ మహారాష్ట్రను చిత్తు చేసి ‘హ్యాట్రిక్’ విజయం నమోదు చేసుకుంది. గ్రూప్ ‘ఈ’లో భాగంగా శుక్రవారం సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో జరిగిన పోరులో ఆంధ్ర జట్టు 75 పరుగుల తేడాతో మహారాష్ట్రపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆంధ్ర జట్టు నిరీ్ణత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. పైలా అవినాశ్ (39 బంతుల్లో 55; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధశతకంతో రాణించగా... అశి్వన్ హెబర్ (36; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్ రికీ భుయ్ (28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. మహారాష్ట్ర బౌలర్లలో ముకేశ్ 3, అర్షిన్ కులకర్ణి రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన మహారాష్ట్ర జట్టు 15.4 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌటైంది. రాహుల్ త్రిపాఠి (21), దివ్యాంగ్ (24 నాటౌట్) కాస్త పోరాడారు. కెపె్టన్ రుతురాజ్ గైక్వాడ్ (4) విఫలమయ్యాడు. ఆంధ్ర బౌలర్లలో శశికాంత్, యశ్వంత్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. గ్రూప్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన ఆంధ్ర జట్టు 12 పాయింట్లు ఖాతాలో వేసుకొని అగ్రస్థానంలో ఉంది. తదుపరి మ్యాచ్‌లో ఆదివారం సర్వీసెస్ జట్టుతో ఆంధ్ర ఆడుతుంది. స్కోరు వివరాలు ఆంధ్ర ఇన్నింగ్స్: కోన శ్రీకర్ భరత్ (బి) ముకేశ్ 7; అశి్వన్ హెబర్ (స్టంప్డ్) రుతురాజ్ (బి) విక్కీ 36; షేక్ రషీద్ (సి) నిఖిల్ నాయక్ (బి) ముకేశ్ 0; అవినాశ్ (బి) అర్షిన్ కులకర్ణి 55; ఎస్డీఎన్వీ ప్రసాద్ (సి) సిద్ధార్థ్ (బి) అర్షిన్ కులకర్ణి 1; రికీ భుయ్ (సి) సిద్ధార్థ్ (బి) ముకేశ్ 28; శశికాంత్ (నాటౌట్) 17; బోధల కుమార్ (సి) త్రిపాఠి (బి) దివ్యాంగ్ 2; సత్యనారాయణ రాజు (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–8, 2–18, 3–79, 4–82, 5–133, 6–141, 7–148. బౌలింగ్: ముకేశ్ 4–0–21–3; రామకృష్ణ 2–0–23–0; అర్షిన్ కులకర్ణి 3–0–26–2; విక్కీ 4–0–34–1; దివ్యాంగ్ 4–0–42–1; అజీమ్ కాజీ 3–0–25–0. మహారాష్ట్ర ఇన్నింగ్స్: అర్షిన్ కులకర్ణి (బి) స్టీఫెన్ 16; రుతురాజ్ గైక్వాడ్ (సి) ప్రసాద్ (బి) సత్యనారాయణ రాజు 4; రాహుల్ త్రిపాఠి (సి) భరత్ (బి) శశికాంత్ 21; అంకిత్ (రనౌట్) 1; అజీమ్ కాజీ (సి అండ్ బి) శశికాంత్ 8; సిద్ధార్థ్ (సి) సత్యనారాయణ (బి) బోధల కుమార్ 0; నిఖిల్ నాయక్ (సి) భరత్ (బి) శశికాంత్ 10; దివ్యాంగ్ (నాటౌట్) 24; రామకృష్ణ (ఎల్బీ) యశ్వంత్ 1; విక్కీ (బి) యశ్వంత్ 0; ముకేశ్ (బి) యశ్వంత్ 6; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (15.4 ఓవర్లలో ఆలౌట్) 99. వికెట్ల పతనం: 1–20, 2–22, 3–30, 4–45, 5–50, 6–62, 7–63, 8–64, 9–64, 10–99. బౌలింగ్: స్టీఫెన్ 2–0–11–1; శశికాంత్ 4–0–22–3; సత్యనారాయణ రాజు 2–0–10–1; బోధల కుమార్ 4–0–24–1; యశ్వంత్ 3.4–0–29–3. -
రాణించిన విజయ్, స్టీఫెన్
సాక్షి, హైదరాబాద్: ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు శుభారంభం చేసింది. ఉప్పల్ స్టేడియంలో సోమవారం జరిగిన గ్రూప్ ‘ఇ’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన నాగాలాండ్ జట్టు 17.1 ఓవర్లలో 77 పరుగులకే ఆలౌటైంది. ఆంధ్ర బౌలర్లు త్రిపురాణ విజయ్ 8 పరుగులిచ్చి 4 వికెట్లు... స్టీఫెన్ 6 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి నాగాలాండ్‌ను దెబ్బ తీశారు. శశికాంత్, సత్యనారాయణ రాజు, వినయ్‌లకు ఒక్కో వికెట్ దక్కింది. అనంతరం ఆంధ్ర జట్టు 9.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్లు కోన శ్రీకర్ భరత్ (26 బంతుల్లో 27; 1 ఫోర్, 1 సిక్స్), అశ్విన్ హెబ్బర్ (24 బంతుల్లో 43; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 63 పరుగులు జోడించారు. వీరిద్దరు అవుటయ్యాక షేక్ రషీద్ (4 నాటౌట్), వంశీకృష్ణ (5 నాటౌట్) గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు. రేపు జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో గోవాతో ఆంధ్ర తలపడుతుంది. -
బ్యాట్స్‌మెన్ మళ్లీ విఫలం
సాక్షి, హైదరాబాద్: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ మరోసారి విఫలమయ్యారు. ఫలితంగా ఉత్తర్‌ప్రదేశ్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. న్యూఢిల్లీలోని పాలం ఎయిర్‌ఫోర్స్ కాంప్లెక్స్ గ్రౌండ్లో జరుగుతోన్న ఈ టోర్నీలో హైదరాబాద్‌కిది వరుసగా రెండో ఓటమి. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 139 పరుగులు చేసింది. బావనక సందీప్ (31 బంతుల్లో 33; 2 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ అంబటి రాయుడు (31 బంతుల్లో 29; 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో అంకిత్ రాజ్‌పుత్ 3, అ„Š దీప్ నాథ్ 2 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌లో సురేశ్ రైనా (35 బంతుల్లో 54 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్ధసెంచరీ చేయడంతో ఉత్తర్‌ప్రదేశ్ 18.3 ఓవర్లలో 4 వికెట్లకు 143 పరుగులు చేసి గెలుపొందింది. సమర్థ్ సింగ్ (36 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు. హైదరాబాద్ బౌలర్లలో ఆశిష్ రెడ్డి 3 వికెట్లు పడగొట్టగా, సాకేత్‌కు ఒక వికెట్ దక్కింది. ఈసారి టాపార్డర్... పాండిచ్చేరితో జరిగిన తొలి మ్యాచ్‌లో లోయరార్డర్ రాణించకపోవడంతో విజయానికి 3 పరుగుల దూరంలో నిలిచిపోయిన హైదరాబాద్... ఈ మ్యాచ్‌లో టాపార్డర్ బ్యాట్ ఝళిపించకపోవడంతో సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్ (16; 2 ఫోర్లు, 1 సిక్స్), అక్షత్ రెడ్డి (9) త్వరగానే ఔటయ్యారు. వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ ఆశిష్ రెడ్డి (16; 2 ఫోర్లు), బి. సందీప్ కాసేపు క్రీజులో నిలిచారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 42 పరుగుల్ని జోడించారు. క్రీజులో కుదురుకుంటోన్న ఈ జంటను అ„Š దీప్నాథ్ విడగొట్టాడు. కొద్ది పరుగుల వ్యవధిలోనే ఇద్దరినీ పెవిలియన్ చేర్చాడు. తర్వాత ప్రత్యర్థి బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగుల వేగం నెమ్మదించింది. అంబటి రాయుడు ఆచితూచి ఆడగా... మరో ఎండ్‌లో కె. రోహిత్ రాయుడు (7), సీవీ మిలింద్ (1) క్రీజులో నిలవలేకపోయారు. ఈ దశలో రాయుడుకు సుమంత్ (18 నాటౌట్) అండగా నిలిచాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 26 పరుగులు జోడించాక అంకిత్ బౌలింగ్‌లో జట్టు స్కోరు 136 పరుగుల వద్ద రాయుడు ఎల్బీగా వెనుదిరిగాడు. రైనా మెరుపులు... సాధారణ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన ఉత్తర్‌ప్రదేశ్ జట్టుకు శుభారంభం దక్కింది. ఓపెనర్లు ఉపేంద్ర యాదవ్ (25), సమర్థ్ సింగ్ (36) తొలి వికెట్‌కు 48 పరుగులు జోడించారు. తర్వాత క్రీజులోకి వచ్చిన సురేశ్ రైనా ధాటికి లక్ష్యం కరిగిపోయింది. కెప్టెన్ అక్ష్ దీప్ నాథ్ (3), రింకూ సింగ్ (0) విఫలమైనప్పటికీ... ప్రియం గార్గ్ (19 నాటౌట్) తోడుగా రైనా సులువుగా లక్ష్యాన్ని ఛేదించాడు. స్కోరు వివరాలు హైదరాబాద్ ఇన్నింగ్స్: తన్మయ్ (బి) అంకిత్ 16; అక్షత్ రెడ్డి (బి) యశ్ దయాల్ 9, ఆశిష్ రెడ్డి (బి) అక్ష్ దీప్నాథ్ 16; సందీప్ (సి) బాబీ (బి) అ„Š దీప్నాథ్ 33; రాయుడు ఎల్బీ (బి) అంకిత్ 29; రోహిత్ రాయుడు (సి) ఉపేంద్ర (బి) సౌరభ్ కుమార్ 7; మిలింద్ (సి) రైనా (బి) అంకిత్ 1; సుమంత్ (నాటౌట్) 18; మెహదీ హసన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 139. వికెట్ల పతనం: 1–24, 2–26, 3–68, 4–92, 5–106, 6–113, 7–136. బౌలింగ్: అంకిత్ రాజ్‌పుత్ 4–1–31–3, యశ్ దయాల్ 3–8–21–1, శివ సింగ్ 4–7–24–0, బాబీ 2–6–10–0, సౌరభ్ 3–3–32–1, అ„Š దీప్ 4–7–18–2. ఉత్తర్‌ప్రదేశ్ ఇన్నింగ్స్: ఉపేంద్ర యాదవ్ ఎల్బీ (బి) ఆశిష్ రెడ్డి 25; సమర్థ్ సింగ్ (సి) రాయుడు (బి) సాకేత్ 36; రైనా (నాటౌట్) 54; అ„Š దీప్ ఎల్బీ (బి) ఆశిష్ రెడ్డి 3; రింకూ సింగ్ (సి) సుమంత్ (బి) ఆశిష్ 0; ప్రియం గార్గ్ (నాటౌట్) 19; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (18.3 ఓవర్లలో 4 వికెట్లకు) 143. వికెట్ల పతనం: 1–48, 2–85, 3–97, 4–97. బౌలింగ్: సిరాజ్ 3–8–28–0, మిలింద్ 3.3–9–24–0, మెహదీహసన్ 4–9–32–0, సాకేత్ 4–9–23–1, ఆశిష్ రెడ్డి 4–8–33–3. -
సౌత్‌జోన్‌కు మరో పరాజయం
ముస్తాక్ అలీ టి20 టోర్నీ ముంబై: దేశవాళీ టి20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీలో సౌత్‌జోన్ జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. బుధవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఈస్ట్‌జోన్ 6 వికెట్ల తేడాతో సౌత్‌జోన్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సౌత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (36 బంతుల్లో 72; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ వినయ్ కుమార్ (47 బంతుల్లో 68; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగారు. మనోజ్ తివారీకి 3 వికెట్లు దక్కాయి. అనంతరం ఈస్ట్ 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 181 పరుగులు చేసింది. ఇషాంక్ జగ్గీ (51 బంతుల్లో 90; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగి ఈస్ట్‌ను గెలిపించాడు. మరో మ్యాచ్‌లో సెంట్రల్ జోన్ 4 పరుగులతో నార్త్‌జోన్‌ను ఓడించింది. మహేశ్ రావత్ (40 బంతుల్లో 57 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), నమన్ ఓజా (34 బంతుల్లో 48; 6 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడటంతో సెంట్రల్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులు చేసింది. అనంతరం శిఖర్ ధావన్ (39 బంతుల్లో 37; 5 ఫోర్లు), యువరాజ్ సింగ్ (20 బంతుల్లో 33; 4 సిక్సర్లు) రాణించినా నార్త్ జోన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 163 పరుగులు మాత్రమే చేయగలిగింది.