సౌత్‌జోన్‌కు మరో పరాజయం | Another was beaten to the South Zone | Sakshi
Sakshi News home page

సౌత్‌జోన్‌కు మరో పరాజయం

Published Thu, Feb 16 2017 12:16 AM | Last Updated on Tue, Sep 5 2017 3:48 AM

సౌత్‌జోన్‌కు మరో పరాజయం

సౌత్‌జోన్‌కు మరో పరాజయం

ముస్తాక్‌ అలీ టి20 టోర్నీ

ముంబై: దేశవాళీ టి20 టోర్నీ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో సౌత్‌జోన్‌ జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. బుధవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఈస్ట్‌జోన్‌ 6 వికెట్ల తేడాతో సౌత్‌జోన్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సౌత్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు చేసింది. మయాంక్‌ అగర్వాల్‌ (36 బంతుల్లో 72; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్‌ వినయ్‌ కుమార్‌ (47 బంతుల్లో 68; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగారు. మనోజ్‌ తివారీకి 3 వికెట్లు దక్కాయి. అనంతరం ఈస్ట్‌ 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 181 పరుగులు చేసింది. ఇషాంక్‌ జగ్గీ (51 బంతుల్లో 90; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగి ఈస్ట్‌ను గెలిపించాడు.

మరో మ్యాచ్‌లో సెంట్రల్‌ జోన్‌ 4 పరుగులతో నార్త్‌జోన్‌ను ఓడించింది. మహేశ్‌ రావత్‌ (40 బంతుల్లో 57 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌), నమన్‌ ఓజా (34 బంతుల్లో 48; 6 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడటంతో సెంట్రల్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులు చేసింది. అనంతరం శిఖర్‌ ధావన్‌ (39 బంతుల్లో 37; 5 ఫోర్లు), యువరాజ్‌ సింగ్‌ (20 బంతుల్లో 33; 4 సిక్సర్లు) రాణించినా నార్త్‌ జోన్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 163 పరుగులు మాత్రమే చేయగలిగింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement