సాక్షి, హైదరాబాద్: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటుతోన్న ఆంధ్ర క్రికెట్ జట్టు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 టోర్నమెంట్‌లో వరుస విజయాలతో దూసుకెళుతోంది. గత రెండు మ్యాచ్‌ల్లో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన ఆంధ్ర జట్టు అదే జోరు కొనసాగిస్తూ మహారాష్ట్రను చిత్తు చేసి ‘హ్యాట్రిక్’ విజయం నమోదు చేసుకుంది. గ్రూప్ ‘ఈ’లో భాగంగా శుక్రవారం సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో జరిగిన పోరులో ఆంధ్ర జట్టు 75 పరుగుల తేడాతో మహారాష్ట్రపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆంధ్ర జట్టు నిరీ్ణత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.
పైలా అవినాశ్ (39 బంతుల్లో 55; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధశతకంతో రాణించగా... అశి్వన్ హెబర్ (36; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్ రికీ భుయ్ (28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. మహారాష్ట్ర బౌలర్లలో ముకేశ్ 3, అర్షిన్ కులకర్ణి రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన మహారాష్ట్ర జట్టు 15.4 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌటైంది. రాహుల్ త్రిపాఠి (21), దివ్యాంగ్ (24 నాటౌట్) కాస్త పోరాడారు. కెపె్టన్ రుతురాజ్ గైక్వాడ్ (4) విఫలమయ్యాడు. ఆంధ్ర బౌలర్లలో శశికాంత్, యశ్వంత్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. గ్రూప్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన ఆంధ్ర జట్టు 12 పాయింట్లు ఖాతాలో వేసుకొని అగ్రస్థానంలో ఉంది. తదుపరి మ్యాచ్‌లో ఆదివారం సర్వీసెస్ జట్టుతో ఆంధ్ర ఆడుతుంది.
స్కోరు వివరాలు
ఆంధ్ర ఇన్నింగ్స్: కోన శ్రీకర్ భరత్ (బి) ముకేశ్ 7; అశి్వన్ హెబర్ (స్టంప్డ్) రుతురాజ్ (బి) విక్కీ 36; షేక్ రషీద్ (సి) నిఖిల్ నాయక్ (బి) ముకేశ్ 0; అవినాశ్ (బి) అర్షిన్ కులకర్ణి 55; ఎస్‌డీఎన్‌వీ ప్రసాద్ (సి) సిద్ధార్థ్ (బి) అర్షిన్ కులకర్ణి 1; రికీ భుయ్ (సి) సిద్ధార్థ్ (బి) ముకేశ్ 28; శశికాంత్ (నాటౌట్) 17; బోధల కుమార్ (సి) త్రిపాఠి (బి) దివ్యాంగ్ 2; సత్యనారాయణ రాజు (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–8, 2–18, 3–79, 4–82, 5–133, 6–141, 7–148. బౌలింగ్: ముకేశ్ 4–0–21–3; రామకృష్ణ 2–0–23–0; అర్షిన్ కులకర్ణి 3–0–26–2; విక్కీ 4–0–34–1; దివ్యాంగ్ 4–0–42–1; అజీమ్ కాజీ 3–0–25–0.
మహారాష్ట్ర ఇన్నింగ్స్: అర్షిన్ కులకర్ణి (బి) స్టీఫెన్ 16; రుతురాజ్ గైక్వాడ్ (సి) ప్రసాద్ (బి) సత్యనారాయణ రాజు 4; రాహుల్ త్రిపాఠి (సి) భరత్ (బి) శశికాంత్ 21; అంకిత్ (రనౌట్) 1; అజీమ్ కాజీ (సి అండ్ బి) శశికాంత్ 8; సిద్ధార్థ్ (సి) సత్యనారాయణ (బి) బోధల కుమార్ 0; నిఖిల్ నాయక్ (సి) భరత్ (బి) శశికాంత్ 10; దివ్యాంగ్ (నాటౌట్) 24; రామకృష్ణ (ఎల్బీ) యశ్వంత్ 1; విక్కీ (బి) యశ్వంత్ 0; ముకేశ్ (బి) యశ్వంత్ 6; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (15.4 ఓవర్లలో ఆలౌట్) 99. వికెట్ల పతనం: 1–20, 2–22, 3–30, 4–45, 5–50, 6–62, 7–63, 8–64, 9–64, 10–99. బౌలింగ్: స్టీఫెన్ 2–0–11–1; శశికాంత్ 4–0–22–3; సత్యనారాయణ రాజు 2–0–10–1; బోధల కుమార్ 4–0–24–1; యశ్వంత్ 3.4–0–29–3.
Comments
Please login to add a commentAdd a comment