హైదరాబాద్లో ఐపీఎల్ పండుగ | Hyderabad to host IPL matches | Sakshi
Sakshi News home page

హైదరాబాద్లో ఐపీఎల్ పండుగ

Published Sat, May 10 2014 4:45 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

హైదరాబాద్లో ఐపీఎల్ పండుగ - Sakshi

హైదరాబాద్లో ఐపీఎల్ పండుగ

హైదరాబాద్: హైదరాబాద్కు పొట్టి క్రికెట్ పండుగ వస్తోంది. ఎన్నికల కారణంగా దుబాయ్, ఇతర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఐపీఎల్ ఏడో అంచె పోటీలు ఇక నగరంలో జరగనున్నాయి. హైదరాబాద్ టీమ్ సన్ రైజర్స్ ఆడే నాలుగు మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనున్నారు.

ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 12, 14, 18, 20న ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతాయి. మ్యాచ్లకు భద్రత ఏర్పాట్లను సైబరాబాద్‌ పోలిస్ కమిషనర్ సీవీ ఆనంద్ సమీక్షించారు. 1500 మంది పోలీసు సిబ్బందితో భద్రత ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఒక్కో మ్యాచ్ను 39 వేల మంది వరకు స్టేడియంలో చూసే అవకాశముందని, అభిమానుల కోసం పార్కింగ్ పార్కింగ్ ఏర్పాటుచేశామని సీవీ ఆనంద్‌ తెలిపారు. స్టేడియం మొత్తం 58 సీసీ కెమెరాలు, స్టేడియం బయట ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని చెప్పారు. సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు సహా ఎలక్ట్రానిక్ వస్తువుల్ని స్టేడియం లోపలికి అనుమతించబోమని సీవీ ఆనంద్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement