Tamil Nadu Man Arrested For Streaming IPL Matches In Own App: సొంత యాప్ ద్వారా ఐపీఎల్ మ్యాచ్‌లను ఫ్రీగా ప్రసారం చేస్తున్న వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. గుర్తు తెలియని వ్యక్తులు తమ లింకును దొంగిలించి ఓ యాప్ ద్వారా ఐపీఎల్ మ్యాచ్‌లను ఫ్రీగా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారని హైదరాబాద్‌కు చెందిన స్టార్ స్పోర్ట్స్ టీవీ ప్రతినిధి కదరామ్ తుప్పా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. సాంకేతిక ఆధారాల సాయంతో ఆ యాప్‌ను తమిళనాడులోని శివగంగై జిల్లా నుంచి నిర్వహిస్తున్నట్టు గుర్తించారు.
ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం తమిళనాడు వెళ్లిన పోలీసులు శివగంగై సమీపంలోని కాంజిరంగల్‌లోని పిల్లైయార్ కోయిల్ వీధిలో ఉంటున్న రామమూర్తి (29) అనే వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కాగా, ఐపీఎల్ 2022 సీజన్ టీవీ ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఆ ఛానల్ బీసీసీఐతో 16,347 కోట్లకు డీల్ కుదుర్చుకుంది. అయితే కొందరు ఫ్రాడ్‌లు అక్రమంగా ఐపీఎల్ మ్యాచ్‌లను లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ లీగల్‌గా ఒప్పందం చేసుకున్న సంస్థలకు నష్టం చేకూరుస్తున్నారు. టీవీల్లో ఐపీఎల్ వ్యుయర్‌షిప్ క్రమంగా తగ్గుముఖం పడుతుండటమే ఇందుకు నిదర్శనం.
చదవండి: IPL 2022: సీఎస్‌కేకు మరో భారీ షాక్.. లీగ్‌ను వీడిన విదేశీ బ్యాటర్
Comments
Please login to add a commentAdd a comment