స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరిగాక రిస్ట్ వాచెస్ కనుమరుగై పోయాయి అనుకున్నాం. కానీ అవి స్మార్ట్ వాచెస్‌గా రూపాంతరం చెంది టైం సంగతి పక్కన పెడితే కాల్స్, మెసేజ్‌లను కంట్రోల్ చేయడంతో పాటు హెల్త్‌కి సంబంధించి వాకింగ్ మొదలు హార్ట్‌బీట్ వరకు సమస్త సమాచారం చెప్పేస్తున్నాయ్. ఇప్పుడు మరో అడుగు ముందుకు పడింది. స్మార్ట్ వాచెస్‌కి తోడుగా స్మార్ట్ గాగుల్స్ కూడా రంగంలోకి దిగాయి.
లైఫ్ స్టైల్ అంటే నిన్నా మొన్నటి వరకు ట్రెండీ గార్మెంట్స్‌ను బట్టి అంచనా వేసే వారు కానీ ఇప్పుడు కాలం మారింది. ఓ వ్యక్తి లైఫ్‌స్టైల్‌ని అంచనా వేయాలంటే ఉపయోగించే గ్యాడ్జెట్స్, టెక్నాలజీకి ఎంతగా అడాప్ట్ చేసుకుంటున్నారనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అయ్యాయి. ఈ ట్రెండ్ని అంచనా వేసిన ఇండియాకి చెందిన నాయిస్ సంస్థ తొలిసారిగా స్మార్ట్ గ్లాసెస్‌ని ఐ వేర్ ఐ1 పేరుతో ఇండియాలో రిలీజ్ చేసింది. లెటెస్ట్ టెక్నాలజీలో నాయిస్‌ల్యాబ్స్ రూపొందించిన ఈ గాస్లెస్ స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానం అవుతాయి. ఫోన్‌తో సంబంధం లేకుండానే కాల్స్‌ను ఆపరేట్ చేసుకునే వీలుంది. బ్లూటూత్ 5.0 ద్వారా ఈ గ్లాసెస్ మొబైల్‌తో కనెక్ట్ అవుతాయి. ఇందులో ప్రత్యేకంగా మోషన్ ఎస్టిమేషన్, మోషన్ కాంపెన్‌సేషన్ టెక్నాలజీను ఉపయోగించారు. దీంతో ఇయర్‌ఫోన్స్ లేకుండా సౌకర్యవంతంగా కాల్స్‌ను మాట్లాడుకునే వీలుంది.
మ్యూజిక్ మ్యాజిక్
ఫోన్ కాల్ మేనేజ్‌మెంట్‌తో పాటు నాయిస్ స్మార్ట్ గ్లాసెస్ ద్వారా చక్కని మ్యూజిక్ హియరింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను కూడా సొంతం చేసుకోవచ్చు. ఇయర్‌బడ్స్ లేకుండానే మ్యూజిక్ చక్కగా ఆస్వాదించేలా ఈ స్మార్ట్ గ్లాసెస్‌ను డిజైన్ చేశారు. వైర్‌లెస్ టెక్నాలజీ ద్వారా ఈ గ్లాసెస్‌ను ఛార్జ్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 9 గంటల పాటు పని చేస్తుంది. కేవలం 15 నిమిషాల ఛార్జింగ్‌తో సుమారు 120 పాటలు వినవచ్చు.
ఒత్తిడి తగ్గిస్తుంది
ఇక స్మార్ట్‌గ్లాసెస్ ఉపయోగించడం వల్ల కళ్లపై పడే ఒత్తడిని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా కంప్యూటర్ / ల్యాప్‌ట్యాప్‌ల ముందు పని చేసే సమయంలో కంటిపై పడే అదనపు ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆల్ట్రావైలెట్ కిరణాల నుంచి కళ్లకు రక్షణ కల్పిస్తుంది. ఇంత స్మార్ట్ గ్లాసెస్ అయినా ఇందులో కెమెరాలు లేకపోవడం ఒక లోటుగానే చెప్పుకోవచ్చు. కెమెరాతో పాటు మరికొన్ని సెన్సార్లను అమర్చినట్టయితే ఫ్యూచర్ టెక్నాలజీ మెటావర్స్‌కి కూడా ఉపయోగకరంగా ఉండేది.
ధర ఎంతంటే
నాయిస్ సంస్థ మార్కెట్‌లోకి తెచ్చిన స్మార్ట్ గ్లాసెస్ gonoise.com వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఎంఆర్‌పీ రూ.12,999లు కాగా ప్రారంభ ఆఫర్‌గా 53 శాతం డిస్కౌంట్‌తో రూ. 5,999లకే లభిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇండియాలో స్మార్ట్ గ్లాసెస్ మార్కెట్‌లో పెద్దగా లేవు. నాయిస్ కంటే ముందు బోస్ సంస్థ మ్యూజిక్ లవర్స్ కోసం స్మార్ట్‌గ్లాసెస్ మార్కెట్‌లోకి తీసుకొచ్చినా అవి పూర్తిగా ప్రీమియం కేటగిరిలో అందుబాటులో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment