eye glasses
-
గూగుల్ డూడుల్‌లో ఆ ఐ ఫ్రేమ్ ఏంటి? ఆమె ఎవరూ..?
గూగుల్ డూడుల్ చారిత్రక ఘట్టల రోజును, ప్రముఖులను, సెలబ్రెటీలను తన లోగో పేజితో సత్కరిస్తుంది. అందరికీ తెలిసిందే. కానీ ఈ రోజు గుగూల్ ఏకంగా ఐ ఫ్రేమ్‌తో సహా ఓ మహిళతో కూడిన డూడిల్‌ని రూపొందించింది. అసలు ఏంటీ ఆ ఐ ఫ్రేమ్? ఆ మహిళెవరూ? గూగుల్ ఈ రోజు చాలా వినూత్న రీతిలో డూడిల్‌ని రూపొందించింది. ఐ ఫ్రేమ్ చుట్టూ బాణాలు మధ్యలో ఓ మహిళ రూపు ఉండేలా రూపొందించింది. ఆమె నూయర్క్కి చెందిన ఆల్టినా షినాసి. ఈ రోజ ఆ మహిళ 116వ పుట్టిన రోజు సందర్భంగా ఇలా డూడుల్‌తో ఘనంగా సత్కరించింది. ఆమె క్యాట్ ఐ ఫ్రేమ్ సృష్టికర్త. షినాసి ఆగస్టు4, 1907లో న్యూయార్క్ మాన్‌హట్టన్‌లో జన్మించింది. ఉన్నత పాఠశాల విద్య అనంతంర చిత్రేఖనం అభ్యసించేందుకు పారిస్ వెళ్లింది. అప్పుడే ఆమెకు కళలపై ఆసక్తి ఏర్పడటం మొదలైంది. ఆమె యూఎస్‌కి తిరిగి వచ్చిన తర్వాత పీటర్ కోప్‌ల్యాండ్‌తో కలిసి పనిచేయడం ప్రారంభించింది. ఒక రోజు వీధుల గుండా నడుచుకుంటూ వెళ్తుండగా..హఠాత్తుగా అక్కడ ఉన్న గాజు ఫ్రేమ్లవైపు దృష్టి మళ్లింది. అక్కడ ఉన్నవన్నీ గుండ్రటి ఆకారంలో పెద్ద ఆసక్తికరంగా లేకపోవటాన్ని గమనించింది. ఆ కాలంలో మహిళలు ధరించే కళ్ల జోడులు కేవలం గుండ్రటి ఫ్రేమ్ ఆకారంలోనే ఉండేవి. దీంతో షినాస్ మహిళలకి సరికొత్త స్టయిల్ గ్లాస్‌లతో.. తమ గ్లామర్‌ని మరింత పెంచేలా చేసేవి రూపొందించాలని అనుకుంది. అందుకోసం తన సృజనాత్మకతకు పదును పెట్టింది. కోణాల అంచులతో కూడిన ఫ్రేమ్‌లు మహిళ లుక్‌ని మరింత అందంగా కనిపించేలా చేస్తుందని షినాసి విశ్వసించింది. అందుకోసం తయారీదారులు వద్దకు కాగితపు ముక్కలో ఫ్రేమ్ డిజైన్ డెమోలు ఇచ్చింది. అయితే వాళ్లంతా ఇందులో ప్రత్యేకత ఏమిలేదని కొట్టిపారేశారు. అయినా వెనక్కి తగ్గక తన ప్రయత్నాలు చేసుకుంటూనే పోతూ ఉంది. ఎవరో ఒకరికి నచ్చావా! అన్న ఆశతో ధైర్యంగా ముందుకు వెళ్లింది. చివరి ప్రయత్నంగా స్థానిక దుకాణ యజమానులను ఆశ్రయించి.. వారికి తన కాగితపు ఫ్రేమ్ డిజైన్ గురించి వివరించింది. వారు ఆమె నైపుణ్యాన్ని గుర్తించి మార్కెట్లోకి ఆమె తయారు చేసిన ఫ్రేమ్‌లని 'హర్లెక్విన్ గ్లాసెస్' పేరుతో తీసుకువచ్చారు. అది విజయవంతమైంది. దీంతో షినాసి పేరు యూఎస్ అంతటా నలుదిశలా వ్యాపించింది. అలా ఆమె సినీరంగంలోకి కూడా ప్రవేశించింది. అంతేగాదు 1960లో తన గురువు, మాజీ టీచర్ జార్జ్ గ్రోజ్తో కలిసి ఒక డాక్యుమెంటరీని నిర్మించింది. షినాసి 1995లో 'ది రోడ్ ఐ హావ్ ట్రావెల్డ్' అనే పేరుతో తన జ్ఞాపకాలకు సంబంధించి ఓ పుస్తకాన్ని ప్రచురించింది. ఆమె ఆగస్టు 19, 1999న మరణించారు. (చదవండి: ఆపిల్ మ్యాప్‌లో వినిపించే వాయిస్..ఏ మహిళదో తెలుసా!) -
ఖాళీగా కళ్లద్దాల పెట్టెలు.. అవాక్కయిన కంటి రోగులు
కామారెడ్డి టౌన్: కంటి వెలుగు కార్యక్రమంలో పరీక్ష చేయించుకున్నారు. కళ్లద్దాల పెట్టె అందిస్తే ఆనందంగా అందుకున్నారు.. తీరా దాన్ని తెరిచి చూస్తే ఖాళీగా కనిపించడంతో అవాక్కవుతున్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం అంచనూర్ గ్రామానికి చెందిన దూడ బీరయ్య కంటి వెలుగు కార్యక్రమంలో తనిఖీ చేయించుకున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయనకు వైద్య సిబ్బంది కళ్లద్దాల పెట్టె అందజేశారు. కానీ పెట్టె తెరిచాక అందులో కళ్లద్దాలు లేకపోవడంతో బీరయ్య, అక్కడి వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది విస్తుపోయారు. మళ్లీ వివరాలను నమోదు చేసుకుని ఆర్డర్ చేస్తామని తెలిపారు. చాలాచోట్ల ఇలాగే జరుగుతోందని సిబ్బంది వాపోతున్నారు. -
‘కంటి వెలుగు’కు అనూహ్య స్పందన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ‘కంటి వెలుగు’కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నాటికి 14,92,450 మంది కంటి పరీక్షలు చేయుంచుకున్నారు. మంగళవారం ఒక్కరోజే 2,11,184 మంది వైద్య పరీక్షలు చేయించుకోగా...42 వేల మందికి కళ్లజోళ్లు ఉచితంగా పంపిణీ చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,38,608 మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. జనవరి 19 నుంచి రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం జనవరి 19 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమైంది. కంటి వెలుగు వైద్య శిబిరాలు స్థానిక ప్రజా ప్రతినిధుల సమన్వయంతో సందడిగా ఉన్నాయి. క్యాంపుల నిర్వహణకు జిల్లా అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడంతో ఎక్కడ ఎలాంటి ఫిర్యాదులు నమోదు కాలేదు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు.. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్య శిబిరాలు కంటి పరీక్షలు చేస్తున్నాయి. వైద్య శిబిరాల్లో ప్రత్యేక సాప్ట్వేర్ సహాయంతో కంటి పరీక్షలు చేస్తున్నారు. డీఈవో, ఏఎన్ఎంలు ట్యాబ్‌ల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని నమోదు చేస్తున్నారు. కంటి పరీక్షల తర్వాత అదే వైద్య శిబిరంలో అవసరమైతే అక్కడికక్కడే రీడింగ్ గ్లాసులు పంపిణీ చేస్తున్నారు. దీంతో కంటి వైద్య శిబిరాల నిర్వహణపై ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రభుత్వ సిబ్బందికి సంబంధిత కార్యాలయాలలో, పత్రిక విలేకరులకు ఆయా ప్రెస్‌క్లబ్‌ల వద్ద, పోలీస్ బెటాలియన్ సిబ్బందికి వారి కార్యాలయాల్లోనే ప్రత్యేకంగా కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. -
రెండో రోజు 2.14 లక్షల మందికి కంటి వెలుగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కంటి వెలుగు కార్యక్రమం రెండో రోజు శుక్రవారం 2.14 లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు. దీంతో రెండ్రోజుల్లో 3.81 లక్షల మందికి పరీక్షలు నిర్వహించినట్లయింది. రెండో రోజు 53,719 మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేశారు. 38 వేలమందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ అవసరమని గుర్తించారు. కంటి సమస్యలు లేనివారు 1.22 లక్షల మంది ఉన్నట్లు తెలిపారు. -
స్మార్ట్ వాచెస్ ఓల్డ్ ట్రెండ్.. ఇప్పుడొచ్చాయ్ స్మార్ట్ గ్లాసెస్
స్మార్ట్ఫోన్ల వినియోగం పెరిగాక రిస్ట్ వాచెస్ కనుమరుగై పోయాయి అనుకున్నాం. కానీ అవి స్మార్ట్ వాచెస్గా రూపాంతరం చెంది టైం సంగతి పక్కన పెడితే కాల్స్, మెసేజ్‌లను కంట్రోల్ చేయడంతో పాటు హెల్త్‌కి సంబంధించి వాకింగ్ మొదలు హార్ట్‌బీట్ వరకు సమస్త సమాచారం చెప్పేస్తున్నాయ్. ఇప్పుడు మరో అడుగు ముందుకు పడింది. స్మార్ట్ వాచెస్కి తోడుగా స్మార్ట్ గాగుల్స్ కూడా రంగంలోకి దిగాయి. లైఫ్ స్టైల్ అంటే నిన్నా మొన్నటి వరకు ట్రెండీ గార్మెంట్స్‌ను బట్టి అంచనా వేసే వారు కానీ ఇప్పుడు కాలం మారింది. ఓ వ్యక్తి లైఫ్‌స్టైల్‌ని అంచనా వేయాలంటే ఉపయోగించే గ్యాడ్జెట్స్, టెక్నాలజీకి ఎంతగా అడాప్ట్ చేసుకుంటున్నారనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అయ్యాయి. ఈ ట్రెండ్‌ని అంచనా వేసిన ఇండియాకి చెందిన నాయిస్ సంస్థ తొలిసారిగా స్మార్ట్ గ్లాసెస్‌ని ఐ వేర్ ఐ1 పేరుతో ఇండియాలో రిలీజ్ చేసింది. లెటెస్ట్ టెక్నాలజీలో నాయిస్ల్యాబ్స్ రూపొందించిన ఈ గాస్లెస్ స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానం అవుతాయి. ఫోన్‌తో సంబంధం లేకుండానే కాల్స్‌ను ఆపరేట్ చేసుకునే వీలుంది. బ్లూటూత్ 5.0 ద్వారా ఈ గ్లాసెస్ మొబైల్‌తో కనెక్ట్ అవుతాయి. ఇందులో ప్రత్యేకంగా మోషన్ ఎస్టిమేషన్, మోషన్ కాంపెన్సేషన్ టెక్నాలజీను ఉపయోగించారు. దీంతో ఇయర్‌ఫోన్స్ లేకుండా సౌకర్యవంతంగా కాల్స్‌ను మాట్లాడుకునే వీలుంది. మ్యూజిక్ మ్యాజిక్ ఫోన్ కాల్ మేనేజ్మెంట్తో పాటు నాయిస్ స్మార్ట్ గ్లాసెస్ ద్వారా చక్కని మ్యూజిక్ హియరింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను కూడా సొంతం చేసుకోవచ్చు. ఇయర్‌బడ్స్ లేకుండానే మ్యూజిక్ చక్కగా ఆస్వాదించేలా ఈ స్మార్ట్ గ్లాసెస్‌ను డిజైన్ చేశారు. వైర్లెస్ టెక్నాలజీ ద్వారా ఈ గ్లాసెస్‌ను ఛార్జ్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 9 గంటల పాటు పని చేస్తుంది. కేవలం 15 నిమిషాల ఛార్జింగ్‌తో సుమారు 120 పాటలు వినవచ్చు. ఒత్తిడి తగ్గిస్తుంది ఇక స్మార్ట్‌గ్లాసెస్ ఉపయోగించడం వల్ల కళ్లపై పడే ఒత్తడిని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా కంప్యూటర్ / ల్యాప్‌ట్యాప్‌ల ముందు పని చేసే సమయంలో కంటిపై పడే అదనపు ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆల్ట్రావైలెట్ కిరణాల నుంచి కళ్లకు రక్షణ కల్పిస్తుంది. ఇంత స్మార్ట్ గ్లాసెస్ అయినా ఇందులో కెమెరాలు లేకపోవడం ఒక లోటుగానే చెప్పుకోవచ్చు. కెమెరాతో పాటు మరికొన్ని సెన్సార్లను అమర్చినట్టయితే ఫ్యూచర్ టెక్నాలజీ మెటావర్స్‌కి కూడా ఉపయోగకరంగా ఉండేది. ధర ఎంతంటే నాయిస్ సంస్థ మార్కెట్లోకి తెచ్చిన స్మార్ట్ గ్లాసెస్ gonoise.com వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఎంఆర్పీ రూ.12,999లు కాగా ప్రారంభ ఆఫర్‌గా 53 శాతం డిస్కౌంట్‌తో రూ. 5,999లకే లభిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇండియాలో స్మార్ట్ గ్లాసెస్ మార్కెట్లో పెద్దగా లేవు. నాయిస్ కంటే ముందు బోస్ సంస్థ మ్యూజిక్ లవర్స్ కోసం స్మార్ట్‌గ్లాసెస్ మార్కెట్లోకి తీసుకొచ్చినా అవి పూర్తిగా ప్రీమియం కేటగిరిలో అందుబాటులో ఉన్నాయి. చదవండి: పోకో సరికొత్త స్మార్ట్‌ఫోన్, స్పెషల్ ఫీచర్లతో -
2,000 మంది నియామకం: లెన్స్‌కార్ట్
న్యూఢిల్లీ: కంటి అద్దాల తయారీ, విక్రయంలో ఉన్న లెన్స్‌కార్ట్ వచ్చే ఏడాది మార్చి నాటికి కొత్తగా 2,000 మందికిపైగా సిబ్బందిని నియమించుకోనున్నట్టు ప్రకటించింది. అలాగే సింగపూర్, పశ్చిమ ఆసియా, యూఎస్‌లో మరో 300 మందిని చేర్చుకోనున్నట్టు బుధవారం వెల్లడించింది. టెక్నాలజీ, డేటా సైన్స్, విక్రయాలు, సరఫరా, ఫైనాన్స్, మానవ వనరుల వంటి విభాగాల్లో ఈ నియామకాలు చేపడుతున్నట్టు తెలిపింది. సంస్థ వృద్ధిలో భాగంగా హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి ప్రాంతా ల్లో నిపుణులైన మానవ వనరులను కొత్తగా చేర్చుకుంటున్నట్టు లెన్స్‌కార్ట్ ఫౌండర్ పీయూష్ బన్సల్ వెల్లడించారు. ప్రస్తుతం కంపెనీలో 5,000 పైచిలుకు సిబ్బంది ఉన్నట్టు చెప్పారు. 2010లో ప్రారంభమైన లెన్స్‌కార్ట్ ఇప్పటికే కేకేఆర్, సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్, ఐఎఫ్‌సీ వంటి సంస్థల నుంచి నిధులను సమీకరించింది. -
నల్ల గుడ్డు చుట్టూ గుండ్రంగా తెల్లగా...
నా వయస్సు 17 ఏళ్లు. సంవత్సరం క్రితం నాకు రెండు కళ్లలోనూ కార్నియా (నల్లగుడ్డు) చుట్టూ తెల్లగా వచ్చింది. కళ్ల డాక్టర్గారికి చూపించాను. ‘డస్ట్ అలర్జీ’ అన్నారు. ఐ డ్రాప్స్ రాసి ఇచ్చారు. అవి వేసుకున్న కొన్ని నెలలకు తగ్గినట్లే తగ్గి వుళ్లీ మెుదటిలో లాగానే వచ్చింది. ఎన్నో కంటి ఆసుపత్రుల్లో చూపించాను. కానీ ఇది వూత్రం తగ్గడం లేదు. దయచేసి సలహా ఇవ్వండి. గత రెండు నెలలుగా కళ్లు బాగా దురద పెడుతున్నాయి. ఎరుపెక్కుతున్నాయి. భవిష్యత్తులో ఏదైనా సవుస్య ఎదురవతుందేమోనని భయంగా ఉంది. ఇది అలర్జీతో వచ్చిన సవుస్యే. బయటి కాలుష్యానికీ, పుప్పొడికీ, దువు్మూ ధూళి వంటి వాటికి ఎక్స్పోజ్ అయితే అలర్జీ ఉన్నవాళ్లకు ఇలాంటి సవుస్య వచ్చే అవకాశం ఉంది. వైద్య పరిభాషలో దీన్ని ‘వీకేసీ’ అంటే... వెర్నల్ కెరటో కంజక్ట వైటిస్’ అంటారు. అందుకే మనం కాలుష్యాలకు దూరంగా ఉంటూ, కంటిని ఎప్పుడూ రక్షించుకోవాలి. రక్షణ కోసం ప్లెయిన్ ప్రొటెక్టివ్ గ్లాసెస్ వాడితే చాలావుట్టుకు రక్షణ ఉంటుంది. ఈ సవుస్య ఉన్నవారు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు కంటిని స్వచ్ఛమైన నీటితో కడుగుతూ ఉండాలి. డాక్టర్‌ను సంప్రదించి యాంటీ అలర్జిక్ చుక్కల వుందు ఎక్కువ కాలం వాడాల్సి ఉంటుంది. ఇందులో స్టెరాయిడల్, నాన్ స్టెరాయిడల్ (స్టెరాయిడ్ లేనివి) అనే రెండు మందులు ఉంటాయి. స్టెరాయిడ్ మాత్రం డాక్టర్గారి పర్యవేక్షణలో తాత్కాలికంగానే వాడాలి. దీర్ఘకాలం వాడకూడదు. దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. నాన్‌స్టెరాయిడ్ (స్టెరాయిడ్ లేనివి) వంటివి మాత్రం చాలా కాలం వరకు వాడవచ్చు. ఉదాహరణకు ఓలోపాటడిన్ వంటి నాన్‌స్టెరాయిడ్ డ్రాప్స్ రోజుకు రెండుసార్లు చొప్పున ఆరుమాసాల వరకు వాడవచ్చు. అలాగే లూబ్రికెంట్ డ్రాప్స్ కూడా వాడాలి. దాంతో అలర్జెన్స్ పలచబారుతాయి. కంటికి ఉపశమనం కలుగుతుంది. అప్పుడు నల్లగుడ్డు చుట్టూ ఉన్న తెల్లటి రంగు క్రమంగా మాయమవుతుంది. మీకు దేనితో అలర్జీ వస్తుందో గుర్తించి, దాని నుంచి దూరంగా ఉండాలి. ఎక్కువ అలర్జీ ఉన్నప్పుడు యాంటీహిస్టమైన్ ఐ డ్రాప్స్, యాంటీహిస్టమైన్ మాత్రలు కూడా వాడాల్సి వస్తుంది. ఆ మందులతో తప్పకుండా అలర్జీ నియంత్రణలోకి వస్తుంది. ఈ సవుస్యను దీర్ఘకాలం ఇలాగే వదిలేస్తే చూపు వుందగించడం, కార్నియా పొర దెబ్బతినడం వంటి సవుస్యలు వస్తాయి కాబట్టి వీలైనంత త్వరగా డాక్టర్‌కు చూపించుకొని దీర్ఘకాలం వుందులు వాడండి. ఇప్పుడు ఆధునికమైన వుంచి వుందులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ సవుస్య గురించి ఆందోళనపడాల్సిందేమీ లేదు. కళ్లు పొడిబారుతున్నాయి... పరిష్కారం చెప్పండి నా వయసు 47 ఏళ్లు. నేను దాదాపుగా ఎప్పుడూ కంప్యూటర్‌పైనే వర్క్ చేస్తుంటాను. కళ్లు విపరీతంగా పొడి బారుతున్నాయి. ఈ వేసవి ఎండవేడితో ఈ ఫీలింగ్ మరీ ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తోంది. దాంతో మాటిమాటికీ వెళ్లి... నీళ్లతో కళ్లు కడుక్కొని వస్తున్నాను. నా సమస్య ఏమిటి? దానికి పరిష్కారం సూచించండి. కంప్యూటర్‌పై ఎప్పుడూ కనురెప్పలు తదేకంగా ఏకాగ్రతతో ఆర్పకుండా చూసేవారికి కన్నుపొడిబారే సమస్య రావచ్చు. దీనికి వయసు పైబడటం, ఎప్పుడూ ఎయిర్కండిషన్డ్ గదుల్లో ఉండటం, కంటికి గాయం కావడం వంటి కారణాలు కూడా ఉండవచ్చు. వైద్యపరిభాషలో ఈ సమస్యను ‘కెరటో కంజంక్టివైటిస్ సిక్కా’ అంటారు. ఇందులో కంటిలోని కార్నియా, కంజంక్టివా పొరలు పొడిబారిపోతాయి. దీన్నే ‘కంప్యూటర్ విజన్ సిండ్రోమ్’ అని కూడా అంటారు. ఈ సమస్యకు నివారణ కోసం చేయాల్సినవి... ►కంటి రెప్పలను తరచూ ఆర్పుతూ ఉండాలి. ఎప్పుడూ తదేకంగా చూస్తూ ఉండకూడదు ►మనం చదువుతున్నప్పుడు తగినంత వెలుతురు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి ►చదువుతున్నప్పుడు మధ్యమధ్య కాసేపు కంటికి విశ్రాంతినివ్వండి. చిన్న అక్షరాలను చాలాసేపు చదవద్దు. అలా చదవాల్సి వస్తే మధ్య మధ్యన కాసేపు దూరంగా కూడా చూపును ప్రసరిస్తూ ఉండండి. మనం చదవాల్సినదెప్పుడూ కంటి కంటే కిందనే ఉండాలి. పై వైపు చూస్తూ చదవాల్సి వస్తే అది కేవలం కాసేపే తప్ప... ఎప్పుడూ అలా ఉండే అక్షరాలను చదువుతూ ఉండవద్దు మీరు చదవాల్సినప్పుడూ నేరుగా ఉండాలి. స్క్రీన్‌ను వాలుగా ఉంచి చదవవద్దు. మీరు స్క్రీన్‌పై చూడాల్సి ఉన్నప్పుడు ఎక్కువ చూడాల్సిన స్క్రీన్‌కూ, దాని బ్యాక్డ్రాప్కూ ఎక్కువ కాంట్రాస్ట్ లేకుండా చూసుకోండి ►టీవీ చూసేటప్పుడు గదిలో వెలుతురు ఉండేలా చూసుకోండి. చీకట్లో టీవీ చూడవద్దు. టీవీ చూసే సమయంలో స్క్రీన్‌నే తదేకంగా చూడవద్దు. మధ్య మధ్యన దృష్టిని మరలుస్తూ ఉండాలి తరచూ ఆరుబయటకు వెళ్తూ ఉండండి. ఎప్పుడూ ఏసీలో ఉండేవారు తరచూ స్వాభావికమైన సూర్యకాంతిలో వెలుతురుకూ ఎక్స్పోజ్ అయ్యేలా జాగ్రత్త తీసుకోవాలి. ఏసీ ఇంటెన్సిటీని మరీ ఎక్కువగా పెంచుకోవద్దు. ఇది కళ్లు మరీ పొడిబారడానికి దారితీస్తుంది. రూమ్‌లో హ్యుమిడిఫైయర్స్ ఉంచుకోవాలి. డాక్టర్‌ను సంప్రదించి ఆర్టిఫిషియల్ టియర్స్ వాడాలి. యాంటీ గ్లేర్ గ్లాసెస్ కొంతవరకు మీకు ఉపయోగపడతాయి ∙శరీరం నుంచి నీటి పాళ్లు తగ్గకుండా ఉండటం కోసం తరచూ ద్రవాహారం తీసుకుంటూ ఉండాలి. ఒమెగా ఫ్యాటీ ఆసిడ్స్ ఉండే ఆహారం గానీ లేదా కాప్సూ్యల్ గానీ తీసుకోవాలి. మీరు తీసుకునే ఆహారంలో అన్ని పోషకాలు అంటే... అన్నిరకాల వైటమిన్లు (ఏ, బీ,సీ), ఖనిజాలు... ముఖ్యంగా జింక్ ఉండేలా చూసుకోండి ∙ఆరుబయట తిరిగేప్పుడు కళ్లజోడును కాసేపు తీయండి. ►ఒత్తిడిని తగ్గించుకోవాలి. యోగా వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్‌ను అవలంబించండి ►కంటికి మురికి తగలకుండా జాగ్రత్తలు తీసుకోండి. చేతులు మురికి అయినప్పుడు వాటితోనే కళ్లు తుడుచుకోవద్దు ►మీ కళ్లు శుభ్రం చేసుకోడానికి, ముఖం కడక్కోడానికి శుభ్రమైన నీటిని ఉపయోగించండి. అందులో డిటర్జెంట్ లేకుండా చూసుకోండి ►పొగతాగే అలవాటు, ఆల్కహాల్ అలవాట్లను తక్షణం మానివేయండి. డాక్టర్ కె. రవికుమార్ రెడ్డి కంటి వైద్య నిపుణులు, మెడివిజన్ ఐ హాస్పిటల్,హైదరాబాద్. -
పాపకు మెల్లకన్ను ఉన్నట్లు అనిపిస్తోంది...
మా పాప వయసు మూడున్నర ఏళ్లు. వచ్చే ఏడాది స్కూల్లో వేయడం కోసం... ఇప్పట్నుంచే అలవాటు చేయడానికి తనను ప్లే స్కూల్‌కు పంపుతున్నాం. ఈ క్రమంలో ఆమెకు మెల్లకన్ను ఉన్నట్లు గుర్తించాను. పాప దేనినైనా తదేకంగా చూస్తున్నప్పుడు మెల్లకన్ను పెడుతోంది. మాకు తెలిసిన కంటి డాక్టర్‌ను సంప్రదిస్తే ఆమెకు కళ్లజోడు అవసరమని చెప్పారు. ఇంత చిన్న పాపకు కళ్లజోడు అవసరమా? ఆమెకు ఇంకేదైనా చికిత్స అందుబాటులో ఉందా? మీరు చెప్పిన వివరాల ప్రకారం బహుశా మీ పాపకు అకామడేటివ్ ఈసోట్రోపియా అనే కండిషన్ ఉండవచ్చునని తెలుస్తోంది. మెల్లకన్ను దూరదృష్టి (హైపర్‌మెట్రోపియా)ని సరిచేయకపోవడం వల్ల ఇలాంటి కండిషన్ వస్తుంది. ఈ సమస్య సాధారణంగా స్కూలుకు వెళ్లే పిల్లల్లో మొదలవుతుంది. ఏదైనా చదివే సమయంలో సరిగా కనిపించనప్పుడుగానీ లేదా తదేకంగా చూస్తూ తనకు కనిపిస్తున్నదాన్ని స్పష్టంగా చూసేందుకు అకామడేట్ చేసుకునే ప్రయత్నంలో గానీ ఈ కండిషన్ మొదలవుతుంది. అదే క్రమంగా మెల్లకన్నుకు దారితీస్తుంది. మీ పాప కంటి సమస్యను చక్కదిద్దడానికి ప్లస్ పవర్ ఉన్న లెన్స్‌లను (అద్దాలను) కంటివైద్యనిపుణులు సూచిస్తారు. ఈ కంటి అద్దాలను ఆరు నెలల పాటు వాడాక అప్పుడు మళ్లీ మెల్లకన్ను ఏ మేరకు ఉందో పరీక్షించి చూస్తారు. ఈ క్రమంలో వయసు పెరిగేకొద్దీ ప్లస్ పవర్ తగ్గే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే మెల్లకన్ను సమస్య దానంతట అదే నయమవుతుంది. అప్పుడు ఆమెకు ఎలాంటి చికిత్సా అవసరం లేదు. ప్లస్ పవర్ ఉన్నంతకాలం ఆమెకు కళ్లజోడు తప్పనిసరి. ఇంత చిన్న వయసులో కళ్లజోడు ఎందుకు అంటూ మీరు గనక నిర్లక్ష్యం చేసే, అది ఆంబ్లోపియా (లేజీ ఐ) అనే కండిషన్‌కు దారితీసి, ఆమె ఒక కంట్లోగానీ, లేదా రెండు కళ్లలోగానీ చూపు తగ్గిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించి, వారి సలహా మేరకు మీ పాపకు తగిన అద్దాలు ఇప్పించండి. కళ్లద్దాలు ఇష్టం లేదు...ప్రత్యామ్నాయం ఉందా? నా వయస్సు 20 ఏళ్లు. నేను నాలుగేళ్లుగా కళ్లద్దాలు వాడుతున్నాను. నాకు మైనస్ 3 పవర్ ఐసైట్ ఉంది. నాకు కళ్లద్దాలు వాడటం ఇష్టం లేదు. నా వయసుకంటే పెద్దగా కనిపిస్తున్నాను. అందుకే వాటికి బదులుగా వాడదగిన కాంటాక్ట్ లెన్స్‌లు వాడటమో లేదా లాసిక్ సర్జరీయో చేయించుకోవాలనుకుంటున్నాను. దయచేసి ఆ రెండింటి గురించి వివరాలు చెప్పండి. మొదట కాంటాక్ట్ లెన్సెస్ గురించి తెలుసుకుందాం. అవి కంటి నల్లపొర (కార్నియా పొర) మీద వాడే ప్లాస్టిక్ లెన్సెస్ అన్నవూట. ఇందులో సాఫ్ట్ లెన్స్, సెమీ సాఫ్ట్ లెన్స్, గ్యాస్ పర్మియబుల్ లెన్స్, రిజిడ్ లెన్స్ అని వెరైటీస్ ఉన్నాయి. దీన్ని పేషెంట్ కార్నియాను బట్టి వాళ్లకు ఏది ఉపయుక్తంగా ఉంటుందో డాక్టర్లు సూచిస్తారు. కాంటాక్ట్ లెన్స్‌ను ఉదయం పెట్టుకొని, రాత్రి నిద్రపోయే వుుందు తొలగించాలి. వాటిని అలా పెట్టుకొనే నిద్రపోకూడదు. కాంటాక్ట్ లెన్స్ ఉన్నప్పుడు కన్ను నలపకూడదు. కాంటాక్ట్ లెన్స్ ఉన్నవాళ్లు ఎక్కువగా డస్ట్, పొగ, వేడిమి ఉన్న ప్రదేశాలకు వెళ్లకూడదు. ఇక లాసిక్ సర్జరీ అంటే కార్నియా పై పొర ఒంపు (కర్వేచర్)ను అడ్జెస్ట్ చేసి దూరదృష్టి (ప్లస్), హ్రస్వ దృష్టి (మైనస్) లోపాలను సరిచేస్తారు. రిఫ్రాక్షన్ స్టేబుల్‌గా ఉంటే లేజర్ చికిత్స కూడా చేయించుకోవచ్చు. లేజర్ అయినా వారం నుంచి పది రోజుల్లో చూపు నార్మల్‌గా ఉంటుంది. ఈ చికిత్సతో సాధారణ ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావం ఉండదు. అయితే 18 ఏళ్లు నిండిన తర్వాతే ఈ ఆపరేషన్‌ను సూచిస్తుంటాం. మీ వయసు 20 ఏళ్లు కాబట్టి మీరు ముందుగా కొన్ని పరీక్షలు చేయించుకొని, అర్హులైతే లాసిక్కు తప్పక వెళ్లవచ్చు. డాక్టర్ రవికుమార్ రెడ్డికంటి వైద్య నిపుణులు, మెడివిజన్ ఐ హాస్పిటల్,హైదరాబాద్. -
కళ్లజోళ్లు కానరావే..!
భీమవరం(ప్రకాశం చౌక్): జిల్లాలోని ప్రభుత్వాసుపత్రిలో ఐ కేంద్రాలను ఈ ఏడాది ఫ్రిబవరిలో ఏర్పాటు చేశారు. ఐ కేంద్రాల నిర్వహణను ప్రభుత్వం అపోలో సంస్థకు పీపీపీటి విధానంలో అప్పగించారు. ప్రారంభంలో కంటి పరీక్షలు నిర్వహించి కళ్లుజోడులను సకాలంలో అందించేవారు. రానురాను ఈ ఐ కేంద్రాల నిర్వహణపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యహరించడంతో కంటి సమస్యలతో వచ్చే వారికి నేత్ర పరీక్షలు తప్ప కళ్ల జోళ్లు సకాలంలో పంపిణీ చేయలేకపోతున్నారు. దీంతో కళ్లజోళ్ల కోసం నేత్ర పరీక్షలు చేయించుకున్నవారు కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. కళ్ల జోళ్లు 10 రోజుల్లో రావాలి. కాని నెలలు గడుస్తున్న రాకపోయేసరికి వారు ఇబ్బందులు పడుతున్నారు. బయట కళ్లజోళ్లు కొనుగోలు చేసుకోలేని పేదవారు ఉచితంగా కళ్లజోడు వస్తుందని కళ్లు కాయలు కాసేలా ఎదరుచూస్తున్నారు. 2 వేల కళ్లజోళ్లు అందించాలి జిల్లాలోని భీమవరం, ఆకివీడు, పాలకొల్లు, నరసాపురం, నిడదవోలు, అచంట, దెందులూరు, పోలవరం, భీమడోలు, కొవ్వూరు, చింతలపూడి, గోపాలపురం 12 ఆసుపత్రుల్లో ఈ ఐ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ 12 కేంద్రాలకూ రోజుకు 50 నుంచి 100 మంది వరకు కంటి చూపు సమస్యతో భాధడేవారు వచ్చి నేత్రల పరీక్షలు చేయించుకుంటారు. ఈ కేంద్రాల్లో వారికి కంటికి సంబంధించి ఏఆర్, కంటిలోని నరాలకు సంబంధించిన పరీక్షలు కంప్యూటర్ ద్వారా చేస్తారు. ఐ సెంటర్లో టెక్నిషియన్ గాని లేదా నేత్ర పరీక్ష అధికారులు చేసిన పరీక్షల్లో కళ్లజోళ్లు అవసరం అయితే కళ్లజోడు కావాలని ఆన్లైన్లోనే సమాచారం అపోలో వారికి పంపిస్తారు. ఇలా గత మూడు నెలల్లో జిల్లా నుంచి సుమారు 2 వేల కళ్లజోళ్లు అందించాలి. అయితే ఇప్పటికీ కళ్లజోళ్లు రాలేదు. ఎప్పుడు అందిస్తారో తెలియని పరిస్థితి ఐ కేంద్రాల్లో ఉంది. పనిచేయని కంప్యూటర్ భీమవరం ప్రభుత్వాసుపత్రిలోని ముఖ్యమంత్రి ఈ ఐ సెంటర్లో రెండు రోజులగా కంప్యూటర్ పనిచేయడం లేదు. దీంతో ఈ సెంటర్లో నేత్ర పరీక్షలు నిలిచిపోయాయి. కంటి పరీక్షల కోసం వచ్చిన వారు నిరాశగా తిరిగివెళ్లిపోతున్నారు. కళ్లజోళ్ల పంపిణీకిచర్యలు తీసుకుంటున్నాం జిల్లాలోని 12 ముఖ్యమంత్రి ఈఐ సెంటర్లలో పెడింగ్‌లో ఉన్న కళ్లజోళ్లు సుమారు 1500 వరకు ఉన్నాయి. వాటిని వెంటనే పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నాము. – డాక్టర్ కె.శంకరరావు,జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త, ఏలూరు -
‘వెలుగు’తోంది..!
ఖమ్మం వైద్యవిభాగం: కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో ఊపందుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంపై ముందస్తుగా విస్తృత ప్రచారం చేయడంతో వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు శరవేగంగా కొనసాగుతున్నాయి. పల్లె, పట్నం తేడా లేకుండా.. వయసు నిమిత్తం లేకుండా కంటి పరీక్షలు చేయించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత నెల 15న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం విదితమే. ఏ ఒక్కరూ కంటి సమస్యలతో బాధపడొద్దనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చింది. కంటి పరీక్షలు చేయడంతోపాటు సమస్య ఉన్న వారికి మందులతోపాటు కళ్లద్దాలు అవసరం ఉన్న వారికి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. శస్త్ర చికిత్సలు అవసరం అనుకుంటే నిర్దేశించిన ఆస్పత్రుల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 32 బృందాల పర్యవేక్షణలో.. జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం కోసం 32 వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. మొత్తం 36 బృందాలు అవసరముంటాయని అంచనాకు రాగా.. 32 వైద్య బృందాల ద్వారా వైద్య పరీక్షలు చేస్తున్నారు. మరో నాలుగు బృందాలను అత్యవసరం మేరకు అందుబాటులో ఉంచారు. ఎక్కడైనా సమస్య ఏర్పడినట్లయితే అత్యవసర బృందాలను వినియోగిస్తున్నారు. కార్యక్రమానికి ఎటువంటి ఆటంకం కలగకుండా డీఎంహెచ్ఓ కొండల్రావు పర్యవేక్షణలో వైద్య శిబిరాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో మొత్తం 14,39,000 జనాభా ఉండగా.. నగరంలో 3,20,000 మంది ఉన్నారు. అయితే ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రణాళిక లు తయారు చేసి.. ఆ దిశగా శిబిరాలు నిర్వహిస్తున్నారు. నెల రోజుల్లో 1,08,692 మందికి పరీక్షలు జిల్లావ్యాప్తంగా కంటి పరీక్షలు శరవేగంగా కొనసాగుతున్నాయి. కార్యక్రమం ప్రారంభించిన నెల రోజుల వ్యవధిలోనే జిల్లాలో 1,08,692 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 47,520 మంది పురుషులు కాగా.. 61,162 మంది మహిళలు ఉన్నారు. 10 మంది ట్రాన్స్‌జెండర్స్ పరీక్ష చేయించుకున్న వారిలో ఉన్నారు. జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమాన్ని గ్రామీణ, అర్బన్ ప్రాంతాలుగా విడదీశారు. 25 బృందాలు గ్రామీణ ప్రాంతంల్లో ప్రతి రోజూ పరీక్షలు చేస్తున్నారు. 7 బృందాలు నగరంలో పరీక్షలు నిర్వహిస్తున్నాయి. జిల్లాలో 447 గ్రామాలు ఉండగా.. ఇప్పటివరకు 108 గ్రామాల్లో పరీక్షలు పూర్తయ్యాయి. అలాగే నగరంలో 50 డివిజన్లు ఉండగా.. ప్రస్తుతం 9 డివిజన్లలో పరీక్షలు పూర్తి చేశారు. వారంలో 5 రోజులపాటు శిబిరాలు నిర్వహిస్తుండగా.. రోజుకు గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో బృందం 250, పట్టణ ప్రాంతంలో 350 మందికి పరీక్షలు చేయాలని నిర్ణయించారు. పథకం ప్రారంభంలో కొంతమేర మందకొడిగా సాగినా.. ప్రస్తుతం కంటి పరీక్షలు ఊపందుకున్నాయి. 27,580 మందికి కళ్లద్దాల పంపిణీ కంటి వెలుగు కార్యక్రమం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 27,580 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. కంటి సమస్యతో బాధపడుతూ.. కళ్లద్దాలు అవసరం ఉన్న వారికి మాత్రమే డాక్టర్లు కళ్లద్దాలు రాస్తున్నారు. మరో 28,223 మందికి కళ్లద్దాలు ఇవ్వాలని డాక్టర్లు రాయగా.. వారికి హైదరాబాద్ నుంచి రావాల్సి ఉంది. జిల్లాకు 1,60,000 కళ్లద్దాలు పంపించారు. అయితే కంటి సమస్య ఎక్కువ ఉన్న వారికి ప్రత్యేకంగా ఇండెంట్ పెట్టి తెప్పిస్తున్నారు. అయితే నెల రోజుల కాలంలో 13,047 మందికి కంటి శస్త్ర చికిత్సలు చేయాలని గుర్తించారు. అందులో 9,626 మందిని ఖమ్మం, 3,421 మందిని హైదరాబాద్ ఆస్పత్రులకు ఆపరేషన్ కోసం పంపించారు. ప్రతి ఒక్కరికీ పరీక్షలు శిబిరానికి వచ్చే ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తాం. శిబిరానికి వచ్చే వారు ఆధార్ కార్డు తీసుకురావాల్సి ఉంటుంది. జిల్లాలో కంటి పరీక్షలు ప్రస్తుతం ఊపందుకున్నాయి. 32 వైద్య బృందాల ద్వారా ప్రతి రోజు 9వేల మందికి పైగా పరీక్షిస్తున్నాం. అత్యవసర బృందాలను కూడా వినియోగిస్తున్నాం. మందులు, కళ్లజోళ్లకు ఎలాంటి కొరత లేదు. నాలుగు నెలలకుపైగా శిబిరాలు నిర్వహిస్తాం. ప్రతి ఒక్కరినీ పరీక్ష చేస్తాం. ప్రజలు శిబిరాలను సద్వినియోగం చేసుకొని కంటి పరీక్షలు చేయించుకోవాలి. – కొండల్రావు, డీఎంహెచ్ఓ -
40 లక్షల మందికి కళ్లద్దాలు
సాక్షి, హైదరాబాద్: ‘కంటి వెలుగు’కింద రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల మందికి ఉచితంగా కళ్లద్దాలు సరఫరా చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభించనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మొత్తం 3.5 కోట్ల మంది ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించనుంది. అందులో 40 లక్షల మందికి కళ్లద్దాలు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు. ఆ మేరకు కళ్లద్దాలను ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కంపెనీ ‘ఎస్సల్లార్’ సరఫరా చేయనుంది. జిల్లాలకు ఇప్పటికే 32 లక్షల కళ్లద్దాలు.. ఇప్పటికే 32 లక్షల కళ్లద్దాలు జిల్లాలకు సరఫరా అయ్యాయి. మొత్తంగా 36 లక్షల కళ్లద్దాలు, రీడింగ్ గ్లాసులు సరఫరా చేస్తారు. వాటిని అక్కడికక్కడే తక్షణమే అందజేస్తారు. ఇతరత్రా లోపంతో బాధపడుతున్న వారికి ప్రిస్కిప్షన్ ఇస్తే సంబంధిత కంపెనీ మూడు, నాలుగు వారాల్లో సరఫరా చేయనుంది. ఒక్కో కళ్లజోడు ఖరీదు రూ.100 కాగా, ఆ ప్రకారం ఎస్సల్లార్ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చారు. మొత్తం పరీక్షలు చేశాక దాదాపు 3 లక్షల మందికి శస్త్రచికిత్సలు అవసరం అవుతాయని సర్కారు అంచనా వేసింది. వారందరికీ ప్రభుత్వం ఉచిత శస్త్రచికిత్సలు చేయనుంది. ఇందుకోసం 114 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను, స్వచ్ఛంద సంస్థలను గుర్తించారు. మొత్తం కార్యక్రమాన్ని కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ద్వారా అమలు చేస్తారు. 150 శాశ్వత విజన్ సెంటర్లు రాష్ట్రంలో అంధత్వ నివారణ లక్ష్యంగా ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కళ్లద్దాలు ఉచితంగా ఇవ్వడం, ఉచిత శస్త్రచికిత్సలు చేయడం, ఉచిత మందులు సరఫరా చేయడం ఇందులో కీలకమైనవి. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం 106 కోట్ల రూపాయలు కేటాయించింది. గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధి యూనిట్‌గా కంటి పరీక్షలు జరుగుతాయి. మొత్తం 799 బృందాలను ఏర్పాటు చేశారు. అందులో 940 మంది మెడికల్ ఆఫీసర్లు, వెయ్యి మంది కంటి వైద్య నిపుణులు ఉంటారు. వారికి సాయంగా ఎనిమిది వేల మంది సిబ్బంది ఉంటారు. వారంతా శిక్షణ పొందినవారే. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా ప్రజాప్రతినిధులంతా కృషి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆరు నెలలపాటు అమలుచేస్తారు. భవిష్యత్తులో కంటి సమస్యతో బాధపడే వారికోసం 150 విజన్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. వాటిలో బాధితులకు నిరంతరం కంటి వైద్యం అందుబాటులో ఉంచుతారు. ఇక ఆర్బీఎస్కే కార్యక్రమం ద్వారా బడి పిల్లలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తారు. కాగా ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తుంటే.. వైద్య ఆరోగ్య శాఖ మాత్రం విస్త్రృత ప్రచారం కల్పించడంలో విఫలమైందన్న విమర్శలు వినవస్తున్నాయి. -
స్పీకర్ కళ్లద్దాలు రూ. 50వేలు
తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ స్పీకర్ కళ్లద్దాల కొనుగోలు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. స్పీకర్ శ్రీరామకృష్ణన్ కొనుగోలు చేసిన రూ.50 వేల విలువైన కళ్లద్దాలకు ప్రభుత్వమే డబ్బు చెల్లించిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్థిక క్రమశిక్షణ పాటించాలంటూ సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం గురువారం 2018–19 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మరునాడే ఈ అంశం వెలుగులోకొచ్చింది. డి.బి.బిను అనే న్యాయవాది సమాచార హక్కు చట్టం కింద పెట్టుకున్న అర్జీకి అసెంబ్లీ సెక్రటేరియట్ స్పందించింది. స్పీకర్ కళ్లజోడు కోసం మంజూరు చేసిన రూ.49వేలలో అద్దాలు రూ.4,900, ఫ్రేమ్‌కు రూ.45 వేలు ఖర్చయ్యాయని పేర్కొంది. స్పీకర్ వైద్యం ఖర్చుల కింద రూ.4.25 లక్షలు చెల్లించినట్లు వెల్లడించింది. -
చూపు తగ్గుతోంది..!
న్యూఢిల్లీ: నగరంలో కంటిచూపు తగ్గుతున్న పిల్లల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పది సంవత్సరాల లోపు చిన్నారుల్లో ఈ సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. పదేళ్లలోపు ఉన్న వంద మంది చిన్నారులను పరిశీలిస్తే.. సుమారు ఎనిమిది మందికిపైగా పిల్లలు దృష్టిలోపంతో బాధపడుతున్నారు. కొందరిలో కంటిఅద్దాలు సమకూర్చినా చూపు బాగుపడని పరిస్థితి ఉంది. పిల్లల్లో చూపు తగ్గడానికి అనేక కారణాలున్నారుు. ప్రధానంగా కంటిచూపు తగ్గడానికి జన్యుపర సమస్య ఒకటైతే, విటమిన్-ఏ లోపం, తగినంత వెలుతురు లేని గదుల్లో విద్యాభ్యాసం చేయడం, అదేపనిగా వీడియో గేమ్స్, కంప్యూటర్, టీవీ చూడటం వ ంటివి కూడా కారణమవుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. కంటిచూపు తగ్గకుండా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆరునెలలకో సారి ఏ-విటమిన్ పిల్లలకు అందిస్తున్నా.. ఆశించిన స్థాయిలో ఫలితం ఉండడం లేదు. విటమిన్ ‘ఏ’ ద్రవం అందించే కార్యక్రమం పకడ్బందీగా చేపట్టకపోవడంతోనే సమస్య ఉత్పన్నమవుతున్నట్లు ఆరోపణలున్నారుు. పిల్లల చూపు తగ్గకుండా ఉండేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. కంటిచూపు సమస్యతో బాధపడుతునన వారిలో ఎక్కువగా ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు.. వీరిలో ఎక్కువ మంది ఉన్నత వర్గాలకు చెందిన వారే ఉంటున్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య రెండు లక్షల వరకు ఉంది. వీరిలో నాలుగు శాతం పదేళ్ల వయసులోపు పిల్లలు ఉండగా ... 11 నుంచి 16 సంవత్సరాల లోపు వారు ఎక్కువ గా ఉంటున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఆహారంలో విటమిన్ ఏ, కెరోటినాయిడ్లు, ట్యూటిన్ అధికంగా ఉండే ఆకుకూరలు, క్యారెట్, ద్రాక్ష, బొప్పాయి, చిలగడ దుంపలు వంటి తినడంతో కంటి సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు. ఏ పనిచేస్తున్నా గంటకోసారి దూరంగా ఉన్న ఏదైనా వ స్తువును తదేకంగా చూడాలి. తర్వాత దగ్గరగా ఉన్న వస్తువును చూడాలి. ఇలా ఐదారుసార్లు చేయడంతో కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. పనిలో పడిపోయి కళ్లను మూసి తెరుస్తుండడం మరిచిపోవద్దు. పిల్లలు, పెద్దలు ఎలాంటి సమస్యలేకపోయినా క్రమం తప్పకుండా కళ్లను పరీక్ష చేయించుకోవాలి. కంటి సమస్యలు వచ్చిన ప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి. పిల్లలకు దృష్టిలోపం రాకుండా ఉండేందుకు పెద్దలూ జాగ్రత్తలు తీసుకోవాలి. చూపు తగ్గడానికి కారణాలు ఇవీ.. * పిల్లలకు పాలు, గుడ్లు, ఆకుకూరలు, కాయగూరలు, పప్పుదినుసులు, అసవరం అయినంతమేరకు తీసుకోకపోవడంతో ఏ-విటమిన్, కాల్షియం స్థాయి తగ్గిపోయి కంటి చూపుతోపాటు ఇతర ఆరోగ్యసమస్యలూ వస్తాయి. * వెలుతురు, గాలి లేని ఇరుకుగదుల్లో విద్యాభ్యాసం చేయడం. * గతంలో బ్లాక్‌బోర్డుపై చాక్‌పీస్‌తో అక్షరాలు రాసేవారు. ఈ అక్షరాలు కళ్లకు ఇబ్బంది కలగకుండా పెద్దగా కూడా కనిపించేవి. తరగతి గదిలో చివరివరుసలో కూర్చున్నా..అక్షరాలు స్పష్టంగా కనిపించేవి. ఇప్పుడు బ్లాక్ బోర్డుల స్థానంలో వైట్‌బోర్డుపై మార్కర్‌తో చిన్న అక్షరాలు రాస్తూ విద్యాభ్యాసం చేస్తున్నారు. ఫలితంగా కళ్లపై ఒత్తిడిపడి నరాలపై ప్రభావం చూపి చూపు తగ్గుతోంది. * పస్తుతం పుస్తకాల్లో అక్షరాలు కూడా మరీ చిన్నవిగా ముద్రిస్తున్నారు. ఇది కూడా కొంతవరకు ప్రభావం చూపుతోంది. * టీవీ, కంప్యూటర్, వీడియో గేమ్స్ ఆడే పిల్లల్లో ఈ కంటిచూపు సమస్య ఉత్పన్నమవుతోంది. -
కళ్లు ఆర్పించే కళ్లజోడు!
టోక్యో: పనిలో బిజీగా ఉండి లేదా కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు మనం తరచూ కళ్లు ఆర్పడం మరిచిపోతుంటాం. దీనివల్ల కళ్లలో తేమ తగ్గిపోయి డ్రై ఐస్ సిండ్రోమ్ సమస్య తలెత్తుతుంటుంది. అయితే ఈ సమస్యను నివారించేందుకు ఉపయోగపడే ‘వింక్ గ్లాసెస్’ను జపాన్‌లోని ‘మసునగ ఆప్టికల్’ వారు రూపొం దించారు. చిన్న బ్యాటరీ సాయంతో పనిచేసే ఈ కళ్లద్దాలపై లిక్విడ్ క్రిస్టల్ షీట్లు ఉంటాయి. జస్ట్ ఓ స్విచ్‌ను నొక్కి ఆన్‌చేసి పెట్టుకుంటే చాలు.. ప్రతి 10 సెకన్లకు ఓసారి 0.2 సెకన్లపాటు ఆటోమేటిక్‌గా కళ్లద్దాలపై క్రిస్టల్ షీట్లు మసకబారిపోతాయి. దీంతో మనం కూడా ఆటోమేటిక్‌గా కళ్లు ఆర్పేస్తామన్నమాట.ఈ కళ్లజోడు ఖరీదు రూ. 15,750 మాత్రమే!