కళ్లు ఆర్పించే కళ్లజోడు!
టోక్యో: పనిలో బిజీగా ఉండి లేదా కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు మనం తరచూ కళ్లు ఆర్పడం మరిచిపోతుంటాం. దీనివల్ల కళ్లలో తేమ తగ్గిపోయి డ్రై ఐస్ సిండ్రోమ్ సమస్య తలెత్తుతుంటుంది. అయితే ఈ సమస్యను నివారించేందుకు ఉపయోగపడే ‘వింక్ గ్లాసెస్’ను జపాన్‌లోని ‘మసునగ ఆప్టికల్’ వారు రూపొం దించారు. చిన్న బ్యాటరీ సాయంతో పనిచేసే ఈ కళ్లద్దాలపై లిక్విడ్ క్రిస్టల్ షీట్లు ఉంటాయి. జస్ట్ ఓ స్విచ్‌ను నొక్కి ఆన్‌చేసి పెట్టుకుంటే చాలు.. ప్రతి 10 సెకన్లకు ఓసారి 0.2 సెకన్లపాటు ఆటోమేటిక్‌గా కళ్లద్దాలపై క్రిస్టల్ షీట్లు మసకబారిపోతాయి. దీంతో మనం కూడా ఆటోమేటిక్‌గా కళ్లు ఆర్పేస్తామన్నమాట.ఈ కళ్లజోడు ఖరీదు రూ. 15,750 మాత్రమే!