గూగుల్‌ డూడుల్‌లో ఆ ఐ ఫ్రేమ్‌ ఏంటి? ఆమె ఎవరూ..? | Google Designing Cat Eye Glasses With Doodle | Sakshi
Sakshi News home page

గూగుల్‌ డూడుల్‌లో ఆ ఐ ఫ్రేమ్‌ ఏంటి? ఆమె ఎవరూ..?

Published Fri, Aug 4 2023 1:32 PM | Last Updated on Fri, Aug 4 2023 2:17 PM

Google Designing Cat Eye Glasses With Doodle - Sakshi

గూగుల్‌ డూడుల్‌ చారిత్రక ఘట్టల రోజును, ప్రముఖులను, సెలబ్రెటీలను తన లోగో పేజితో సత్కరిస్తుంది. అందరికీ తెలిసిందే. కానీ ఈ రోజు గుగూల్‌ ఏకంగా ఐ ఫ్రేమ్‌తో సహా ఓ మహిళతో కూడిన డూడిల్‌ని రూపొందించింది. అసలు ఏంటీ ఆ ఐ ఫ్రేమ్‌? ఆ మహిళెవరూ?

గూగుల్‌ ఈ రోజు చాలా వినూత్న రీతిలో డూడిల్‌ని రూపొందించింది. ఐ ఫ్రేమ్‌ చుట్టూ బాణాలు మధ్యలో ఓ మహిళ రూపు ఉండేలా రూపొందించింది. ఆమె నూయర్క్‌కి చెందిన ఆల్టినా షినాసి. ఈ రోజ ఆ మహిళ 116వ పుట్టిన రోజు సందర్భంగా ఇలా డూడుల్‌తో ఘనంగా సత్కరించింది. ఆమె క్యాట్‌ ఐ ఫ్రేమ్‌ సృష్టికర్త. షినాసి ఆగస్టు4, 1907లో న్యూయార్క్‌ మాన్‌హట్టన్‌లో జన్మించింది. ఉన్నత పాఠశాల విద్య అనంతంర చిత్రేఖనం అభ్యసించేందుకు పారిస్‌ వెళ్లింది. అప్పుడే ఆమెకు కళలపై ఆసక్తి ఏర్పడటం మొదలైంది.

ఆమె యూఎస్‌కి తిరిగి వచ్చిన తర్వాత పీటర్ కోప్‌ల్యాండ్‌తో కలిసి పనిచేయడం ప్రారంభించింది. ఒక రోజు వీధుల గుండా నడుచుకుంటూ వెళ్తుండగా..హఠాత్తుగా అక్కడ ఉన్న గాజు ఫ్రేమ్‌లవైపు దృష్టి మళ్లింది. అక్కడ ఉన్నవన్నీ గుండ్రటి ఆకారంలో పెద్ద ఆసక్తికరంగా లేకపోవటాన్ని గమనించింది. ఆ కాలంలో మహిళలు ధరించే కళ్ల జోడులు కేవలం గుండ్రటి ఫ్రేమ్‌ ఆకారంలోనే ఉండేవి. దీంతో షినాస్‌ మహిళలకి సరికొత్త స్టయిల్‌ గ్లాస్‌లతో.. తమ గ్లామర్‌ని మరింత పెంచేలా చేసేవి రూపొందించాలని అనుకుంది. అందుకోసం తన సృజనాత్మకతకు పదును పెట్టింది.

కోణాల అంచులతో కూడిన ఫ్రేమ్‌లు మహిళ లుక్‌ని మరింత అందంగా కనిపించేలా చేస్తుందని షినాసి విశ్వసించింది. అందుకోసం తయారీదారులు వద్దకు కాగితపు ముక్కలో ఫ్రేమ్‌ డిజైన్‌ డెమోలు ఇచ్చింది. అయితే వాళ్లంతా ఇందులో ప్రత్యేకత ఏమిలేదని కొట్టిపారేశారు. అయినా వెనక్కి తగ్గక తన ప్రయత్నాలు చేసుకుంటూనే పోతూ ఉంది. ఎవరో ఒకరికి నచ్చావా! అన్న ఆశతో ధైర్యంగా ముందుకు వెళ్లింది. చివరి ప్రయత్నంగా స్థానిక దుకాణ యజమానులను ఆశ్రయించి.. వారికి తన కాగితపు ఫ్రేమ్‌ డిజైన్‌ గురించి  వివరించింది.

వారు ఆమె నైపుణ్యాన్ని గుర్తించి మార్కెట్లోకి ఆమె తయారు చేసిన ఫ్రేమ్‌లని 'హర్లెక్విన్ గ్లాసెస్‌' పేరుతో తీసుకువచ్చారు. అది విజయవంతమైంది. దీంతో షినాసి పేరు యూఎస్‌ అంతటా నలుదిశలా వ్యాపించింది. అలా ఆమె సినీరంగంలోకి కూడా ప్రవేశించింది. అంతేగాదు 1960లో తన గురువు, మాజీ టీచర్‌ జార్జ్ గ్రోజ్‌తో కలిసి ఒక డాక్యుమెంటరీని నిర్మించింది. షినాసి 1995లో 'ది రోడ్ ఐ హావ్ ట్రావెల్డ్' అనే పేరుతో తన జ్ఞాపకాలకు సంబంధించి ఓ పుస్తకాన్ని ప్రచురించింది. ఆమె ఆగస్టు 19, 1999న మరణించారు. 

(చదవండి: ఆపిల్‌ మ్యాప్‌లో వినిపించే వాయిస్‌..ఏ మహిళదో తెలుసా!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement