Frame
-
గూగుల్ డూడుల్‌లో ఆ ఐ ఫ్రేమ్ ఏంటి? ఆమె ఎవరూ..?
గూగుల్ డూడుల్ చారిత్రక ఘట్టల రోజును, ప్రముఖులను, సెలబ్రెటీలను తన లోగో పేజితో సత్కరిస్తుంది. అందరికీ తెలిసిందే. కానీ ఈ రోజు గుగూల్ ఏకంగా ఐ ఫ్రేమ్‌తో సహా ఓ మహిళతో కూడిన డూడిల్‌ని రూపొందించింది. అసలు ఏంటీ ఆ ఐ ఫ్రేమ్? ఆ మహిళెవరూ? గూగుల్ ఈ రోజు చాలా వినూత్న రీతిలో డూడిల్‌ని రూపొందించింది. ఐ ఫ్రేమ్ చుట్టూ బాణాలు మధ్యలో ఓ మహిళ రూపు ఉండేలా రూపొందించింది. ఆమె నూయర్క్కి చెందిన ఆల్టినా షినాసి. ఈ రోజ ఆ మహిళ 116వ పుట్టిన రోజు సందర్భంగా ఇలా డూడుల్‌తో ఘనంగా సత్కరించింది. ఆమె క్యాట్ ఐ ఫ్రేమ్ సృష్టికర్త. షినాసి ఆగస్టు4, 1907లో న్యూయార్క్ మాన్‌హట్టన్‌లో జన్మించింది. ఉన్నత పాఠశాల విద్య అనంతంర చిత్రేఖనం అభ్యసించేందుకు పారిస్ వెళ్లింది. అప్పుడే ఆమెకు కళలపై ఆసక్తి ఏర్పడటం మొదలైంది. ఆమె యూఎస్‌కి తిరిగి వచ్చిన తర్వాత పీటర్ కోప్‌ల్యాండ్‌తో కలిసి పనిచేయడం ప్రారంభించింది. ఒక రోజు వీధుల గుండా నడుచుకుంటూ వెళ్తుండగా..హఠాత్తుగా అక్కడ ఉన్న గాజు ఫ్రేమ్లవైపు దృష్టి మళ్లింది. అక్కడ ఉన్నవన్నీ గుండ్రటి ఆకారంలో పెద్ద ఆసక్తికరంగా లేకపోవటాన్ని గమనించింది. ఆ కాలంలో మహిళలు ధరించే కళ్ల జోడులు కేవలం గుండ్రటి ఫ్రేమ్ ఆకారంలోనే ఉండేవి. దీంతో షినాస్ మహిళలకి సరికొత్త స్టయిల్ గ్లాస్‌లతో.. తమ గ్లామర్‌ని మరింత పెంచేలా చేసేవి రూపొందించాలని అనుకుంది. అందుకోసం తన సృజనాత్మకతకు పదును పెట్టింది. కోణాల అంచులతో కూడిన ఫ్రేమ్‌లు మహిళ లుక్‌ని మరింత అందంగా కనిపించేలా చేస్తుందని షినాసి విశ్వసించింది. అందుకోసం తయారీదారులు వద్దకు కాగితపు ముక్కలో ఫ్రేమ్ డిజైన్ డెమోలు ఇచ్చింది. అయితే వాళ్లంతా ఇందులో ప్రత్యేకత ఏమిలేదని కొట్టిపారేశారు. అయినా వెనక్కి తగ్గక తన ప్రయత్నాలు చేసుకుంటూనే పోతూ ఉంది. ఎవరో ఒకరికి నచ్చావా! అన్న ఆశతో ధైర్యంగా ముందుకు వెళ్లింది. చివరి ప్రయత్నంగా స్థానిక దుకాణ యజమానులను ఆశ్రయించి.. వారికి తన కాగితపు ఫ్రేమ్ డిజైన్ గురించి వివరించింది. వారు ఆమె నైపుణ్యాన్ని గుర్తించి మార్కెట్లోకి ఆమె తయారు చేసిన ఫ్రేమ్‌లని 'హర్లెక్విన్ గ్లాసెస్' పేరుతో తీసుకువచ్చారు. అది విజయవంతమైంది. దీంతో షినాసి పేరు యూఎస్ అంతటా నలుదిశలా వ్యాపించింది. అలా ఆమె సినీరంగంలోకి కూడా ప్రవేశించింది. అంతేగాదు 1960లో తన గురువు, మాజీ టీచర్ జార్జ్ గ్రోజ్తో కలిసి ఒక డాక్యుమెంటరీని నిర్మించింది. షినాసి 1995లో 'ది రోడ్ ఐ హావ్ ట్రావెల్డ్' అనే పేరుతో తన జ్ఞాపకాలకు సంబంధించి ఓ పుస్తకాన్ని ప్రచురించింది. ఆమె ఆగస్టు 19, 1999న మరణించారు. (చదవండి: ఆపిల్ మ్యాప్‌లో వినిపించే వాయిస్..ఏ మహిళదో తెలుసా!) -
అనుమానాస్పదంగా కనిపిస్తున్నారు కదూ.. నిజం తెలిస్తే, ఆశ్చర్యపోతారు
ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తులను చూస్తుంటే.. ఎవరో అనుమానాస్పదుల్లా కనిపిస్తున్నారు కదూ? ఎందుకు వారు ముఖాన్ని దాచుకుంటున్నారు? ఏదైనా ల్యాబ్‌లో పనిచేస్తూ .. మరిచిపోయి డైరెక్ట్‌గా రోడ్డు మీదకు వచ్చేశారా? లేదా.. మనుషులను పోలి ఉండే గ్రహంతర వాసులా? ఇలాంటి వింత ఆలోచనలు అనుమానాలన్నీ మీ బుర్రను తొలిచేయడం మొదలుపెట్టే ఉంటాయి. (చదవండి: పదేళ్లుగా ఉదయాన్నే లేవడం, ఊరంతా బలాదూర్ తిరగడం.. ఈ కుక్క ప్రత్యేకత) అసలు నిజం తెలిస్తే, ఆశ్చర్యపోతారు. మాస్కును మించి ముఖాన్ని కవర్ చేసేసేలా వీరు ధరించినవి కొత్తరకం గాగుల్స్. నిజం.. ఇవి సరికొత్త కళ్లజోళ్లు. సాధారణంగా ఎండ నుంచి కళ్లను రక్షించే సన్గ్లాసెన్ను మాత్రమే ఇప్పటివరకు చూసి ఉంటారు. కానీ, ఈ సన్‌గ్లాసెస్ మాత్రం మీ ముఖం మొత్తాన్ని ఎండ ప్రభావం నుంచి కాపాడుతాయి. జపాన్‌కు చెందిన ఓ కంపెనీ అధిక నాణ్యత గల పాలికార్బొనేట్‌తో వీటిని రూపొందించింది. సాధారణ సన్ గ్లాసెస్లాగే వీటిని కూడా చెవుల పైభాగం నుంచి ధరించొచ్చు. ప్రస్తుతం కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఈ గాగుల్స్ ఎండ నుంచే కాదు, కరోనా వంటి మహమ్మారి రోగాల నుంచి కూడా మిమ్మల్ని కాపాడుతాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా ఎవరైనా వీటిని ధరించొచ్చు. ఆన్లైన్ మార్కెట్లో వివిధ పరిమాణాలు, ధరల్లో ఇవి లభిస్తున్నాయి. (చదవండి: కరోనా ఆంక్షలు.. బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి.. అప్పుడొచ్చింది ఓ మైండ్ బ్లోయింగ్ ఐడియా!) -
అలా నేర్చుకున్నాను...
మనోగతం బ్రహ్మచారిగా ఉండే రోజుల్లో హోటల్లో తినీ తినీ ‘ఇక నా వల్ల కాదు. పెళ్లి చేసుకోవాల్సిందే’ అనుకున్నాను. నేను అనుకున్నానో లేదో మా వాళ్లు ఒక అందమైన అమ్మాయిని చూశారు. ‘‘అమ్మాయికి వంట రాదు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటోంది’’ అనే మాట విని నెత్తి మీద ఆర్డీఎక్స్ పేలినట్లు ఎక్స్ప్రెషన్ పెట్టాను. ‘‘అదేమీ పెద్ద విషయం కాదనుకోండి...’’ అన్నాడు నాన్న. ‘‘అదే అసలు విషయం’’ అని నాలో నేను గొణుక్కున్నాను. ‘‘అమ్మాయికి వంటరాదు కాబట్టి ఆమె నచ్చలేదు’’ అని చెప్పడం న్యాయం కాదు కాబట్టి ‘ఓకే’ అనేశాను. ‘‘ఇవ్వాళ టిఫిన్ చేశాను. తిని ఓకేనా కాదా చెప్పండి’’ ‘‘ఇవ్వాళ బెండకాయ వేపుడు చేశాను. తిని బాగుందో లేదో చెప్పండి’’ ఇలా అడిగేది మా ఆవిడ. ‘‘ఆమె చేసిన టిఫిన్ టిఫిన్ కాదని, కూర కూర కాదని ఎలా చెప్పాలి? ఓరి భగవంతుడా... ఏమిటీ శిక్ష ’’ అనుకునేవాడిని. ఆమెను చిన్న మాట అనడానికైనా మనసొప్పేది కాదు. అలా అని ఆమె వంటల మంటలను మింగలేను కదా! ఇక ఇలా కాదనుకొని ఆ ఇళ్లు, ఈ ఇళ్లు తిరిగి పనిగొట్టుకొని రకరకాల వంటలు నేర్చుకున్నాను. దినపత్రికల వంటలు పేజీలు చాలా శ్రద్ధగా సేకరించేవాడిని. నేను వంటలు నేర్చుకోవడంతో పాటు, మా ఆవిడకు అర్థమయ్యేలా సులభంగా చెప్పాను. ఏ మాటకామాట చెప్పుకోవాలి... ఇప్పుడు నా కంటే ఆవిడ వంట చక్కగా చేస్తుంది! -బి. శేఖర్, హైదరాబాద్