తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ స్పీకర్ కళ్లద్దాల కొనుగోలు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. స్పీకర్ శ్రీరామకృష్ణన్ కొనుగోలు చేసిన రూ.50 వేల విలువైన కళ్లద్దాలకు ప్రభుత్వమే డబ్బు చెల్లించిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్థిక క్రమశిక్షణ పాటించాలంటూ సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం గురువారం 2018–19 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మరునాడే ఈ అంశం వెలుగులోకొచ్చింది. డి.బి.బిను అనే న్యాయవాది సమాచార హక్కు చట్టం కింద పెట్టుకున్న అర్జీకి అసెంబ్లీ సెక్రటేరియట్ స్పందించింది. స్పీకర్ కళ్లజోడు కోసం మంజూరు చేసిన రూ.49వేలలో అద్దాలు రూ.4,900, ఫ్రేమ్‌కు రూ.45 వేలు ఖర్చయ్యాయని పేర్కొంది. స్పీకర్ వైద్యం ఖర్చుల కింద రూ.4.25 లక్షలు చెల్లించినట్లు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment