ఇది అధునాతనమైన వాటర్ డిసిన్ఫెక్షన్ సిస్టమ్. అమెరికన్ కంపెనీ ‘అక్విసెన్స్’ ఇటీవల దీనికి రూపకల్పన చేసింది. ‘పెర్ల్ అక్వా డెకా 30సీ’ పేరిట రూపొందించిన ఈ వాటర్ డిసిన్ఫెక్షన్ సిస్టమ్ నీటిలో సాధారణంగా ఉండే ప్రమాదకరమైన సూక్ష్మజీవులను క్షణాల్లోనే నాశనం చేసి, నీటిని పరిశుభ్రంగా, సురక్షితంగా మారుస్తుంది.
ఇది యూవీసీ– ఎల్‌ఈడీ సాంకేతికతతో పనిచేస్తుంది. ఇది ఆన్ చేసుకోగానే దీనిలో వెలువడే అల్ట్రావయొలెట్ కిరణాలు, దీని నుంచి సరఫరా అయ్యే నీటిలోని సూక్ష్మజీవులను 99.9 శాతం మేరకు నాశనం చేస్తాయి.
ఇళ్లల్లోనే కాకుండా, వాణిజ్య సంస్థల్లోను, కార్యాలయాల్లోను వినియోగించుకోవడానికి ఇది చాలా అనువుగా ఉంటుందని ‘అక్విసెన్స్’ సీఈవో ఆలివర్ లావాల్ చెబుతున్నారు. దీని ధర 500 డాలర్లు (రూ.40,957) మాత్రమే!
Comments
Please login to add a commentAdd a comment