technique
-
ఖాళీ కుర్చి.. అమెజాన్ బెజోస్ టెక్నిక్ ఇది..!
వ్యాపారంలో విజయవంతమైన ప్రతిఒక్కరికీ ఓ టెక్నిక్ ఉంటుంది. దాన్ని అనుసరిస్తూ మరికొంతమంది సక్సెస్ సాధిస్తుంటారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ స్ఫూర్తితో ప్రముఖ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ బ్రాండ్ మామాఎర్త్ కోఫౌండర్ ఘజల్ అలాఘ్ వ్యూహాత్మక సమావేశ టెక్నిక్‌ను పంచుకున్నారు.తన భర్త వరుణ్ అలఘ్‌తో కలిసి స్థాపించిన హోనాసా కన్జ్యూమర్ లిమిటెడ్ కంపెనీలో ఈ టెక్నిక్ నిర్ణయాలను గణనీయంగా ఎలా మెరుగుపరిచిందో ‘ఎక్స్’ పోస్ట్‌లో అలఘ్ వివరించారు. "మీరు నిర్వహించే ప్రతి వ్యూహాత్మక సమావేశంలో మీ కస్టమర్లు కూర్చున్నారని ఊహించుకోండి. మా ప్రతి వ్యూహాత్మక సమావేశాలలో ఒక కుర్చీని ఖాళీగా ఉంచుతాం. మా కస్టమర్లే అక్కడ కూర్చున్నారని భావిస్తాం. నేను జెఫ్ బెజోస్ నుంచి ఈ అద్భుతమైన టెక్నిక్ నేర్చుకున్నాను. ఇది హోనాసాలో నిర్ణయాలు తీసుకునే ప్రమాణాలను మెరుగుపరుస్తోంది" అని ఆమె రాసుకొచ్చారు."మేము ప్రతి ఆలోచనను కస్టమర్ల దృక్కోణం నుంచి పునఃపరిశీలన చేసుకుంటాం" అని అలఘ్ పేర్కొన్నారు. కస్టమర్లకు మేలు జరిగేలా ఉంటేనే తాము నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. మార్కెట్ అత్యంత వినియోగదారు-స్పృహ కలిగిన కంపెనీలలో ఒకటిగా మారాలనే తమ లక్ష్యాన్ని అలఘ్ నొక్కి చెప్పారు.2008లో ఎన్ఐఐటీలో కార్పొరేట్ ట్రైనీగా ఘజల్ అలఘ్ వ్యాపార ప్రస్థానం ప్రారంభమైంది. 2016లో ఆమె హోనాసా కన్స్యూమర్ ప్రైవేట్ లిమిటెడ్ (మామెర్త్) ను స్థాపించారు. ఇది టాక్సిన్ లేని చర్మ సంరక్షణ, హెయిర్ కేర్, బేబీ కేర్ ఉత్పత్తులతో తక్కువ సమయంలోనే ఖ్యాతిని సంపాదించుకుంది. ముఖ్యంగా ఈ బ్రాండ్ డైరెక్ట్-టు-కన్స్యూమర్ మోడల్ విజయవంతమైంది. -
పూర్వకాలంలో అరటిపండ్లను అలా ముగ్గబెట్టేవారా!నెటిజన్లు ఫిదా
పండ్లు తొందరగా పక్వానికి రావడానికి ఇటీవల కృత్రిమ రసాయనాలను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా కాల్షియం కార్పైడ్, ఇథలిన్ వంటి రసాయానాలతో పండ్లను మాగబెట్టే యత్నం చేస్తున్నారు. ఇలాంటి రసాయనాలు కారణంగా ప్రాణాంతక వ్యాధులు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైగా రైతులను, విక్రయదారులను ఇలాంటి రసాయనాలు వినియోగించొద్దని ఆరోగ్య సంస్థలు సూచిస్తున్నాయి కూడా. అయితే పూర్వకాలంలో పండ్లను మాగబెట్టడానికి ఒక టెక్నిక్ ఉపయోగించేవారు. అది కూడ సహసిద్ధమైన రీతిలో మాగబెట్టవేరు. అదెలోగా ఓ బామ్మ చేసి చూపించింది. ఎలాగంటే..ఓ బామ్మ అరటి పండ్లను పూర్వకాలంలో ఎలా ముగ్గబెట్టేవారో చేసి చూపించింది. అరటి చెట్టుకి కాసిన గెలను కోసి చక్కగా దాన్ని భూమిలో కొద్దిమేర గొయ్యి తీసి దాంట్లో ఈ అరటి గెలను ఉంచింది. తర్వాత ఓ మట్టి పాత్రలో బొగ్గులను రాజేసి దాన్ని కూడా అరటిపండ్ల గెల ఉన్న చోట పెట్టి పైన ఆరటి ఆకులతో కప్పి ఉంచింది. ఆ తర్వాత పైన మరిన్ని ఎండిన కొబ్బరి ఆకులను మట్టిని కూడా వేసి అలా రెండు రోజులు వదిలేసింది. ఆ తర్వాత రోజు చూస్తే చక్కగా మంచి సువాసనతో ముగ్గిపోయి ఉన్నాయి అరటి పండ్లు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు పండ్లు ముగ్గేంత వరకు చెట్టుకే ఎందుకు ఉంచరు అని ప్రశ్నించగా, మరికొందరు మాత్రం రసాయనాలకు బదులుగా పూర్వకాలంలో ఉపయోగించిన ఈ టెక్నిక్ అద్భుతంగా ఉంది. ఎలాంటి దుష్పభావాలు లేని ఆరోగ్యకరమైన టెక్నిక్ అంటూ ఆ బామ్మపై ప్రశంసల వర్షం కురిపించారు. View this post on Instagram A post shared by Eswari S (@countryfoodcooking)(చదవండి: మామిడి పండ్లను తినడం వల్ల మొటిమలు వస్తాయా? నిపుణులు ఏమంటున్నారంటే..) -
మీ బ్రెయిన్ షార్ప్‌గా ఉండాలంటే.. ఇలా చేయండి..
సాధారణంగా యంగ్‌గా ఉన్నప్పుడు ఉన్నంత జ్ఞాపకశక్తి కాస్తా.. ఉండగా, ఉండగా..అంటే వృద్ధాప్యంకి చేరవయ్యేటప్పటికీ తగ్గిపోతుంది. అలా ఎందువల్ల జరగుతుందని, శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా పరిశోధనాలు చేస్తూ వచ్చారు. ఆ దిశలో ఎంతవరకు పురోగతి సాధించారో తెలియదు గానీ ..వారి అధ్యయనంలో అలా బ్రెయిన్ చురుకుదనం తగ్గిపోకుండా మునుపటిలా షార్ప్‌గా ఉండేలా ఏం చేయాలో కనుగొన్నారు. దీంతో వృద్ధాప్యంలో ఎదురయ్యే బ్రెయిన్‌కి సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు అంటున్నారు. అందుకు కొన్ని టెక్నిక్స్ ఫాలో అయితే చాలు మంచి జ్ఞాపకశక్తి మీ సొంతం అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ మేరకు వారు 70ల వయసు ఉన్న కొందరూ వృద్ధులపై పరిశోధనలు జరిపారు. వారందరికి ఒకేసారి వారికి ఇష్టమైన రంగాల్లో నైపుణ్యం సంపాదించేలా ట్రైనింగ్ ఇచ్చారు. వారంతా వారానికి 15 గంటలు హోంవర్క్ చేయడం, తరగతి గదుల్లో కూర్చోవడం వంటివి చేశారు. వారు కొత్తభాషలు, ఫోటోగ్రఫీ, వంటి ఇతరత్రా సృజనాత్మక కోర్సులను అభ్యసించడం వంటివి చేశారు. ఆ క్రమంలో వారికి తెలయకుండానే వారి మొదడు 30ల వయసులో ఉండే వారి బ్రెయిన్ మాదిరిగా షార్ప్‌గా ఉండటం గమనించారు. వారి చిన్నప్పటి జ్ఞాపకాలతో సహాఅన్ని చెబుతుండటం. ఠక్కున దేని గురించి అయినా చెప్పేయడం వంటివి జరిగాయి. దీంతో వారు మెదడును ఖాళీగా ఉంచకుండా మంచి వ్యాపకాలతోనే మనకి ఇష్టమైన అభిరుచిలతో బిజీగా ఉండేలా చేయడం చేస్తే.. మన మెదడులో పిచ్చిపిచ్చి ఆలోచనల ప్రవాహం తగ్గి చురుగ్గా ఉండటం ప్రారంభిస్తుందని అన్నారు. అలాగే ఎప్పటికప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడంపై దృష్టి సారించడం అనేది మీ మెదడుకు ఓ వ్యాయామంలా ఉండటమేగాక మీలో దాగున్న స్కిల్స్ బయటకు వస్తాయి. పైగా మీ బ్రెయిన్ కూడా ఆరోగ్యంగా ఉండి యువకుల్లో ఉండే మాదిరిగా చురుగ్గా బ్రెయిన్ ఉంటుందన్నారు. (చదవండి: అంతుతేలని ఇద్దరి యువతుల మిస్టరీ గాథ..చంపేశారా? మరణించారా!..) -
కూలీల సమస్యకి చెక్ పెట్టిన దంపతులు.. రూ.20 వేలు ఆదా!
సాక్షి,జగిత్యాల అగ్రికల్చర్: సాగులో కూలీల సమస్య రైతులకు ఇబ్బందిగా మారింది. సకాలంలో వ్యవసాయ పనులు చేయలేక, అనుకున్న స్థాయిలో దిగుబడులు రాక పలువురు రైతులు మధ్యలోనే పంటను వదిలేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అలూర్‌కు చెందిన మెక్కొండ రాంరెడ్డి–లక్ష్మి దంపతులు (9666002222) మల్చింగ్ పేపర్‌తో కూలీల సమస్యకు చెక్‌పెట్టి మంచి ఆదాయం ఆర్జిస్తున్నారు. కూలీలతో ఇబ్బందులు రాంరెడ్డి–లక్ష్మి దంపతులకు ఐదెకరాల భూమి ఉంది. వరి, మొక్కజొన్న, కూరగాయలు, పండ్ల తోటలు సాగు చేస్తుంటారు. అయితే, ప్రతీ సీజన్లో కూలీలు సకాలంలో దొరక్కపోవడం, దొరికినా డబ్బులు ఎక్కువగా తీసుకుంటుండటంతో ఖర్చు పెరిగేది. దీనికి తోడు వారానికోసారి పంటలకు నీరు అందించినా నీరంతా ఆవిరి అయ్యేది. రసాయన ఎరువులు వేసినా పెద్దగా ఉపయోగంలోకి రాకపోయేది. దీంతో, పంటకు పెట్టిన పెట్టుబడి, వచ్చే ఆదాయానికి పొంతనలేకుండా పోయింది. ఎకరంలో మల్చింగ్ పేపర్‌తో.. మల్చింగ్ పేపర్ వల్ల కూలీల సమస్యకు చెక్ పెట్టవచ్చని తెలుసుకున్న దంపతులు, తొలుత ఎకరంలో రూ.8వేలతో మల్చింగ్ పేపర్ వేశారు. ఇందుకోసం భూమిలో రసాయన, సేంద్రియ ఎరువులు వేశారు. రోటోవేటర్‌తో దున్ని, మట్టిపెళ్లలు లేకుండా చేసి గట్లు ఏర్పాటు చేశారు. సాగు నీటి కోసం గట్లపై ముందుగా డ్రిప్ పైపులు అమర్చి అనంతరం మల్చింగ్ పేపర్ వేశారు. ఖర్భూజ, బీర సాగు మల్చింగ్ పేపర్ వేసిన తర్వాత గట్టుపై అవసరమున్న చోట రంధ్రాలు చేసి ఖర్భూజ, బీర విత్తనాలు వేశారు. మల్చింగ్ వేయకముందు ఎకరంలో మూడుసార్లు కలుపు తీసేందుకు కనీసం 30 మంది కూలీలకు రూ.15 వేలు ఖర్చయ్యేవి. ప్రస్తుతం కూలీల అవసరం లేకుండా పోయింది. రెండుమూడు పంటలకు వాడుకునేలా మల్చింగ్ను ఏర్పాటు చేశారు. కాగా, మల్చింగ్‌పై సిల్వర్ కోటింగ్ ఉండటంతో సూర్యరశ్మి తగిలి పంటలకు పెద్దగా పురుగులు, తెగుళ్లు ఆశించలేదు. అన్నిరకాల యాజమాన్య పద్ధతులు పాటించడంతో దిగుబడులు సైతం రెట్టింపు అయ్యాయని రైతులు దంపతులు పేర్కొన్నారు. ఒక్కో పంటకు కూలీలకు అయ్యే రూ.20 వేల ఖర్చును తగ్గించుకుంటున్నారు. ప్రస్తుతం మల్చింగ్ కింద వేసిన పంటల ద్వారా దాదాపు లక్ష వరకు ఆదాయం రావచ్చని సదరు దంపతులు చెప్పారు. నూతన పద్ధతులతోనే ఆదాయం సంప్రదాయ, నూతన పద్ధతుల్లో వ్యవసాయం చేస్తేనే రైతులకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. మల్చింగ్‌తో ఒక్క పంటకు రూ.20 వేల వరకు ఆదా అవుతాయి. ప్రస్తుతం పంటలపై ఒకరిని చూసి మరొకరు పెడుతున్న పెట్టుబడులు రైతులను అప్పుల ఊబిలోకి నెడుతాయన్న విషయాలను గ్రహించాలి. – మెక్కొండ రాంరెడ్డి–లక్ష్మి -
ఆక్సీజన్ లెవల్స్: ప్రోనింగ్ టెక్నిక్ అంటే తెలుసా?
రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. చాలా మంది బాధితులు ఇళ్లలోనే ఐసోలేషన్‌లో ఉంటున్నారు. ఇలాంటి కొందరిలో ఆరోగ్య పరిస్థితి మరీ సీరియస్‌గా లేకపోయినా.. రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గుతుండటం కనిపిస్తోంది. అలాంటి వారి రక్తంలో ఆక్సిజన్ స్థాయులను సహజంగా పెంచుకునేలా ‘ప్రోనింగ్’ అనే టెక్నిక్ ఉపయోగపడుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. స్వల్పంగా శ్వాస సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నవారిలో.. ఆక్సిజన్ స్థాయులు తగ్గిపోకుండా ఉండేందుకు, వీలైతే స్థాయులు పెరిగేందుకు ఈ పద్ధతి తోడ్పడుతుందని సూచించింది. అసలు ఈ ప్రోనింగ్ టెక్నిక్ ఏమిటి? ఎలా చేయాలి? శ్వాస సమస్యను ఎలా అధిగమించాలో తెలుసుకుందాం.. ప్రోనింగ్ టెక్నిక్ అంటే? ఊపిరి సరిగా అందని సమయంలో బోర్లా పడుకోవడం, పక్కలకు తిరగడం, వాలుగా కూర్చోవడం వంటివి చేయడమే ప్రోనింగ్. కరోనా సోకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నవారికి ఈ పద్ధతి ఎంతో ఉపయోగపడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఆవశ్యకత ఏంటి? ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నవారు రక్తంలో ఆక్సిజన్ లెవల్స్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ఆక్సిజన్ లెవల్స్ పడిపోతే పరిస్థితి తీవ్రంగా మారే ప్రమాదం ఉంటుంది. ప్రోనింగ్ టెక్నిక్ ద్వారా గాలి పీల్చుకునే సామర్థ్యం మెరుగుపడుతుంది. వాయుకోశాలు తెరుచుకోవడం ద్వారా శ్వాస తీసుకోవడం సులువు అవుతుంది. ఆక్సిజన్ లెవల్స్ 94 కన్నా తగ్గితే ప్రోనింగ్ ద్వారా ప్రాణాలు కాపాడొచ్చు. ప్రోనింగ్‌కు ఏమేం కావాలి? ప్రోనింగ్‌కు కావాల్సిందల్లా 4 నుంచి 5 దిండ్లు. బోర్లా పడుకుని ఒక దిండు తల కింద పెట్టుకోవాలి. 1 లేదా 2 దిండ్లు ఛాతీ నుంచి తొడల వరకు నిలువుగా ఉంచుకోవాలి. రెండు దిండ్లు మోకాళ్ల కింద నిలువుగా ఉంచుకోవాలి. ఏ పొజిషన్లో కూడా ఎక్కువ సేపు పడుకోవద్దు. 30 నిమిషాలకోసారి పడుకునే పొజిషన్లను మారుస్తూ ఉండాలి. సొంతంగా కదలగలిగితే పేషెంట్ స్వయంగా దీనిని అనుసరించవచ్చు. పేషెంట్ సొంతంగా కదిలే పరిస్థితి లేకుంటే కొందరి సాయంతో ప్రోనింగ్ చేయాల్సి ఉంటుంది. సొంతంగా ఎలా చేయాలి..? ప్రతి పొజిషన్ కూడా 30 నిమిషాల నుంచి 2 గంటల వరకు ఉండొచ్చు. రెండు గంటలకు మించి మాత్రం ఒకే పొజిషన్లో ఉండొద్దు. పొజిషన్–1: బోర్లా పడుకోవాలి. పొజిషన్–2: కుడివైపు తిరిగి పడుకోవాలి. పొజిషన్–3: వాలుగా కూర్చోవాలి. పొజిషన్–4: ఎడమ వైపు తిరిగి పడుకోవాలి. పొజిషన్–5: తిరిగి మొదటి పొజిషన్లో పడుకోవాలి. అంటే బోర్లా పడుకోవాలి. ఎవరు ప్రోనింగ్ చేయొద్దు? ► గర్భంతో ఉన్న వారు ప్రోనింగ్ చేయొద్దు ► సిరల్లో రక్తం గడ్డ కట్టుకుపోయిన వారు (వీనస్ త్రాంబోసిస్) (48 గంటలలోపు చికిత్స తీసుకున్నవారు) ► తీవ్రమైన గుండె సమస్యలు ఉన్న వారు ► వెన్నెముక, తొడ ఎముక, కంటి ఎముకలకు తీవ్రంగా గాయాలైన వారు ఈ జాగ్రత్తలు తప్పనిసరి ► ఆహారం తీసుకున్న గంట వరకు ప్రోనింగ్ చేయొద్దు. ► ఏ పొజిషన్లో అయినా భరించగలిగినంత సేపు మాత్రమే పడుకోవాలి. ► శరీర భాగాలపై ఒత్తిడి తగ్గించేందుకు దిండ్లను మార్చుకుంటూ ఉండొచ్చు. ► ఎక్కడైనా నొప్పి కానీ, బొబ్బలు కానీ వస్తున్నాయో గమనించాలి. ► పెద్దగా ఇబ్బందేమీ లేకుంటే ప్రోనింగ్ను రోజుకు 16 గంటల వరకు దశలు దశలుగా చేయొచ్చు. కదలలేని పేషెంట్లకు ప్రోనింగ్ ఎలా? ► పలుచటి బెడ్‌షీట్ ఉపయోగించి రోగిని బెడ్‌పై ఒక పక్కకు జరపాలి. ► పేషెంట్‌ను ఒక పక్కకు తిప్పి మరో బెడ్‌షీట్‌ను పరచాలి. తర్వాత పేషెంట్‌ను మరోవైపునకు తిప్పి ఆ బెడ్‌షీట్‌ను రెండోవైపు లాగాలి. ► ఆ బెడ్షీట్లను పైకి లాగుతూ.. పేషెంట్ బోర్లా పడుకునేలా తిప్పాలి. అదే సమయంలో దిండ్లను ఛాతీ కింద, మోకాళ్ల దిగువన ఏర్పాటు చేయాలి. ► తర్వాత రోగిపై బెడ్‌షీట్‌ను తొలగించాలి. ► ఇదే తరహాలో బెడ్షీట్లను ఉపయోగిస్తూ పేషెంట్‌ను పక్కలకు తిప్పాలి. (చదవండి: టీకా వేసుకున్నా కరోనా వస్తుందా? వస్తే రెండో డోసు పరిస్థితి ఏమిటి? ) -
ప్లాస్టిక్ భరతం పట్టే కొత్త టెక్!
వీధుల్లో, చెరువుల్లో, సముద్రాల్లో చేరిపోయి మనిషిని రకరకాలుగా ముప్పు తిప్పలు పెడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలకు ఓ పరిష్కారం దొరికిందని అంటున్నారు స్వీడన్ లోని చామర్స్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు. భూమ్మీద ఉన్న ప్లాస్టిక్ చెత్తనంతా కరిగించేయడమే కాకుండా.. దాన్ని మళ్లీ తాజా ప్లాస్టిక్‌లా వాడుకునే అద్భుత టెక్నాలజీని వీరు అభివృద్ధి చేశా రు. ఆవిరితో కరగబెట్టడం ద్వారా ప్లాస్టిక్‌ను అణుస్థాయిలో విడగొట్టడం ద్వారా ఈ సాంకేతికత పని చేస్తుందని ఈ పద్ధతిని ఆవిష్కరించిన శాస్త్రవేత్త హెన్రిక్ థున్‌మన్ తెలిపారు. ప్లాస్టిక్‌ను సుమారు 850 డిగ్రీ సెల్సియస్ వరకు వేడి చేయడం ద్వారా వచ్చే వాయువును కొన్ని పద్ధతుల ద్వారా మళ్లీ తాజా ప్లాస్టిక్ మాదిరిగా వాడుకోవచ్చని వివరించారు. ఇప్పుడున్న ఫ్యాక్టరీల్లోనే ఈ సరికొత్త రీసైక్లింగ్ ప్రక్రియను చేసుకోవచ్చని చెప్పారు. ప్రయోగాల్లో తాము 200 కిలోల ప్లాస్టిక్ చెత్తను గంటలో మళ్లీ ప్లాస్టిక్‌ను ఉత్పత్తి చేయగల వాయురూపంలోకి మార్చేశామని తెలిపారు. ఏడాదికి 35 కోట్ల టన్నులు.. 2015 నాటి లెక్కల ప్రకారం ప్రపంచం మొత్తమ్మీద ఏడాదికి ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్ దాదాపు 35 కోట్ల టన్నులు. ప్రస్తుతం చాలావరకు ప్లాస్టిక్ చెత్తను మండించి ఆ వేడితో విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు ఉపయోగిస్తున్నారు. లేదా వ్యర్థాలు ఎక్కువ స్థలం ఆక్రమించకుండా చూసేందుకు కాల్చేయడాన్ని ఒక మార్గంగా పరిగణిస్తున్నారు. దీనివల్ల కార్బన్ డయాక్సైడ్‌తోపాటు అనేక ఇతర విషవాయువులు గాల్లోకి చేరి పరిసరాలను కలుషితం చేస్తున్నాయి. మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాల్లో సుమారు 60 శాతం చెత్త కుప్పల్లోకి చేరుతోంది. రీసైక్లింగ్ కోసం సేకరిస్తోంది 14 శాతం మాత్రమే. మొత్తం వ్యర్థాల్లో 8 శాతాన్ని చౌకరకం ప్లాస్టిక్‌గా రీసైకిల్ చేస్తుండగా 2 శాతం కొంచెం నాణ్యమైన పదార్థంగా అందుతోంది. ఒక శాతం వ్యర్థాలు మాత్రం వీధుల్లో, నదుల్లో, ఇతర ప్రాంతాల్లో పేరుకుపోయి సమస్యగా మారుతోంది. కర్బన పరమాణువులతో మ్యాజిక్.. ప్లాస్టిక్‌ను చెత్తగా పడేశాక దాన్ని రీసైకిల్ చేసినా నాణ్యత పెరగదు. ఈ కారణంగానే హెన్రిక్ బృందం ప్లాస్టిక్ పునర్వినియోగానికి ఓ వినూత్న మార్గాన్ని ఎంచుకుంది. పదార్థంలోని కర్బన పరమాణువులను సేకరించి వాడుకునేందుకు ప్రయత్నించింది. వాటిద్వారా మళ్లీ సరికొత్త, నాణ్యమైన ప్లాస్టిక్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా ముడిచమురుతో ప్లాస్టిక్‌ను తయారు చేయాల్సిన అవసరాన్ని గణనీయంగా తగ్గించొచ్చు. ‘మా ఆలోచనలను పరీక్షించుకునేందుకు 200 కిలోల ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేశాం. అది కాస్తా విజయవంతమవడంతో ప్రస్తుతం మొత్తం ప్రక్రియను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. చమురు శుద్ధి కేంద్రాలనే రీసైక్లింగ్ ప్లాంట్లుగాను మార్చేందుకు ఏం కావాలో పరిశీలిస్తున్నాం’అని హెన్రిక్ తెలిపారు. -సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కాలుష్యాన్ని ప్లాస్టిక్‌గా మార్చే కొత్త టెక్నిక్!
వాతావరణ కాలుష్యం కార్బన్‌డయాక్సైడ్‌ను ప్లాస్టిక్‌గా మార్చేసేందుకు రట్గర్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేశారు. విద్యుత్ ఆధారిత ఉత్ప్రేరకాలను ఉపయోగించినప్పుడు కార్బన్డయాక్సైడ్, నీళ్ల మిశ్రమం నుంచి ఒకటి రెండు లేదా మూడు పరమాణువులు ఉండే కర్బన మూలకాలను ఉత్పత్తి చేయవచ్చునని, వీటితో వేర్వేరు రకాల ప్లాస్టిక్లు, జిగుర్లు తయారు చేసుకోవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త చార్లెస్ తెలిపారు. ఈ ప్రక్రియలో ఉప ఉత్పత్తులుగా లభించే మిథైల్ౖ గ్లెయోక్సల్ను ప్రమాదకరమైన ఫార్మాల్డీహైడ్కు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు కూడా. కార్బన్‌డయాౖMð్సడ్ నుంచి మెథనాల్, ఇథనాల్, మీథేన్, ఎథిలీన్ వంటి వాటిని తయారు చేసేందుకు గతంలోనే కొన్ని పద్ధతులు అందుబాటులోకి వచ్చినా అవన్నీ వ్యయప్రయాసలతో కూడుకున్నవి. అత్యధికంగా 99 శాతం సామర్థ్యంతో పని చేయడం, నికెల్, ఫాస్పరస్ వంటి చౌకైన ఉత్ప్రేరకాలను ఉపయోగించుకోవడం వంటి అంశాలను పరిగణిస్తే కొత్త పద్ధతి ప్రయోజనాలు ఇట్టే అర్థమవుతాయని చార్లెస్ తెలిపారు. అవసరానికి తగ్గట్టుగా ఉత్ప్రేరకాలను వాడుకోవడం ఈ పద్ధతిలోని ఇంకో విశేషం. ఈ టెక్నాలజీని వాణిజ్యస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చార్లెస్ రిన్యూసీఓ2 పేరుతో ఒక కంపెనీ కూడా ఏర్పాటు చేశారు. -
98 శాతం మందికి ఆ టెక్నిక్ తెలియదు
న్యూఢిల్లీ: గుండెజబ్బులతో మృతిచెందేవారి సంఖ్య పెరిగిపోతున్న భారత్‌లో.. దానిపై అవగాహన మాత్రం దాదాపు శూన్యంగా ఉందని ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. హఠాత్తుగా గుండెపోటు సంభవించినప్పుడు ప్రాణాలను కాపాడటంలో సహకరించే చిన్న చిన్న టెక్నిక్‌లు సైతం భారత్‌లో 98 శాతం మందికి తెలియవని లిబ్రేట్ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. దేశవ్యాప్తంగా 20 నగరాల్లోని 25 నుంచి 50 ఏళ్ల మధ్య వయసులో ఉన్న సుమారు లక్ష మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరిలో యువతకు సైతం హార్ట్ ఎటాక్ సమయంలో ఎలా స్పందించాలనే అంశంలో స్పష్టతలేకపోవడం ఆందోళనకరమని లిబ్రేట్ సీఈవో సౌరబ్ అరోరా తెలిపారు. హార్ట్ ఎటాక్ సమయంలో ఎంతగానో ఉపకరించే కార్డియోపల్మొనరి రిసక్సిటేషన్(సీపీఆర్) టెక్నిక్ గురించి దేశవ్యాప్తంగా అవగాహన కల్పించాల్సిన అవసరముందని సర్వే నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. హార్ట్ ఎటాక్ సంబంధిత కేసుల్లో ఆసుపత్రికి చేరేలోపే 60 శాతం మంది మృతి చెందుతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్న నేపథ్యంలో కీలక సమయంలో ఎలా స్పందించాలో తెలుసుకోవడం మంచిదన్నారు. -
కండబలంతో కాదు టెక్నిక్‌తో గెలిచా
న్యూఢిల్లీ: క్రీడల్లో ముఖ్యంగా కుస్తీ వంటి పోటీల్లో గెలవాలంటే కండబలం చాలా అవసరం. రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, రెజ్లర్ సాక్షి మాలిక్ మాత్రం.. తాను కేవలం కండబలంతో గెలవలేదని, బుద్ధిబలం కూడా తోడైందని చెప్పింది. హరియాణాకు చెందిన సాక్షిని ఎయిరిండియా సన్మానించింది. బిజినెస్ క్లాస్‌లో సాక్షి ఉచితంగా ప్రయాణించేందుకు సదుపాయం కల్పించినట్టు ఎయిరిండియా ప్రకటించింది. ఈ సందర్భంగా సాక్షి మాట్లాడుతూ.. ‘నేను శక్తి వల్ల మాత్రమే గెలవలేదు. టెక్నిక్ కూడా తోడైంది. రియోలో పతకం గెలవడం ఓ మధురానుభూతి. పోటీల కోసం బరువు తగ్గా. డైట్‌పై కంట్రోల్ చేశాను. అన్ని టోర్నమెంట్లకు ఒకేవిధంగా ప్రాక్టీస్ చేస్తాను. అయితే ప్రత్యర్థిని బట్టి దృష్టిసారించాలి. పవర్, వెయిట్, స్పీడ్ ట్రైనింగ్స్‌లో ప్రాక్టీస్ చేయాలి. నా కుటుంబ సభ్యులు ఎలాంటి నిబంధనలు పెట్టలేదు. రియోలో 15 రోజులు ఉన్నాం. ఏం జరుగుతుందో తెలియదు. నాపై గెలిచిన రష్యా రెజ్లర్ ఫైనల్‌కు చేరుతుందని వందశాతం నమ్మాను. ఏదేమైనా నేను పతకం గెలుస్తానని భావించా’ అని సాక్షి చెప్పింది. -
కేన్సర్‌నే కిల్ చేద్దాం!
► ప్రాణాంతక వ్యాధి చికిత్సకు కొత్త ఆయుధాలు ► తెరపైకి కొత్త కొత్త పద్ధతులు.. బ్యాక్టీరియాలు, ► వైరస్‌లతో కణితులను తగ్గించొచ్చు.. ► కణితుల జన్యు క్రమం ► తెలుసుకోవడం ద్వారా చికిత్సలు ► అనేక దేశాల్లో విజయవంతం.. సాక్షి, హైదరాబాద్: కేన్సర్... ఏటా కొన్ని లక్షల మంది ప్రాణాలు తీస్తున్న మహమ్మారి. నిన్న మొన్నటి వరకు ఈ ప్రాణాంతక వ్యాధిని నయం చేసేందుకు శస్త్రచికిత్స.. కీమోథెరపీ.. రేడియో థెరపీ వంటి మూడే చికిత్స మార్గాలుండేవి. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్రవేత్తలు ఓ అడుగు ముందుకేసి సరికొత్త చికిత్సలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. బ్యాక్టీరియా, వైరస్ల ద్వారా కేన్సర్‌కు చెక్ పెట్టొచ్చని ఇప్పటికే రుజువు చేశారు. దీంతో పాటు మరికొన్ని కొత్త పద్ధతులను కూడా తెరపైకి తీసుకొచ్చారు. తాజా పరిశోధనల తీరుతెన్నులపై ఓ లుక్కేద్దాం. బ్యాక్టీరియాతో కేన్సర్ కణాలకు చెక్.. బ్యాక్టీరియా అనగానే రోగ కారకం అని అందరూ భావిస్తారు. అయితే అన్నీ మానవునికి చెడు చేసేవే కావు.. కొన్ని మంచి చేసే బ్యాక్టీరియాలు ఉంటాయనే విషయం కూడా చాలా మందికి తెలుసు. కొన్ని రకాల బ్యాక్టీరియాలను కేన్సర్‌పై యుద్ధం చేసేందుకు శాస్త్రవేత్తలు ఆయుధంగా మలుచుకున్నారు. అమెరికాలోని బయోమెడ్ వ్యాలీ డిస్కవరీస్‌కు చెందిన డాక్టర్ సౌరభ్సాహా ఇలాంటి పరిశోధనే చేశారు. కొన్ని రకాల బ్యాక్టీరియాలు కేన్సర్ కణితుల పరిమాణం తగ్గేలా చేస్తాయని కొన్ని కుక్కలు, ఓ మనిషి కేన్సర్ కణితులపై ఆయన చేసిన అధ్యయనంలో తేలింది. కేన్సర్ కణాలున్న చోట ఆక్సిజన్ తక్కువగా, ఆమ్లత్వం ఎక్కువగా ఉంటుంది. ఈ రకమైన వాతావరణం కొన్ని రకాల బ్యాక్టీరియాలు పెరిగేందుకు అనుకూలంగా ఉంటుంది. క్లాస్ట్రీడియం నోవీ అనే బ్యాక్టీరియాను ఆయన కేన్సర్ కణాల్లో పెరిగేలా చేశారు. ఈ బ్యాక్టీరియాలు అభివృద్ధి చెందే క్రమంలో విడుదలైన ఎంజైములు కేన్సర్ కణితుల పరిమాణం తగ్గించాయని పేర్నొంటున్నారు. 16 కుక్కలపై జరిపిన పరిశోధనల్లో 6 కుక్కలు ఈ చికిత్సకు స్పందించగా, మూడింటిలో కణితి పూర్తిగా మాయమైంది. మిగిలిన వాటిలో 30 శాతం వరకు తగ్గుదల కనిపించింది. ఊపిరితిత్తులు, లివర్, ఎముకల కేన్సర్‌తో బాధపడుతున్న 53 ఏళ్ల ఓ మహిళలోనూ నెల రోజుల్లోనే కణితి పరిమాణం గణనీయంగా తగ్గిపోయింది. ఈ రకం చికిత్సలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవడం గమనార్హం. అయితే వందేళ్ల కిందే విలియం కోలీ అనే శాస్త్రవేత్త ఇలాంటి ప్రయోగాలు చేశారు. రోగ నిరోధక వ్యవస్థకు తర్ఫీదు... కేన్సర్ సోకినప్పుడు శరీర రోగ నిరోధక వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. దీంతో కేన్సర్ శరీరం మొత్తం విస్తరిస్తుంది. ఇలా జరగకుండా ఈ రోగ నిరోధక వ్యవస్థను చైతన్యం చేసి కేన్సర్ కణాలపై నేరుగా యుద్ధం చేసేలా పరిశోధకులు ఇమ్యునోథెరపీ అనే కొత్త ఆవిష్కరణ చేశారు. ఇమ్యూన్ చెక్‌పాయింట్ ఇన్హిబిటర్స్ అనే ప్రత్యేకమైన మందుల ద్వారా రోగ నిరోధక వ్యవస్థలోని టీ కణాలు ఉత్తేజితమై నేరుగా కేన్సర్ కణాలను నాశనం చేస్తాయి. ఈ విధానంతో పాటు కీమో, రేడియేషన్థెరపీలను కలిపి ఉపయోగించడం ద్వారా తక్కువ దుష్ఫలితాలతో మెరుగైన చికిత్స సాధ్యమవుతుందా అన్న అంశంపై పరిశోధనలు సాగుతున్నాయి. ప్రస్తుతం అమెరికాలో కొత్తగా సోకిన 25 శాతం మంది కేన్సర్ రోగులకు ఇమ్యునోథెరపీ ద్వార చికిత్స అందిస్తున్నారు. ఇది త్వరలోనే 50 శాతానికి పెరగొచ్చని అంచనా. వ్యక్తిగత వైద్యంతోనూ చెక్.. వేలిముద్రలు, కంటిపాప (ఐరిస్) విషయంలో ఒక వ్యక్తికి మరో వ్యక్తికి మధ్య వ్యత్యాసం ఉన్నట్లే.. కేన్సర్ కణాలు కూడా జన్యుక్రమం ప్రకారం వేరువేరుగా ఉంటాయి. అయినా అందరికీ ఒకే రకమైన మందులు ఇస్తుంటారు. ఇవి కొందరిలో బాగా పనిచేస్తాయి.. మరికొందరిలో అసలు పనిచేయవు. అందుకే ముందుగా కేన్సర్ కణాల జన్యుక్రమాలను ముందుగా విశ్లేషించి, ఆయా జన్యుమార్పులకు సంబంధించి సమర్థమైన మందులను గుర్తించి రోగికి ఇస్తారు. ‘పర్సనలైజ్డ్ ఆంకోజెనోమిక్స్’ అని పిలుస్తున్న ఈ పద్ధతి ద్వారా మందుల దుష్ర్పభావాలను తగ్గించడమే కాకుండా మెరుగైన చికిత్స అందజేయొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. శరీరంలోని కణాలు నిత్యం విభజన చెందుతూ ఉంటాయనే విషయం తెలిసిందే. అయితే కొన్ని కణాల్లోని జన్యువులు పరివర్తనం చెందడం వల్ల అడ్డూ అదుపు లేకుండా విభజన చెందుతాయి. ఇవి కణితులుగా ఏర్పడతాయి. శరీరంలోని వేర్వేరు భాగాల్లో కణితులు ఏర్పడతాయి. కణితులు ఏర్పడే భాగాన్ని బట్టి దాదాపు వంద రకాలకు పైగా కేన్సర్లు ఉన్నట్లు అంచనా. అతిసాధారణంగా గుర్తించే కేన్సర్‌గా ప్రొస్టేట్ కేన్సర్ తొలిస్థానంలో ఉంది. కోలోరెక్టల్, బోవెల్, బ్రెస్ట్ కేన్సర్లు తరువాత స్థానాల్లో ఉన్నాయి. ఊపిరితిత్తుల కేన్సర్ 5వ స్థానంలో ఉంది. అన్నిరకాల కేన్సర్లతో వీటి వాటా 60 శాతం. ప్రతి లక్ష మందిలో 338 మంది కేన్సర్‌తో బాధపడుతున్నారు. కేన్సర్ బాధిత దేశాల్లో డెన్మార్క్ తొలిస్థానంలో ఉంది. అమెరికా 6వ స్థానం, భారత్ 128వ స్థానంలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కేన్సర్ చికిత్సకు ఖర్చు చేస్తున్న మొత్తం ఏడు లక్షల కోట్ల రూపాయలకు పైనే. 2010-14 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా కనీసం కేన్సర్ చికిత్సకు 45 కొత్త మందులు మార్కెట్లోకి వచ్చాయి. నానో టెక్నాలజీ సాయంతో... కీమో, రేడియో థెరపీలో కేన్సర్ కణాలతో పాటు వాటి పక్కన ఉండే ఆరోగ్య కణాలు కూడా నాశనం అవుతాయి. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా కేవలం కేన్సర్ కణాలను టార్గెట్ చేసేలా శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. కీమో థెరపీ, రేడియో థెరపీల్లో వాడే మందులు నేరుగా కేన్సర్ కణాలనే నాశనం చేసేందుకు నానో టెక్నాలజీ సాయం తీసుకుంటున్నారు. దీంతో ఈ మందుల ప్రభావం కేవలం కేన్సర్ కణాలపైనే ఉంటుంది. ఆరోగ్యకరమైన కణాలకు ఎటువంటి హాని జరగదు. ఇప్పటికే అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కొన్ని నానో టెక్నాలజీ ఆధారిత మందులకు అనుమతులు కూడా ఇచ్చింది.