న్యూఢిల్లీ: క్రీడల్లో ముఖ్యంగా కుస్తీ వంటి పోటీల్లో గెలవాలంటే కండబలం చాలా అవసరం. రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, రెజ్లర్ సాక్షి మాలిక్ మాత్రం.. తాను కేవలం కండబలంతో గెలవలేదని, బుద్ధిబలం కూడా తోడైందని చెప్పింది.
హరియాణాకు చెందిన సాక్షిని ఎయిరిండియా సన్మానించింది. బిజినెస్ క్లాస్లో సాక్షి ఉచితంగా ప్రయాణించేందుకు సదుపాయం కల్పించినట్టు ఎయిరిండియా ప్రకటించింది. ఈ సందర్భంగా సాక్షి మాట్లాడుతూ.. ‘నేను శక్తి వల్ల మాత్రమే గెలవలేదు. టెక్నిక్ కూడా తోడైంది. రియోలో పతకం గెలవడం ఓ మధురానుభూతి. పోటీల కోసం బరువు తగ్గా. డైట్పై కంట్రోల్ చేశాను. అన్ని టోర్నమెంట్లకు ఒకేవిధంగా ప్రాక్టీస్ చేస్తాను. అయితే ప్రత్యర్థిని బట్టి దృష్టిసారించాలి. పవర్, వెయిట్, స్పీడ్ ట్రైనింగ్స్లో ప్రాక్టీస్ చేయాలి. నా కుటుంబ సభ్యులు ఎలాంటి నిబంధనలు పెట్టలేదు. రియోలో 15 రోజులు ఉన్నాం. ఏం జరుగుతుందో తెలియదు. నాపై గెలిచిన రష్యా రెజ్లర్ ఫైనల్కు చేరుతుందని వందశాతం నమ్మాను. ఏదేమైనా నేను పతకం గెలుస్తానని భావించా’ అని సాక్షి చెప్పింది.
కండబలంతో కాదు టెక్నిక్తో గెలిచా
Published Fri, Sep 9 2016 8:28 PM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM
Advertisement