రెజ్లర్ సాక్షి రాక నేడే... | Grand welcome awaits Olympics bronze medallist Sakshi Malik | Sakshi
Sakshi News home page

రెజ్లర్ సాక్షి రాక నేడే...

Published Wed, Aug 24 2016 1:03 AM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM

రెజ్లర్ సాక్షి రాక నేడే...

రెజ్లర్ సాక్షి రాక నేడే...

రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన రెజ్లర్ సాక్షి మలిక్ నేడు (బుధవారం) భారత్‌కు రానుంది. తెల్లవారుజాము 3.50 గంటలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో అడుగుపెట్టనున్న సాక్షికి హర్యానా రాష్ట్ర ఐదుగురు మంత్రులు స్వాగతం పలకనున్నారు. ‘నా దేశానికి, నా స్వంత ఇంటికి రాబోతున్నాను’ అని సాక్షి ట్వీట్ చేసింది. రోహ్‌తక్ జిల్లా మొఖ్రా ఖాస్ గ్రామంలోని తన ఇంటికి ఆమెతో పాటు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కూడా వెళ్లనున్నారు. అక్కడ భారీ జనసమూహం మధ్య ఆమెకు సన్మానం చేయనున్నారు. కాంస్యం సాధించిన తనకు రూ.2.5 కోట్ల ప్రైజ్‌మనీ ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement