సాధారణంగా యంగ్‌గా ఉన్నప్పుడు ఉన్నంత జ్ఞాపకశక్తి కాస్తా.. ఉండగా, ఉండగా..అంటే వృద్ధాప్యంకి చేరవయ్యేటప్పటికీ తగ్గిపోతుంది. అలా ఎందువల్ల జరగుతుందని, శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా పరిశోధనాలు చేస్తూ వచ్చారు. ఆ దిశలో ఎంతవరకు పురోగతి సాధించారో తెలియదు గానీ ..వారి అధ్యయనంలో అలా బ్రెయిన్ చురుకుదనం తగ్గిపోకుండా మునుపటిలా షార్ప్‌గా ఉండేలా ఏం చేయాలో కనుగొన్నారు.
దీంతో వృద్ధాప్యంలో ఎదురయ్యే బ్రెయిన్‌కి సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు అంటున్నారు. అందుకు కొన్ని టెక్నిక్స్ ఫాలో అయితే చాలు మంచి జ్ఞాపకశక్తి మీ సొంతం అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ మేరకు వారు 70ల వయసు ఉన్న కొందరూ వృద్ధులపై పరిశోధనలు జరిపారు. వారందరికి ఒకేసారి వారికి ఇష్టమైన రంగాల్లో నైపుణ్యం సంపాదించేలా ట్రైనింగ్ ఇచ్చారు. వారంతా వారానికి 15 గంటలు హోంవర్క్ చేయడం, తరగతి గదుల్లో కూర్చోవడం వంటివి చేశారు. వారు కొత్తభాషలు, ఫోటోగ్రఫీ, వంటి ఇతరత్రా సృజనాత్మక కోర్సులను అభ్యసించడం వంటివి చేశారు.
ఆ క్రమంలో వారికి తెలయకుండానే వారి మొదడు 30ల వయసులో ఉండే వారి బ్రెయిన్ మాదిరిగా షార్ప్‌గా ఉండటం గమనించారు. వారి చిన్నప్పటి జ్ఞాపకాలతో సహాఅన్ని చెబుతుండటం. ఠక్కున దేని గురించి అయినా చెప్పేయడం వంటివి జరిగాయి. దీంతో వారు మెదడును ఖాళీగా ఉంచకుండా మంచి వ్యాపకాలతోనే మనకి ఇష్టమైన అభిరుచిలతో బిజీగా ఉండేలా చేయడం చేస్తే.. మన మెదడులో పిచ్చిపిచ్చి ఆలోచనల ప్రవాహం తగ్గి చురుగ్గా ఉండటం ప్రారంభిస్తుందని అన్నారు. అలాగే ఎప్పటికప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడంపై దృష్టి సారించడం అనేది మీ మెదడుకు ఓ వ్యాయామంలా ఉండటమేగాక మీలో దాగున్న స్కిల్స్ బయటకు వస్తాయి. పైగా మీ బ్రెయిన్ కూడా ఆరోగ్యంగా ఉండి యువకుల్లో ఉండే మాదిరిగా చురుగ్గా బ్రెయిన్ ఉంటుందన్నారు.
(చదవండి: అంతుతేలని ఇద్దరి యువతుల మిస్టరీ గాథ..చంపేశారా? మరణించారా!..)
Comments
Please login to add a commentAdd a comment