
వాతావరణ కాలుష్యం కార్బన్‌డయాక్సైడ్‌ను ప్లాస్టిక్‌గా మార్చేసేందుకు రట్గర్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేశారు. విద్యుత్ ఆధారిత ఉత్ప్రేరకాలను ఉపయోగించినప్పుడు కార్బన్‌డయాక్సైడ్, నీళ్ల మిశ్రమం నుంచి ఒకటి రెండు లేదా మూడు పరమాణువులు ఉండే కర్బన మూలకాలను ఉత్పత్తి చేయవచ్చునని, వీటితో వేర్వేరు రకాల ప్లాస్టిక్‌లు, జిగుర్లు తయారు చేసుకోవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త చార్లెస్ తెలిపారు.
ఈ ప్రక్రియలో ఉప ఉత్పత్తులుగా లభించే మిథైల్‌ౖ గ్లెయోక్సల్‌ను ప్రమాదకరమైన ఫార్మాల్డీహైడ్‌కు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు కూడా. కార్బన్‌డయాౖMð్సడ్ నుంచి మెథనాల్, ఇథనాల్, మీథేన్, ఎథిలీన్ వంటి వాటిని తయారు చేసేందుకు గతంలోనే కొన్ని పద్ధతులు అందుబాటులోకి వచ్చినా అవన్నీ వ్యయప్రయాసలతో కూడుకున్నవి. అత్యధికంగా 99 శాతం సామర్థ్యంతో పని చేయడం, నికెల్, ఫాస్పరస్ వంటి చౌకైన ఉత్ప్రేరకాలను ఉపయోగించుకోవడం వంటి అంశాలను పరిగణిస్తే కొత్త పద్ధతి ప్రయోజనాలు ఇట్టే అర్థమవుతాయని చార్లెస్ తెలిపారు. అవసరానికి తగ్గట్టుగా ఉత్ప్రేరకాలను వాడుకోవడం ఈ పద్ధతిలోని ఇంకో విశేషం. ఈ టెక్నాలజీని వాణిజ్యస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చార్లెస్ రిన్యూసీఓ2 పేరుతో ఒక కంపెనీ కూడా ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment