Alexander Horvath
-
'ప్రధాని నన్ను ఉత్తేజపరిచారు'
న్యూఢిల్లీ: ఇప్పటివరకు పోటీపడిన నాలుగు బౌట్లలోనూ నాకౌట్ విజయాలు నమోదు చేసిన ప్రొఫెషనల్ స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్. చివరగా అలెగ్జాండర్ హోర్వత్ (హంగేరి)తో జరిగిన బౌట్ లో విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ప్రొఫెషనల్ బాక్సింగ్ లో అడుగుపెట్టిన ఈ బాక్సర్ బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశాడు. ఈ సందర్భంగా కొన్ని విశేషాలను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. మోదీని కలవడానికి వెళ్తున్నానంటూ తొలుత ట్వీట్ చేసిన విజేందర్, ప్రధానిని కలిసి బాక్సింగ్ గురించి చర్చించినట్లు ట్వీట్ లో రాసుకొచ్చాడు. ప్రధానిని కలిసిన తర్వాత చాలా ప్రేరణ పొందినట్లు, ఆయన తనను ఉత్తేజాన్ని కలిగించారని, భారత్ లో ఇక ముందు బాక్సింగ్ ఆట ఎలా ఉండబోతుందన్న అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్లు విజేందర్ తెలిపాడు. ప్రధానిని కలిసినందకు తనకు చాలా సంతోషంగా ఉందన్నాడు. తన తదుపరి బౌట్ ఏప్రిల్ 2న ఉండగా, ఆ బౌట్ ను 30వ తేదీకి మార్చుకున్నట్లు ఇటీవలే పేర్కొన్నాడు. లండన్ లోని కాపర్ బాక్స్ ఎరినాలో తన ఐదో బౌట్ జరగుతుందని అక్కడ కూడా మీ అందరి సహకారం లభిస్తుందని ఆశిస్తున్నానని రెండు రోజుల కిందట ట్వీట్ లో వెల్లడించాడు. Plzr meeting u sir @narendramodi Feeling motivated having a long discussion on future of boxing in our country -
జయహో... విజేందర్
వరుసగా నాలుగో బౌట్లోనూ విజయం లివర్‌పూల్: గతేడాది పోటీపడిన మూడు బౌట్లలోనూ నాకౌట్ విజయాలు నమోదు చేసిన భారత ప్రొఫెషనల్ స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్... కొత్త ఏడాదిలోనూ శుభారంభం చేశాడు. ఈ సంవత్సరం తాను బరిలోకి దిగిన తొలి బౌట్‌లోనే విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అలెగ్జాండర్ హోర్వత్ (హంగేరి)తో శనివారం జరిగిన బౌట్లో విజేందర్ మూడో రౌండ్లో ‘టెక్నికల్ నాకౌట్’ పద్ధతిలో గెలుపొందాడు. 30 ఏళ్ల విజేందర్ సంధించిన పంచ్‌ల ధాటికి 20 ఏళ్ల హోర్వత్ ఎదురునిలువలేకపోయాడు. మూడు నిమిషాల నిడివిగల ఆరు రౌండ్లపాటు ఈ బౌట్ జరగాల్సింది. తొలి రౌండ్ నుంచే విజేందర్ ప్రత్యర్థిపై పైచేయి సాధించాడు. అవకాశం దొరికినపుడల్లా పంచ్‌లు కురిపించాడు. దాంతో మూడో రౌండ్లో నిమిషం ముగిసిన వెంటనే హోర్వత్ ఓటమిని అంగీకరిస్తూ బౌట్‌ను కొనసాగించలేనని చేతులెత్తేశాడు. విజేందర్‌తో పోరుకు సన్నాహాల్లో భాగంగా హోర్వత్ తన ఆహార జాబితాలో పాము రక్తం కూడా చేర్చుకున్నాడు. అయితే విజేందర్ దూకుడు ముందు ఇవేవీ పనిచేయలేదు. విజేందర్ కెరీర్లో వరుసగా ఇది నాలుగో విజయం కావడం విశేషం. -
జోరు కొనసాగిస్తాడా..?
⇒ నేడు బాక్సర్ విజేందర్ పోరు ⇒ తొలి రౌండ్లోనే ఓడిస్తా: ప్రత్యర్థి హోర్వత్ లివర్‌పూల్: గతేడాది ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారిన విజేందర్ సింగ్‌కు ఇప్పటిదాకా ఓటమి లేదు. ఇప్పటిదాకా మూడు బౌట్లలో తలపడిన అతను అన్నీ నాకౌట్ విజయాలనే సాధించి అదరగొట్టాడు. ఈ నేపథ్యంలో ఈ స్టార్ బాక్సర్ నేడు (శనివారం) నాలుగో ఫైట్‌కు సిద్ధమవుతున్నాడు. అతనికి ఈ ఏడాది ఇదే తొలి ఫైట్ అవడంతో ఇప్పటిదాకా కనబరిచిన జోరునే మరోసారి చూపి సీజన్‌ను విజయంతో ఆరంభించాలని భావిస్తున్నాడు. ఇక ఈ బౌట్లో విజేందర్ ప్రత్యర్థిగా హంగేరికి చెందిన అలెగ్జాండర్ హోర్వత్ బరిలోకి దిగుతున్నాడు. విజేందర్కన్నా అతను అనుభవశాలి. అలాగే ఈ పోటీ కోసం పటిష్టంగా తయారయ్యేందుకు పాము ర క్తం తీసుకుంటున్నట్టు 20 ఏళ్ల హోర్వత్ ఇప్పటికే ప్రకటించి ఆసక్తిని మరింత పెంచాడు. ఏడు ఫైట్లలో తలపడిన ఈ యువ బాక్సర్ ఐదింటిలో నెగ్గాడు. అలాగే 31 రౌండ్లపాటు ఆడిన అనుభవం ఉంది. అందుకే ఈ బౌట్‌ను అంత తేలిగ్గా తీసుకోవడం ఇష్టం లేని 30 ఏళ్ల విజేందర్ కూడా రోజుకు 10 గంటలపాటు ప్రాక్టీస్‌తో చెమటోడ్చుతున్నాడు. నిజానికి ఈ బౌట్ గత నెలలోనే జరగాల్సి ఉన్నా కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది. నా విజయాల రికార్డును కొనసాగించాల్సిన అవసరం ఉంది. అందుకే హోర్వత్పై పైచేయి సాధించడమే కాకుండా ఆ తర్వాత హారోలో జరిగే ఫైట్ కూడా నెగ్గి భారత్‌లో టైటిల్ పోరుకు సిద్ధమవ్వాలి. హోర్వత్ కచ్చితంగా గట్టి పోటీదారు. నాకన్నా అనుభవం కలిగి ఉన్నా నా పంచ్‌లకు అతడు ఎక్కువ సేపు రింగ్‌లో నిలబడడనే అనుకుంటున్నాను’ అని విజేందర్ ధీమా వ్యక్తం చేశాడు. మరోవైపు హోర్వత్ కూడా ఇంతే ఆత్మవిశ్వాసాన్ని కనబరుస్తున్నాడు. తన ముందు విజేందర్ గట్టి ప్రత్యర్థే కాదని అంటున్నాడు. అతడికి మూడు విజయాలే ఉన్నా, తనకు ఐదున్నాయని గుర్తుచేశాడు. ‘ఇంతకుముందు విజేందర్ బౌట్స్ను వీడియోలో చూశాను. నా ప్రణాళికలు అతడికి బాక్సింగ్ అంటే ఏంటో నేర్పుతాయి. అతడిలో కొన్ని బలహీనతలు గమనించాను. మొదటి లేక రెండో రౌండ్లోనే మట్టికరిపించి స్వదేశానికి వెళ్లే ముందు తొలి ఓటమిని అందిస్తాను’ అని హోర్వత్ సవాల్ విసిరాడు. -
నా నరాల్లో పామురక్తం...మాజికల్ పవర్ నా సొంతం
హంగరీ: బాక్సింగ్ లో బారతీయ ఆటగాడిని ఎలాగైనా ఓడించాలనే తపనతో హంగేరియన్ బాక్సర్ అష్టకష్టాలు పడుతున్నాడు. భారత బాక్సర్ ఒలంపిక్ విజేత, పద్మశ్రీ, విజయేంద్ర సింగ్ ను ఎదర్కోవడానికి హంగరీ బాక్సర్ అలెగ్జాండెర్ హోర్వాత్(20) తన డైట్ లో సాంప్రదాయ పద్ధతులను ఫాలో అవుతున్నాడట. పాము రక్తాన్ని తాగుతున్నానని, దీంతో తన పవర్ పంచ్ లతో ఇక అతనికి సరైన గుణపాఠం చెబుతానంటున్నాడు. బాక్సింగ్ రింగ్ లో విజయేంద్ర సింగ్ తో తలపడేందుకు పాము రక్తాన్ని తాగుతున్నాడు. పాము తాజా రక్తాన్ని తాగడం ద్వారా తన శరీరాన్ని మరింత ధృఢంగా శక్తివంతంగా తయారు చేసుకోవాలని అతని ప్లాన్. పాము రక్తాన్ని సేవించడం వల్ల అద్భుతమైన శక్తి సామర్ధ్యాలను సాధించ వచ్చని హంగేరియన్లు నమ్ముతారు. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సాంప్రదాయం సైనికుల్లో కూడా అమల్లో ఉంది. అనేక శతాబ్దాలుగా తన కుటుంబంలో తాజా పాము రక్తాన్ని తాగడం సంప్రదాయం గా కొనసాగుతోందని స్వయంగా అలెగ్జాండర్ తెలిపాడు. ఇది తనకు చాలా గర్వకారణమని, దాని మాజికల్ పవర్ ను మాటల్లో చెప్పలేనన్నాడు. పాము రక్తం తన నరాల్లో ప్రవహిస్తున్నంతసేపు తనకిక ఎదురే ఉండదని, తన ప్రధాన ప్రత్యర్థి విజయేందర్ ను మట్టికరిపిస్తానని వ్యాఖ్యానించాడు. కాగా మార్చి 12 న భారతీయ స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ తో హంగేరియన్ బాక్సర్ అలెగ్జాండర్ తలపడనున్నాడు. ప్రొఫెషనల్ బాక్సింగ్ లో మూడు విజయాల తర్వాత విజయేందర్ కు ఇది నాల్గవ పోటీ. అటు అలెగ్జాండర్ తనకు గట్టి పోటి ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ అతణ్ని ఓడించడం పెద్దకష్టం కాదని విజయేందర్ ఇప్పటికే ప్రకటించాడు.