ఉక్రెయిన్‌లో యుద్ధ సమయంలో చిక్కుకుపోయిన భారతీయులను రోమేనియా, హంగేరీల మీదుగా ఇండియాకి తీసుకువచ్చేందుకు కేంద్రం వ్యూహం రచించింది. ఈ మేరకు తగు జాగ్రత్తలు తీసుకుంటూ హంగేరీ, రోమేనియా సరిహద్దులకు చేరుకోవాలంటూ భారతీయులకు సూచనలు జారీ చేసింది.
భారత ఎంబసీ నుంచి వచ్చిన సూచనలకు అనుగుణంగా ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులు కేపీపీ టైసా సరిహద్దు వద్ద హంగేరిలోకి వెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలా వచ్చే వారి కోసం హంగేరీలో ఉన్న ఇండియన్ ఎంబసీ కొన్ని విధి విధానాలు రూపొందించింది. అందులో భాగంగా కేపీపీ టైసా సరిహద్దుకు చేరుకోవాడనికి ముందే ఆన్‌లైన్‌లో కొన్ని పత్రాలు ఫిల్ చేయాలంటూ కోరింది.
Imp Notice! Students wanting to cross border through Kpp Tysa may please fill the form -https://t.co/jmkFl3Nahn Students and other stranded in Ukraine should follow advisory & alerts issued by @IndiainUkraine @MEAIndia @BshBudapest
— Indian Embassy in Hungary (@IndiaInHungary) February 24, 2022
ఉక్రెయిన్ నుంచి హంగేరీ వచ్చే భారతీయులు ముందుగా పేరు, జెండర్, పుట్టినరోజు, ఉక్రెయిన్‌లో కాంటాక్ట్ నంబర్, భారత్‌లో కాంటాక్ట్ నంబర్, ఇండియాలో అడ్రస్, ఈ మెయిల్, పాస్‌పోర్ట్ నంబరు, పాస్‌పోర్ట్ ఎక్స్‌పైరీ తేది, ఉక్రెయిన్‌లో అడ్రస్, దగ్గరగా ఉన్న హంగేరి సరిహద్దు తదితర వివరాలు పొందు పరచాల్సి ఉంటుంది. ఇది చాలా ముఖ్య గమనికగా హాంగేరీ లోని ఇండియన్ ఎంబసీ పేర్కొంది.
చదవండి: హంగేరి, రుమేనియా బోర్డర్‌కి రండి - కేంద్రం కీలక ఆదేశాలు
Comments
Please login to add a commentAdd a comment